మీ సామర్ధ్యాన్ని ఇలా పెంపొదించుకోండి...
- Admin
- Nov 5, 2017
- 2 min read

నేనే చేయగలను అనే అతివిశ్వాసాన్ని, నేనేమి చేయలేను అనే అల్పవిశ్వాసాలకి దూరంగా వుండాలి, ఎందుకంటే అతివిశ్వాసం తరచుగా వివక్షన, విచక్షనలు లోపించి పెరుగుదలకి ప్రతిభందకాలు అయితే, అల్పవిశ్వాసం ఆ పనిలో అసలు ముందడుగుని వేయించాడానికే ప్రతిభంధకం అవుతుంది. అందుకని నేను చేయగలను అనే అనే సానుకూల భావోద్వేగ ధోరణిని అలవర్చుకొనే ధృక్ఫదాన్ని పెంపొందించుకోవాలి, అది ఆత్మవిశ్వాసానికి ఆలంబన అవుతుంది. సాదించబోయే విజయాలకి విజయపధం అవుతుంది.
సానుకూల ధృక్పాధాన్ని ఎలా పెంపొందించుకోవాలి?
అందానికి, ఆరోగ్యానికి నిద్రకి ప్రత్యక్ష సంబంధం వుంది. తగినంత నిద్రలేకపోతే దాని ప్రభావం శరీర ఆరోగ్యంపై పడుతుంది. నిద్ర సమయంలో మెదడు విశ్రాంతి పొందడంవల్ల మెమొరి పవర్ పెరుగుతుంది. సుఖనిద్రవల్ల మెదడు పునర్వ్యవస్తీకరణ జరిగి సృజనాత్మకత పెరుగుతుంది. నిద్రలో అనేక శరీర కణాలకు రెపేర్లు జరుగుతాయి. జీవవ్యవస్థ మెరుగౌతుంది. నాణ్యమైన కొత్తకణాలు తయారవుతాయి. ఈ కొత్తకణాలు కొత్త అందాన్నిస్తాయి. అందుకనే ఎదైనా ఒక మంచిపని చేయాలన్న, నేర్చుకోవాలన్న అదమరచి నిద్ర పోవాలి. నిద్రసమయంలో మెదడుసహ మనలోని ప్రధాన వ్యవస్థలు విశ్రాంతి తీసుకుంటాయి. కొన్ని రకాల హర్మొన్లు విడుదలవుతాయి. ఈ హర్మొన్లు మన శరీరానికి, మనస్సుకి, చర్మానికి ఎంతగానో ఉపయొగపడుతాయి.
తగినంత నిద్ర లేకపోవడం నిద్రలేమికి కారణమవుతుంది. నిద్రలేమి మిమ్మలని శారీరకంగా, మానసికంగా బలహీనపరుస్తుంది. అందుకని ప్రతిరోజు కనీసం ఎడుగంటలు నిద్ర తప్పనిసరి. కొందరు పగలు ఓ మూడు గంటలు, రాత్రిల్లు ఓ నాలుగు గంటలు నిద్రపోతూ తగినంతగా నిద్ర పోయినట్లుగా భావిస్తారు, కానీ నిద్ర అనేది కంటిన్యూగా వుండాలి అపుడే మెదడుకి తగిన విశ్రాంతి లభిస్తుంది. ఇది జీవనగడియారం సక్రమంగా నడవడానికి అత్యవసరం. పరీక్షల సమయంలో ఇది గతి తప్పుతుంది, అయితే పరీక్షల అనంతరంకూడా సరిఅయిన నిద్రపోవకపోతే అది అనారోగ్యానికి కారణం అవుతుంది. వారంలో మూడు రోజులుమించి సరిఅయిన నిద్రలేకపోవడం, నిద్రనుంచి తరచుగా మధ్యలో లేవడం తరువాయి సరిగా నిద్రపోకపోవడం కూడా నిద్రలేమిగానే భావించాలి!! ప్రతిరోజు చక్కటి నిద్రకి, మానసికవిశ్రాంతికి యోగనిద్రని సాధన చేయాలి.
యోగనిద్ర మీలో సానుకూల బావోద్వేగాలకు ప్రేరణ అవుతుంది. మానసిక ఉద్విగ్నత, ఓటమి, కల్లోలాల భావనలని అధిగమించే సమ్యక్ సిద్దిని సాధించే మార్గాన్ని అవగతం చేస్తుంది. డిన్నర్ ముగించిన రెండున్నర గంటల అనంతరమే యోగనిద్ర సాధన చేయాలి. ఆలస్యంగా డిన్నర్ చేసే అలవాటుకి స్వస్తి చెప్పి, రాత్రి భోజనం 7.30కి లోపుగా ముగించేట్లుగా అలవాటుచేసుకోవాలి. మరిన్ని వివరాలకు ఈ లింకుని క్లిక్ చేయండి http://rvnsetty.blogspot.com/2014/11/blog-post_19.html
ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉండాలి. ప్రతి విఫలప్రయత్నం విజయఫధానికి దగ్గరికి చేరుస్తుంది అనే నమ్మకంతోనే పయనం సాగించాలి. ప్రయత్నలోపం లేనంతవరకి విజయావకాశాలకి ద్వారాలు తెరిచి ఉంటాయి. మొదలుపెట్టిన ప్రయత్నం మధ్యలో విరమిస్తే అపజయమే నీకు కానుక! అందుకని నమ్మకంతో ప్రారంభించే ఏ పని అయిన ప్రతికూల భావనలతో మొదలెట్టకండి. ఆ భావనల పరంపరలో సరి అయిన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పడడం జరుగుతుంది. తడబాటు నిర్ణయాలు పోటిలో నిన్ను వెనుకవరుస లోనికి నెట్టివేస్తాయి. నీలో పిరికితనాన్ని పెంచుతుంది.
పనిలోని సాధారణ ఒత్తిడి మీలోని ప్రతిభకి మెరుగు పెడుతుంది, అదే అపరిమితమైతే మానశిక ఒత్తిడిగా మీలోని ధారుడ్యాన్ని బలహీన పరుస్తుంది, బ్లడ్ లో గ్లూకోజు లెవెల్సుని తగ్గిస్తుంది. మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తుంది. శరీరంలో గ్లూకోజ్ త్వరగా ఖర్చు అవుతుంది. మానసిక ఒత్తిడి, టెన్షన్లను దూరంచేస్తూ మానసికానందం, శాంతి, ఆహ్లాదాల అనుభూతులకి తరగని నిధిగా మెడిటేషన్ని ప్రతిరోజు సాధన చేయండి. మెడిటేషన్ శరీరంలోని కొన్నిరకాల టాక్సిన్లని మెరుగైన శ్వాసక్రియ ప్రక్రియ ద్వార సమర్థవంతంగా తొలగిస్తుంది. మస్తిష్కంలో ఆలోచనాపరిధి విస్తృతమౌతుంది, నూతనభావాలతో ప్రేరణ పొందుతుంది, మరిన్ని వివరాలకు ఈ లింకుని క్లిక్ చేయండి http://rvnsetty.blogspot.com /2014/11/blog-post_18.html
నేనే తెలివైనవాడిని, యుక్తిపరున్ని అనే అహంభావం నుంచి దూరంగా ఉండాలి, లేకుంటే అదే ఓ పెద్ద బలహీనతగా మారే ప్రమాదం ఉంది! మేధోవంతులతో సాన్నిహితాన్ని పెంపొదించుకోవాలి. అది మీలోని ప్రతిభకి మెరుగులు దిద్దుతుంది. వ్యక్తిత్వవికాసానికి మిత్రుల నుంచి వచ్చే సలహలని, సూచనలని తప్పక స్వీకరించాలి, మీలోని బలహీనతలని సరిదిద్దుకోవడానికి ఇది ఒక వేదిక అవుతుంది.
నిన్ను నీవుగా నమ్మక, విశ్వసించక అపనమ్మకంతో ఆరంభించే ఏ కార్యానికి అయిన కార్యసిద్ది లభించదు, ఎందుకంటే మనస్థైర్యం నుంచి ఎటువంటి ప్రోత్సాహం ఉండకపోవడమే! స్వశక్తి పై నమ్మకం లేకుంటే సోమరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే నీలోని ప్రతిభ, సామర్థ్యాలను పెంపొందించుకోవాలి, వాటిపై నమ్మకాన్ని పెంచుకోవాలి!! నిరంతరసాధనే ఈ పోటి ప్రపంచంలో నీవు చేసే ప్రతిపని అంతర్గత శక్తుల ప్రేరణతో విజయపధం వైపుకి నడిపిస్తుంది.
అతిజాగరుత, సందిగ్థత, సంశయం, అనుమానం, అభద్రతలు మీ సామర్ధ్యానికి జారుడుమెట్లు! ఇవి నిన్ను అసమర్ధుడి జీవనపయనం దిశలో నడిపిస్తాయి! ఈ జారుడుమెట్లని సమర్థవంతంగా అధిగమించాలి, అపుడే విజయపథం వైపు దూసుకవెల్లడానికి మార్గం సుగమం అవుతుంది!!
Comments