బాలమిత్ర - పిల్లల సంరక్షణ
- Narayana Setty
- Jun 28, 2017
- 2 min read

మీ ఫామిలీ లోనికి కొత్తగా ఓ పాపాయి చేరగానే అంతవరకి అల్లారు ముద్దుగా పెరిగిన మీ మొదటిపాపని పెద్దదానిగా చూడడం మొదలుపెడ్తారు. అంతవరకు సాగిన ముద్దు, మురిపాలు పంచడంలో వివక్షణ చూపడం, ప్రతి దానికి వాడికి పెద్దరికాన్ని ఆపాదించడం పిల్లలలో అనుకోని అసంతృప్తికి మీరు తెలియకుండానే భీజాలు వాళ్ల మనస్సుల్లో వేస్తున్నారు. ‘నాకిష్టమైన బొమ్మలన్ని,స్టోరీబుక్సు అన్ని చెల్లీకి ఇవ్వాలిసిందే లేదూ అంటే అదే లాగేసుకుంటుంది! కాదూ, లేదూ అంటే అమ్మ, నాన్న నీవు పెద్దాడివి షేరు చేసుకోవాల్సిందే అని చెల్లికే సపోర్ట్టు!! చెల్లి బొమ్మలు తనవే దానికి సపోర్టుగా పెద్దాడివి దానితో నీకు పోటీ ఎమిటి అని తిరిగి అమ్మ, నాన్నే అనడం ఎవరికి ఉక్రోషం రాదు చెప్పండి’. ఆటపాటలలో ఇద్దరిలో ఎవరిది తప్పుఐన పెద్దాడికే చివాట్లు. అనురాగాన్ని పంచడంలో మొదటి బిడ్డతో తరుచుగా నీవు పేద్దోడివి, చిన్నదానితో నీకు పోటి ఏంటి అనే కామెంట్లు వాడిలో తనని చులకన చేస్తున్నారు అనే భావనకి అంకురార్పన జరుగుతుంది. అది తన ఉనికిని గుర్తించాలి అనే తపననని వాడిలో కలిగిస్తుంది. ఇక ప్రతిదానికి తన చెల్లీతో మొండిగా పోటి, అలకలు, కోపాలు మొదలెడుతాడు. ఇక్కడే మీసంయమనం, వివేకతని ప్రదర్సించాలి అంతేగాని వాడిని కోపగించడం, దండించడంద్వారా వాడిలో పెంకితనం, మొండితనాన్ని పెంచినవారు అవుతారు. ఆ పసిమనస్సుని ప్రేమతో లాలించాలి, అంతేగాని విసుగు, అసహనాన్ని ప్రదర్శించరాదు, అది సమస్యని మరింత జటిలం చేస్తుంది. నెమ్మది, నెమ్మదిగా పెద్దరికపు విలువలని అర్థం అయ్యేలా తెలియజేయాలి. పిల్లలని చేసే చిన్నపనులైన తరచుగా వారిని అభినందించాలి, అలాగని ప్రతిపనిని పొగడకండి అది గర్వాన్ని తీసుకువస్తుంది. సరిగా చేయని పనులని ఎలా చేయాలో సహనంతో నేర్పించాలి అంతేగాని చిన్నబుచ్చకండి. అడిగినవెంటనే బొమ్మలని కొనకండి. దాని విలువ తెలిసేట్లుగా వారికి ఓ టాస్కుని ఇవ్వాలి. వారికి గిఫ్టుగా టాస్కు చేసినాక కొనివ్వాలి. ఇది పనిచేసి సాధించాలి అన్న భావనకి వారి చిన్నారి మనస్సులో ప్రేరణగా అవుతుంది. పిల్లలని సరదాగ ఇరుగు పొరుగు పిల్లలతో రోజు సాయంత్రం ఆరు నుంచి ఓ అరగంట ఆడుకోనివ్వాలి, ఓ అరగంట వాళ్లకి ఇష్టమైన టీవీ ప్రోగ్రాములని చూడనీయాలి, తరువాత హోంవర్కు ఏ రోజుది ఆ రొజే చేయుంచాలి అది చక్కగా మనస్సుకి చేరుతుంది. రోజూ డిన్నర్ రాత్రి ఎనిమిది గంటలలోపుగానే ఇవ్వాలి, వారికి ఆసక్తికలిగించేలా నీతి కధలను చెప్పండి. ఓ అరగంటలో వాళ్ల బెడ్ రూం లోనే నిద్రపోయేలా చూడాలి. వేళకి ఆటపాటలు, హోమువర్కు, డిన్నర్, నిద్ర వాళ్లని మరునాటికి ఉత్సాహాభరితంగా ఉంచుతుంది. పిల్లలలో క్రమశిక్షణ, కట్టుబాట్లుపేరీట వాళ్లస్వేచ్చని కట్టడి చేయరాదు. అబ్బాయిలా కుప్పిగంతులు ఎంటి అని అమ్మాయిలని, ఆడంగిలా ఎంటి ఆ పనులు అని అబ్బాయిలని సరదాగకూడా అనరాదు. పిల్లల ముందు మీరు అరచుకోవడం, వారిపై ఒకేసారి ఇద్దరు చిరాకు పడడం చేయరాదు. అది వారిలో తెలియని అలజడికి కారణం అవుతుంది. చాక్లెట్లు, ఐసుక్రీం, కూల్ డ్రింకులు, బేకరి ఐటంలు, నూడిల్సు, స్వీట్లు వంటి ఎంప్టి కెలోరీల ఆహారాన్ని మీ పిల్లలకి ఇవ్వకండి వాటిలో ఆరోగ్యాన్ని పెంపొదించే పోషాకాలు శూన్యం, అందుకే వాటిని ఎల్లప్పుడు దూరంగా వుంచడం పిల్లలకి, మీకుకూడా అరోగ్యకరం. ఒక సీజనల్ ఫ్రూటు విధిగా ప్రతిరోజు వారి ఆహారంలో ఓ భాగంగా ఉండాలి. మీ పిల్లలని ఇరుగు,పొరుగు పిల్లలతో ఆట,పాటలలో పోల్చి చిన్నబుచ్చకండి. సృష్టిలో ప్రతి శిశువు ఒక ఆణిముత్యమే! వారిలోని ప్రతిభని పేరెంట్సుగా మీరే గుర్తించాలి. ఆ దిశలో ప్రోత్సాహాం అందించాలి. కొందరిలో గాత్రం శ్రావ్యంగా వుంటుంది వారిని మంచి సింగరుగా ఎదగనివ్వాలి, మరికొందరిలో ఆటలపై ఆసక్తి వుంటుంది వారిని వారికి ఇష్టమైన క్రీడలో ప్రావీణ్యతని పొందనీయాలి. ఇంకొందరిలో ప్రతిది తెలుసుకోవాలనే తపన బాగావుంటుంది వారికి మీరు ఓపికగా తెలియజేయాలి, వాటిని తెలుసుకొనే అవకాశాన్ని కూడా కలుగచేయాలి. అలాగే మరికొందరిలో సృజనాత్మకతపాళ్లు ఎక్కువగా వుంటాయి, ఆ కళలపై ప్రావీణ్యతని పొందడానికి అవసరమైన వసతులు మీరే సమకూర్చాలి. చిన్నారులతో వీలుచేసుకొని తరచుగా ఆటఫాటలతో సరదగా గడపాలి ఆ క్షణాలు వాళ్లకి మీరు అందజేసే అముల్యాకానుకలు.
Yorumlar