జీవశక్తిధార కుండలినియోగ
- Narayana Setty
- Nov 5, 2017
- 2 min read

మన మనుగడకి నీళ్లు ఏంత అవసరమో అదేవిదంగా శరీరానికి హర్మొన్లు అంతే అవసరం!
హర్మోన్లవ్యవస్థ మనశరీరంలోని రసాయనసమ్మేళనాలలో సమతుల్యతలకి కేంద్రకాలుగా పనిచేయడంద్వార మనస్సుకి, శరీరానికి, కణనిర్మాణానినికి, మెటబాలిజానికి, ఆరోగ్యవ్యవస్థ సక్రమంగా విధులని నిర్వర్తించడానికి, రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేయడంలో కీలకపాత్రని పోషిస్తుంది.!
క్రమశిక్షణ లోపించిన జీవనవిధానం, ఆహరనియమాలు, శారీరకవ్యాయామలు, హర్మోన్లవ్యవస్థని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఏకాగ్రత లోపించడం, నిద్రలేమి, కోపం, అసహనం, ఒత్తిడులలాంటి మానసికసమస్యలకి కారణమవుతున్నాయి. కుండలినియోగాసాధన ద్వార ఈ మానసిక శక్తులని ప్రతికూలంగా ప్రభావితంచేసే విషయాలకి చెక్ పెట్టవచ్చు.
కుండలినియోగ అంటే ఏమిటి?
మన శరీరంలో చక్రాలు అనబడే గుండ్రంగా తిరుగుతూ వుండే శక్తికేంద్రాల వ్యవస్థ ఎంతో ప్రధానమైనది. ఈ వ్యవస్థ
భౌతికశరీరంలోని ప్రాణాధారమైన అవయాలను అదుపులోవుంచుతూ, వాటికి శక్తిని నిరంతరం అందచేస్తూవుంటుంది. ఈ వ్యవస్థని ప్రాణాధార ఇంద్రియాలకు శక్తిని సరఫరాచేసే శక్తికేంద్రాలుగా పరిగణించవచ్చు.
ఇవి 3 నుంచి 4 అంగుళాల వ్యాసాన్ని కలిగి మన భౌతిక శరీరంలోనికి చొచ్చుకొనిపోయి అక్కడ వ్యాపించి ఈ క్రింది విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తుంటాయి.
ప్రాణశక్తిని గ్రహించి, జీర్ణించుకొని, దానిని శరీరంలోని వివిధభాగాలకు సరఫరా చేస్తాయి.
భౌతికశరీరంలోని వివిధ అంగాలను అదుపులో వుంచుతూ అవి సక్రమంగా పనిచేసేందుకు భాధ్యత వహిస్తాయి. ఈ ప్రధానచక్రాలను , అదుపులో ఉంచడం, లేదా మార్పు తీసుకరావడం ద్వారా శరీరంలోని వినాళగ్రందులలో చలనాన్ని , ఉత్తేజాన్ని కలిగించవచ్చు.
కొన్ని చక్రాలు మనోశక్తులకి నిలయాలు. ఆయా చక్రాలను ఉత్తేజపరచడం ద్వార మానసికవ్యవస్థ తేజోవంతం అవుతుంది.
ఈ శక్తికేంద్రాలు సరిగ్గా పనిచేయకపొతే ప్రాణాధార అవయవాలకు అనారోగ్యం సోకుతుంది. సరిగ్గా పనిచేసెందుకు కావాలసిన శక్తి వాటికి లభించదు. ఫలితంగా అవి అనారోగ్యానికి గురి అవుతాయి. వీటీనీ యోగసాధనలో కుండలినిప్రక్రియ ద్వారా ప్రాణశక్తితో తేజోవంతం చేయగలం.మనలోని అంతర్గత శక్తులకి ఉద్దీపనకారిగా ప్రేరణ అవుతుంది. ప్రధాన శక్తికేంద్రాలని ఉజ్వలంగా ఉంచడానికి కుండలినియోగ జీవశక్తిధార అవుతుంది. రోగనిరోధక వ్యవస్థని ప్రకాశవంతంచేస్తుంది.
మనలోని ప్రధాన శక్తికేంద్రాలని గురించి తెలుసుకుందాం
మూలాధార (రూట్) చక్ర:
ఈ చక్రం వెన్నముక యొక్క మూలస్థానంలో ఉంటుంది. ఇది భౌతిక శరీరాన్ని అంతటిని అదుపులో ఉంచుతూ శరీరానికి కావలసిన శక్తిని అందిస్తూవుంటుంది. కండర వ్యవస్థ, బోన్ వ్య్వస్థలని నియంత్రిస్తూ , రక్తాన్ని ఉత్పత్తిని మరియు నాణ్యతని నియంత్రిస్తూ , శరీరంలోని టిష్యులకి శక్తిని ప్రసరిస్తుంది. జననేంద్రియాలపై కూదా తనప్రభావాన్ని చూపి వాటిని శక్తితో నింపుతుంది. ఈ చక్రం సరిగా పనిచేయకపోతే కీళ్ళవాపులు, వెన్నముక సంభందిత వ్యాధులు, శరీరంలో శక్తి తగ్గడం జరగుతుంది.
ఈ చక్రం తేజోవంతంగా ఉన్నవ్యక్తులు బలోపేతంగా, ధృడంగా వుంటారు, లేనివారు బలహీనంగా, నీరసంగా , బక్కపలుచగా వుంటారు.
స్వాధిష్టాన (శృంగార) చక్ర:
పొత్తికడుపు దిగువ బాగంలో ఈ చక్రం ఉంటుంది.ఇది జననేంద్రియాలను, మూత్రాశయాన్ని నియంత్రిస్తూ వాటికి శక్తిని ప్రసారం చేస్తుంది.ఈ చక్రం సరిగ్గా పనిచేయకపోతే లైంగిక సమస్యలు తలెత్తుతాయి. కిడ్ని సంభందిత వ్యాదులు బయటపడుతాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రతికూల ప్రభావితమౌతుంది. మూలాధార చక్రప్రభావం దీనిపై ఎక్కువుగా వుంటుంది.
మణిపూరక (నాభి) చక్ర:
ఇది నాభి ప్రాంతంలో ఉంటుంది. ఈ చక్రం చిన్నప్రేవు, పెద్ద ప్రేవు వ్యవస్థలని, అపెండిక్సులను నియంత్రిస్తూ , వాటికి శక్తిని అందిస్తూవుంటుంది. ఇది మనలోని జవస్తత్వాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ చక్రం సరిగ్గా పనిచేయకపోతే, మలబద్దకం, అపెండిసైటిస్. ప్రసవంలో ఇబ్బంది, ప్రేవులకు సంబంధించిన వ్యాధులు కలుగుతాయి.
అనాహత (హృదయ) చక్ర:
ఇది వక్షభాగానికి మధ్యలో ఉంటుంది. ఇది గుండె, రక్తప్రసరణ వ్యవస్థను అదుపులో ఉంచుతూ వాటికి శక్తిని ప్రసరిస్తూ ఉంటుంది. ఇది ఎంతో సున్నితమైనది. మానశిక ఉద్వేగాలు. ఉద్రిక్తలు. ఒత్తిడుల ప్రాభావాలు దీనిపై ఆధికంగా ఉంటుంది. ఈ చక్రం సరిగ్గా పని చేయకపోతే హృదయ సంభందిత. శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
విశుద్ద (థ్రోట్)చక్ర:
గొంతు మధ్యలో ఈ చక్రం ఉంటుంది. ఇది స్వరపేటికను, థైరాయుడ్ గ్రంధులను , లింఫాటిక్ గ్రంధులను, వినాళ గ్రంధుల వ్యవస్థను నియంత్రిస్తూ వాటికి శక్తిని అందిస్తుంది. కొంతమేరకు స్వాధిష్టాన చక్రంపై తన ప్రభావాన్ని చూపిస్తుంది.ఈ చక్రం సరిగా పనిచేయకపోతే గొంతువాపు (గాయిటర్), గొంతునొప్పి, ఉబ్బసం, గొంతు బొంగురుపోవుట మొదలైన గొంతుసంబందిత వ్యాదులు బయటపడుతాయి.
ఆఙ్ణాచక్ర:
రెండు కనుబొమల మధ్యలో (భృకుటి) ఈ ఆఙ్ణ చక్రం ఉంటుండి. ఇది పిట్యుటరి, వినాళ గ్రంధులని నియంత్రిస్తూ వాటికి ప్రాణశక్తిని సరఫరా చేస్తుంది. అంతేగాకుండా మెదడుకు కూడా ప్రాణశక్తిని కొంతమేరకు అందచేస్తుంది. ఇతర ప్రధాన చక్రాలను ముఖ్యావయాలను నియంత్రించి వాటిని నిర్ధేశిస్తూ ఉంటుంది. దీని ప్రభావం కండ్లు, ముక్కు, శిరస్సు మీద కూడా వుంటుంది. అంతుర్ముఖంగా మనోనేత్రాన్ని ప్రకాశవంతంగా తేజోవంతంగా వుంచుతుంది. సాధరణంగా ప్రత్యేకచక్రాలకు శక్తిప్రసరణ గావించే బదులు ఈ ఆఙ్ణాచక్రాన్ని శక్తితో నింపినపుడు తగినంత వేగంగా శరీరంలోని ఇతరచక్రాలు కూడా ప్రకాశవంతమవుతాయి.
సహస్రార (క్రౌన్) చక్ర;
శిరస్సు పైభాగాన ఈ చక్రం ఉంటుంది. ఇది పీనియల్ గ్రంధినీ, మెదడునూ, శరీరాన్ని పూర్తీగా నియంత్రిస్తూ, వాటికి శక్తిని అందిస్తూ ఉంటుంది. మానశిక ప్రశాంతతలని సాధించడానికి ఆలంబన అవుతుంది. వివేక విఙ్తలకి, విచక్షణలకి వేదిక అవుతుంది. దేహంలోనికి ప్రాణశక్తిని ప్రసరించే ప్రధానమర్గాలలో ఇది ఒకటి. సహస్రార చక్రాన్ని శక్తితో నింపితే , దేహాన్ని మొత్తంగా శక్తితో నింపిన ప్రభావం ఏర్పడుతుంది. ఈ చక్రం సరిగా పని చేయకపోతే మెదడుకు సంభందించిన రుగ్మతలు బయటపడుతాయి.
‘కుండలినియోగ’ శక్తికేంద్రాలను తేజోవంతం చేయడానికి సాధకునికి ఓ చక్కటి మార్గదర్శి. యోగసాధకుడు కుండలిని యోగ సాధనని అందులోని మెళుకువలను యోగాచార్యుల సమక్షంలో ఆభ్యసించాలి.అందుకు మీరు యోగశిక్షణ శిబిరంలో చేరి సాధనచేయాలి.
Comments