top of page

ఒత్తిడులను ఇలా అధిగమించండి..

  • Narayana Setty
  • Jun 28, 2017
  • 3 min read

నేటి పోటి వాతావరణంలో ప్రతి రంగంలో తమకి నిర్ణయించిన లక్ష్యాలను సాధించే జీవన గమనంలో నేడు మనం ఒత్తిడులతోనే సహజీవనం సాగించేస్తున్నాం. ఈ ఒత్తిడులను ఓస్థాయి వరకు ఛాలెంజీగా తీసుకోవడంద్వారా అది మీలోని మేధస్సు, ప్రతిభ, ప్రజ్ఙ్లలకి గీటురాయి అవుతుంది. అయితే ఈ లక్ష్యాలు మీ సమర్థతకి మించిన స్థాయిలో వుంటే అది తీవ్ర ఒత్తిడి, ఆంధోళణ ,అలజడులకు కారణం అవుతుంది. ఇది ఇలాగే ఎక్కువకాలం కొనసాగితే అది మెదడులోని రసాయనాల సమ్మేళణాలలో అసమతుల్యతలకి కారణం అవుతుంది. అది భావోద్వేగాలలో తరచు మార్పులకి గురిచేస్తుంది. అది మిమ్మలని తీవ్రనిరాశ, నిసృహలకి గురి చేస్తుంది. మీ మానశిక స్థైర్యాన్ని అందోళణలకి గురిచేస్తుంది. ఇక మీలోని సామర్ధ్యాన్ని తిరోగమ దిశలో నడిపించేస్తుంది. అసహనం, విసుగు, కోపాలని తీసుక వస్తుంది. కారిస్టోలు లాంటి స్ట్రెస్ హర్మొనుల ప్రాభల్యాన్ని పెంచేస్తుంది. ఈ దశ నుంచి వీలైనంత త్వరగా బయటకి రాగలగాలి. దానిని సమర్థవంతంగా మీ చేతల్లోకి తీసుకోవాలి. మనలో వుండే ఒత్తిడులను, స్ట్రెస్ హర్మొనుల ప్రాబల్యాన్ని మీరు ఇలా ప్రయత్నిస్తే దూరంగా వుంచగలరు.

o చేరలేని లక్ష్యాలకి ఎటువంటి అపోహలు లేకుండా, ఆత్మవిశ్వాసంతో 'నో' చెప్పగలగాలి వాటిని సహేతుకమైన కారణాలతో సున్నితంగా తిరస్కరించాలి. అపుడు లక్ష్యాలని రివిజన్ చేయడానికి అవకాశాలు మెండుగా వుంటాయి. o సహోద్యోగులతో, మిత్రులతో సరదాగా వుండండి. చిరునవ్వులతో పలకరించండి. ఈ చిరునవ్వులు మీ మనస్సులో హ్యపి కెమికల్సుని ప్రేరేపిస్తాయి అవి స్ట్రెస్ హార్మొనులనులపై పట్టు సాధిచదానికి సహయపడుతాయి మిమ్మల్ని సంతోషానికి దగ్గరచేస్తూంది, సంతోషంగాను వుంచుతుంది. చిరునవ్వు ఓ అందమైన ఆభరణం. దానితోనే నేస్తం సాగించండి. కారిస్టోలు హర్మోనుని సహజరితిలొ అదుపులో ఉంచుకోవడానికి మనస్సుని సంతోషానుభూతులతో వుండనివ్వాలి. ఈ సహజినవజీవనశైలి ని ఇలానే కొనసాగనివ్వాలి. o డైలీ మీ మదిలోని భావనలని జర్నలులో రికార్డు చేయండి. దీనిని తరచుగా తిరగేయండి. ఇది మీ భావాతరంగాల సరళికి నావిగేటర్ అవుతుంది. o చేసే పని మీలో ఒత్తిడిని పెంచుతుంటే ఆ పని నుంచి తాత్కాలికంగా బ్రేక్ తీసుకోండి, మీ ఫ్యామిలితో కలిసి సరదాగా ఓ విహరయాత్రని ప్లాను చేసుకోండి. అది మీలో చక్కటి మార్పుని తీసుక వస్తూంది. o సంసారిక జీవితాంలో శృంగారానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వాలి. అది ఏండార్ఫిన్ల విడుదలని ప్రోత్సహిస్తూ అలసిన మనువు, తనువులను సేదదీరిస్తూ మీ జీవితాన్ని రసమయం చేస్తుంది. o మీ వర్కు స్టేషన్ని ఓ చిన్న మొక్కతో అలంకరించండి. తరచుగా వర్కు స్టేషన్ విండో నుంచి పకృతిని ఆస్వాదించండి. అది అలసటలని దూరం చేస్తుంది. o డల్ గా వున్నప్పుడు ఓ డార్కు చాక్లేట్ తీసుకోండి. అందులోని చక్కెరలు, ఫ్లేవరాయిడ్సు శరిరంలో ఏండార్ఫిను లెవల్సుని ప్రేరింపించి మీ మనస్సుని డల్నెస్ భావనలకి దూరం చేస్తాయి. o వారంలొ నాలుగు నుంచి ఐదు గంటల సమయాన్నిఆట పాటలకి ,శారీరక క్రీడలైన వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, జిం, ఎరోబిక్సు లకు కేటాయించాలి. అది బ్రెయిన్ లో ఏండార్ఫిన్ల విడుదలకు సహయకారి అవుతూ కారిస్టోలు హర్మోనుని సహజరీతిలో సమర్థవంతంగా నియంత్రించడానికి సహయకారి అవుతుంది.

o విటమిన్ ‘డి’ లోపం మానశిక ఒత్తిడికి కారణం అవుతుంది అని పలు అధ్యాయనాలు తెలియజేస్తున్నాయి. ఇది సహజంగా సూర్యరశ్మి ద్వార మనకి లభిస్తుంది. అయితే ఎక్కువగా ఏ.సి గదులలో పనిచేసే ఐ.టి ఉద్యోగస్తులలో ఈ విటమిన్ లోపం తరచుగా గుర్తించడం జరుగుతోంది. ఈ లోప నివారణ చర్యగా రోజు ఓ గంట ఆరుబయట నీరెండలో గడపడంద్వారా శరీరానికి తగినంతా సూర్యరశ్మిని అందచేయాలి. o రోజు పలు మార్లు దీర్ఘ శ్వాసక్రియని సాధన చేయండి. ఈ సాధన రోజులొ కనీసం 30 నిముషాలు అభ్యసించడంవల్ల మీ జీవక్రియ, జీవనక్రియలలో జరిగే మార్పులను ప్రస్పుటంగా కేవలం 6 నుంచి 8 వారాలలో గమనిస్తారు. మానశిక ఆందోళణల క్రమబద్దీకరణ, మెరుగైణ రక్త ప్రసరణల ద్వారా బి.పి. సాధారణ స్థాయికి చేరడాన్నికూడా గుర్తించగలరు. కారిస్టోలు హర్మోనుని సహజరితిలో అదుపులో ఉంచుతుంది. మరిన్ని వివరాలకు ఈ లింకుని క్లిక్ చేయండి http://rvnsetty.blogspot.com/2014/11/07.html o తనువు, మనువుల పరిరక్షణలో మెడిటేషన్ సాధన నమ్మకమైన ఫలితాలను మీ సొంతం చేస్తుంది. ఇది మానశిక ప్రాశాంతతని సాధించడానికి మరియు మానశిక ఆందోళణలను నియంత్రించడానికి ఓ చక్కటి వేదిక అవుతుంది. రోజు 30 నిముసాల సాధన ద్వార కేవలం 8 వారాలలో మెదడులోని న్యూరాన్ వ్యవస్థ సంఘటితం అవుతుంది. స్ట్రెస్ హర్మోనులపై పట్టు సాధించగలరు. మరిన్ని వివరాలకు ఈ లింకుని క్లిక్ చేయండి http://rvnsetty.blogspot.com /2014/11/blog-post_18.html o నారింజ, బత్తాయి, లెమన్ లాంటి సిట్రస్ జాతి ఫలాలు విటమిన్’ సి’ కి తరగని నిధులు. ఇది రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తుంది. వీటిని రోజువారి ఆరోగ్యకర ఆహరాలుగా మీ మెనులో చేర్చుకోవాలి. అందులోని యాంటి యాక్సిడెంట్లు , ఫ్లేవరాయిడ్సు మీలో అహ్లోదకర అనుభుతులకి దగ్గర చేస్తాయి, మెటబాలిజాన్ని మెరుగుపరుస్తూ మిమ్మలని ఆరొగ్యవంతంగా ఉంచుతూ సత్వరశక్తిని యిస్తాయి. o పండ్లలో ఫైబర్, పొటాషీయం, విటమిన్లు, మైక్రో నూట్రీషీయంట్లు, ఎంజైంలు, యాంటియాంక్సిడెంట్సు పుష్కలంగా వుంటాయి. ఉపాహారంగా వారంలో మూడుమార్లు ఆయా సీజన్లలో దొరికే పండ్లని తీసుకోవాలి. ప్రతిరోజు విధిగా ఆయా సీజన్లలో దొరికే రెండు రకాల పండ్లు తినాలి అనే నియమాన్ని తప్పక పాటించండి. o ఫిష్, డ్రైనట్సు ఒమెగా 3 ప్యాటీ యాసిడ్సు, విటమిన్ E ల సంవృద్దితో మస్తిష్కంకి ఎంతో ప్రయోజనకారి. వీటిని రెగ్యులరుగా తీసుకోవడం ద్వారా డోపోమైన్ హార్మొనులస్థాయి నిలకడగా వుండడానికి తోడ్పాటు అవుతుంది. అది మీలో సంతోషకర భావనలకి ప్రేరణ అవుతుంది, మానిశిక ఆందోళనలని దూరంగా ఉంచుతుంది. o సెరోటొనిన్ హార్మొనులు మానశిక ఆందోళణలను, అతృతలని, స్ట్రెస్ భావనలని దూరంగా వుంచుతుంది. ఇందుకు క్రమశిక్షణ కలిగిన సహజ జీవన శైలి, ఆహర అలవాట్లు, సంసారిక జీవనం , తగినంత శారిరక శ్రమ, విశ్రాంతి ప్రధాన భూమికలని పోషిస్తాయి.


 
 
 

Kommentare


bottom of page