ప్రాణయామ
- Admin
- Nov 5, 2017
- 2 min read

శరీరం, మెదడు, మరియు మనోభావాల సహజానుభుతుల పునరుద్ధరణలో ప్రాణయామ కీలకపాత్ర అనిర్వచనీయం. ఇది మెదడుయొక్క చేతన మరియు అచేతన వ్యవస్థలని అనుసంధానించే ఓసహజ ప్రక్రియ.
మెదడు నిర్వర్తించే అచేతనప్రక్రియలలో నిరంతర శ్వాసక్రియ ప్రధానమైనది అటువంటి క్రియని చేతనక్రియగా శ్వాసక్రియ నియంత్రణనిసాధించడనికి ‘ప్రాణయామ’ని యోగవిఙ్ఞానశాస్త్రం మనకి అందించిన అపురూపకానుక.
ఆనాడు యోగులు పకృతితో సహచర్యం చేసే జీవరాశిలో ఏనుగు, తాబేలు, కొండచిలువలు దీర్ఘకాలం జీవించడానికి అదేవిదంగా తమచుట్టు వుండే పక్షులు, శునకాలు, ఇతర మృగాలు తక్కువకాలం జీవించడానికి వాటి శ్వాసక్రియ విధానమే ప్రధాన కారణంగా గుర్తించారు. ధీర్ఘశ్వాసక్రియ మానిసిక స్థిరత్వాన్ని పెంచడానికి దాని ఫలితంగా ప్రాణశుద్దీకరణను, ప్రాణియొక్క క్రమబద్దత క్రియాశీలత్వాన్ని ప్రభావితం చేయడాన్ని గుర్తించారు.
ప్రాణయామ అంటే ఏమిటి?
చేతనశ్వాసక్రియ విధానం ప్రాణయామ. ఈ పద్దతిలో శ్వాసక్రియవిధానాన్ని నాలుగుభాగాలుగా విభజించారు. అవి పూరక (ధీర్ఘ ఉచ్చాస్వ), రేచక (ధీర్ఘ నిశ్వాస), అంతర కుంభక (శ్వాసని అంతర్గతంగా బంధించి వుంచడం), మరియు బహిర్ కుంభక (శ్వాసని బాహ్యంగా పట్టి వుంచడం).
ప్రాణయామని ఏలా అభ్యాసం చేయాలి?
సాధనచేసే పరిసరాలలో ధారాళంగా గాలి, వెలుతురు ప్రసరించేట్లుగా వుండాలి.
శ్రావ్యమైన ఓంకార నాదస్వరాన్ని బాక్ గ్రౌండ్ మ్యుజిక్ గా ప్లే చేయండి. మంద్రస్థాయిలోని ఓంకారం మనోద్వేగాలకి అపారమైన ప్రాశాంతతని తీసుకువస్తూ సాధనకి అనుకులమైన వాతావరణాన్ని తీసుకువస్తుంది.
బిగువైన వస్త్రాలని ధరించకండి. పలుచటి వస్త్రాలని ధరించండి.
ఙాన ముద్రలో పద్మాసనం లేదా వజ్రాసనం లేదా అర్ధపద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చోండి.
ముందుగా ఎడమ నాసికని మీ బొటనవేలితో మూసివుంచి కూడినాసిక ద్వార 4 నుంచి 5 సెకండ్లు ధీర్ఘశ్వాసని (పూరక) పొట్టలోపటికి తీసుకోవాలి, ఆ శ్వాసని 2 నుంచి 3 సెకండ్లు అంతర్గతంగా బందించివుంచాలి (అంతర కుంభక).
ఇప్పుడు కూడినాసికని మీ బొటనవేలితో మూసివుంచి, ఎడమ నాసికద్వారనెమ్మదిగా శ్వాసని 4 నుంచి 5 సెకండ్లు ధీర్ఘనిశ్వాసద్వార (రేచక) పొట్టకండరాలపై ఒత్తిడిని తీసుకుంటూ గాలిని పూర్తిగా వదలివేయాలి, ఆ స్థితిని 2 నుంచి 3 సెకండ్లు (బహిర్ కుంభక) కొనసాగించాలి. ఈ శ్వాసక్రియ విధానాన్ని ఉదరశ్వాసగా వ్యవహరిస్తారు.
ఇది ప్రాణయామలో ఒక వృత్తం వ్యవధి. అభ్యాసకుడు ఓ నిముషానికి 4 నుంచి 5 వృత్తాలుగా శ్వాసక్రియని సాధన చేయాలి.
ఈ ప్రాణయామ సాధనని ఆరంభంలో 10 నిముషాలు అభ్యాసం చేయాలి , నెమ్మదినెమ్మదిగా ఈ అభ్యాసాన్ని 20 నుంచి 25 నిముషాలుగా కొనసాగించడాన్ని ఓ అలవాటుగా చేసుకోవాలి.
ప్రాణయామద్వారా ఏలాంటి ప్రయోజనాలు పొందవచ్చు?
ప్రాణయామ అభ్యాసంద్వార మనం తీసుకునే గాలి పరిమాణం రెట్టింపు అవుతుంది, అందువల్ల ఆక్సిజన్ శరీరంలోని జీవవ్యవస్థకి మెరుగ్గా లాభిస్తుంది, అది శక్తివంతం అవుతుంది. జీవవ్యవస్థ శక్తివంతం అయిందంటే అవి ఆరోగ్యంగా వున్నట్లే!!
పూరక, అంతరకుంభక, బహిర్ కుంభక, రేచక క్రియలద్వార శరీర కండరాలు తమ సహజరీతిలో ఒత్తిడికి గురవుతూ పునర్ శక్తిని సంతరించుకోవడంద్వారా కండరవ్యవస్థ, జీర్ణవ్యవస్థలు మెరుగుపడుతాయి అంటే మీ ఆరోగ్యం రోజూరోజుకి బలపడుతున్నట్లే!!
ప్రాణాయామలో ఎన్ని పద్దతులు ఉన్నాయి?
ప్రాణయామ సాధనలో వివిధ విధానాలు ఆచరణలో వున్నాయి. అవి కపాలభాతి, భస్త్రిక, నాడిశోధన, శీతలి, భ్రమరి, ఉజ్జయిని, శీతకరి.
అభ్యాసకుడు తనకి నచ్చిన ఏ విధానంలోఅయిన ప్రాణయామని అభ్యాసంచేయవచ్చు.
Comentarios