top of page

హృదయ శ్రేయస్

  • Narayana Setty
  • Jun 28, 2017
  • 3 min read

మన జీవనసరళి విదేశినాగరికత ప్రలోభాలకి విపరితంగా ఇటివలకాలంలో ప్రభావితమైంది. అది విలాసవంతమైన నూతన ఒరవడికి ఓ వేదిక అయింది. పాశ్చత్యా సంసృతిలాగా రాత్రీ పగలు తేడా లేకుండా వృత్తిపనుల్లో బిజిగా వుండడం, ఆలస్యంగా డిన్నర్ తీసుకోవడం, అంతే ఆలస్యంగా నిద్రకి ఉపక్రమించడం కూడ పరిపాటి అయింది.

ఎవరో తరుముతున్నట్లు ఆరాటంగా లేవడం, హడవిడిగా పరుగులుపెట్టడం నిత్యజీవితంలో చాలమందికి ఓ అలవాటు అయింది. ఇలా అదరా బాదరాగ దినచర్య ప్రారంభిస్తే ఆ ప్రభావం ఆ రోజుచేసే పనులపై పడుతుంది అని మానసిక అద్యాయనాలు తెలియజేస్తున్నాయి. ఊదయాన్నే సూర్యుడు ఉత్సాహంగా శుభోధయం చెప్పినట్లుగానే మనంకూడ అంతే ఉత్సాహంగా ఉండగలిగితే ఆ రోజంతా ఆనందలహరియే...

అందానికి, ఆరోగ్యానికి నిద్రకి ప్రత్యక్ష సంబంధం వుంది. తగినంత నిద్రలేకపోతే దాని ప్రభావం శరీర ఆరోగ్యంపై పడుతుంది. నిద్ర సమయంలో మెదడు విశ్రాంతి పొందడంవల్ల మెమొరి పవర్ పెరుగుతుంది. సుఖనిద్రవల్ల మెదడు పునర్వ్యవస్తీకరణ జరిగి సృజనాత్మకత పెరుగుతుంది.

తగినంత శారీరకశ్రమ, శారీరకవ్యాయమం, నిద్రలేకపోతే జీవక్రియ మందగిస్తుంది, హర్మొన్ల వ్యవస్త హెచ్చుతగ్గులకు గురౌతుంది. కారిస్టోల్ అనే ఒత్తిడిని పెంచే హర్మోను ఉత్తేజితమౌతుంది. అది మూడ్ స్వింగులకి కారణమవుతుంది. మానసిక సమతుల్యం దెబ్బతింటుంది. నిత్య జీవనంపై దీని ప్రభావం కనిపిస్తుంది. శారీరక, మానసిక రుగ్మతలకు హేతువవుతుంది. వీటికి చెక్ పెట్టవలిసిన అవసరం ఎంతో వుంది... ఇక ఆ దిశలో...

హృదయ శ్రేయాస్

బలమైన పునాది ఆకాశహర్మ్యాలకి, సుందరమైన కడలి సముద్రానికి, ధృడమైన శరీరసౌష్టవం మీ జీవనకడలికి శోభని తీసుకవస్తాయి! తగినంత శారీరకవ్యాయాయం బలమైన కండర నిర్మాణానికి, ధృడమైన, ఆకర్షణీయమైన శరీరసౌష్టవానికి, మీ హృదయ శ్రేయస్సుకి రక్షణకవచం అవుతుంది!!

ఈ దిశలో వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, స్కిప్పింగ్, ఏరోబిక్సులు మంచిఫలితాలను సాధించడానికి అనువైన శారీరకవ్యాయామాలు. మీ అభిరుచి మేరకు వాటిని రెగ్యులర్ గా ప్రాక్టీసు చేయాలి.

మొదటిగా వాకింగ్ అన్నది వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరు పాటించదగ్గ ఎక్సర్సైజ్. అయితే:

  • మెలోడీ, భక్తి సంగితం బాక్ గ్రౌండుగా మెడిటేషన్, యోగాసనాల ప్రాక్టీసు మీ మూడ్'ను రొటిన్ లోంచి బయటపడేస్తుంది.

  • యోగాసనాల ప్రాక్టీసు పూర్తి అయినాక మార్నింగ్ వాకింగ్ ఆరంభించాలి

  • వాకింగ్ ఆరుబయట ప్రశాంత వాతావరణంలో, శబ్దకాలుష్యానికి, వాయు కాలుష్యానికి దూరంగా వుండే ప్రాంతం కావాలి. పచ్చిక బయళ్లు, ఉధ్యానవనాలు, పార్కులు యిందుకు అనువైన ప్రదేశాలు. మీ శ్వాసకోశాలు స్వఛ్చమైన గాలిని తనివిధీర అనుభవిస్తాయి. దీనివల్ల మీలో ఏకాగ్రత పెరుగుతుంది.

  • సూర్యోదయానికి ముందుగా, ఉషోదయంలో వాకింగ్ ఆరంభించండి. లేలేత సూర్యకిరణాలతో మీ మనస్సుని, తనువును సేదదీరనీయండి

  • ఈ వాకింగ్ కనీసం 45 నిముషాలు చేయండి. వాకింగ్ నెమ్మదిగా ప్రారంభించి వడివడిగా, వేగంగా నడవాలి. అంటే మొదటి 10 నిముషాలు సాధారణ నడకగా ఆ తరువాత జాగింగ్ గా కొనసాగాలి.

  • శరీరంలోని టాక్సిన్లు స్వేదరూపంలో విసర్జింపబడి, బాడి తేలిక అవుతుంది.

  • శరీరంలో మంచి కొలొస్ట్రాల్ (HDL) స్థాయిని మెరుగుఅవుతుంది. చెడు కొలొస్ట్రాల్ (LDL) లెవల్సుతగ్గుతాయి. ఇది మీ హృదయశ్రేయస్సుకి ఎనలేని రక్షణఅవుతుంది.

  • శరీరంలో కీళ్లవ్యవస్థని మెరుగుపరుచు కోవడానికి తోడ్పాటు అవుతుంది

  • శరీరానికి సహజసిద్దంగా ‘విటమిన్ డి’ సంవృద్దిగా లభ్యమౌతుంది. ఇది శరీరంలో తయారయ్యే చెడు కణాలాపై పోరాడుతుంది. దానివల్ల మెదడు ఉత్తేజితమౌతుంది. రోగనిరొధకశక్తి కూడా పెరుగుతుంది.

  • బిపి, చక్కర, హార్టు వ్యాధి బాధితులకు ఇది చక్కటి వ్యాయామం

బిగువైన వస్త్రాలని ధరించి జాగింగ్ చేయకండి, అవి కొంత వదులుగా వుండాలి. అవకాశం ఉంటే ట్రాక్ సూట్ వాడండి. ఇది జాగింగ్, రన్నింగ్ లకి సౌకర్యవంతంగా వుంటుంది. వాకింగ్ లో వాక్ మాన్ ని వాడకండి. పకృతిలో పరవశించండి.

  • మార్నింగ్ జాగింగ్ తరువాత ఒక గ్లాసు నిమ్మరసం తీసుకోండి. రుచి కోసం హనీని కలుపుకోవచ్చు లేదా గ్రీన్ టీ 1 లేక 2 కప్పులు తీసుకోండి. ముందుగా వాటి పరిమళాలని ఆశ్వాదించండి. రుచి కోసం చక్కరని యాడ్ చేయకండి. ఇక మార్నింగ్ కాఫీ/టీ లకి స్వస్తి చెప్పండి.

స్విమ్మింగ్

స్విమ్మింగ్ పై ఆసక్తి, మరియు అవకాశం ఉంటే వారంలో ఒకటి లేక రెండు సార్లు స్విమ్మింగ్ ని ప్రాక్టీస్ చేయండి. ఇది చక్కటి ఫిట్నెస్ ఎక్సరసైజు.

  • గంటకి 300 నుంచి 400 కెలొరీలు తగ్గుతాయి. ఇది బ్లడ్ లో చక్కరలెవెల్సుని కంట్రోల్ చేయడానికి ఓ చక్కటి టెక్నిక్. అధికబరువును తగ్గించుకోవాడానికి ఉపయొగపడుతుంది.

  • శ్వాసక్రియని మెరుగుపరిచి శ్వాసకోశ వ్యవస్థని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ఆస్తమాన్ని కంట్రోల్ చేస్తుంది

  • శరీరాంగాలన్నింటికి మంచి వ్యాయామం. మిమ్మల్ని యవ్వనవంతులుగా ఉంచడానికి దోహదకారి అవుతుంది

  • హృదయ కండరాలను బలోపేతం చేస్తుంది. కండర వ్యవస్థ ఉత్తేజభరితం అవుతుంది

  • బలమైన బోను వ్యవస్థకి సహాయకారి అవుతుంది. ఆర్థరైటీస్ బాధితులకి ఉపశమనం తీసుకు వస్తుంది

  • మానసిక ఒత్తిడిని నియంత్రించి మీలోని మానసికశక్తుల ఉద్దీపనాకారి అవుతుంది

లీజర్ సమయాలలో మీ ఫ్యామిలి సభ్యులంతా కలిసి స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయండి. కుటుంబం అంతా ఆనందంగా గడపండి. అయితే స్విమ్మింగ్ లోని మెలుకువలను మంచి ట్రైనర్ దగ్గర నెర్చుకోండి. ఆరంభంలో ట్రైనర్ పర్యవేక్షనలో మాత్రమే స్విమ్మింగ్ చేయండి.

సైకిలింగ్

రెగ్యులర్ గా సాధరణ దూరాలకి సైకిల్ ని ప్రయాణానికి ఉపయొగించండి. ఇది మీ శరీరాంగాలకు చక్కటి ఫిట్నెసుని కూడా తీసుకువస్తుంది. గంటకి 250 నుంచి 300 కెలరీలను సమర్థవంతంగా దహిస్తుంది.

  • బలమైన కండరాలు, మృదువైన కీళ్ల వ్యవస్థ, ధృడమైన ఎముకల వ్యవస్థ, మెరుగైన మానశిక ఒత్తిడి, సరైన శారీరక భంగిమలు, మెరుగైన వ్యాది నిరోధక వ్యవస్థలని పొందడానికి సహయకారి అవుతుంది.

అభివృద్ది చెందిన దేశాలు పర్యావరణ రక్షణకి సైకిల్ వాడకాన్ని ప్రొత్సహిస్తున్నాయి. అంతర్జాతీయస్థాయి కార్పొరేట్ సంస్థలు కూడా నేడు తమ క్యాంపస్సులలో సైకిలు వాడకాన్ని ప్రొత్సహిస్తున్నాయి. మన సమాజంలో పర్యావరణ పరిరక్షణలో మీరు భాగస్వాములు కండి.

మీ హృదయ శ్రేయస్సుకి మీ జీవితశైలిలో మరికొన్నిమార్పులను ఇలా ప్రారంభించండి:

  • అపార్టుమెంట్, ఆఫీసుల్లో లిఫ్టుకి బదులుగా కాలి నడకన మెట్లు ఎక్కండి/దిగండి.

  • షాపింగ్ మాలుకి దూరంగా మీ వెహికల్ ని పార్కింగ్ చేసి అక్కడినుండి నడవండి.

  • షాపింగ్ మాలు నుంచి మీ సరుకులను పార్కింగ్ ప్లేస్ వరకు ట్రాలీని వాడకుండా మీరే తీసుకురండి.

  • దగ్గర్లో ఉండే కూరగాయలు, సరుకుల కోసం వెహికల్ వాడకండి, నడిచివెళ్లండి.

  • మధ్యాహ్నం లంచ్ తర్వాత 10 లేక 15 నిముషాలు మీ సహచరులతొ కలిసి వాక్ చేయండి.

  • డిన్నర్ని వీలు అయినంత ముందుగా మీ కుటుంభ సభ్యులతో కలసి తీసుకొండి. డిన్నెర్ పూర్తి చెసిన 2 గంటల తరువాతే నిద్ర్రకు ఉపక్రమించాలి.

  • ప్రతి డిన్నర్ తరువాత మీ ఫ్యామిలితో కలిసి 15 నిముషాలు సరదాగా వాక్ చేయండి.

  • మీ పని ఎక్కువగా కంప్యుటర్ మీద అయితే ప్రతి పావు గంటకి ఒకసారి మీ వర్కుస్టేషన్ విండో నుంచే కొన్ని క్షణాలు పకృతి సోయగాలను కనువిందుగా తిలకించండి.

  • పని గంటల్లో ఒకటి, రెండు సార్లు మీ కండ్లని చల్లటి ట్యాప్ వాటర్ తో శుభ్రం చేసుకోండి. మీ నేత్రాలను సం రక్షించుకొనే బాధ్యత మీదే.

ఏరోబిక్సు, జిం లాంటి ఎక్సర్సైజులు పై మీ ఆసక్తి ఉంటే ఓ అలవాటుగా మలచుకోవాలి.

మీకు ఆసక్తికరమైన ఏ శారీరక వ్యాయమంని అయినా ఓ హాబిగా చేసుకోవాలి. ఆ హాబిని మనసారా ఆస్వాదించాలి.

మీకు ఇష్టమైన క్రీడ/వ్యాపకంలో ఆసక్తిని పెంపొదించుకోండి. ఆ క్రీడ/వ్యాపకంలో నైపుణ్యాన్నిసాధించండి. అది మీ ఆశలని, ఆశయాలని, ఆలోచనలని సజీవంగా ఉంచుతుంది! వాటిని మీ మదిలోనే వాడనీయకండి, ఆ ఆలోచనలని నిత్యవసంతంగా ఉండనీయండి!!


 
 
 

Comentários


bottom of page