మానస సాత్విక్
- Narayana Setty
- Jun 28, 2017
- 5 min read
ఆహరశైలిలోని మార్పులు, లోపించిన శారీరక వ్యాయామం, క్రమశిక్షణ లోపించిన జీవనశైలి మనలోని రోగనిరొధక వ్యవస్థ పనితీరుని ప్రభావితం చేస్తున్నాయి, సంప్రదాయకవ్యవస్థలో మనం తీసుకొనే ఆహరాలు మనకి నచ్చినవి, మన శరీరానికి నచ్చేవిగా వుండేవి. నవీనవ్యవస్థలో అందుకు భిన్నంగా అవి కేవలం మనకి నచ్చ్చేవిగా వుండడం శరీరానికి నచ్చనివిధంగా వుండిపోతున్నాయి. దాని పర్యనసానమే ఒబెసిటి, బిపి, సుగర్ లాంటి మెండివ్యాదుల దరికి మనలని దగ్గర చేస్తున్నాయి. ఒత్తిడికి గురిచేసే కార్టిసొల్ హర్మోనిని కూడ ప్రబావితం చేస్తున్నాయి దాని పర్యవసానమే ఏకాగ్రత లోపించడం, నిద్రలేమి, కోపం, అసహనం, ఒత్తిడులలాంటి మానసికసమస్యలకి కారణమవుతున్నాయి.
ఆహారాన్ని ఔషధంగా తీసుకొనే సంప్రధాయాక వ్యవస్థ నుంచి ఔషధాన్ని ఆహరంగా తీసుకొనే దశకి చేరుకుంది నేటి సమాజిక వ్యవస్థ.
మనం తీసుకొనే ఆహరాలు మన ఆరోగ్యాన్ని సదా పరిరక్షించేవిగా వుండాలి, అందుకని అవి పోషకాహారాలుగా వుండితీరాలి. ఆ ఆహరం పోషకవిలువలని కలిగివుండదామే గాకుండా మన ఆరోగ్గ్యపరిరక్షణలో భాగంగా అవి ఔషధవిలువలని కూడ కలిగివుండాలి. అందుకే మన ఆహరశైలి ఆహరాన్ని ఔషదంగా తీసుకునేవిధంగా మారాలి అపుడే ఔషధాన్ని ఆహరంగా తీసుకొనే పరిస్థితులకి దూరంగా వుండవచ్చు.
మనం తీసుకొనే ఆహరం ఏలా వుండాలి?
మనం తీసుకునే ఆహరం సరీఅయిన పొషకవిలువలు కలిగిన సమీకృత ఆహరాలు కావాలి, అవి శరీరా అవసరాలకు అవసరమైన పరిమాణాలలో తీసుకోవాలి. అవి నాణ్యతని కలిగి వుండి తీరాలి. అటువంటి సాత్విక ఆహరాలలోని ఔషధగుణాలు మనల్ని సదా ఆరోగ్యవంతులుగా ఉంచుతాయి.

పాలు, కూరగాయలు, పచారి సరుకులు, గ్రాసరీల కొనుగోలుకి మీ పరిసర ప్రాంతాలలో కొద్ది దూరంలో వుండే మంచి దుకాణాలకి నడచి వెళ్లండి. మీ తీరిక సమయాలలోనే బజారుకి వెళ్లండి, అయితే ఏండలో వెళ్లకండి.నాణ్యమైన సరుకులనే, తాజా కూరగాయలనే కొనాలి. ఆకుకూరలని రన్నింగు వాటరులో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఫ్రిడ్జులో నిల్వ చేసుకుంటే ఆకుకూరలు, కూరగాయలను విడివిడిగా పొడిగా ప్యాక్ చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితులలోను తాజాపాలపాకెట్లు తీసుకోవాలి. డబుల్ టోనుడ్ (వెన్నతీసిన) పాలను కొనండి. టెట్రాప్యాక్ పాలని వాడనవసరం లేదు. మీ బాడిలో ఫ్యాటుని నియంత్రించాలి. మార్కెట్లో వుండే కల్తీపాలపై ఓ కన్నేసి వుంచాలి. వాటిని ఎటువంటి పరిస్థితిలోను కొనకండి. అవి మీకు మీ ఆరోగ్యానికి తీవ్రహాని చేస్తాయి. ఆ దూకాణాదారులని నిలదీయండి. సామాజిక అనుసంధాన వేదికలో ఈ ఆగడాన్ని ఎండగట్టండి!! మీ కొనుగోళ్లలో పండ్లు, ఫలాలు తప్పనిసరిగా వుండాలి. మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి కావలసినన్ని పండ్లుకొనండి. ఇవి ఖరీదైనవిగా ఉండనవసరంలేదు, కాని తాజాగావుండాలి. అన్నిరకాల పండ్లు పోషకపదార్ధాలకు ట్రెజరు హౌసులే! మీ డైలీడైటులో పండ్లు ఓప్రధాన భాగం కావాలి. ప్రూట్ తేలికగా జీర్ణమౌతుంది అన్నది మీకు బాగా తెలుసు. అంతేగాకుండా ఫైబర్, పొటాషీయం, విటమిన్లు, మైక్రో నూట్రీషీయంట్లు ఎంజైంలు, యాంటియాంక్సిడెంట్సు, ఇందులో పుష్కలంగా వుంటాయి. అవి మీకు ఎనలేని శ్రేయస్సుని తీసు కు వస్తాయి. మీకు ఆరోగ్యభరితమైన శారీరకపోషణలను అందచేస్తాయి. o ప్రూట్ లో హానికలిగించే కొలోస్ట్రాలు వుండదు. ఇది మీ హార్టుని హేల్తీగా, రక్తపోటుని దూరంగా వుంచుతుంది. o రక్తంలో చక్కరల స్థాయిని పెరగడానికి అవకాశం ఇవ్వదు. డయాబిటీసుని దూరంగా వుంచుతుంది. o శరీరంలో క్యాన్సర్ కణాలని పెరగడానికి అవకాశం ఇవ్వదు. సుక్ష్మ పోషకాలు రక్త హీనతని దూరం చేస్తుంది o ప్రూట్ లో ఫైబర్ సంవృద్దిగా లభ్యం. పెద్దప్రేవువ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం మీకు ఇక దూరం. ఆయా సీజనులలో దొరికే ప్రూట్ లనే తినండి. మనకి సాదరణంగా రేగు, ఆపిల్, జామ, బొప్పాయి, నేరేడు, కమల, బత్తాయి, దానిమ్మ, పుచ్చకాయ, కర్బూజ, ధ్రాక్ష, సీతాఫలం, మామిడి, సఫోట, అరటి, పనస ఆయా సీజనులలో సంవృద్దిగా తాజాగా చవుకగా లభ్యమౌతాయి. ప్రతి ప్రూట్ కూడా మీ పొట్టకి సంతృప్తిదాయకమే! ఆనందదాయకమే!! o మీ కుటుంబంలో వారంలో రెండుమార్లు ఉపాహారంగా ఫలాలనే ఆహారంగా తీసుకోవాలనే నిర్ణయం తీసుకోండి, అదే విదంగా మొలకెత్తిన గింజలను రెండుమార్లు ఉపాహారంగా తీసుకొండి. అవి విలువైన పౌష్టికాహర విలువలను శరీరానికి అందిస్తాయి. ఈ వారం నుంచే అమలు చేయండి. o వారంలో ఒకటి, రెండు సార్లు పండ్లు, ఫలాలు, పండ్లరసాలను మాత్రమే భోజనంగా తీసుకోండి. ఆ రోజు ఇంట్లో కిచెన్ కి శలవే! o మార్నింగ్ కాఫీ, టీ లకి ప్రత్యమ్నాయంగా లెమన్ జ్యూసు లేదా గ్రీన్/తులసి టీ ని తీసుకోండి. o వారంలో ఒకసారి పెసలు లేదా శనగలు లేదా పల్లీలతో గుగ్గుల్లని స్నాక్ అయిటంగా తయారు చేసుకోండి. రుచి కోసం గార్లిక్ క్లొవ్ లు, ఉల్లితరగు, నిమ్మరసాన్ని కలుపుకోండి. ఇందులోని స్థూల, సూ క్ష్మ పోషకాలు మీకు ఎంతో మేలుచేస్తాయి. మధుమేహాం ఉన్నవారు రేగు, ఆపిల్, జామ, బొప్పాయి, నేరేడు, కమల, బత్తాయి, దానిమ్మ, పుచ్చకాయ, కర్బూజ, లాంటి పండ్లను రెగ్యులరుగా తీసుకోవచ్చు. ధ్రాక్ష, సీతాఫలం, మామిడి, సఫోట, అరటి, పనస లాంటి పండ్లను పరిమిత మొతాదులలో తీసుకోవాలి.
మీరు రోజు ‘జీరో’ కెలొరిలు, ‘లో’ కెలోరీల ఆహారాన్ని బాగా తీసుకోవాలి. ఇది మిమ్మల్ని స్లింగా, ఆరోగ్యభరితంగా వుంచుతుంది. ఊబకాయం బారినుండి రక్షిస్తుంది. కీర దోశకాయని, కురగాయలని సలాడుగా మీ పొట్టకి నిండుగా ఇవ్వండి. ఇందులోని లో/జీరో కెలోరీలు సంవృద్దిగా పోషకాలను, చెడు కొవ్వు రహితంగా మీకు లభ్యం అవుతాయి.
పంటలపై స్ప్రే చేసే రసయానాలు ప్రూట్ పై అలాగే అంటి వుంటుంది. ఫ్రూట్ ప్రిజర్వెటివ్ గా వాడే వాక్సింగ్ కూడా హానికరమైన రసయానాలే! అందుకే ఆపిల్, సీమరేగు, జామ, మామిడి, ద్రాక్షలను ట్యాప్ వాటర్ తో లేక మంచినీటితో తినేముందుగా పరిశుభ్రంగా కడగాలి!! ప్రూట్ సలాడు కూడ జీరో/లో కెలోరీల పోషకాలను సంవృద్దిగా, ఫ్యాట్ రహితంగా మీకు అందచేస్తుంది. ఆపిల్, జామ, సీమరేగు, బొప్పాయిలని మొత్తం ప్రూట్ గా పై స్కిన్ తో తీసుకుంటే పోషకాలు పూర్తిగా లభ్యం అవుతాయి. కమల, బత్తాయి, ద్రాక్ష లని ప్రూట్ జ్యూసుకు బదులు ప్రూట్ గా తీసుకోవడం వాంఛనీయం. ఎందుకంటే అందులోని ఫైబరు మీ ప్రేవువ్యవస్థని శుభ్రం చేస్తుంది.
ఎంప్టీ (empty) కెలొరీలు ద్వార ఆరోగ్య ప్రధానమైన సుక్ష్మ పోషకాలు శూన్యం. వాటిని దూరంగా వుంచాలి లేదా చాల తక్కువగా తీసుకోవాలి. అవి అధిక కెలోరీలను, కొవ్వు, చక్కెరలను శరీరానికి తీసుకవస్తాయి. తక్షణశక్తిని ఇస్తుంది. నేటి సమాజంలో ఊబకాయం ఒక అవలక్షణంగా మారడానికి ఇవే కారణం. షాపింగ్ మాలులలో మిమ్మలని అమితంగా చూడగానే ఆకర్షించేవి కుడా ఇవే. నేటి యువత వీటి మాయకి సులభంగా దాసోహం అయిపోతున్నాది. ఈ జాబితాలో మొదటిగా బహులజాతి సంస్థలు ప్రమోట్ చేస్తున్న కూలుడ్రింకులు, ఎనర్జి డ్రింకులు, ఫ్రూట్ జ్యూసులు, డైట్ కోలాలు, అల్కహాల్ డ్రింకు, బెవరేజ్ డ్రింకులు వస్తాయి. దేశవాళి జాబితాలో సమోస, బజ్జి, బోండ, వడపావు, పకోడీ, మిరపకాయబజ్జి, పునుగులు, హాట్ చిప్సు, క్రీం బిస్కట్లు, బ్రెడ్డు, బట్టర్, జాం, పేస్ట్రీలు, కేకులు, డోనట్సు, ప్యాన్ కేకులు, క్యాండీలు, పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైయిస్, పప్ లు, జంక్ ఫుడ్సు మరియు షుగర్, నెయ్యి, డాల్డ, మైదాలతో తయారైన అన్ని స్వీట్లు వస్తాయి.
బరువుని తగ్గించుకోవడానికి డైటింగ్ చేయనవసరం లేదు. ఆహార ప్రత్యామ్నాయాలని పాటించాలి. అవి తక్కువ పిండి పదార్థాలు, సహజసిద్దంగా లాభించే ఆరోగ్యకరమైన కొవ్వుని కలిగి వుండాలి. ఇది మీ హార్టుకి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్య ప్రధానమైన సుక్ష్మ పోషకాలతో వున్న ‘లో’ కెలొరీలు మీకు ఆరోగ్యకరమైన జీవితాన్నే కాకుండా ధీర్ఘ ఆయు ప్రమాణాన్నికుడా ఇస్తుంది అని నేటి వివిద పరిశోధనలలో శాస్త్రీయంగా నిరూపించబడింది.
o ‘జీరో’ కెలొరిలు ‘లో’ కెలోరీల వెజిటబుల్ సూప్, ఉడికించని కూరగాయలని సలాడ్సుగా భోజనంతో కడుపార తీసుకోవాలి. సలాడు, వెజిటబుల్ సూప్ లలో టేస్టు కోసం సాల్టు, పెప్పరులని వాడకండి ఆసక్తి వుంటే జింజర్ తురుము, నిమ్మరసం, మిరియాలపొడిని కలుపుకోవచ్చు. o సలాడులో కీర దోశకాయని పై చెక్కుతో వాడాలి. దీనిద్వార అందులోని సి విటమిన్, పైబర్, మినరల్సు సహజంగా మీకు లభిస్తాయి. నోటిలోని చెడు బాక్టీరియాలని దూరంచేస్తుంది అందువల్ల నోటిలోని దుర్వాసనలని అరికడుతుంది. శరిరంలో కొన్నిరకాల కాన్సర్ కణాలని నిర్మూలిస్తుంది. రీహైడ్రేషన్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. చక్రాల్లా తరిగిన దోశకాయ ముక్కలని కండ్లపై ఓ పది నిముషాలు ఉంచండి. అది ఎంతో రిలీఫుని తెస్తుంది, కండ్ల చుట్టు వుండే వలయాలని కాంతి రహితం చేస్తుంది. o అన్నానికి ముడి బియ్యంనే వాడండి. స్టీం చేసిన ఇగుర్లు, ఆకుకూరలని, గార్లిక్ క్లొవ్ లు తీసుకోండి. o డీప్ గా ఫ్రై చేసిన వేపుడులని దూరంగా ఉంచాలి. అందులో హై కెలొరీలు, కొవ్వు మాత్రమే మిగిలి ఉంటాయి. అది మీకు హానిని కలిగిస్తుంది. o భోజనంతో నెయ్యి, పాలు, పెరుగు, బట్టరుని వాడకండి. బట్టరుమిల్కుని తీసుకోండి. o భోజనంతో పాటు ఫ్రూట్/ ఫ్రూట్ సలాడుని తీసుకోకండి. అయితే స్నాక్ ఐటం బదులుగా తీసుకొండి. ఫ్రూట్ సలాడుతో ఐసుక్రీంని జత చేయకండి. రుచికొసం చక్కరని కలపకండి. అయితే తేనెని కలుపుకోండి. o డిన్నరులో రెండు లేక మూడు గోదుమ పుల్కాలు తీసుకోండి. రుచి కోసం సాల్టు, నూనెలని కలపకండి. o వెజిటబుల్ సలాడ్సు, తరిగిన లెమన్, ఉల్లితరుగు, రెండు కప్పులు ఉడికించిన ఆకు కూర పప్పుని పుల్కాలతో తీసుకోండి వీటి నిష్పత్తి 40:60 గా వుండాలి. o ఓ గ్లాసు బట్టరుమిల్కుతో డిన్నర్ పూర్తి చేసేయండి. o గోదుమ పిండిలో ఉప్పు కలపొద్దు, రుచి కోసం కొన్ని టమొటాల జ్యూసుని పిండిలో కలుపుకోండి, సోయాబీన్సు పౌడర్ని 4: 1 నిష్పత్తిలో మిక్సు చేసుకోవడం ద్వారా అదనంగా పోషకపదార్దాలు అందుతాయి. మార్పుకోసం గోదుమలకి బదులు ఇతర తృణధాన్యాలని తరచుగా వాడండి. o బరువుని తగ్గించుకోవడానికి ప్రణాళిక సాత్వికాహారంగా వుండాలి. ఆ ప్రణాళిక ఆకలి బాధని దూరంగా వుంచాలి. • భోజనాన్ని (లంచ్) మూడు విడతలాగా తీసుకోండి. ప్రతి విడతకి 2 గంటల వ్యవది ఇవ్వం డి. • తొలి విడతగా ప్రూట్, వెజిటబుల్ సలాడు మీ ఆసక్తి మేరకు తీసుకోండి. • మలివిడతగా వెజిటబుల్ సూప్, కూరగాయలు టమ్మి నిండుగా తీసుకోండి. • మూడవ విడతగా ఓ కప్పు మొలకెత్తిన గింజలు (లేదా) ఆకు కూరలతో ఓ కప్పు అన్నం, రెండు పుల్కాలు, బట్టర్ మిల్కు ఓ గ్లాస్ తీసుకోండి. • చివరివిడతగా ఓ కప్పు గ్రీన్ టీ/ జింజర్ టీ లేదా ఓ గ్లాస్ లెమన్ వాటర్ తీసుకోండి. o తీసుకునే ఆహారాన్ని నోట్లోనుంచి జారవిడచే అలవాటుని మానేయాలి, ఆహారాన్ని నెమ్మదిగా బాగా నమలండి. అది లాలాజలం, అందూలోని ఎంజైంలతొ కలసి చక్కగా జీర్ణం కావడానికి ఉపయోగ పడుతుంది. o భోజనంతొ పాటు మంచినీళ్లు త్రాగకండి, వాటి అవసరం జీర్ణక్రియకి ఎంతమాత్రం అవసరం లేదు. భోజనానికి అర గంట ముందుగా భోజనం తరువాత ఓ గంట వరకి మంచి నీళ్లు త్రాగకండి. ఇది ఆహరాన్ని చక్కగా జీర్ణం కావడానికి దోహదం ఔతుంది. o ఎంఫ్టీ కెలోరీ ఫుడ్సు, జంక్ ఫుడ్సుని తీసుకోవద్దు. o పండుగలకి ప్రత్యేక సందర్భాలకి వెన్నతీసినపాలు, బెల్లం, కాజు, ఎండు ద్రాక్ష, ఇలాచి, ముడి బియ్యంల తో పాయసం, లేదా డ్రైఫ్రూట్, హానీలతో లడ్డూలు, లేదా నూగులు, కొబ్బరి, బెల్లంతో నూగు వుండలు, మినుములు, పల్లీలు, కొబ్బరి, హానీలతో సున్నివుండలు వంటి పిండి వంటలు చేసుకోండి. ఇవి టేస్టీగా వుండడమే గాకుండా ఇందులోని స్థూల, సుక్ష్మపోషకాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. o నూనె, నెయ్యి, బట్టర్, డాల్డ్డలనుంచి అదనంగా కొవ్వుని తీసుకోనే అవసరం ఎంత మాత్రం లేదు. వాటి ద్వారా హానికరమైన, అవాంచనీయమైన కొవ్వు శరీరంలో జమ అవుతుంది. మీ పాకశాలలో రాగులు, జొన్నలు, సజ్జలు, గోదుమలు వంటి తృణ ధాన్యాలు, ముడి బియ్యం, గింజదాన్యాలు పెసలు, అలసందలు, శనగలు, బఠాణీలు, సోయాబీన్సు, డ్రైనట్సు, షుగరుకి ప్రత్యమ్నయంగా కర్జూరం, తేనే, బెల్లం మరియు నూనెలకి ప్రత్యమ్నాయంగా పల్లీలు, నూగులు, కొబ్బరి వుండాలి. ఇవి అవాంచనీయ పరిస్థితులైన శారీరకలేమికి, మానశికలేములకి కారణం అయిన పౌష్టికాహరలేమిని సుదూరంగా వుంచు తుంది. నూనె, నెయ్యి, బట్టర్, డాల్డ్డ, షుగర్, మైదాలు కనీసస్థాయిలో వుంచుకోవడం తక్కువగా వాడడం మీ మానస సాత్వికత లకి ఆలంబన అవుతుంది. ఆమలుచేసె చిత్తశుద్ది మీ చేతల్లో, చేతుల్లో వుంది.
Comments