జీవధార...జీవనధార
- Admin
- Jun 28, 2017
- 2 min read

మిమ్మల్ని ఆరోగ్యభరితంగా, ఆరోగ్యవంతులుగా ఉంచడానికి, మీ జీవనగతికి జీవధారగా, జీవనధార ఐ నడిచేది, నడిపించేది జలధార.. అదే మీరు ఫ్రతి రోజు త్రాగే మంచి నీరే! ఐతే ఈ నీరు త్రాగే విధానాన్ని ఈ విధంగా ఆరంబించండి.
o నిద్రలేవగానే పర గడుపున 1 నుంచి 1.5 లీట్తర్ల పరిశుభ్రమైన నీరు త్రాగండి.ఐతే ఇందుకు ‘ఫ్రిడ్జ్’ వాటర్ ని ఉపయొగించకండి. o పాకెజెడ్ వాటర్ త్రాగే అలవాటు ఉంటే దానినే కంటిన్యూ చేయండి.సాదరణంగా అందుబాటులో ఉంటే స్వచ్చమైన బావి నీరు తీసుకోండి లేదంటే ట్యాప్ వాటార్ కూడ పరవాలేదు. o నీరు త్రాగే గ్లాసులు మరియు పాత్రలు పరిశుభ్రంగా వుండాలి. o మొదట్లో వాటర్ త్రాగే అలవాటు అయ్యెంతవరకు 3 గ్లాసుల నుంచి ఆరంభించండి. కొద్ది టైం గ్యాప్ తరువాత ఇంకొ 3 గ్లాసుల నీరు త్రాగండి. అవసరమైతే గోరు వెచ్హని నీరు కూడ తీసుకొవచ్చు. ఆ తరువాత ఓ గంట వరకు ఏమి తీసుకోకండి. ఇక మీ కాలక్రుత్యాలను తీర్చుకోండి.
ఈ ప్రక్రియ మనలొ సాధారణంగా ఉండే మలబద్దకాన్ని 2 వారాలలొ పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. గ్యాస్ ప్రాబ్లంని కూడా అదుపులోనికి తీసుక వస్తుంది. బిపీ వుంటె దాన్ని పది వారాలలొ నార్మల్ కి తీసుక రావడానికి దోహదకారి ఔతుంది.
జీర్ణ వ్యవస్థని అరోగ్యవంతంగా ఉంచడానికి దోహదకారి అవుతుంది. జీర్ణప్రక్రియ, జీవప్రక్రియలలొ శరీరం నుంచి తయారయ్యే వ్యర్ద పదర్థాలు (టాక్సిన్స్), మలిన పదార్థాలు, జీర్ణంకాని ఆహర పదార్థాలని సమర్థవంతంగా విసర్జించడానికి సహకరిస్తుంది. విసర్జనవ్యవస్థకి మెరుగైన, సమర్థవంతమైన, ఆరోగ్యవంతమైన అనుకూల వాతావరణాన్ని కలుగ చేస్తుంది.
భొజనంతొ పాటు మంచి నీళ్లు త్రాగే అలవాటు ఉంటె దాన్నిఆపేయండి. భొజనంతొ పాటు నీళ్లు త్రాగ వలిసిన అవసరం జీర్ణక్రియకి ఎంతమాత్రం అవసరం లేదు. భొజనానికి అర గంట ముందుగా భొజనం తరువాత ఓ గంట వరకి మంచి నీళ్లు త్రాగకండి. ఇది మీరు తీసుకున్న ఆహరంని చక్కగా జీర్ణం కావడానికి దోహదం ఔతుంది. ఆ తర్వాత ఫ్రతి గంట, గంట విరామంతో ఓ గ్లాసు మంచి నీళ్లు త్రాగండి. అదే విదంగా రోజుకు 3.5 నుంచి 4 లీటర్ల మంచి నీళ్లు త్ర్రాగాలి .. నైట్ టైంలో తక్కువగా నీళ్లు త్రాగండి.ఇది మన శరీరంలోని సహజ నిష్పత్తి ఐన ద్రవపదర్థాల సమతుల్యతని సాధిస్తుంది. మరియు
o కిడ్నీలని శక్తివంతంగా, సమర్థవంతంగా, విధులని నిర్వర్తించేలా దోహదకారి అవుతుంది, కిడ్నీ లలొ స్టోన్ ఫార్మెషన్ లను రాకుండా నివారిస్తుంది, మరియు స్టోన్ లు ఫార్మేషన్ ప్రారంభంలొ వుంటే సమర్థవంతంగా నివారణకారిగా పనిచేస్తుంది. మూత్రవిసర్జన ఫ్రీక్వేన్సి పెరుగుతుంది, ఆందోళన పడనవసరం లేదు ఐతే ఆ కోరికని బలవంతంగా కంట్రొలు చెయకండి. o కొద్ది రొజుల్లో చర్మం కాంతివంతంగా, కోమలంగా, మ్రుదుత్వాన్ని సంతరించుకుంటుంది, తన విధులను సక్రమంగా నిర్వర్తించదానికి ఉపకరిస్తుంది. o జీర్ణప్రక్రియ, జీవప్రక్రియలని సజావుగా, సక్రమంగా, వేగవంతంగా నిర్వర్తించదానికి రెడి చేస్తుంది మరియు మిమ్మల్ని ఒబెసిటి బారినుంచి కాపాడుకొవడానికి మొదటి అడుగు అవుతుంది. o రొంప, జలుబు, ఆస్థమా, బ్రాంకైటీస్ ల నుండి ఇమ్మ్యునిటిని 3 నుంచి 4నెలల్లొ తీసుక వస్తుంది. o ఆర్టరైటీస్ ని కంట్రొల్ చెయడానికి ఇది ఓ చక్కటి పరిష్కార మార్గం అవుతుంది. o బయటకి వెళ్లేప్పుడు బాటిల్లో వాటర్ తిసుకవెళ్లే అలవాటు చేసుకోండి. మీ బాడిని డిహైడ్రెష్నకి గురిగాకుండా రక్షిస్తుంది.
ధీర్గకాలం మొండివ్యాదులతో ఉన్నవారు సత్వర ఫలితాలను ఆశించకుండా సహనంతో మరికొద్దిగా ఎక్కువ కాలం కొనసాగించాలి. నెమ్మదిగా ఫలితాలను గమనిస్తారు. ఆశావాహ ద్రుక్పదంతొ కంటిన్యు చేయాలి. కూల్ డ్రింక్, కాఫీ, టీలు డ్రింకింగ్ వాటర్ కి ప్రత్యామ్నం కానే కాదు అనేది ప్రధానంగా గుర్తు ఉంచుకోవాలి. ఐతే వీటికి ప్రత్యమ్నయంగా ప్రూట్ /లెమన్ జ్యూసు తీసుకోండి .ఐతే ఈ జ్యూసులొ టేస్టు కోసం సుగర్ నీ యాడ్ చేయకండి. కూలింగ్ కోసం ఐస్ వాడకండి. నేచురల్ గా తీసుకోండి. ఆరొగ్యవంతమైన శరీరంలో 38 నుంచి 42 లీటర్ల ద్రవపదార్తాల సమ్మేళణం ఉండాలి. ఆ సమతుల్యతని కాపాడే భాద్యత మీధే, దానికి మీరు సంసిద్దులు కావల్సిందేమరి. శరీరనికి కావలసినంత డ్రింకింగ్ వాటర్ తీసుకోవడం అనే అవసరాన్ని గుర్తించాం. ఈ ప్రక్రియ మీ శరిరంలొ అంతరశుద్దిని మరియు జీర్ణకోశ వ్యవస్థని సక్రమంగా తన విధులని నిర్వర్తించడనికి సహయకారి ఔతుంది. ఈ ప్రక్రియని మొదటి దినచర్యగా ఈ రోజే ప్రారంభించండి. సహజ జీవనశైలిలో స్వాగతించే ఆరోగ్యకరమైన మొదటి అడుగు ఇది. ఆరోగ్యవంతంగా మీ శరీరాన్ని తన విధులను నిర్వర్తించనీయండి.
ఇక మీ మానసిక ఆందోళలనలను అధిగమించడానికి, మానసిక ప్రశాంతతని సాధించడానికి మీకో ట్రెజర్ హౌస్ కావాలి !!
ఇక మీ ట్రెజర్ హంట్ ని ఇలా మొదలెట్టండి!!!
Comentarios