ట్రెజర్ హౌస్
- Narayana Setty
- Jun 28, 2017
- 2 min read

మానసికప్రశాంతత, ఉల్లాసం, ఉత్సాహాలకి ఓ ట్రెజర్ హౌస్ మనలోనే ఉంది. అయితే ఈ ట్రెజర్ హౌస్ ని తెరవడానికి కావలసిన తాళంచెవిని కనిపెట్టడంలోనే వుంది అసలైన కిటుకు. అది మనచేతల్లో, చేతుల్లోనే వున్నది అనేనిజాన్ని గుర్తించాలి. ఈ 'కీ' మనల్ని శారీరకంగా, మానసికంగా మనలోని వ్యక్తిగత బలహీనతలపై ఆధిపత్యం సాధించదానికి ఆ పై చక్కటి ప్రశాంతతని పొందడానికి నూతన మార్గాన్ని అవగతం చేస్తుంది.
ఇందుకోసం ఎటువంటి ప్రిస్కిప్షన్ ఫీజుని, మెడిసిన్ కాస్టుని, ఎక్విపుమెంట్ కాస్టుని కోరుకోని 'కీ' ఇది!
నిజమైన ఈ డాక్టరు మీతోనే, మీవెనువెంటనే ఉన్నాడు. ఏవరీ మనతో, మనలో వుండే ఈ డాక్టరు! ఈ డాక్టరుగారి సేవలు ఎలా ఉపయొగించుకోవాలి!! దీనికి సమాధానం మనలో వుండే ఈ డాక్టరుని మన హైందవ నాగరికత సుమారు 5000 సంవత్సరల క్రితమే గుర్తించి మానవాళికి అపురుపకానుకగా అందజేసింది… అదే ‘యోగ’!!
హిందుత్వం నుంచి శాఖోపశాఖలుగా విస్తరించి భౌద్దయిజం, జైనయిజంలతో కలిసి ఆసియాలో బహుళ ప్రాచూర్యం పొందింది. 19వ శతాబ్దంలో యోగగురు వివేకానందద్వార పాశ్చత్యనాగరికతలు వీటి అపారవిలువలను తెలుసుకున్నాయి. హిందువారసత్వ గ్రంధాలు అయిన హఠయోగప్రధీపిక, శివసంహిత, రాజయోగ, పతంజలి యోగసూత్రాలు ప్రామాణికాలుగా నేడు యోగశిక్షణ ఆభ్యాసం విశ్వవ్యాప్తాంగ జరుగుతున్నాది.
విశ్వసనీయమైన ఫలితాలను గుర్తించిన పలు కార్పోరేటు సంస్థలు నేడు తమ ఉద్యొగులకి ‘యోగశిక్షణ శిబిరాల’ను తమ క్యాంపస్ లలో నిర్వహిస్తున్నాయి.
పాశ్చత్యదేశాలు యోగప్రాశస్యతని గుర్తించి యోగక్లాసులను ప్రోత్సహిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా యోగశిక్షణకి ఎనలేని ఆదరణ లభిస్తున్నది అంటే అతిశయొక్తి కాదు. అయితే మన అందరికి తెలిసిన ఈ ప్రాధమిక విషయాన్ని ఈ సందర్బంలో మననం చేసుకోవాలి.
మనం గాలి లేకుండా కొన్ని నిముషాల కంటే ఎక్కువుగా జీవించలేము. అదే నీరులేకుండా కొన్నిరోజులు జీవించగలం. అదే ఆహరం లేకుండా కొన్ని వారాలు జీవించడానికి అవకాశంవుంది. అంటే జీవించడానికి, జీవక్రియ సమర్థవంతంగా నిర్వర్తించడానికి కావల్సింది శ్వాసక్రియ. ఆశ్వాసక్రియని క్రమబద్దీకరించగలిగిన శక్తివంతమైన ప్రక్రియే యోగ!
దీర్గశ్వాసక్రియ ఆరోగ్యానికి రహదారి. అటువంటి శ్వాసని సమర్థవంతంగా నిర్వర్తించడానికి యోగకళలో మెడిటేషన్ చక్కటి మార్గదర్సి ఔతుంది.
నీవు నీ ఆత్మ, తనువు, మనస్సలతో అనుసంధానమై ఓ విహాంగంలా మనసిక ప్రశాంతతని అనుభవించే స్థితికి మార్గం అవగతం చేస్తుంది మెడిటేషన్...!! మానసిక స్థైర్యాన్ని, విచక్షణని, వివేకతలకు అనుసంధానిస్తూ మానసిక దౌర్బల్యాలకి స్వస్తి చెప్పే కళే యోగ...!!!
యోగ ద్వార మీ శరీరంలోని కండారాలు ఉత్తేజితమై తమ సహజ మృధుత్వాన్ని సంతరించుకుంటాయి. శరీరం తేలిక అయిన అనుభూతిని తీసుక వస్తుంది.
కార్టిలేజ్ వ్యవస్థ కూడా మృధుత్వాన్ని సంతరించుకోని శక్తివంతం అవుతుంది. ఆర్థరైటీస్ భారి నుంచి సమర్థవంతంగా కాపాడుతుంది.
సరి అయిన శారీరక భంగిమ ద్వార /యోగాఆసన ద్వార వెన్నముక బలొపేతం అవుతుంది. ఇది వెన్నముక వ్యవస్థకి సంరక్షణని తీసుక వస్తుంది.
రక్త ప్రసరణ శరీరాంగాలకు సక్రమంగా అందడానికి తోడ్పాటు అవుతుంది. లింఫాటిక్ వ్యవస్థ బలోపేతం అవుతుంది. అది అన్ని వయస్సుల వారిలో కూడా రోగనిరోధక వ్యవస్థని తేజోవంతం చేస్తుంది.
కొద్దిరోజుల ఆభ్యాసంతో సరియైన విశ్రాంతి, ఘాడమైన నిద్రద్వారా అహ్లాధకరమైన నిద్రానుభూతి, మెరుగైన మానసికస్థితితో మానసిక ఆందోళన/అలజడులపై నియంత్రణలని సాధిస్తుంది అని పలు అధ్యాయనాలు తెలియజేస్తున్నాయి.
మీ మనస్సుకి యోగప్రశాంతతని చేకూరుస్తుంది. ప్రేమ, కరుణ, దయ, జాలి, ఆర్థ్రత అనే భావనలకి ఆలంబన అవుతుంది. అది జీవితంలోకి ఆహ్లదాన్ని, నిర్మలత్వాన్ని తీసుకవస్తూంది. నిద్రలేమి, వివేకలేమి, విచక్షణలేమిని దూరంచేస్తుంది.
కేవలం రోజు ఓ గంట పాటు ఎనిమిది వారాల యోగసాధనతో మస్తిష్కంలో జరిగేమార్పులు మనలోని నైరాశ్యాం, డిప్రెషను భావాల కేంద్రకాలనుంచి ఆభావనలను తగ్గించివేస్తాయి అని ఇటివల హర్వర్డు విశ్వవిధ్యాలయ పరిశోధనలలో ధ్ధృవీకరించబడ్డాయి అని ఆ శాస్త్రవేత్తలబృందం ప్రకటించింది.
యోగసాధనలో అద్యాత్మిక, శారీరక, మానసిక ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. మీరుచేయవలసిందల్లా ఖచ్చితమైన నిర్ణయాలని తీసుకొని ప్రయత్నాలు మొదలుపెట్టి చక్కటి ఆరోగ్యాన్ని సొంతంచేసుకోవడమే!!
యోగ శిక్షణని అనుభవజ్ఞులైన గురు ముఖత ప్రాధమికంగా నేర్చుకోవాలి. ఆ పై మీ దినచర్యగా అభ్యాసం చేయాలి.
మెడిటేషన్, యోగాభ్యాసల ప్రాక్టీసుని ఇక తెలుసుకుందాం
Comments