యోగ - బాక్ పెయిన్
- Narayana Setty
- Nov 5, 2017
- 2 min read

సాధరణంగా చాలమందిని వేదించే అనారోగ్య సమస్యలలో వెన్నునొప్పి అనబడే బాక్ పెయిన్, నడుమునొప్పి, మెడనొప్పి అనేది ఒకటి. కారణం ఎదైన అది రాకుండ జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. ప్రస్తుత జీవ నవిధానంలో నడుమునొప్పి లేని వారు చాల తక్కువ.
నడుమునొప్పి ఎందుకు వస్తుంది?
సాధారణంగా వచ్చే నడుమునొప్పి ముఖ్యంగా ఇటివల జీవనవిధానంలో వచ్చిన మార్పులే ప్రధానకారణం. నేటిఉద్యోగాలు గంటల తరబడి నిశ్చలస్థితిలో పనిచేసే కోవకి చెందినవే. ఆ నిశ్చలస్థితిలో వెన్నముకని వంచి కూర్చొనేవిధానమే నడుంనొప్పికి, అదేవిధంగా ఆ సమయంలో మెడవంచి చదివేతీరు, మెడఎత్తి చూసేవిధానం మెడనొప్పికి కారణం అవుతున్నాయి.
కొందరిలో పడక వెన్నుకి సపోర్టుగా లేక వెన్నునొప్పికి కారణమవుతుంది. అవసరమైన మార్పులతో పడుకొనే విధానాన్ని వారు మార్చుకోవాలి.
కొందరిలో పని టెన్సన్ వల్ల నడుం కండరాలు సంకోచిస్తాయి, రక్త సరఫరా కటిభాగానికి తగ్గవచ్చు. దీనివల్ల నడుం నొప్పి వస్తుంది.
ఫ్యాషన్ పేరిట వాడే ఎగుడు దిగుడు చెప్పులు, ఎత్తుమడమల చెప్పులు రక్తప్రసరణకి అడ్డంకిగామారవచ్చు, కండరాలు బలహీనపడవచ్చు, నడుమునొప్పికి కారాణం కావచ్చు.
సరిలేని శరీరభంగిమలు వెన్నుపూసలని అధిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. దీనికి సరి అయిన జాగ్రత్తలు సకాలంలో తీసుకోకపొతే ముందు ముందు అనేక సమస్యలకి ఇవి కేరాఫ్అడ్రస్ గా మారే ప్రమాదం వుంది. కూర్చునే విషయాల్లో, చూసే పద్దతుల్లో, పడుకొనే పద్దతుల్లో, నడిచే విధానాల్లో కొద్దిపాటి మార్పులని పాటించడంద్వారా ఈ సమస్యలకి చెక్ పెట్టవచ్చు.
ఇందుకుగాను రోజు ఓ ఇరవైనిముషాలు వజ్రాసనం ప్రాక్టీసు చేయడంవల్ల మెరుగైన శరీరభంగిమలని సాధించడంద్వార వెన్నుపూస సాధరణస్థితికి చేరడానికి దోహదం అవుతుంది, ఆవిధంగా ఈ సమస్యని దూరంచేసుకోవచ్చు.
ఆహరశైలిలోని మార్పులు ముఖ్యంగా అధిక కెలరీలువున్నా ఆహరాలని డైలీ అదేపనిగా తీసుకోవడం మనలని ఒబెసిటికి దగ్గరచేస్తున్నాయి. ఒబెసిటి వెన్నుపాముని అధిక ఒత్తిడికి, భారానికి గురిచేస్తుంది. బరువు నడుము నొప్పికి కారణం అయితే 5 నుంచి 6 కిలోల బరువు తగ్గడంద్వారా నడుమునొప్పిని అదుపులోనికి తెచ్చుకోవచ్చు. ఇందుకుగాను లో కేలరిలు కలిగివున్న పోషకాహరాలని ప్రత్యామ్నాయంగా తీసుకోవాలి.
వెన్నుపాము ఏ పనులని చేస్తుంది?
శరీరంలోని నాడీమండల వ్యవస్థకి వెన్నెముక ఓ రక్షణకవచంలా వుంటూ అన్ని ప్రధాన అవయాలను అనుసంధానిస్తూ శరీరాకృతిని పరిరక్షించడంలో కీలకపాత్రని పోషిస్తూవుంటుంది. వెన్నెముకకు తోడుగా కండరాలు, లిగ్మెంట్లు, డిస్కులుంటాయి. వెన్నెముక సులభంగా వంగడానికి డిస్కులు , లిగ్మెంట్లు తోడుగావుంటాయి. వెన్నుపూసల అమరికనే వెన్నుపాము అనివ్యవహరించే వెన్నెముక. ఈ వెన్నుపూసల మధ్య రబ్బరు కుదురులాంటి మృదు పదార్ధం సాగే గుణాన్ని కలిగివుంటుంది. దీనిని డిస్కు అంటారు. డిస్కులు వెన్నముక కదలికలకి షాక్ అబ్జార్బర్సు లా పనిచేస్తాయి
వెన్నుపాము పొడవున ఎన్నో నరాలు వెలుతుంటాయి. మెడభాగం నుంచి వెళ్లే నరాలు చేతుల్లోకి, నడుమునుంచి వెళ్లేనరాలు కాళ్లలోకి వెళ్తూ వెళతాయి. వీటిలో కొన్ని నరాలు మూత్రకోశం, మలవిసర్జన భాగంతోపాటు లైంగిక బాగాల్లోకి వెళతాయి. డిస్కుసమస్యలు కలిగివున్న కొందరిలో అంగస్తంభన, శ్రీఘ్రస్కలనం వంటి లైంగిక సమస్యలు కూడా అగుపిస్తాయి.
డిస్కు సమస్యలు ఎందుకు వస్తాయి?
ఆధికబరువులను ఎత్తడం, ఎక్కువదూరం అదే పనిగా రన్నింగ్ చేయడం, రోజంతా వంగి పని పనిచేయడం, వెన్నేముకకి ప్రమదవశాత్తు దెబ్బలుతగలడం, గతుకులరోడ్లలో వాహనప్రయాణాలు, వయసుపెరిగేకొద్ది వచ్చేమార్పులు ,సరైయిన శారిరక భంగిమలని పాటించకపోవడం డిస్కులపై ఒత్తిడి పెరగడానికి డిస్కులలో అరుగుదల, తరుగదలలికి కారణమవుతున్నాయి. సంవృద్దిగా నీళ్లుతాగడం డిస్కుల అరుగుదలలకి, తరుగుదలలకి చెక్ పెట్టడానికి ఓ మంచి టెక్నిక్ అవుతుంది.
బలమైన వెన్నువ్యవస్థకి అభ్యసించదగిన యోగాసనాలు.
కటిచలనాసన; మార్జాలసన; శలభాసన; పశ్చిమోత్తాసన; భుజంగాసన; మత్స్యేంద్రాసన; ధనురాసన; సేతుభందాసన; త్రికోణాసన; ధండాసన; ఉష్ట్రాసన; శశాంకాసన
Comments