top of page

డైటింగ్ ప్లాన్

  • Narayana Setty
  • Jun 28, 2017
  • 3 min read

డైటింగ్ ప్లాను అనే మాటని నేడు సొసైటిలో మనం తరుచుగా వింటున్నాం. ఇది మెరుగైన ఆహరపు అలవాట్లను అమలుపరచుకొనె ఒక ఆరోగ్యకరమైన మార్పుగా వుండాలి. నేటి యువత, ఉధ్యోగినులు, వివిధ రంగాలలో పనిచేసే కళకారులు, నిపుణులు, స్టుడెంట్సు, అని అన్నితరగతులవారు వయోభేదం లేకుండా తమకి తోచిన రీతిలో అనుసరిస్తున్న ఆహార విధానం. అయితే 75% మందికిపైగా ఆశించినరీతిలో ఫలితాలను పొందలేక ఈ కార్యచరణ పధకాన్ని అసంతృప్తితో అర్థాంతరంగా వదిలివెస్తున్నారు అని గణాంకాలు తెలియచేస్తున్నయి. అందుకని మనం తీసుకొనే ఆహారం సమతుల్యపోషకాహారంగా వుండితీరాలి. అలా లేకుంటే అది అనేక కొత్తసమస్యలకి కారణంకూడా అవుతుంది. అవి:

o మీరు త్వర, త్వరగా అలసిపోవడం, కొద్దిపాటి ఒత్తిడినికూడా తట్టుకోలేకపోవడం o మొహం కాంతివిహీనంగా, మరియు ముడతలని ప్రస్పుటంచేస్తుంటే ఆ డైటింగ్ సరియైనది కాదు. o మీలో డిప్రెషన్ భావాలని తీసుకవస్తుంటే మీ డైటింగ్ ప్లాన్ లో కొన్ని మార్పులను వెంటనే చేయాలి అనేదానికి సంకేతం. o తీసుకొనే ఆహారంపై ఆనాసక్తి కలగడం మీ డైటింగ్ ప్లాన్ సరీఅయినదికాదు అనడనికి ఓ చిహ్నం o నెలరోజుల డైటింగులో కూడా మీ బరువు తగ్గకపోవడం, డైటింగ్ ప్లాన్ లో మార్పులని సూచిస్తుంది. o టమ్మిని ఎక్కువుగా ఆకలితో ఖాళీగా వుంచడం సర్వదా సరి అయిన డైటింగ్ పద్దతి కాదు. o భావోద్వేగాలలో తరచుగా మార్పులని తీసుకవస్తుంటే ఆ డైటింగ్’ని పునః సమిక్షించాల్సిందే. o జీవక్రియ, జీర్ణక్రియలలొ అసమానతలని తీసుకవస్తుంటే మీ డైటింగ్ ప్లాన్ సరియైనదికాదు o మెటబాలిజం తగ్గినా,రోగనిరోధకశక్తి తగ్గినా డైటింగ్’లో మార్పులు చేయవలసిందే. o కొత్తగా, తరుచుగా కాళ్లనొప్పులు, బాడీ పెయిన్సు వస్తూంటే డైట్'ని మార్చుకోవాల్సిందే. o ఆకలి భావన అదేవిదంగా కలిగివుండడం, మీ డైటింగ్ ప్లాన్ సరియైనదికాదు అని తెలియజేస్తుంది o మీరు తీసుకొనే ఆహరం జీర్ణక్రియని మందగింపచేసినా, సరిగా జీర్ణంకాకపోవడం అనారోగ్యానికి కారణం అవుతుంది. o ఏనర్జి లెవల్సు తగ్గిపోతున్న భావన తరచుగా కలుగుతుంటే మార్పులు, కూర్పులు డైటింగ్ లో చేయవలసిందే డైటింగ్ ప్లాన్ జీరో కేలోరీలు, తక్కువ కేలోరీలతో సూక్ష్మపోషక భరితంగా సాత్వికాహరంగా ఉండి తీరాలి. డైటింగ్ ప్లాన్ని కొద్దిపాటి మార్పులు, కూర్పులతో మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఈ ప్రణాళిక ఆకలి బాధని దూరంగా వుంచడమే గాకుండా మెటబాలిజాన్ని మెరుగుపరచి ఆరోగ్యవంతంగా వుంచుతుంది. • భోజనాన్ని (లంచ్) మూడు విడతలాగా తీసుకోండి. ప్రతి విడతకి 2 గంటల వ్యవది ఇవ్వం డి. • తొలి విడతగా ప్రూట్, వెజిటబుల్ సలాడు మీ ఆసక్తి మేరకు తీసుకోండి. • మలివిడతగా వెజిటబుల్ సూప్, కూరగాయలు టమ్మి నిండుగా తీసుకోండి. • మూడవ విడతగా ఓ కప్పు మొలకెత్తిన గింజలు (లేదా) ఆకు కూరలతో ఓ కప్పు అన్నం, రెండు పుల్కాలు, బట్టర్ మిల్కు ఓ గ్లాస్ తీసుకోండి. • చివరివిడతగా ఓ కప్పు గ్రీన్ టీ/ జింజర్ టీ లేదా ఓ గ్లాస్ లెమన్ వాటర్ తీసుకోండి.

o టమోటజ్యూసుని నిమ్మరసం, జింజర్, మిరియాల పౌడర్లతో తరచుగా తీసుకోండి. పూదీనా, పండిన ఫైన్’ఆపిల్ జ్యూసుని ఓ కప్ ని కూడా ఇందులో కలుపుకోవచ్చు. ఇది కొలోస్ట్రాల్ లెవల్సుని తగ్గిస్తుంది, చర్మాన్ని ఆరోగ్యవంతంగా వుంచుతుంది.ఇందులో A మరియు C విటమిన్ లు పుష్కలంగా, ఇంకా B6, K విటమిన్ లు సంవృద్దిగా లభ్యం. అవి ఎముకవ్యవస్థని బలోపేతం చేస్తాయి. టమొటాలోని ఎర్రటి గుజ్జులో వుండే యాంటియాక్సిడెంట్లు ఫ్రీ రాడికల్సుని నియంత్రిస్తాయి. అది ఒత్తిడులను తగ్గిస్తుంది. ఈ జ్యూసుని వారంలో మూడు నుంచి నాలుగు సార్లు తీసుకోవచ్చు.

o ఫ్రెష్ పైన్ ఆపిల్ రసం ఓ కప్పు, ఓ పూర్తి నిమ్మకాయరసం, ఓ టెబులు స్పూను జింజర్ రసం, ఓ చిన్న స్పూను తేనె, ఓ అరకప్పు ఫ్రెష్ క్యారెట్ రసం, కొద్దిగా మిరియాలపౌడర్ మిశ్రమాలతో జ్యుసు తరచుగా తీసుకోండి. ఇది బోను మరియు కార్టిలేజు వ్యవస్థలని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ఇందులోని యాంటిఇంఫ్లమెటరి గుణాలు అర్థరైటీసుకి, కండారలవాపుల నుంచి ఉపశమనమిస్తాయి. బరువు పెరగడానికి సహకరించదు. ఈ జ్యూసుని రోజులో రెండు పర్యాయాలుగా వారానికి ఒకసారి తీసుకోవాలి.

o ఉసిరికాయని జ్యూసుగా, పొడిగా, చట్నీగా రెగ్యులరుగా వాడుకోండి. ఉసిరికాయ జ్యూసుని పరగడుపున రోజు తీసుకోండి. ఈ జ్యూసుని నోటితో పుక్కిలించండి అది నోటిలో అల్సర్లని మానుస్తుంది. ఈ జ్యూసులోని యాంటి ఇంఫ్లమెటరి గుణాలు ఆర్తరైటీసు, కండారలవాపుల నుంచి ఉపశమనం ఇస్తుంది. కండ్లని, కంటిచూపుని, సంరక్షిస్తుంది. ఉసిరిలో విటమిన్ C రోగ నిరోధకవ్యవస్థని మెరుగు పరుస్తుంది. పైబరు సంవృద్దిగా లభిస్తుంది, ఇది ప్రేవువ్యవస్థని ఉత్తేజపరచి మలబద్దకాన్ని దూరంచేస్తుంది. ఉసిరిలోని క్రోమియం ధాతువు ఇన్సులిన్ వాడాకన్ని మెరగుపరచి డయబిటిస్ని నియంత్రిస్తుంది, మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియలో తయారైన టాక్సిన్సుని సమర్థవంతంగా విసర్జించడానికి సహయాకారి అవుతుంది, ఎసిడిటిని తగ్గిస్తుంది. ఈ జ్యూసుని తేనతో కలిపి జలుబు, రొంపలకి రోజుకి రెండు, మూడు సార్లు తీసుకోండి వాటిని తగ్గించివేస్తుంది. రోజు రాత్రి పడుకునేముందు ఓ చెంచ ఉసిరిపొడిని ఓ గ్లాస్ నీళ్లలో కలిపి త్రాగండి. ఇది చెడు కొలోస్త్రాలుని తగ్గిస్తుంది, నిద్రలేమిని దూరం చేస్తుంది.

o దానిమ్మ గింజలని తరచుగా తీసుకోండి. దానిమ్మలో యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి, అవి ప్రీరాడికల్సుని నియంత్రిస్తాయి. ఇవి రోగనిరొధకవ్యవస్థని బలోపేతం చెస్తుంది. దానిమ్మజ్యూసుని అవకశాం దొరికిన ప్రతిసారి ఓ గ్లాసు తీసుకోండి. హార్మొన్ల సమతుల్యతలని సాదిస్తుంది. నరాలలో రక్తాన్ని గడ్డకట్టడాన్ని నియంత్రిస్తుంది. గుండెని ఆరొగ్యవంతంగా తన విధులని నిర్వర్తించడానికి తొడ్పడుతుంది. ఇందులో ఇనుము ధాతువు సంవృద్దిగా లభిస్తుంది, అది రక్తహీనతని తగ్గిస్తుంది. మరియు రక్తంద్వార ఆక్సిజన్ని చర్మానికి మెరుగ్గా సరఫరా అవుతుంది. అది చర్మాన్ని అరోగ్యవంతంగా, తెజోవంతంగా ఉంచుతుంది. జుట్టుకుదుల్లను గట్టిపర్స్తుంది, రాలడాన్ని తగ్గిస్తుంది. కొద్దిగా ఈ జ్యూసుని స్పాంజితో మొహానికి పట్టించండి.అది మొహంలోని మచ్చలని కాంతివిహీనం చేస్తుంది.

o తీసుకునే ఆహారాన్ని నోట్లోనుంచి జారవిడచే అలవాటుని మానేయాలి, ఆహారాన్ని నెమ్మదిగా బాగా నమలండి. అది లాలాజలం, అందూలోని ఎంజైంలతొ కలసి చక్కగా జీర్ణం కావడానికి ఉపయోగ పడుతుంది. o భోజనంతొ పాటు మంచినీళ్లు త్రాగకండి, వాటి అవసరం జీర్ణక్రియకి ఎంతమాత్రం అవసరం లేదు. భోజనానికి అర గంట ముందుగా భోజనం తరువాత ఓ గంట వరకి మంచి నీళ్లు త్రాగకండి. ఇది ఆహరాన్ని చక్కగా జీర్ణం కావడానికి దోహదం ఔతుంది. మనం తీసుకునే సలాడ్సు ,సూపులు, జ్యూసులు తాజాగా వుండాలి. టేస్టుకోసం షుగరుని వాడరాదు, ఆసక్తి ఉంటే తేనె వాడుకోవాలి.


 
 
 

Comments


bottom of page