top of page

పిల్లలలో మానశిక ఒత్తిడి

  • Writer: Admin
    Admin
  • Jun 28, 2017
  • 3 min read

మనలో చాలమంది చిన్నపిల్లకి మానశిక ఒత్తిడులా, అవి ఎందుకు వుంటాయి...! వాళ్లకి ఏమి ప్రాబ్లంలు/ సమస్యలు వుంటాయి.. అనే భావనలో వుంటాం…!! నిజానికి ఇవి మనందరిలో వయస్సుతో సంభందం లేకుండా వుండనే వుంటాయి.. తల్లి గర్భంలోవుండే శిశువుకి కూడా ఇవి వుంటాయి అన్నది మన వుహలకి అందని యదార్ధం... లౌడ్ మ్యూజిక్, వింతశబ్ధాలకి , పిడుగుపాటి శబ్ధాలకి గర్భస్థ శిశువు వులికిపడడం చాలామంది తల్లులకు అనుభవమే..! అందుకే వినసొంపైన, లయబద్దమైన, శ్రావ్యమైన , ఆహ్లదభరితమైన వీనులవిందైన సంగీతాన్నే తల్లిగా మీరు ఆస్వాదించాలి.

మీచిన్నారి ప్రవర్తనలో వచ్చే మార్పులు, చేర్పులని సునిశతంగాగమనిస్తూ వుండడం తల్లితండ్రులుగా మీ కనీసభాద్యత , ఇది ప్రధానం అన్నది తప్పక గుర్తించాలి.. అప్పుడుమాత్రమే అది వాళ్ల ఆలన,పాలనలకి చక్కటి ఆలంబన అవుతుంది.

మీ చిన్నారి గత కొంతకాలం నుంచి తరచుగా మూడీగా , ఒంటరిగా, పరధ్యానం, ఇరిటేషన్ లతో వుంటే వాడు మానశికఒత్తిడిలో వున్నట్లే. వారి ప్రవర్తనలలోని మార్పులని ఇలా గమనించవచ్చు.. • స్కూల్ కి వెళ్లడానికి అయిష్టంగా వుండడం • ఫ్రెండ్స్ తో కలసి ఆటపాటలకి కలసి ఆడుకోవడానికి ఇష్టపడక పోవడం • అడిగినవాటికి సమధానం ఇవ్వకపోవడం • తరచుగా గట్టిగా, అరచినట్లుగా మాట్లడడం • కోపంగా సమాధానం ఇవ్వడం • ఒంటరిగా వుండడానికి ఇష్టపడడం • అందరితో కలసి మెలసి వుండకపోవడం

ఇలా బిహెవ్ చెయడానికి ప్రధానకారణాలుగా వీటిని చెప్పుకోవచ్చు

• పిల్లల ముందే తరచుగా మీరు గట్టిగా అరచుకోవడం, కీచులాడుకోవడం, వాదులాడుకోవడం వారిలో ఇన్సెక్యురిటీగా ఫీల్ కావడానికి కారణం అవుతారు. ఈ విషయాన్ని వాళ్లు వ్యక్తీకరించలేక పొవచ్చు, కాని ఆభద్రతా భావానలకి గురవుతారు... అందుకే పిల్లల ముందు అలా ఎప్పటికి ప్రవర్తించకపోవడం అభిలషణీయం అని గుర్తెరిగి హుందాగా, సరదాగా నడచుకోవడంద్వార వారిలోని ఆభద్రతా భావనలని దూరంచేస్తాయి… మీలోని కోపావేశాలని పిల్లల ముందు ఎప్పుడు ప్రదర్శించకపోవడం అనేవివేకవంతమైన మార్పుని మీ జీవనవిధానంలోనికి మనస్పూర్తీగా స్వాగతించాలి. • సాంఘిక పరమైన సమస్యలు, ఆర్ధిక పరమైన సమస్యలని వారి ముందు చర్చించకండి. అది వారిని ఆందోళనలకి గురిచేస్తాయి.

• కారణాలు ఏవైన పిల్లలు తల్లితండ్రులలో ఒక్కరి దగ్గరమాత్రమే వుండడం సహజంగా వారిని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తాయి. ఆవి సహేతుకమైన కారణాలు మీకు కావచ్చు కాని అవి ఆ చిన్నారి మనస్సుకి సాంత్వనని ఏమాత్రం తీసుకరాలేవు..

• క్లాస్ లో చెప్పే పాఠాలు సరిగా అర్ధం చేసుకోకపోవడం, ఇది ప్రధానంగా క్లాస్ రూం లో మాట్లాడే భాష డిఫరెంట్ గా వుండి ఫాలోకాలేకపోవడం. అది వారి మానశిక స్థైర్యాన్ని దెబ్బతీసి తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ నిరాశని తీసుకవస్తుంది.

• స్కూల్లో ఎవరైన వారితో మిస్ బిహేవ్ చేయడం లేక ఆటలలో దూరంగా వుంచడం వారిని ఆత్మన్యూనత పరిస్తితులలోనికి తీసుక వెళ్తాయి. ఒంటరి తనానికి దగ్గర చేస్తుంది.

ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చాక వారితో ప్రేమగా ఆ రోజు క్లాస్ విషయాలని, చెప్పిన పాఠాలని గురించి స్వేచ్చగా మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాలి. వాటిని శ్రద్దగా వినండి. వారికి వుండే చిన్నపాటి ఇబ్బందులని ఫ్రీ గా చెప్పనీయండి. ఆ ఇబ్బందులని అధిగమించడానికి మేము ఉన్నాం అనే భరోసా ఇవ్వండి.

వారి హోంవర్క్ లో మీ చేయూత తప్పనిసరి. చేసేసిన హోంవర్క్ కి అభినందించండి. మీ పనులని పక్కనవుంచి డైలీప్రోగ్రస్ ని సునిశితంగా గమనిస్తువుండాలి. వారిలోని బెరుకుతనాన్ని దూరంచేయడానికి మీ వంతు సహకారం తప్పనిసరి.

తోటి మిత్రులతో ఆడుకోవడానికి వారిని ఎంకరెజ్ చేయండి. ప్రతి రోజు వాళ్లతో కలసి ఆడుకొనేట్లుగా చూడండి.

తరుచుగా వారి క్లాస్ టీచర్ తో మాట్లాడండి. మీ వాడి చదవులో ప్రోగ్రస్ ని గురించి వారితో చర్చించాలి క్లాస్ లో వాడి ప్రవర్తనని గురించి ఆరా తీయండి. అవసరమైతే వారి అబిప్రాయాలని, సలహాలని సూచనలని తీసుకోవాలి. గురువుగా మీవాడిని గురించి వారి ఒపినియన్ చాల ముఖ్యమైనది అని గుర్తించి ప్రవర్తించండి.

ఎవరైన మిస్ బిహేవ్ చేసినట్లుగా లేక ఆటలలో దూరంగా వుంచడం మీదృష్టికి వస్తే తప్పకుండా క్లాస్ టీచర్ దృష్టికి తీసుకవెళ్లాలి. దిద్దుబాటు చర్యలని తీసుకోవాలి.

స్కూల్ ఎక్టివిటీస్ లో మీ వాడు తప్పక పాల్గొనేవిధంగా ప్రొత్సహించాలి.

స్కూల్ వాతవరణం వారికి సన్నిహితంగా వుండేట్లు చూసే భాద్యత మీది మరియు స్ఖుల్ యజమాన్యానిది. అందుకనే తరుచు వారితో మాట్లాడడం ఎన్ని పనులున్న వాటిని పక్కనవుంచి , పేరేంట్స్ డే కి విధిగా అటెండ్ కావాలి.

పిల్లల్ని కోపం చేయడం మీ ప్రేమలో ఓ భాగంగా మీ అలవాటు అయితే మీరు ముందుగా మారాలి. ఆ ఆలోచన సరి అయినది కాదు. వారికి మీ ఆంతర్యం తెలుసుకొనే శక్తి వుండకపోవచ్చు, మానశికంగా ఒత్తిడికి గురి అవుతారు. వారు తమ మనస్సుల్లో తమని చిన్నబుచ్చుకుంటారు. అది వారి మానశికవికాసాన్ని ప్రభావితంచేస్తుంది. అందుకనే పిల్లలతో ఎప్పుడూ ప్రేమగా వుండాలి.

రోజు నిర్ణిత సమయానికి వారిని నిద్రకి ఉపక్రమించేలా చేయాలి. వారికి మీ అనురాగాన్ని పంచుతూ దగ్గరిగా తీసుకోవడం, హత్తుకోవడం ద్వార రక్షణ భావాన్ని కలుగచేస్తూ ప్రతిరోజు స్పూర్తీధాయకమైన ఓ మంచి నీతి కధని వారి మనస్సుకు హత్తుకునేట్లుగా చెప్తు వారిని నిద్రపుచ్చాలి. అది చక్కటి నిద్రకి ప్రేరణ అవుతుంది, మానశిక ఒత్తిడులని దూరం చేస్తుంది.

పాశ్చాత్య పోకడలకు దూరంగా వారిని మీదగ్గరిగా మీతో పాటు పడుకోనియ్యాలి. నిద్రకి ఉపక్రమించినాక వారిని వారికి కేటాయించిన బెడ్ కి మార్చుకొండి. విడిగా వుంచడంతో కొన్నిమార్లు వారు ఒత్తిడికి దగ్గరయ్యే అవకాశం వుండి. అందుకని మీ విగ్నతని ప్రదర్సించాలి.

ఆహార సంభందిత విషయాలలో కొన్ని మెళుకవలని ఇలా పాటించండి. • ఆహారాలు తత్వగుణాన్ని పెంపొందించేవిగా వుండాలి. తేలికగా జీర్ణమయ్యే పండ్లు, కూరగాయలని విరివిగా తీసుకొనేట్లుగా చుడాలి • పాలు, డ్రైనట్సు తేనెలని విరివిగా/రెగ్యులర్గా ఇవ్వాలి. అవి మనస్సుని రిలాక్స్ గా వుంచే సమికృత ఆహరాలు అవుతాయి . • చిప్స్, కూల్ డ్రింక్స్, బర్గర్లు, పిజ్జ, కేక్సు, ఫాస్ట్రీస్, సమోస, బజ్జి, బేకరి ప్రాడక్ట్స్ తమోగుణాన్ని పెంచుతాయి, అదనపు కేలరిలని వృద్ది చేస్తాయి, ఒబెసిటికి కారకాలు అవుతాయి. అందుకని వాటిని ఇవ్వడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. • తమో గుణాన్ని కలిగిన ఆహారాలు మనస్సుకి ఇరిటేషన్ కలిగిస్తాయి అందుకని వాటిని వాడకపోవడం మీ చిన్నారి భవిష్యత్తు దృష్ట్యా శ్రేయస్కరం.


 
 
 

Comments


bottom of page