top of page

ఆరోగ్యాన్ని పెంపొందించే డ్రైనట్సు…

  • Writer: Admin
    Admin
  • Nov 6, 2017
  • 2 min read

డ్రైనట్సు కాజు, పిస్త, బాదం, వాలునట్సు, పల్లీలు ఆరోగ్యకరమైన ఆహరాలు అయితే అందులోవుండే అధికకెలోరీలు, కొవ్వు బరువునిపెంచే అనారోగ్యకర ఆహరాలుగా చాలమందిలో అపోహ వుంది. వాస్తవానికి డ్రైనట్సు అపార పోషకనిధుల సంతులితఆహరాలు. వీటిని పరిమితమొతాదులో వాడకంద్వార హానికరంకాని మంచికొవ్వు, ప్రొటిన్లు, ఫైబర్లు, మినరల్సు, విటమిన్లు, యాంటియాక్సిడెంట్లు, సహజసిద్దమైన స్టిరాయిడ్సు లభిస్తాయి అవి ఆరోగ్యపరిరక్షణకి చాలాఅవసరం. వీటిని వుడకించకుండా తీసుకోవడం శ్రేయస్కరం అయితే నానబెట్టిన నట్సులో ఫొషకవిలువలు రెట్టింపు అవుతాయి అందుకని అలా తీసుకోవడం మరింత శ్రేయస్కరం. టేస్టుకోసం ఉప్పు, కారంలని కలపకండి లేక ఆయిల్సులో ప్రై చేయకండి, అసక్తి ఉంటే పెప్పెరుపౌడరుని వాడుకోండి. వీటిని సహజరీతీలో తీసుకోండి. ఇవి చాలారకాల కాన్సర్లను, హృదయసంభందిత వ్యాధులను, గాల్ స్టోన్సు, ఉదరకోశ వ్యాధులను, నిరోధించడానికి, గ్లూకోజు లెవల్సుని, మెరుగైన మేటబాలిజాలకి చేయూత అవుతుంది.

డ్రైనట్సు తీసుకోవడం ద్వార మనకు లభించే ఆరోగ్యప్రయోజనాలు:

  • డ్రైనట్సు తీసుకోవడంద్వారా సమతుల్యమైన బరువుని సాధించుకోవచ్చు. అందుకే డైటులో ఓ భాగంగా రోజు ఐదు నుంచి ఆరు నట్సుని మించకుండా తీసుకోవచ్చు.

  • డ్రైనట్సులోని యాంటియాక్సిడెంట్లు కణనిర్మాణంలో కీలకపాత్రని పోషిస్తూ, కణహీనతలనుంచి రక్షణని తెస్తాయి, అది కాన్సర్ల నుంచి దూరంగా ఉంచడానికి సహయపడుతాయి.

  • వీటిలోని E విటమిన్ కంటిచూపుని పరిరక్షిస్తాయి. మరియు ధమనులు గట్టిపడనీయకుండ మృదువుగా ఉండడానికి తోడ్పడుతాయి.

  • వీటిద్వార లభించే కొవ్వు కొలొస్ట్రాలు లెవెల్సుని పెరగనీయవు, అందులోని ఫైబర్లు ఆకలి భావనలను దూరం చేస్తాయి.

  • ఇవి సూక్ష్మధాతువులు అయిన మాంగనీసు, పోటాషీయం, మాగ్నీషియం, కాల్షియంలకు అపారనిధులు. అవి ఆరోగ్యపరిరక్షణలో కీలకపాత్రని పోషిస్తాయి.

  • ఇందులోని యాంటియాక్సిడెంట్లు, విటమిన్లు, ఇతర సూక్ష్మధాతువులు చర్మాన్ని అరోగ్యవంతంగా ఉంచుతూ మృదుత్వాన్ని, లావణ్యాన్ని తీసుకవస్తాయి.

  • ఇందులోని B7 విటమిన్లు ఆరోగ్యవంతమైన శిరోజాలపెరుగుదలకి మరియు సంరక్షణకి ఉపయొగపదుతూ జుట్టురాలడాన్ని తగ్గిస్తాయి.

  • ఇవి ప్రొస్టేటు క్యాన్సరువ్యాప్తిని 30% నుంచి 40% వరకు నియంత్రించడానికి సహయకారి అవుతుంది.

  • ఇవి స్తనసంపదని ఆకర్షణియంగా ఉంచడానికి, బ్రెస్టు క్యాన్సరువ్యాప్తిని నియంత్రించడానికి సహయపడుతుంది

  • ఇవి మెటబాలిజక్రియని మెరుగుపరుస్తాయి, అందుకే డయాబిటిసుభాదితులు వారానికి ఓ పావుకప్పు వాలునట్సుని తీసుకోవడం వాంచనీయం.

  • వాలునట్సు ఒమెగా3ఫ్యాట్సు, విటమిన్ E ల సంవృద్దితో మస్తిష్కంకి ఎంతో ప్రయోజనకారి. మానిశిక ఆందోళనలని దూరంగా ఉంచుతుంది.

  • వాలునట్సు రెగ్యులరుగా తీసుకోవడం ద్వార ఆరోగ్యవంతులైన యువకుల్లో వీర్యవృద్దికి దోహదపడుతుంది

  • బాదం, వాలునట్సు వాడకం రక్తపోటుని సాధరణస్తాయిలో ఉంచడానికి సహయ పడుతాయి.

  • పల్లీలు, కాజులలోని కాల్షియం నిధులు బోనువ్యవస్థకి, మరియు గుండెకి ఎంతో మేలుని తీసుక వస్తాయి

  • గర్భిణిగా ఉన్నపుడు బాదం పప్పులు రెగ్యులరుగా తీసుకోవడంద్వారా తల్లికి, శిశువుకి సమీకృత పోషకవిలువలను అందచేస్తాయి. వీటిద్వార లబబించే ప్రోటీన్లు శిశువులో చక్కటి కండర నిర్మాణానికి ఉపయోగపడుతాయి. ఇందులోని ఫైబర్లు తల్లిని మలబద్దకము నుంచి పరిరక్షిస్తాయి. ఇందులోని విటమిన్ A శిశువు జుట్టుపెరుగుదలకి, మృదువైన చర్మనిర్మాణానికి తోడ్పడుతుంది. వీటీలోని కాల్షియం నిధులు తల్లిలో బిపి స్తాయిలని క్రమబద్దీకరిస్తాయి.ఇందులోని మాంగనీసు సమతుల్య బరవులని సాధించడానికి అవసరం. వీటిలోని మాగ్నీషియం నాడీమండల వ్యవస్థని బలోపేతం చేస్తుంది. ఇందులో విటమిన్లు A, B1, B2, B5, B6, B9, E, మరియుK ఆరోగ్యపరిరక్షణకి ఆలంబన అవుతాయి.

ఇవి శిశువుకి ఎటువంటి ఫుడ్ అలర్జీలు దరిదాపుకి చేరనీయవు. తల్లికి నట్సు అలర్జి ఉంటే ముందుగా దాక్టరు సలహాని తీసుకోని వీటి వాడకాన్ని ప్రారంబించాల్సివుంటుంది.

  • పిల్లలో వ్యాధినిరోధకవ్యవస్థని మెరుగుపరుస్తుంది. చిన్నపిల్లలలో నాడీవ్యవస్థ, బోనువ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థలు బలోపేతం అవుతాయి. వీరికి కాజు, బాదం, వాలునట్సులని, పల్లీలని సమపాళ్లలో తీసుకొని ఓ రాత్రి నీళ్లలో నానబెట్టండి. మరునాడు నీడలో వీటిని ఆరనీయండి, ఆరిన ఈ నట్సుని పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవాలి. మీ చిన్నారులకి ఇచ్చే ఆహరంలో ఈ పొడులమిశ్రమాన్ని, ఓట్సులని కలగలిపి 40:60 గా మిక్సుచేసి రోజుఇవ్వాలి. ఇది బలవర్ధకమైన సమతుల్య పొషకాహారం అవుతుంది.

  • డ్రైఫ్రూట్సుతో చేసిన లడ్డులను పిల్లలు బాగా ఇష్టపడుతారు. వీటి తయారిలో నూగులు, ఫాక్సుసీడ్సుని కూడా జత చేసుకోండి. వీటిని వారంలో రెండు నుంచి మూడమార్లు ఇవ్వండి. ఈ లడ్డులలో చక్కెరకి ప్రత్యామ్నాయంగా కొద్దిగా బెల్లం, తేనె, ఎండుద్రాక్ష, కర్ర్జురాలని వాడాలి.

  • కర్జురాలు సూక్ష్మపోషకాలు, విటమిన్సు, మినరల్సుకు నిధులు. రోజు మూడూ, నాలుగు కర్జురాలను తీసుకోండి. మీ చిన్నారులకి స్నాక్ ఐటంగా ఇవ్వండి. రాత్రి ఐదారు ఎండు కర్జురాల ముక్కలని మంచినీళ్లలో నానబెట్టండి. ఆ నీటిని చిన్నపిల్లలతొ ఉదయం తాగించండి. వీటి రుచిని ఇష్టపడుతారు.ఇందులోని ఫ్లోరిన్ దంతసంరక్షణకి, ఐరన్ రక్తహీనరహితానికి తోడ్పాటు అవుతుంది.

  • కర్జురాలలోని పొటాషియం నరాలవ్యవస్థని, ఫైబరు జీర్ణవ్యవస్థని, ప్రొటీన్లు శారీరకవ్యవస్థని ఆరోగ్యంగా వుంచుతాయి. ఇందులో B1, B2, B3, B5, C మరియు A1 విటమిన్లు ఉన్నాయి ఇవి కంటి చూపుని మెరుగుపరుస్తాయి. ఉదరకోశ క్యాన్సరు నుంచి రక్షణ ఇస్తుంది. చెడు కొలొస్ట్రాలుని తగ్గిస్తుంది. ఇందులోని ‘లో’ కెలోరీలు ఆరోగ్య పరిరక్షణకి మేలు చేస్తాయి.

  • వారంలో మూడుసార్లు డ్రైఫ్రూట్సుని రెగులర్గా తీసుకోవడం ఓ అలవాటుగా చేసుకోండి. ఈ అలవాటు ఆరోగ్యకర జీవితానికి, ధీర్గాయుస్సుకి కారణం అవుతుంది.

  • ప్రతిసారి పది నుంచి పదిహేను గ్రాములు మించకుండా వారానికి రెండుమార్లు రెగ్యులర్ వీటిని తీసుకోవడం ఓ అలవాటుగా చేసుకోవడం ద్వారా పాంక్రియాసుక్యాన్సరు భారి నుంచి రక్షణ పొందవచ్చు.

డ్రైనట్సు, డ్రై ఫ్రూట్సులపై అపోహలు వదలి మీ డైటులో వీటిని ఓ భాగంగా చేర్చుకొనండి, వాటి అపార ఫలితాలను, రుచులను మనసరా అస్వాదించండి.


 
 
 

Comments


bottom of page