top of page

మానససరోవరంలో...

  • Narayana Setty
  • Apr 1, 2014
  • 2 min read

ప్రస్తుతం ఎటుచూసిన ఉరుకులు, పరుగుల జీవితమే. ఇది విధ్యార్థులు, గృహిణులు, ఉధ్యోగస్తులు, వ్యాపరస్తులు, అన్నిరంగాలవారిని తీవ్రఒత్తిడికి గురిచేస్తున్నాది. ఒత్తిడి జీవితాన్నుంచి, ప్రతికూల భావోద్వేగాలనుంచి మానసిక ప్రశాంతతని అనుభవించడానికి మెడిటేషన్ని యోగ అందజేసిన అపురూప, అపూర్వ కానుక!

ఆశవాహదృక్పధం, ఏకాగ్రత అనేఆయుధాలని మన హైందవనాగరికత మానవావళికి అందజెసిన అముల్యమైన కానుకలు.ఆశవాహదృక్పధంద్వారా అంతర్గత బలహీనతలను, అభద్రతాభావనలను అధిగమించగలరు. ఓర్పు, సహనం, విచక్షణ, వివేకతలద్వారా ఏకాగ్రతలని సాధించడగలరు. ధ్యానసాధన ద్వారా వీటిపై మెరుగైన ఆధిపత్యాన్నిపొందగలరు.

ఏకాగ్రత ద్వార చూసిన లేక చదివిన విషయాన్ని మనస్సుపుటలలో భద్రపరచుకోవడం అయితే అవసరమైనపుడు వాటిని గుర్తుతెచ్చుకోవడానికి ఙాపకశక్తి అంతే అవసరం.ఏగ్జాంలలో చదివిన విషయం ఙాపకం రాకపోవడం అనేది కొందరిలో, సమయానికి బాగాతెలిసినవిషయం అయిన గుర్తుకురాక పోవడం మరికొందరిలో మనం తరచు గమనిస్తాం.అటువంటివారు ఏకాగ్రత, ఙాపకశక్తులని పెంపొందిచుకుంటూ విశ్వాసంతో ముందడుగు వేయాడానికి, బుద్దిలేమిని అధిగమించి బుద్దికుశలతలను పెంపొందించుకోవడానికి మెడిటేషన్ బాగా సహకరిస్తుంది.

తనువు, మనువు ప్రశాంత వాతవరణంలో ఐక్యత సాధించడానికి అనువైన సమయం బ్రాహ్మీకాలంలో ఆరుబయట స్వచ్చమైన గాలిని మనసార అస్వాదిస్తు, శ్వాసపై ద్యాసతో ఓంకార ప్రణవనాధం సాక్షిగా మెడిటేషన్ ప్రారంభించాలి. వజ్రాసనం లేదా పద్మాసనం లేదా సుఖాసనంలలో మీకు ఎది అనువైతే ఆఆసనంలో యోగముద్ర లేదా ధ్యానముద్రలో ధ్యానక్రియని ప్రారంభించాలి.

  • మొదటిగా ఉచ్చాశ్వ, నిశ్వాసలని వీలైనంత వేగంగా ఓ రెండునిముషాలు సాగించాలి.

  • ఆ తరువాయి దీర్ఘశ్వాసతో ప్రాణావాయువుని చాతి, శ్వాసకోశాలలోనికి తీసుకుంటూ ఒకటి నుంచి ఐదూవరకి మనస్సులో లెక్కించాలి. నిశ్వాసలో ఐదు నుంచి ఒకటి లెక్కిస్తూ నెమ్మదిగా శ్వాసని వదలాలి. ఈ దీర్ఘ శ్వాసక్రియని రెండు నుంచి మూడు నిముషాలు కొనసాగించాలి.

  • చివరిగా దీర్ఘశ్వాసని తీసుకొని చాతికండరాలపై పట్టుబిగించి, ఒత్తిడినిపెంచుతూ ఐదు సెకండ్లు ఉండాలి, కండరాలపై పట్టుని, ఒత్తిడిని సడలిస్తూ నెమ్మదిగా శ్వాసని వదలాలి. ఈ మారు భుజాలు, మెడ, చేతి కండరాలపై పట్టు పట్టుబిగించి ఒత్తిడిని పెంచండి. ఇంకోమారు ముఖ కండరాలాపై పట్టుబిగించి ఒత్తిడిని పెంచండి. చివరిసారిగా పొత్తికడుపు కండరాలపై, తొడ, పిక్కల కండరాలపై ఒత్తిడిని తీసుకోండి. నెమ్మదిగా ఏడు నుంచి ఎనిమిది సెకండ్లు కండరాలపై పట్టు సాధించడానికి ఆభ్యాసం చేయాలి.

ఈ ఆనాపానసతి ధ్యానక్రియని పది నిమిషాలు కొనసాగించాలి. ఇది ప్రాణధాతువుని సక్రమంగా పంపిణిచేయడం ద్వార కండారాలకి చక్కటి రిలీఫుని తీసుకవస్తూ శారీరక ఇతి బాదలను తగ్గించివేస్తుంది, అని ఇటీవల జరిపిన శాస్త్రీయ ఆధ్యయనాలు* ధృవీకరిస్తున్నాయి. ధ్యానానికి బిగువైన వస్త్రాలను ధరించకండి, సాధరణ దుస్తులు ధరించండి.మంద్రస్థాయిలో ఓంకారనాదం బాక్ గ్రౌండు మ్యూజిక్ గా ఉండడం అభిలషణీయం.

శ్వాసపై ఏకాగ్రతని సాధించే మెడిటేషన్ ప్రక్రియలో ఆరంభంలో మీ మదిలో కలిగే అలజడులను, ఆందోళనలను, ఆలోచనాభావనలని అవి కలిగించే భావాప్రకంపనలని, భావోద్వేగాల్ని అణచరాదు. మీమదిలో అలజడిని కలిగించే ఆలోచనా తరంగాలు సుడులుసుడులుగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే వాటిని దరి చేరనీయాలి. అందోళణ కలిగించే ఈ ఆలోచనాస్రవంతిని బలవంతంగా ఆపే ప్రయత్నం ఎంతమాత్రం చేయరాదు. కేవలం శ్వాసపై ఏకాగ్రతతోమీ మనస్సుని లగ్నం చేయండి. శ్వాసని లయబద్దంగా కొనసాగించండి. క్రమేణా ఈ అలజడుల, అందోళణా మూలకాలు మనస్సుకి అవగతం అవుతాయి. వాటిని అధిగమించే మానశిక స్థైర్యాన్ని మీలో తీసుకవస్తుంది. అవి పెనుతూపాను తర్వతా కడలిలో ప్రాశంతతలా నెమ్మది, నెమ్మదిగా ఈ ఆలోచనాస్రవంతి నుంచి మీరు బయటికి రావడానికి తోడ్పాటు అవుతాయి.

ఏకాగ్రతని సాధించడానికి మీగదిలో మీకిష్టమైన దేవతామూర్తీవిగ్రహాన్నిగాని, వస్తువునిగాని, పకృతి మనోహర ధృశ్యాలని గాని లేదా ఓ చిరుజ్యోతిని వుంచండి. మీమనోనేత్రం ద్వారా ఆ దేవతామూర్తీవిగ్రహాన్ని/ మీకిష్టమైన వస్తువుని/ పకృతిమనోహర ధృశ్యాలని లేదా జ్ఞానజ్యోతి వెలుగును దర్శించండి. ఈ ప్రక్రియ మీలో త్వరగా ఏకాగ్రాతని సాధించడానికి సహయకారి అవుతుంది. సాధారణంగా మూడు నుంచి నాలుగు సిట్టీంగులలొ ఈ ఆలోచన స్రవంతులు దరిచేరని దశకి చేరుకుంటారు. మానసిక ప్రశాంతతకి ఆలంబనమైన ఈ ఆసనస్థితిలో ప్రేమ, దయ, జాలి, కరుణ, ఆర్థ్రత, ఔదార్యం, వివక్షణ అనే భావనలను ప్రతిఉచ్చాస్వలో నింపుకోవాలి. కోపం, నిస్తేజం, పిరికితనం, నిరాసక్తత, అందోళణ, అలజడులను ఫ్రతినిశ్వాసలొ మీమనస్సు నుంచి బయటికి వెలుతున్న భావనలతో మెడిటేషన్ని కంటిన్యుచేయాలి.

ప్రతి దీర్ఘఉచ్చాస్వ మీలోని ప్రాణశక్తిని ఉత్తేజపరుస్తుంది, ఏందుకంటే ప్రతిఉచ్చాస్వ అపారమైన ప్రాణవాయువుని మీ రక్తనాళాలద్వార నాడీమండలవ్యవస్థకి, కణజాలానికి అధికమొతాదులో చేరవేస్తుంది అది మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. శరీరం తేలిక అయిన భావనని తీసుకవస్తుంది. ఈ దశలో ప్రతిసారి మనస్సు అనే మానససరోవరంలో, మీ ఆత్మ ఓ విహంగంలా విహరిస్తున్న అనుభూతికి లోనవుతుంది. మనస్సు అంతరాత్మతో మమైకం అవుతుంది. వివేకం, విచక్షణలకి ఉద్దీపన అవుతుంది. మీ సమస్యలకి, అలజడులకి, మానశిక ఆందోళనలకి పరిష్కార మార్గాన్ని అవగతం చేస్తుంది. ఈ స్థితిని వీలైనంత ఎక్కువగా ప్రతిసారి అనుభవించాలి. ఇది మెదడులోని న్యూరానువ్యవస్థని ఉత్తేజపరుస్తుంది అది మీమనస్సుని చురుగ్గా ఉంచుతుంది. మీ ఆలోచనలలో చురుకుతనాన్నితెస్తుంది. మనస్సుకి ఎనలేని ప్రశాంతతని తెస్తుంది.

  • మేడిటేషన్ మెదడులోని భావోద్వేగ ప్రతిస్పందనలు, భావోద్వేగ ప్రకంపన కేంద్రాలను ప్రభావితం చేస్తుంది మరియు సానుకూల భావోద్వేగాలకి ఆలంబన అవుతుంది అని ఇటీవల శాస్త్రీయ ఆధ్యయనాలు* తెలియజేస్తున్నాయి.

  • మెడిటేషన్’తో రోజులోవచ్చే ఒత్తిడి, మానసికవేదనల వంటివి తగ్గించుకోవచ్చు. పని ఒత్తిడితో మీకు తరచుగా కోపం వస్తూవుంటే అటువంటప్పుడు ఇది బాగాపని చేస్తుంది.

మెడిటేషన్ని మొదట్లో ఓ 10 నిమిషాలు అభ్యాసం చేయాలి, క్రమేనా 20 నిముషాలు సాధన చేయాలి. ఇది మనలోని అంతర్గత బలహీనతల బంధాలను బలహీనపరుస్తుంది. నవజీవనమార్గానికి నూతన ఆధ్యాయం అవుతుంది.

*Research at Leiden University in the Netherlandarlas

ఒత్తిడి, టెన్షన్లనుంచి రిలాక్షేషన్ కి యోగనిద్రని గురించి తెలుసు కుందాం.


 
 
 

コメント


bottom of page