top of page

ఆకర్షణీయంగా...అందంగా

  • Narayana Setty
  • Jun 28, 2017
  • 4 min read

ఉన్నత జీవనప్రమాణాలు, నవీన నాగరికత, ఆధునిక గృహోపకరణాలు, మెరుగైన వసతులు, నగరజీవితం నేటి మహిళ జీవితాన్ని సౌకర్యవంతం చేసాయి.

అయితే ఈ జీవనాన్నిఆరోగ్యభరితంగా, ఆహ్లాదభరితంగా తీర్చుకోవడానికి మరియు ధృడమైన శరీరసౌష్టవాన్ని, కోమలమైన చర్మాన్ని, చురుగ్గా, చలాకిగా ఉండే మోముని సొంతం చేసుకోవడానికి కొన్ని మార్పులు, చేర్పులను జీవనవిధానంలోకి నేటి మహిళ మనస్సుపుర్తీగా అంగీకరించాలి, వాటిని దినచర్యలోనికి స్వాగతించాలి. ఇందుకు మీ దశ, దిశలని నవీన జీవనశైలిని ఈ మార్పులతో ట్రై చేయండి. కొద్ది వారాలలో ఫలితాలు ఎనలేని సంతృప్తిని తీసుకు వస్తాయి.

  • ఇంటి పెరట్లో గార్డెనింగ్ ని ప్రారంభించండి. ప్రతిరోజు ఓ పావుగంట తోటపనికి కేటాయించండి, అది మీకు చక్కటి వ్యాయామం మరియు మీ అకౌంటు నుంచి సుమారు నూరు కెలొరీలు ఖర్చు అవుతాయి. మీ కండరాలు ఉత్తేజితమవుతాయి. అన్ని అవయవాలకు ప్రాణవాయువు సక్రమంగా సరఫరా అవుతుంది. రక్తపోటుతో బాధపడేవారికి ఇదెంతో మేలు చేస్తుంది. స్వచ్ఛమైన గాలి కూడా అందుతుంది. దీనివల్ల పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. ఇది మానశిక ఆనందాన్ని తీసుకు వస్తుంది. పెంచుకున్న మొక్కలు ఇచ్చే ఆర్గానిక్ కూరాగాయలు మీకు చక్కటిఆరోగ్యాన్ని, సంతోషాన్ని తీసుక వస్తాయి.

  • ఇంటి ఆవరణలో విధిగా తులసి మొక్కలని పెంచండి. తులసి ఆరోగ్యప్రధాయణి. తులసిలోని ఔషధ గుణాలని మన హైందవ సంస్కృతి ఏనాడో గుర్తించింది. ఇది శ్వాసకోస వ్యవస్థని, రోగనిరోధక వ్యవస్థని, మానశిక వ్యవస్థలని ఉత్తేజపరుస్తుంది. తులసిఆకులని మరగుతున్న మంచినీటీలో కలిపి టీ గా ప్రతి దినం సేవించండి అయితే ముందుగా ఆ టీ పరిమళలాని అనుభవించండి. మీ ఆతిధులకు కూడా ఇవ్వండి. వారి అభినందలను అందుకోండి. ఇందులో లెమన్ జ్యూస్ ని కూడా ఇష్టం, ఆసక్తి ఉంటే కలుపుకోవచ్చు. ఇది మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులోని యాంటిఆక్సిడెంట్లు శారీరక వ్యవస్థని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. తులసి దళాలు జలుబు, రొంప, సాధారన జ్వరాల నుంచి మీ కుటుంభాన్ని దూరంగా ఉంచుతుంది. ఇతరులకు తులసి మొక్కలని కానుకగా కూడా ఇవ్వవచ్చు.

  • ఇంటి పని, ఇంట్లో పని, ఇంట్లో వంటపనులని సాంప్రదాయక పద్ద్ధతిలో పునః ప్రారంబించండి. ఇంట్లో ఫ్లోర్ క్లీనింగ్, ఫ్లోర్ మాపింగ్, వాషింగ్ లని సొంతంగా చేయండి. బట్టల వాషింగ్, డిష్ వాషింగ్ లని కూడ ఇష్టంగా చేయడానికి సంసిద్ధులు కావాలి. డిగ్నిటి ఇన్ లేబర్ని మనస్పూర్తిగా ఆహ్వన్నించండి.

  • ప్రతిరోజు స్నానం సాంప్రదాయక పద్ద్ధతిలో చేయండి. ఇందులో భాగంగా పసుపుని విరివిగా వాడండి. ఇందులో యాంటిబయాటిక్, యాంటిఇమప్లమేటరి గుణాలు ఉన్నాయి. అది కాళ్లపగుల్లుని అరికడ్తుంది. పసుపులోని ఔషద గుణాలు చర్మసంరక్షణకి, సౌందర్యపోషణకి ఆలంబన అవుతుంది. పాలు, పసుపుల మిశ్రమాన్ని మీమోముకి తరచుగా మసాజు చేయండి. అది మొహంలోని మచ్ఛలని కాంతిరహితంగా, మొహాన్ని మృదువుగా చేస్తుంది. వారంలో ఒకసారి వంటికి నలుగుపెట్టి, కుంకుడుకాయ లేక శీకాయతో ఆభ్యంగనస్నానం చేయండి ఇది కేశసంపదని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మార్కెటులో దొరికే షాంపు, బాడీలోషన్ లాంటి సౌందర్యోత్పత్తులని దూరంగా ఉంచండి. ఇది డబ్బుని కుడా ఆదాచేస్తుంది.

  • వేసవిలో పాలు, నీళ్లు సమంగాకలగలిపిన ఐసుక్యూబ్సుతో లేదా చల్లటిగడ్డపెరుగుతో మెడ, గొంతు మోహాన్ని తరచుగా మసాజు చేయండి.అది మెడ, గొంతు, ముఖకండారాలకి చక్కటి రిలీఫ్ ని, ముఖానికి ఫ్రెష్నస్ ని తీసుకవస్తుంది.

ఇంటిపని, వంటపని, ఇంట్లోపని నడుము వంచి చేయడం ద్వారా అది చక్కటి శారీరకవ్యాయామం అవుతుంది. శరీరంలోకి ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఇవి అన్ని వయస్సులవారి మీద సానుకూల ప్రాభావాన్ని చూపుతాయి. ఆడుతు పాడుతు నేటి యువతి ఈ దినసరి కార్యక్రమాలను నిర్వర్తించుకోవాలి.దీనిద్వార రక్తనాళాల గోడలలో పేరుకున్నకొలొస్ట్రాలు కరగడం మొదలౌతుంది. శరీరంలోని కొవ్వునిల్వలు కరుగుతాయి.ఫలితంగా బిగువైన కండరాలు, బలిష్టమైన కీళ్ళవ్యవస్థ, బలమైన కటివ్యవస్థ, ఆకర్షణీయమైన దేహధారుడ్యం మీసొంతం అవుతుంది.

భర్తగా మీ సహధర్మచారిణికి ఈ పనులుచేయడంలొ మీ వంతు సహకారం అందచేయాలి. పనులను షేరు చేసుకోండి. ఏ పనిని చిన్నచూపు చూడకండి. కలిసి పనిచేయండి, ఆరోగ్యాని కలిసి పంచుకోండి. ఆహ్లాదభరిత వాతావరణంలో విహరించండి. మధురానుభూతులను సొంతం చేసుకొండి.

అలసిన తనువు, మనువుకి విశ్రాంతిగా ప్రతిరోజు చక్కటినిద్ర మిమ్మల్ని వరిస్తుంది. అది శరీరలావణ్యానికే మొదటి అడుగు అవుతుంది. లంచ్ తర్వాత ఓ పావుగంట కునుకుతీసుకొనే అలవాటు ఉంటే దానిని కంటిన్యూచేయండి. ఇది మిమ్మల్ని ఫ్రెష్ గా ఉంచడడానికి సహయకారి అవుతుంది.

ప్రశాంతమైన నిద్రానుభూతిని అనుభవించడానికి పడకగదిలోనికి గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేట్లుగా వుండాలి. ఇందుకు కిటికిలు తెరచివుంచాలి. దోమల బెడదనుండి కిటికిలకి నెట్ అరెంజుమెంట్ వుండాలి. పరిసరాలు మురుగునీరు, చెత్త, చెదారం లేకుండా పరిశుభ్రంగా వుండాలి. మీకు సౌకర్యవంతంగా ఉండే బెడ్ ని సెలెక్టు చేసుకోండి. మీ చిన్నారికి బెడ్ రూం ప్రత్యేకంగా వుండాలి. అవసరమైతే దోమతెరలని వాడండి. రూం ఫ్రెషర్సుని తరచుగా స్ప్రే చేయండి. పడకగదిలో బెడ్ నీటుగా, శుభ్రంగా వుండాలి. దిండుగలీబులు, బెడ్ షీట్లు తరచుగా మారుస్తూవుండాలి మరియు వాష్ చేస్తూవుండాలి. ఫ్లోరు పొడిగా, క్లీన్ గా వుండాలి. గోడలకి మనస్సుకి ఆహ్లదకరంగా వుండే లైట్ కలర్సు వుండాలి. బెడ్ రూంలో నైట్ పలుచటి నీలిరంగు కాంతులు నలువైపుల పరచుకోవాలి. డిన్నర్ అయిన ఓ గంటన్నర తరువాతనే నిద్రకు ఉపక్రమించాలి. మీలోని సృజనాత్మకత, వైవిధ్యాలని ప్రదర్శించడానికి, మీ శ్రీవారి మనస్సుతో దోబూచులాడడానికి, మనస్సుని దోచుకోవాడానికి ఇంతకి మించిన ప్రపంచం లేదు.

  • హాలిడేస్ /లీజర్ సమయాల్లో స్కిప్పింగ్ గేం ని విడిగాకాని లేదా గ్రూపుగా సహాచరులతో కలిసి ఆడండి. దీని ద్వార మీ అకౌంటునుంచి సుమారు 150 కెలొరీలు ప్రతి పావుగంటకి ఖర్చు అవుతాయి. కటి వ్యవస్థకి బలాన్ని తీసుకు వస్తుంది. కండరాలు మృధుత్వాన్ని సంతరించుకుంటాయి. శరీరం లోనికి అదనపు ఫ్యాట్ డిపాజిట్ గాకుండా శరీరాంగాలను నాజుకుగా ఉండడానికి దోహదం చేస్తుంది. స్కిప్పింగ్ గేం ఆడటానికి మెదడులోని ఇరుభాగాల మధ్య చక్కటి సమన్వయం, సమతుల్యత కావాలి. ఈ ఆట సమన్వయం, సమతుల్యతలని సాధించడమే గాకుండా, మెదడుని, అలోచలని తేజోవంతం చేయడానికి తోడ్పడుతుంది. అది మీలోని వత్తిడిని సమర్థవంతంగా తగ్గిస్తుంది.

  • ఆసక్తి ఉన్న ఆట, పాటలని గృహిణిగా కూడా కంటిన్యు చేయండి. పెయింటింగ్, డ్రాయింగ్, డాన్సింగ్, సింగింగ్ మ్యూజిక్ లాంటి లలితకళలలో మీకు ఉన్న ప్రావీణ్యతని మీ చుట్టు పక్కల వారికి తెలియజేయండి.ఆసక్తి ఉన్నవారికి ఈ కళలని నేర్చుకోవడానికి ప్రోత్సాహం అందచేయండి/ నేర్పించండి.మీ సృజనాత్మకత ఇతరులకి ప్రేరణ అవుతుంటే ఆనందించండి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది! అది మీలోని అందాన్ని ఇనుమడింపచేస్తుంది!! మీ అందానికి ఆభరణం మీ ఆత్మవిశ్వాసమే..!!! పండుగలకు, వేడుకలకి చుట్టు పక్కల వారిని అహ్వానించండి.మీ లోని సృజనాత్మకతలని ప్రదర్సించడానికి ఇది ఓ చక్కటివేదిక కూడా అవుతుంది.

  • పరిసరాల శుభ్రతకి మీవంతు సహాయ సహకారాలను అందజేయండి. స్వచ్ఛభారత్ ని ప్రేరణగా తీసుకొండి, ఆచరించండి. సామాజిక సేవలో భాగస్వాములు అవండి.

  • ఇతరులు చెప్పేది శ్రద్ద్ధగా ఆలకించండి. శ్రద్ద్ధగా వినడం ఓ కళ దానిని మెరుగుపరచుకోండి. అవసరమైతే మీ అభిప్రాయలని, సలహాలని తప్పక జత చేయండి. అది వారికి మిమ్మల్ని మరింత దగ్గరచేస్తుంది. మీరు అందరికి చక్కటి నేస్తం అవుతారు.

  • ఏవి శాశ్వతం కాదు, మీ వ్యధలు కూడా అనే భావనని మనసారా నమ్మండి. ఇది మీలోని పాజిటివ్ ఆటిట్యూడికి ఊతం తీసుకువస్తుంది! అది మీ లోని ఆత్మపరిశీలన, ఆత్మవిమర్శలకి పదును పెడుతుంది. వాటినే మీఆయుధాలుగా చేసుకొండి! ఇక ఆత్మవిశ్వాసంతో మిమ్మల్ని ముందడుగువేయిస్తుంది!! ముందుకు నడిపిస్తుంది!!

మీరు పెద్ద సింగర్ కానవసరం లేదు, అయినా కూనిరాగాలు, పాటలు రోజు పాడుకుంటూనే వుండండి. మీ గాత్రాన్ని అభినందిస్తూ, మీ లోని సింగర్ని ప్రోత్సహించండి. ఇది మిమ్మల్ని హూషారుగా, లంగ్సుని, మనస్సుని హెల్తీగా వుంచు తుంది.

వారంలో ఓక రోజుని ఫ్యామిలీతో సరదాగా గడిపేట్లుగా మీవారితో కలిసి ప్లాను చేసుకోండి. అది నూతన ఉత్సాహాన్ని మీలో తీసుకువస్తుంది. ఈ నవ జీవన మాధుర్యాన్ని అనుభవించండి.

ఓ బుజ్జి కుక్కపిల్లని నేస్తంగా పెంచుకోండి. ఇది మీకు చక్కటి కాలక్షేపం అవుతుంది. అలసి, సొలసిన మీలో కొత్త ఉత్సాహాన్ని, మోమున చిరునవ్వులను పూయిస్తుంది.

మీ కుటుంబం పౌష్టికాహరలేమి లేనిదిగా ఉండాలి. ఇందుకు మీ పాకశాలనే మీ పాఠశాలగా, పానశాలగా మలచుకోవాలి. పౌష్ష్ఠికాహరలేమి, అవాంచనీయ పరిస్థితులైన శారీరకలేమికి, మానసికలేములకి కారణం అవుతుంది. నేటిసమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సామాజికరుగ్మతలు ఇవే! ప్రతి సంవత్సరం ప్రపంచంలో కొన్నిమిలియన్ల శిశు మరణాలు పౌష్టికాహరలేమిద్వారా సంభవిస్తున్నాయి అని ప్రభుత్వ గణాంకాలు నిర్ధ్వందంగా చెబుతున్నాయి! ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిమందిలో ముగ్గురు మానశసికలేమి భాదితులే! ఇది నమ్మలేని వాస్తవం!!

ఇక పాకశాలే...మీ పాఠశాల… సవివరంగా తెలుసుకుందాం


 
 
 

Comments


bottom of page