top of page

సుర్యనమస్కారాలు

  • Narayana Setty
  • Nov 5, 2017
  • 2 min read

కాంతి ప్రధాత అయిన సుర్యుడిని ప్రాచీనకాలం నుంచి జగజ్జ్యోతిగా మనం ఆరాధిస్తు వస్తున్నాం. నీరసాన్ని, మనోరుగ్మతలనుంచి విముక్తిచేస్తూ ఙానజ్యొతులని వెలిగించే తేజోవంతమైన జీవశక్తిగా మన వేదాలు కొనియాడాయి.

సుర్యనమస్కారాలు అంటే ఏమిటి?

తేజోవంతమైన జీవచైతన్యమైన ఆ సూర్యభగవానుడికి ఉషఃకాలంలో నమస్కారాలను సమర్పించడమే సూర్యనమస్కారాలు. మృదువైన కదలికలతో సుర్యనమస్కారలు పేరిట ఆచరించే పన్నెండు శారీరకభంగిమలు యోగ విద్యలో బహుళప్రాచుర్యతని సంతరించుకున్నాయి.

సుర్యనమస్కారాలు చేయడంవల్ల మనకు కలిగే ప్రయొజనాలు

మన వయస్సుని పుట్టిన తేదినుంచి గణించి చెబుతాం కాని మన వెన్నుముక వంగేశక్తి ఆధారంగా యోగవయస్సు అనేది మన పూర్వికులు గణన చేసేవారు. యోగవయస్సుని బట్టి యవ్వనం, భౌతికశక్తి, మానసిక ధృడత్వం ఎర్పడతాయి. శరీరం ఎలాపడితే అలా వంగేలా, స్వాధీనంలో వుండేలా వెన్నుపూసలు సులువుగా వంగేలా వుండడానికి చేసే పన్నెండు యోగభంగిమలు సూర్యనమస్కారలు. ఈ పన్నెండు ఆసనాలని వేయడంద్వార మనకి లబించే ప్రయోజనాలను తెలుసుకుందాం.

  • శరీరంలోని వ్యర్ధ పధర్ధాలు స్వేదరూపంలో విసర్జింపబడి దేహకదలికలు సులువవుతాయి, అందువల్ల నరాల వ్యవస్థ మెరుగై, కీళ్లవ్యవస్థ, సరళికృతం అవుతుంది.

  • పంచేద్రియాల శక్తి మెరుగౌతుంది, అందువల్ల రుచి, వినికిడి, ధృష్టి, వాసన శక్తులు పెరుగుతాయి.

  • వ్యాధినిరోధకత పెరుగుతుంది అందువల్ల శరీరం తేజోవంతంగా, శక్తివంతంగా తయారవుతుంది.

  • జీర్ణవ్యవస్థ మలినరహితమయి మెరుగౌతుంది, మెటభాలిజం సాధరణస్థితికి వస్తుంది.

  • మనస్సుకి ప్రశాంతత చేకూరుతుంది అందువల్ల ఆలోచనలలో స్పష్టత, భావవ్యక్తీకరణలో స్వేచ్చత, ఏకాగ్రత, ఙాపకశక్తిలో మెరుగుదలలకి కారణమవుతుంది అది మానసికానందం సాధించుకోవడానికి మార్గం సుగమతరంచేస్తుంది.

సూర్యనమస్కారాలు ఏలా చేయాలి?

ఉషోదయవేళ సూర్యునికి అభిముఖంగా పలుచటి బట్టలు ధరించి సాధనకి వుపక్రమించాలి. సాధనలో శరీరంలోని వివిధభాగాల కదలికలని గమనిస్తూ వుండాలి. శ్వాసపై ధృష్టి సారించి ఆ కదలికల మద్య సమన్వయం వుండేలా చూసుకోవాలి. శరీరాన్ని వెనుకకువంచేభంగిమలలో శ్వాసనిలోనికి తీసుకోవడం, ముందుకు వంచే భంగిమలలో శ్వాసని వదలడం చేయాలి. ఈ సాధన ప్రాణయమ, ధ్యాన, వ్యాయమం సమ్మేళణాలతో కలసివుంటుంది. అందుకని ఆరంభంలో యోగాచార్యుల సమక్షంలో మెళుకువలను ఆభ్యసించడం అభిలషణీయం.

  1. ప్రణామాసనం: ముందుగా ప్రార్ధన భంగిమలొ సూర్యునికి అభిముఖంగా నిల్చొని ‘ఓం మిత్రాయ నమః’ మంత్రోచ్చారణతో రెండు చేతులను నమస్కార ముద్రలోనికి తీసుకొని సాధరణ శ్వాసక్రియని కొద్దిసేపు కొనసాగించాలి.

  2. హస్త ఉత్థానాసనం: ‘ఓం రవయే నమః’ మంత్రోచ్చారణతో ధీర్ఘశ్వాసనిలోనికి తీసుకుంటూ రెండుచేతులను పైకెత్తి వీపువెనుకకు వంచాలి.

  3. పాదహస్తాసనం: ‘ఓం సూర్యాయ నమః’ మంత్రోచ్చారణతో శ్వాసని నెమ్మదిగా వదులుతూ రెండుచేతులను నేలనితాకే విధంగా కటిభాగాన్ని ముందుకు వంచాలి. ఈ భంగిమలో ముఖం తొడలని చుస్తూ వుండాలి.

  4. ఆశ్వసంచలనాసనం: ‘ఓం భానవే నమః’మంత్రోచ్చారణతో శ్వాసని లోనికి తీసుకుంటూ కుడిపాదాన్ని వెనుకకు తీసుకుంటూ కటిబాగాన్ని కిందికి దించుతు మోకాలుని, కుడికాలుని వంచుతూ రెండుచేతులను నేలపైన వుంచండి.

  5. సంతులనాసనం: ‘ఓం ఖగాయ నమః ‘ మంత్రోచ్చారణతో గాలిని నెమ్మదిగా వదలుతూ కాలివేళ్లను నేలకి తగిలేట్లుగా రెండుకాళ్లను వెనక్కి తీసుకుంటూ కటినుంచి పైభాగాన్ని గాలిలోవుండేట్లుగా రెండు అరచేతులని నేలకి ఆనించి వుంచండి. మొత్తం శరీరం కాలివేళ్లు , అరచేతుల ఆధారంగా నిలవాలి.

  6. అష్టాంగనమస్కార: ‘ఓం పూష్ణే నమః ‘మంత్రోచ్చారణతో కాలివేళ్లు, అరచేతులను కదల్చకుండా మొండాన్ని నేలపైకి వంచాలి, అందుకు ముందుగా మోకాళ్లని నేలకి తాకించండి తరువాత చాతి, గడ్డమ్ని నేలకి తాకించాలి.

  7. భుజంగాసన: అష్టాంగ నమస్కారముద్రలోవలే ఉదరం నేలని తాకేలా వుంచాలి, ‘ఓం హిరణ్యగర్భాయ నమః’ మంత్రోచ్చారణతో శ్వాసని లోనికి తీసుకుంటూ గడ్డం, తలని పైకెత్తి చూస్తూ వుండాలి. మోచేతులను శరీరానికి దగ్గరగా వుంచాలి.

  8. పర్వతాసనం: భుజంగాసనభంగిమ నుండి చేతులను, కాళ్లను కదల్చకుండా ‘ఓం మరీచయే నమః’ మంత్రోచ్చారణతో శ్వాసను నెమ్మదిగా వదలుతూ కటిభాగాన్ని మెల్లగా పైకి లేపాలి, మడమలని నేలకి నొక్కి వుంచాలి.

  9. ఆశ్వసంచలనాసనం: పర్వతాసన భంగిమనుంచి ‘ఓం ఆదిత్యాయ నమః’ మంత్రోచ్చారణతో శ్వాసని లోనికి తీసుకుంటూ కుడిపాదాన్ని వెనుకకు తీసుకుంటూ కటిబాగాన్ని కిందికి దించుతు మోకాలుని, కుడికాలుని వంచుతూ రెండుచేతులను నేలపైన వుంచే ఈ భంగిమకి రండి.

  10. పాదహస్తాసనం: ఆశ్వసంచలనాసన భంగిమనుంచి ‘ఓం సవిత్రే నమః’ మంత్రోచ్చారణతో శ్వాసని నెమ్మదిగా వదులుతూ రెండుచేతులను నేలనితాకే విధంగా కటిభాగాన్ని ముందుకు వంచే ఈ భంగిమకి రండి.

  11. హస్త ఉత్థానాసనం: పాదహస్తాసన భంగిమనుంచి’ ఓం అర్కాయ నమః’ మంత్రోచ్చారణతో ధీర్ఘశ్వాసనిలోనికి తీసుకుంటూ రెండుచేతులను పైకెత్తి వీపువెనుకకు వంచే ఈ భంగిమకి రండి.

  12. ప్రణామాసనం: ‘ఓం భాస్కరాయ నమః’ మంత్రోచ్చారణతో సాధరణ శ్వాసక్రియతో రెండు చేతులను నమస్కార ముద్రలోనికి తీసుకరావడంతో సూర్యనమస్కారాలు ముగిసినట్లే!

సూర్యనమస్కారాలు ఏంతసేపు చేయాలి?

ఈ వురుకుల, పరుగుల గజిబిజి జీవితంలో బాడిఫిట్నెసుగావుంచుకోవడం ముఖ్యం అని తెలిసికూడ తగినంతసమయం కేటాయించలేక పోతున్నాం అని మదనపడేవారు కనీసం సూర్యనమాస్కారాలని రోజూ ఓ ఇరవై నిమిషాలు క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వార బాడిఫిట్నెస్ని కాపాడుకోవచ్చు.

మెరుగైన ఫలితాలకోసం ప్రతిరోజు ఉషఃకాలంలో ఇరవై నుంచి ఇరవైఐదు నిముషాల సాధన అభిలషణియం. పరగడుపున చేసే ఈ ఆసనాలు ఏంతో విలువైన ఆరోగ్యప్రధాయణి కాని ఋతుసమయాలలోను, వెన్నముక కిందిభాగంలో, మోకాళ్లనొప్పులు ఉన్నపుడు, జ్వరం, హార్టు సంభందిత సమస్యలువున్నవారు ఈ ఆసన సాధన చేయరాదు.


 
 
 

Comments


bottom of page