జీవితకాలం...గ్యారంటీ!!
- Narayana Setty
- Nov 6, 2017
- 2 min read
మన ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రాలు* మన దేహాధారుడ్యాన్ని, ఆరోగ్యసంపదల గుణగణాలని నిర్ణయుంచే ప్రధాన మూలధాతువులగా ‘థ్రిదోషాలు’ అయిన వాత, పిత్త, కఫాలు అని గుర్తించాయి. ఈ ప్రధాన మూలధాతువులలో కలిగే అసమానతలే అనారోగ్యాలకి మూలకారణాలుగా గుర్తించింది.
వీటి మధ్య సమతుల్యతల సాధనకి ‘యొగ షట్ క్రియ’లని మనకి వారసత్వ సంపదగా అందజేసింది. అవి జలనేతి, కపాలభాతి, బస్తి, నౌళి, ధౌతి, మరియు త్రాటక క్రియలు. ఇవి యోగ థెరఫీలో థ్రిదోష నివారిణిగా ప్రధాన భుమికని పోషిస్తాయి.

జలనేతి & సూత్రనేతి:
ఇందుకు ప్రత్యేకంగా ఉపయొగించే నేతిపాత్రతో గోరు వెచ్చని సాల్టువాటర్ తో నాసిక లోని సున్నితమైన పలుచటి మ్యూకసు పొరలు శుభ్రమౌతాయి. అది నాసికా వ్యవస్థని బలోపేతం చేస్తుంది. సాధరణ జలుబు, రొంపలని సమర్థవంతంగా, డిప్రెషన్, మైగ్రైన్, టెన్షన్ లని కూడా నియంత్రించడానికి సహయకారి అవుతుంది.

కపాలభాతి:
జలనెతి అనంతరం పద్మాసనం లేదా సుఖాసీనులై మీశక్తి మేరకు శ్వాస తీసుకొని వదలుతూ ఓ 50 సార్లు శ్వాసక్రియని కొనసాగించాలి.
నుదురు, తల భాగాలని ఉత్తేజ పరుస్తుంది. ముఖానికి నూతన తేజస్సుని తీసుక వస్తుంది. మీరు యవ్వనవంతులుగా ఉండడానికి సహకరిస్తుంది. శ్వాసకోశవ్యవస్థని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సైనాసిస్’కి చక్కటి. ఈ క్రియ ఆజ్ఞాచక్రం ఉద్దీపనకీ సహయకారి అవుతుంది.

వస్త్రధౌతి:
ముందుగా రెండు లీటర్ల గోరు వెచ్చని సాల్టువాటర్ త్రాగాలి. తరువాయి త్రాగిన సాల్టువాటర్’ని వాంతి చేసుకోవాలి. తదుపరి నూలువస్త్రంతో ఆన్నవాహికని పరిశుభ్రపరుచుకోవాలి. ధౌతి క్రియలోని మెళుకువలను నేర్చుకొవడానికి మొదటిసారి యోగాచార్యుల సన్నిధీలో ప్రాక్టీస్ చేయండి. ఇది మెటాబాలిజాన్ని పెంపొందిస్తుంది. రోగనిరొధక వ్యవస్థ ఉత్తేజిత మౌతుంది. రక్తంలో
చక్కెర నిల్వలని సాధరణా స్థాయికి తీసుక రావడానికి ఉపకరిస్తుంది.

బస్తి లెక శంఖప్రక్షాళన:
అన్నవాహిక, జీర్ణకోశ వ్యవస్థ, చిన్న, పేద్ద ప్రెవుల వ్యవస్థ, మరియు కోలన్ వ్యవస్థలను శుద్ది చేస్తుంది. ఈ క్రియలో 6 నుంచి 7 లీటర్ల గోరు వెచ్చని సాల్టు వాటర్ త్రాగవలసి ఉంటుంది. ఆచార్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించండి. రక్త శుద్దికి, మొండి చర్మ వ్యాదుల నివారణకి, మానసిక సమతుల్యతలని సమర్థవంతంగా సాధిస్తుంది.

త్రాటక:
ఆరొగ్యవంతమైన కనుదోయికి, కంటిచూపుకి ఆచరించదగిన క్రియ. ఇరవై రకాలా కండ్ల వ్యాదులని దూరంగా ఉంచుతుంది. పిల్లలలో ఙాపకశక్తి, ఎకాగ్రతలను పెంపొదించుకోవడానికి సహయకారి అవుతుంది. మెడిటేషన్ వెంట ఆచరింప దగిన క్రియ. నిడ్రలేమిని నివారిస్తుంది, డిప్రెషన్ని, అలెర్జిలని, యాంక్జైటిలని దూరం చేయడానికి సహయకారి.

నౌలి:
జీర్నకోశ వ్యవస్థని సమర్థవంతంగా ఉంచాడానికి, జీర్ణక్రియని మెరుగుపరచడానికి, పాంక్రియాస్ ని ఉత్తెజపరచడం ద్వార సుగర్ ని కంట్రోలులో వుంచడానికి, పొత్తికడుపు కండరాలు ఆరోగ్యవంతంగా ఉంచడానికి ఈ క్రియ చక్కటి సహయకారి.
మీలో థ్రిదోషాలా సమతుల్యతను, అంతర్ శుద్ది సాధించడానికి యోగక్రియలు యోగ నిపుణల పర్యవేక్షణలో మాత్రమే ఆచరించండి. సుధీర్ఘజీవనయానంలో ఆరోగ్యవంతమైన సుఖజీవితాన్ని యోగసాధనతో మీ సొంతం చేసుకొండి.
*Hath Yoga Pradeepika: Shat Kriyas
*Sushruta Samhita
Comments