top of page

జాతిరత్నాలు

  • Writer: Admin
    Admin
  • Nov 6, 2017
  • 3 min read

మంచి తండ్రి దగ్గర పెరిగిన ఓ ఆడపిల్లకి మగవారిని గౌరవించడం బాగా తెలుస్తుంది

మంచి తల్లి దగ్గర పెరిగిన ఓ మగపిల్లాడికి ఓ మహిళను ఏలా గౌరవించాలో , ప్రేమించాలో బాగా తెలుస్తుంది

ఏదైన అది మన పెంపకంలోనే ఉంటుంది

అదే ఆదర్శసమాజ నిర్మణానికి మొదటి అడుగు అవుతుంది.

పొత్తిళ్లలోని పాపాయికి మాతృస్తన్యం దేవుడు ప్రసాదించిన ఆమూల్య కానుక. ఆ దైవప్రసాదాన్ని తనివిదీర రోజూ త్రాగనీయండి. అది తల్లి శిశు అనుభందాలని మమేకంచేస్తూ అనిర్వచనీయ అనుభూతులకి దగ్గరచేస్తూంది. పెరిగేపాపాయికి ఈ స్తన్యం అమృతధార అవుతుంది. తల్లిపాలు పాపాయికి ఎదుగుదలకి కావలసిన పోషకాలను అందజేస్తూ ఆరోగ్యవంతమైన జీవనానికి నాంది అవుతుంది. ఇతర సమీకృత ఆహరాలను బేబికి స్తన్యం అందించినంతవరకి అందచేయవలిసిన అవసరం ఏమాత్రం లేదు.

బేబికి ఆరుమాసాలు నిండినతరువాత నెమ్మదిగా ఘనఆహరాలను పరిచయం చేయాలి.

  • మార్కెట్లలో దొరికే బేబిఫుడ్’ని వాడనవసరంలేదు. మీ ఇంట్లోనే బేబికి కావలసిన ఆహరాన్నిసంప్రదాయక పద్దతిలో తయారుచేసి మీ ప్రేమతో రంగరించి అందించండి. భెబిఫుడ్’లో రుచికోసం ఉప్పు,కారాలు,మసాలాలని కలపకండి. అలాగే చక్కరకి ప్రత్యామ్నంగా తేనేని కలిపి ఇవ్వాలి.

  • పెరిగే పాపాయి అన్ని రుచులని ఆస్వాదిస్తుంది అయితే ఐస్ క్రీం, కేక్ , పిజ్జా , బర్గర్లు ,కూల్ డ్రింకులకి వీలైనంత దూరంగా వుంచడం వారి ఆరోగ్య పరిరక్షణలో కీలకం అని గుర్తించండి. అందులోని ఎంఫ్టి కెలరీలు ఒబెసిటిని పెంచడానికి మాత్రమే ఉపయొగపడుతాయి!!

  • ఫుడ్ ఫీడింగ్ విషయంలో వారి ఆభిరుచులకి ప్రాధాన్యత ఇవ్వాలి.

  • చిన్నారికి ఎంత ఇష్టపడుతుందో అంతే ఫీడ్ చేయండి. అంతేగాని క్లీన్ ప్లేట్ కావాలి అని ఒత్తిడి ఎంతమాత్రం చేయకండి. మరింతగా ఫీడ్ తీసుకోవాలని వారికి టివి, స్మార్ట్’ఫోన్ ప్రోగ్రాం’లని ఆశ పెట్టకండి. ఒబెసిటికి అది మరో అడుగు అవుతుంది !!!

  • రోజూ నిర్దేశిత సమయాల్లోనే నాలుగు లేక ఐదు దఫాలుగా వారి అభిమతం మేరకు ఆహరం ఇవ్వాలి. ప్రతి ఫీడింగ్ కి కనీసం మూడు గంటలు గాప్ ఇవ్వాలి. అది మెటబాలిజ క్రియని తేజోవంతం చేస్తుంది. వారి టమ్మీ సున్నితమైనది అందుకే తేలికగా జీర్ణమయ్యే సాత్వికాహారాలనే ఇవ్వాలి.

ఆహరం తీసుకునే విషయంలో మీ మితిమీరినప్రేమతో వారిని బలవంతం చేయకండి. ఓవర్ ఫీడింగ్ వారి పెరుగుదలపై ప్రతికూల ప్ర భావాన్ని చూపుతుంది.

  • పిల్లలకి కావలసింది మీ ముద్దుమురిపాలు, ప్రేమ ఆప్యాయతలే...వాటినే పంచండి!

  • వారిని టివి, స్మార్ట్’ఫోన్ ప్రోగ్రాం’లతో గిఫ్ట్ లతో, బొమ్మలతో మచ్చిక చేసుకోవచ్చు అని భావించకండి!!

  • తల్లివడిని మించిన సౌఖ్యం ఏ గిఫ్ట్ కూడ వారికి ఇవ్వదు!

  • పిల్లలతో సరదగా గడపడానికి ప్రతిరోజు సమయం కేటాయించాలి. వారితో సన్నిహితంగా గడపండి. సరదాగా నవ్వుతు, హగ్ చేసుకుంటూ పలకరించాలి.

  • విధిగా రోజూ వారిని తోటివారితో నిర్ణిత సమయాలలో కలసి మెలసి వుండేట్లుగా ఆటలు ఆడుకోనివ్వాలి. వారితో ఎలా ఆడుతున్నారో గమనించండి. ఆటలలో ఎలా ప్రవర్తించకూడదో నేర్పించండి. ఋజుప్రవర్తనకి, సఖ్యతకి మొదటి ఆడుగులు సక్రమగావుండెట్లు జాగ్రత్థ తీసుకోవలసిన అవసరాన్ని ఆర్ధం అయ్యేలా నేర్పించండి. ఇతరులతో ఆటపాటలలో పోల్చి చిన్నబుచ్చకండి.

  • వారి భాల్యాన్ని మధురానుభూతులతో ఆస్వాదింపచేయనియండి. అవే ప్రేమాంకురాలుగా వారి మదిలో వెళ్లివిరవాడానికి దోహదం అవుతాయి.

పిల్లల ముందు తరచుగా కీచులాడుకోవడం వారిలో ఆభద్రతాభావాన్ని తీసుకువస్తుంది. వారి ముందు హుందాగా ప్రవర్తించాలి మీ కోపావేశాలు, పరస్పర నిందారోపణలు చేసుకోవద్దు. అవి వారి సున్నిత మనస్తత్వాన్ని ప్రభావితం చెస్తాయి. మీ మధ్య వుండే పరస్పర గౌరవమే చిన్నారికి మీరు అందజేసే అపురూప వారసత్వం.

నాన్నగా వాళ్ల అమ్మకి అనురాగాన్ని, ఆప్యాయతలని మాత్రమే పంచాలి. మీ పిల్లలు మిమ్మలనే అనుకరిస్తారు అన్నది గుర్తుంచుకొని ప్రవర్తనని సరిదిద్దుకోవలసిన భాధ్యత తల్లిదండ్రులదే.. పిల్లలు మీరు ఎలా వుంటారో వారు అలాగే పెరుగుతారు అందుకని వారి ప్రవర్తన ఎలావుండాలని మీరు అభిలషిస్తారో ఆవిధంగా మీరు మారాలి.

  • మీ ఆలోచనలని, అబిప్రాయాలని బలవంతంగా వారిపై రుద్దకండి!

  • వారి ఆలోచనలని, భావనలని, అభిప్రాయాలని, స్వేచ్చగావ్యక్తికరించనియ్యాలి..

  • వారి వ్యక్తిత్వాన్ని గమనించి ఆ దశలో ప్రోత్సహించాలి.

  • వారిలోని సృజనాత్మకతని నిశితంగా గమనించాలి

  • మీ చిన్నారిలోని అంతర్గత ప్రతిభని గుర్తించండి.. ఆ ప్రతిభకి మెరుగులు దిద్దే ప్రయత్నం చేయండి. ఆ దిశలో శిక్షణ ఇప్పించాలి

  • లలతకళలలని ఆభ్యసించడానికి ప్రోత్సహించండి. నాట్యం, చిత్రలేఖనం, యోగ, చెస్, సంగితకళలలో ఆసక్తిని పెంపొదించే దిశలో ప్రోత్సహించండి. స్విమ్మింగ్ క్లాసుల్లో చేర్పించండి. మన ఆచార వ్యవహరాలశైలికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆ దిశలో మొదటి అడుగులు పడనీయండి.

వారి ప్రవర్తన ఎలా వుండాలో అన్న విషయంలో మీకు పూర్తిగా క్లారిటి వుండాలి. వారి ప్రవర్తనలో మీకు నచ్చని విషయాలని వారికి సున్నితంగా తెలియజేయడమే గాకుండ అది ఎలా వుండాలో వారి మనస్సుకి హత్తుకునేలా తెలియజేయవలసిన భాద్యత మీదే!! వారి ప్రవర్తనలో తప్పొపులను సునిశితంగా గమనించాలి. వారి తప్పులని సున్నితంగా చూపించండి. అలా ఎందుకు చేయరాదో, ఎలా చేయాలో వారికి తిరిగి అర్ధం అయ్యేలా తెలియచేయాలి. అదే పొరపాట్లు తిరిగిచేయనివ్వకండి. అవే తప్పులని పదేపదే చేస్తుంటే చూసిచుడనట్లుగా వదలివేయకుండా చక్కటి క్రమశిక్షణని అమలుచేస్తూ సహనంతో సరిదిద్దాలి. క్రమశిక్షణని అమలు చేసే విషయంలో పిల్లలముండు మీరు ఎప్పుడు ఆర్గ్యుమెంట్లు చేసుకోకండి. ప్రవర్తనని సరిదిద్దడంలో మీలో ఏకాభిప్రాయం తప్పనిసరి. మీరు అమలు చేయలేని ఆర్డర్లు, క్రమశిక్షణని పిల్లలకి ఇవ్వకండి. క్రమశ్క్షణ పేరుతో కఠినంగా శిక్షించకండి. ఒక తప్పుకి ఒక పనిష్మెంట్ ఒక మంచి పనికి ఒక రివార్డ్’ నే ఇవ్వాలి. ఇవ్వబడే పనిష్మెంట్ మీ చిన్నారిని భయభ్రాంతులకి గురిచేసెట్లుగా అసలు వుండరాదు. ఇచ్చే రివార్డ్ స్పుర్తిదాయకంగా వుండాలి.

భవిష్యత్తులో జాతిరత్నంగా తీర్చిదిద్దడానికి ఇపుడే శ్రీకారం చుట్టాలి.

పెంచడం అమ్మే అయినా బాధ్యతాయుతంగా పెంచడం నాన్న బాధ్యతే!!

సేవచేయడం అమ్మవంతు మరి సరిచేయటం నాన్నవంతు !!

కనిపించే ఆరాటం అమ్మది, కనిపించని పోరటమే నాన్నది !!!

అమ్మ మీ రక్తం అయితే నాన్న మీ హృదయం !!!


 
 
 

Comments


bottom of page