బ్లడ్ షుగరు లెవల్సుని ఇలా నియంత్రించుకోండి..
- Narayana Setty
- Nov 6, 2017
- 3 min read
నాగరిక జీవనశైలి, ఆహారపు అలవాట్లలో ఇటివల వివక్షణ రహితంగా వచ్చిన మార్పులు, కూర్పులు, చేర్పుల ఫలితంగా ఈ సమాజంలో ఓ అవలక్షణంగా చక్కెరవ్యాధి ఆంధోళనకరస్థాయిలో విస్తరిస్తున్నాది. ఒకప్పుడు నలబై సంవత్సరాల వయస్సు పైబడినవారిలో అగుపించే ఈ లక్షణాలు నేడు ఇరవై నుంచి ఇరవైఐదు సంవత్సరాలా యువతలో కూడా అగుపించడం మనం గమనిస్తున్నాం. ప్రతి ఐదుగురిలో ఇద్దరు చక్కెర వ్యాధిభాధితులే అని గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు ప్రధాన కారాణాలు శరీరానికి తగినంత వ్యాయమం ఇవ్వకపోవడం, తీసుకునే ఆహరాలు ప్రధానంగా జంకుఫుడ్సు మరియు సూక్ష్మ పోషకాల లోపభరితం కావడమే! చక్కెరవ్యాధిని సమర్థవంతంగా నియత్రించుకోవడానికి సహజ జీవనశైలీలో సాత్వికాహారాన్ని మాత్రమే తీసుకోవడం ప్రారంభించాలి.

పండ్లలో ఫైబర్, పొటాషీయం, విటమిన్లు, మైక్రో నూట్రీషీయంట్లు, ఎంజైంలు, యాంటియాంక్సిడెంట్సు పుష్కలంగా వుంటాయి. ఉపాహారంగా వారంలో మూడుమార్లు ఆయా సీజన్లలో దొరికే పండ్లని తీసుకోవాలి.
ప్రతిరోజు విధిగా ఆయా సీజన్లలో దొరికే రెండు రకాల పండ్లు తినాలి అనే నియమాన్ని తప్పక పాటించండి.
ఉపాహారంగా వారంలో నాలుగుమార్లు మొలకెత్తిన సజ్జలు, అలసందలు, పెసర, రాగి, శనగ గింజలని తీసుకోవాలి, మొలకెత్తించిన గింజలు సూక్ష్మపోషకాలకి, ఫైబర్లకి మరియు ప్రొటిన్లకి రెట్టింపు నిధులౌతాయి!!
నానబెట్టినవి నాలుగు లేక ఐదు కాజు, బాదం, పిస్తా, పల్లి పప్పులనుకూడా తీసుకోండి. అవి ప్రొటీన్లు, విటమిన్లు, ఓమెగా 3 కొవ్వు సముదాయాలతో ఆరోగ్యమైన ఆహారాలు. ఎక్కువగావాడితే బరువును పెంచేస్తాయి కాబట్టి వీటి వాడకంలో పరిమితులు విదించుకోవాలి.
జామకాయలోని ఫైబర్, విటమిన్ సి లు గ్లూకోజునిల్వలను కంట్రోలు చేస్తాయి. అవకాశం ఉన్నంతకాలం చెక్కుతీయని జామకాయలని రోజూ తీసుకోండి, మరియు చవకగా లభిస్తాయి.
సీతాఫలంలో మాగ్నీషీయం, పోటాషియం, ఐరను, విటమిన్ సి లు మరియు యాంటి డయాబిటిక్ గుణాలు బ్లడ్ షుగరులెవల్సుని నియంత్రిస్తాయి. సీజన్లో స్నాక్ గా ఓ ఫ్రూటు తీసుకోండి
కమలఫలాలో విటమిన్ సి పుష్కలం, షుగర్లు తక్కువగా ఉంటాయి. వీటిని రెగులర్గా తీసుకోండి.
కివి పండ్లని కూడ రెగ్యులర్గా తీసుకొండి ఇందులోని సూక్ష్మపోషకాలు గ్లూకోజు లెవెల్సుని నియంత్రిస్తాయి. ఇవి ఫ్రిడ్జులో ఐదు, ఆరువారాల వరుకు నిల్వఉంటాయి.
పుచ్చకాయ, కర్బుజాలు తక్కువ షుగర్సుని కలిగి ఉంటాయి. వీటిని మీరు వాడుకోవాలి.
ఫైన్ ఆపిలు, ఆపిల్, దానిమ్మ లని కూడా తీసుకొండి ఇందులోని యాంటి ఆక్సిడెంట్సు మీకు ఎంతో అవసరం.
నేరేడు పండ్లలోని ఇలాజిక్ రసాలు పాంక్రియాసుని ఉత్తేజపరుస్తుంది అందుకని వీటిని మీరు తీసుకోవాలి.
తాజా వెజిటబులుసలాడ్సు’ లో ‘కేలోరీల్ని కలిగివుంటాయి అందుకని వీటితోనే ప్రతిసారి భోజనంని ఆరంభించాలి, అది భోజనంలో 40% దాకా వుండాలి. అది మీ టమ్మిని నిండుగావుండేట్లు చేస్తుంది.
ప్రతి రోజు 20 నుంచి 25 గ్రాములు ఉల్లిపాయలని తీసుకోవాలి, అవి ‘లో’ కెలోరీల ఆరోగ్యకరమైన ఆహరం.
గుమ్మడిలో A, C విటమిన్లు, పోటాషియం, ఐరను, ప్రోటీన్లు, యాంటి ఆక్సిడెంట్సు విరివిగా లభిస్తాయి అందుకని అపుడపుడు తగుమొతాదులో గుమ్మడిని నిరభ్యంతరంగా తిసుకోవచ్చు.
అలవాటువుంటే వారంలో ఒకటి, రెండుమార్లు ఓ ఉడకబెట్టినగుడ్డుని తీసుకోవచ్చు, ఆమ్లేటుగా తీసుకోవద్దు.
కాకరకాయజ్యూసుని పరగడపున తీసుకోండి ఇందులోని పెప్టిటైడ్సు గ్లూకోసులెవెల్సుని తగ్గించాడనికి సహయపడుతుంది, లేదా ఇగురుగా భోజనంలో తీసుకోవచ్చు.
ఉసిరికాయలో విటమిన్ C పాంక్రియాసుకి ఉపయొగకారి. ఉసిరి జ్యూసిని ఓ గ్లాసు పరగడుపున తీసుకోండి.
పరగడుపున తాజా కరివేపాకులను ఓ గుప్పెడు తీసుకోండి అది పాంక్రియాసు లోని కణాలని సంరక్షిస్తాయి.
లేత వేపాకు చిగురుని ఓ గుప్పెడు పరగడుపున తీసుకోవడం ద్వారా అది రక్తశుద్దికి తోడ్పడుతుంది.
తాజా లేత మామిడి ఆకులని రాత్రి మంచినీళ్లలొ నానవేయండి. పరగడుపున ఆ నీళ్లు తాగండి. లెదా మామిడాకులను మంచినిటిలో మరగబెట్టి ఆ నీటిని తరచుగా త్రాగండి. అవి ఇన్సులిను స్తాయిని పెంచడానికి సహకరిస్తుంది.
మిరియాలపొడిని వేడి పాలలో కలిపి పడుకొనే ముందు తరచుగా ఓ కప్ తీసుకోండి. రోగనిరోధక వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. గాయాలు త్వరగా తగ్గుతాయి.
గ్రీన్ టీని తరచుగా తీసుకోండి అది పాంక్రియాసుని ఉత్తేజపరుస్తూ ఇన్సులిన్ తయారికి ప్రేరణ అవుతుంది.
జింజర్ టి ఇన్సులిన్ స్తాయిని పరిరక్షిస్తూ, బ్లడ్ సుగర్సుని నియంత్రించడానికి దోహదకారి అవుతుంది.
దాల్చినచెక్క పౌడరుని కొద్దిగా గ్లాసునీళ్లలో కలిపి వారంలో రెండుమార్లు నైటుటైం తీసుకోండి, అది టాక్సిన్సుని శుభ్రపరుస్తూ లివరువ్యవస్థని సక్రమంగా పనిచేయుస్తుంది.
నైటు డిన్నరుని ఆకుకూరలతో రెండు లేక మూడు పుల్కాలతో ముగించాలి, ఆహరాన్ని ప్రతిరోజు ఒకే సమయంలో తీసుకోవడం అభిలషణీయం.
ఓ చెంచ మెంతిపౌడరుని ఓ కప్పు వెన్నతీసిన పాలతో కలిపి వారంలో నాలుగు నుంచి ఐడు సార్లు నైటుటైం తీసుకోండి, అది పాంక్రియాసుని ఉత్తేజపరుస్తుంది.
ఓ గ్లాసు టమొటాజ్యూసు, క్యారెట్ జ్యూసు, లెమనుజ్యూసు, పైన్ ఆపిల్ జ్యూసు, పాపాయజ్యూసులలో ఒక దానిని కాఫీ, టీ లకి ప్రత్యమ్నాయంగా స్నాక్ టైంలో తీసుకోండి. అది పాంక్రియాసుని ఉత్తేజపరుస్తుంది
కాల్సియం బలిష్టమైన బోనువ్యవస్థకి అవసరం అందుకని లస్సి /పెరుగు పై ఆధారపడితే అందులోని కెలొరీలు బరువునికూడా పెంచుతాయి. అందుకే వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. అయితే ప్రత్యమ్నయంగా బట్టరుమిల్కుని రెగ్యులరుగా తీసుకోవచ్చు.
పాలు పౌష్టికాహారం అయినా అందులోని కొవ్వు మీలో కొలోస్ట్రాల్ని పేంచివేస్తుండి, అందుకే వీటి వాడకం రోజుకి ఒకకప్పుని మించరాదు, అవికూడ వెన్నతీసిన పాలు అయితేనే ఆరోగ్యకరం.
మందుకాని మందు అల్కహాలు తీసుకునే అలవాటు ఉంటే వారానికి ఒకటి, రెండుమార్లు ఓ పెగ్గు మించకుండా తీసుకోవచ్చు, అది కొలోస్ట్రాలుని కరగించడానికి సహయపడుతుంది. అయితే ఇందుకోసం కొత్తగా ఈ అలవాటు చేసుకోకండి.
షుగరుకి బదులుగా తేనేని వాడుకోవాలి. అందులోని ఔషదగుణాలు ఎనలేని శ్రేయస్సుని పంచిపెడ్తాయి.
రోజు మంచినీళ్లు మూడు నుంచి నాలుగు లీటర్లు త్రాగలి. వీటి అవశ్యకత వివరాలకి’ జీవధార...జీవనధార’ ఆర్టికలుని క్లిక్ చేయండి http://rvnsetty.blogspot.com/2014/11/blog-post_15.html
యోగసాధన సాంప్రదాయక పద్దతిలో కేవలం ఓ అరగంటపాటు ఎనిమిది నుంచి పది వారాలు ప్రతిరోజు కొనసాగించడంద్వార రోగనిరోధక వ్యవస్త బలోపేతం అవుతుంది, రక్తంలో గ్లూకోజుస్తాయి సాధరణ స్థితికి రావడానికి దోహదం అవుతుంది. మరిన్నివివరాలకి ‘యోగసంజీవణీ’ ఆర్టికలుని క్లిక్ చేయండి http://rvnsetty.blogspot.com/2014/11/07.html
Comments