top of page

ఆదర్శసమాజ నిర్మణానికి పదండి ముందుకు

  • Narayana Setty
  • Nov 6, 2017
  • 2 min read

నేటిచిన్నారులే రేపటి భవిష్యత్తు, నవోదయ కరదీపికలు! నవశకానికి చిరుదివ్వెలు ! మీ ఆశాదీపాలు, మీకలల సాకారాలు!! ఆడుతూ, పాడుతూ కేరింతలతోసాగాలి బాల్యం. గలగల సాగే మధురస్రవంతిలా తోటివారితో అరమరికలులేకుండా కలసిమెలిసే జీవనస్రవంతిలా కొనసాగుతూ ఉండేలా చూడడం మన బాద్యత. రేపటి పౌరులుగా ఆహ్లదకరమైన వాతవరణంలో ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యభరితంగా చిరునవ్వులతో కొనసాగాలి కౌమారదశ.

మనజాతి సంపదని మహోన్నతంగా, ఉజ్వలంగా, ఆదర్సవంతంగా తీర్చడంలో తల్లిదండ్రులుగా మన భాద్యత అసమానమైనది, నిరుపమానమైనది.

నేటి సమాజికవ్యవస్థలో ఈ భాద్యతానిర్వహణ బహుసున్నితం, క్లిష్టతరం అయింది.

ఆదర్శవంతమైన పెంపకానికి కావలసిన పేరెంటింగ్ స్కిల్స్ నేటిసమాజంలో కొరవడడం కలచివేస్తున్న భాధకరవాస్తవం. నిజానికి ఈ భాద్యతలను సక్రమంగానిర్వర్తించడానికి తల్లిదండ్రులకు నిర్దేశిత కోర్సులుగాని, కోచింగ్ సెంటర్లూగాని లేవు. ఈ దిశలొ అనుభవరాహిత్యం , అవగాహనరాహిత్యం తల్లిదండ్రులకు/సమజానికి పెనుసవాలుగా మారుతున్నాది.

కాబోయే తల్లిదండ్రులు ఈఅవగాహనరాహిత్యాని, అనుభవలేమిలని గుర్తించడంలో వాటిని అధిగమించడంలో విఙ్నతని పెంపొందించుకోవాలి. ఈ దశలో మొదటి అడుగుగా…

  • సంతానం ఎప్పుడు కావాలి అన్న విషయంలో సంధిగ్ధతలు వుండరాదు. ఇరువురి ఏకాభిప్రాయంతోనే గర్భధారణకి అంకురార్పణ జరగాలి. అంతవరకి సంతాననిరోధక పద్దతులని తప్పక పాటించాలి, అది అవాంచనీయ గర్భధారణలకి చెక్ అవుతుంది. ఆరోగ్యవంతమైన సంసారిక జీవనానికి నాంది అవుతుంది.

  • గర్భధారణకి సహధర్మచారిణి వయస్సు కనీసం ఇరవైకి పైగా వుండడం అభిలషణీయం. ఆమె ఆరోగ్యాన్ని, మానసికవికాసాన్నికూడ పరిగణనలోనికి తీసుకోవాలి.

  • దంపతుల్లో ఎవరైన సుగర్ భాధితులైతే ముందుగా తీసుకోవలసిన జాగ్రత్తలని తెలుకోవాలి వాటిని అమలుపరచి తీరాలి.

  • గర్భధారణ గురించిన అపోహలు, ఆందోళనలు , భయాలు ఉండడం సహజం అవి మీ మదిని కలవరపరుస్తూ వుండవచ్చు. ఇందుకుగాను మీ ఫ్యామిలిడాక్టరుతో నిస్సంకోచంగా మీ ఆరోగ్య సమస్యలని, మదిలోని ఆలోచనల ప్రకంపనలని, అలవాట్లని వివరంగా మనస్సువిప్పి చర్చిం చాలి. వారి సలహాలు సూచనలను పాటించాలి.

  • ఈ క్రమంలో ఆరోగ్యకర అలవాట్లని స్వాగతించాలి. సమతుల్యమైన బలవర్ధకమైన పోషక ఆహరాలని తీసుకోవడం మీ జీవనశైలి కావాలి. ద్రవపదర్థాలని ఎక్కువుగా తీసుకుంటు, ఎంప్టికెలరీ ఆహరాలని దూరంగా వుంచండి. రోజుకి రెండు నుంచి మూడులీటర్ల నీరు త్రాగాలి. అవి శారీరక సమతుల్యతలని కాపాడుతూ మిమ్మలని ఆరోగ్యవంతులుగా వుంచుతుంది.

  • ఆల్కహాల్ డ్రింకింగ్, సిగరేట్ స్మోకింగ్, జర్డాపాన్, పొగాకు ఉత్పత్తులను వాడే అలవాట్లువుంటే వాటిని దూరంగా వుంచండి, అవి గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

  • నిర్ధేశిత సమయాల్లో భోజనం, నిర్ణిత సమయాల్లొ నిద్రకి ఉపక్రమించాలి. ఆలస్యంగా నిద్రపోయె అలవాటుకి స్వస్తి చెప్పి 9:30కి నిద్రకి ఉపక్రమించాలి. బెడ్’రూంలోనికి ధారాళంగా గాలి వెలుతురు వచ్చేట్లుగా వుండాలి. నైట్ నీలిరంగు బెడ్ ల్యాంప్ వాడండి. సరితగినంత నిద్ర మిమ్మలని ఆహ్లదకరంగా వుంచుతుంది. స్మార్ట్’పోన్’ని చీకట్లో బెడ్’రూంలోవాడడం మానివేయండి అవి కంటిచూపుకి హానికరం.

  • బెడ్ రూంలో టివి ప్రోగ్రాములు చూడడం అలవాటు ఉంటే టివిని హాలులోనికి మార్చండి, లేకుంటే మీకు తెలియకుండానే ఎక్కువసమయం టివి వాచింగ్ లో గడిపేస్తారు.

  • మానశికపుష్టి, శారీరకపుష్టి, ఆర్ధికపుష్టి, ఆరోగ్యపుష్టిలసమ్మేళనంతో మీ కుటుంభంలోనికి నూతనశిశువుకోసం శ్రీకారం చుట్టాలి.

  • కాబోయే తండ్రిగా సహధర్మచారిణితో మరింత సన్నిహితంగా వుండాలి. ఆమె భావోద్వేగాలను, ఆలోచనాప్రకంపనలను నిశితంగా గమనిస్తూ మానశికంగా దగ్గరిగావుంటు, అక్కున చేర్చుకొని నేనున్నాను అనే భరోసాన్ని ఇవ్వాలి.

  • ఆమెలో శారీరకంగా, మానసికంగా కలిగే మార్పులను ప్రేమానురాగాలతో గమనిస్తూ ఆమెకు చేదోడువాదోడుగా, ఆప్యాయంగా వుంటూ సంతోషంగా వుంచడం మీభాద్యత. ఇంటి పనులని షేర్ చేసుకోండి.

  • ఆమె మనస్సుని ఆహ్లదకరంగా వుంచడానికి రోజు ఆరుబయట వాకింగ్ తప్పనిసరి. వీలు అయితే వారంలో ఓ గంట స్విమ్మింగ్’కి కేటాయించండి.

  • శృంగారంలో సున్నితత్వం, లాలిత్యం కలగలపుగా వుండాలి. అందులో ఆమెకి అభిరుచి, ఆసక్తి వుండితీరాలి. ఆమెకి శృంగారంపై అనాసక్తి ఉంటే దానికి దూరంగా వుండడమే బెటర్.

  • మనస్సు ప్రశాంతత పొందడానికి యోగసాధన ఓ చక్కటి పరిష్కార వేదిక. అందుకని మీరు సరయిన యోగశిక్షణ తీసుకొని యోగాభ్యాసం చేయండి.

  • సృష్టిలో ప్రతిశిశువు ఆణిముత్యమే ఇందులో లింగవివక్షణకి ఆస్కారమే ఇవ్వకండి. లింగ నిర్ధారణ పరిక్షలు చేయించకండి అది నేరం కూడ.

  • శిశువు పెరుగదలను, తల్లి ఆరోగ్యపరిస్తితులను రెగ్యులర్ గా డాక్టర్’తో చెకప్’లు చేయించాలి.

అల్ట్రాసౌండ్ స్కాన్నింగ్’లని అందులో మీ చిన్నారి స్పందనలను ఆస్వాదించండి. మీశ్రీమతితో ప్రతిసారి డాక్టరుని కలవండి.శిశువు పెరుగదలలో జన్యుపరమైన లోపాలను గుర్తిస్తే అవసరమైతే డాక్టరు సలహమేరకు గర్భవిచ్చిత్తికి సంసిద్దం కావలసిందే.

ఆరోగ్యవంతమైన దంపతులు మాత్రమే ఆరోగ్యకరమైన శిశువుని అపురూప కానుకగా భవిష్యత్ తరానికి అందచేయగలరు. చిన్నారులని మీ వారసులుగానే గాకుండా దేశసంపదగా గుర్తించాలి. అది మన జాతీయసంపదని ఆదర్శవంతంగా పురొగమనదిశకి నడిపించే మొదటి అడుగు కావాలి.


 
 
 

Comentarios


bottom of page