top of page

బరువుని ఇలా తగ్గించుకోండి..

  • Narayana Setty
  • Nov 6, 2017
  • 2 min read

మనం తీసుకొనే ఆహరం పోషకభరితంగా, వైవిధ్యపూరితంతో, వివక్షణాపూరితంగా వుండాలి. నేటి సమాజం ఇటీవలకాలంలో సాధించిన అబివృద్ది ఫలాలతో ఉన్నత జీవనప్రమణాలతో మన కొనుగోలుశక్తి మెరుగుపడింది, దీనితో బలవర్ధకమైన అహరాలు ఆధిక కేలోరిల ఆహరాలపై మనం మక్కువ పెంచుకున్నాం. పర్యవసానంగా ఒబెసిటి అన్నది మనలో సాధారణమైంది. 50% కి పైగా నేడు ఒబెసిటి భాదితులే అని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఆందోళనకరస్థాయిలో నేడు వేగంగా నగరాలలో విస్తరిస్తున్నాది. నేటియువత ఒబెసిటి అధిగమించడానికి డైటింగుని ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ డైటింగులో నాణ్యత, వైవిద్యభరితం ఉన్నపటికి బరువును వదిలించుకోలేక నిరాశపరులవుతున్నారు. ఇందుకు కారణం వీరుతీసుకొనే కొన్నిరకాల ఆహరపధార్థాలు ఆరోగ్యకరమైనప్పటికి అధికకెలొరీలతో బలవర్ధకాలు కావడమే! అందుకని వాటి వాడకంలో వివక్షత చూపించాల్సిందే!

  • పాలు పౌష్టికాహారం అయినా అందులోని కొవ్వు కొలోస్ట్రాల్ స్థాయిలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే వీటి వాడకం రోజుకి ఒకటి, రెండు కప్పులని మించరాదు, అవికూడ వెన్నతీసిన పాలు అయితేనే ఆరోగ్యకరం.

  • లస్సి /పెరుగు కాల్సియంకి నిధి బలిష్టమైన బోనువ్యవస్థకి అవసరం కాని అందులోని కెలొరీలు బరువునికూడా పెంచు తాయి. అందుకే వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. అయితే ప్రత్యమ్నయంగా బట్టరుమిల్కుని రెగ్యులరుగా తీసుకోవచ్చు.

  • అరటిపండు, మామిడికాయ, ధ్రాక్ష, పనస, సపోటాలలో కేలొరీలు ఎక్కువే అవి బరువుని మరియు చక్కెర నిల్వలను పెంచుతాయి, అందుకే వీటిని ముఖ్యంగా డయాబిటీసు భాదితులు తక్కువ మొతాదులో తీసుకోవాలి.

  • ఫ్రూట్ సలాడుతో ఐసుక్రీముని, డ్రై ఫ్రూట్సుని, షుగర్ని రుచులకోసం కలపకండి, ఆసక్తి ఉంటే తేనెని కలుపుకోండి. తేనేలోని యాంటి బాక్టిరియల్, యాంటి ఆక్సిడెంట్లు మిమ్మలని ఆరోగ్యవంతంగా ఉండడానికి ఉపయొగపడుతాయి.

  • కాజు, బాదం, పిస్తా, పల్లీలు ప్రొటీన్లు, విటమిన్లు, ఓమెగా 3 కొవ్వు సముదాయాలతో ఆరోగ్యమైన ఆహారాలు అయితే కెలరీలకినిధులు, బరువును పెంచుతాయి, అందుకే నానబెట్టిన డ్రైనట్సుని వారంలో ఒకటి, రెండు సార్లు రోజుకి ఐదు, ఆరుకి మించి తీసుకోవద్దు.

  • డ్రై ఫ్రూట్సు ఆరోగ్యకరమైన ఆహరం కాని అవి కేలోరీలనిధులు అందుకని ప్రత్యమ్నాయంగ తాజా పండ్లు తీసుకోవాలి.

  • వెజిటబుల్ సలాడ్సులో బట్టరు, కాజు, బాదం, పిస్తాలని కలపరాదు రుచికోసం కెచప్ ని తీసుకోవద్దు.

  • రెడ్ వైన్ లోని యాంటి ఆక్సిడెంట్లు మేలుని కలుగచేస్తాయి కాని అందులోని కెలొరీలు బరువుని కూడా పెంచుతాయి, అందుకని పరిమితంగా తీసుకోవాలి.

  • గుడ్డునిఉడకబెట్టి తీసుకోవాలి కాని దానిని ఆమ్లేటుగా తీసుకుంటే అందులో వాడే ఆయిల్ ద్వార కొవ్వు పెరుగుతుంది.

  • తేనీరులోని ఫ్లెవరాయిడ్సు మెటబాలిజాన్ని మెరుగుపరుస్తూ మిమ్మలని ఆరొగ్యవంతంగా ఉంచుతూ సత్వరశక్తిని యిస్తాయి కాని పాలు, చక్కెరలు లేకుండా ఒకటి, రెండు కప్పులు ప్రతి రోజు సేవించండి.

  • వెజ్ శాండ్విజ్ /వెజ్ బర్గర్లులతోపాటు రుచికి వాడే కెచ్ అప్, మెయో, బట్టర్లు మీ బరవుని పెంచేస్తాయి.

  • శీతలికరణ ఆహరాలలో ప్రిజర్వేటివుగా వాడే షుగర్తో ఎంప్టీ కెలరీలు అదనంగా జమ అవుతాయి.

  • ఎనెర్జిబార్సు తక్షణ శక్తిదాయకాలు అయితే ఎంప్టి కెలరీలు మీ సొంతం అవుతాయి

  • డార్కు చాక్లేట్లలోని ఫ్లెవరాయిడ్సు ఆరోగ్యకర మైనవే కాని అవి తెచ్చే కెలరీలు మీ బరవుని పెంచేస్తాయి, అందుకని అలవాటు వుంటే వారానికి రెండు, మూడు చాక్లేట్లు తీసుకోండి.

  • సీరియల్సు ఉపాహారానికి అనువైనవే కాని ప్రిజర్వేటిఉగా వాదే సోడియం, షుగర్ లని గురించి ఆలోచించండి. అలవాటు వుంటే వారానికి ఒకటి, రెండుసార్లు తగు మోతాదులోతీసుకోండి.

  • కూకీసు కేలోరీలకి నిధులే అందుకని వాటిని దూరంగా ఉంచాలి.

  • వడియాలు, అప్పడాలతో అదనంగా కెలొరీలు జమ అవుతాయి, బరవుని తగ్గించుకోవాడానికి సహకరించవు. అలవాటు వుంటే వారంలో ఒకసారి మితంగా తీసుకోవాలి.

  • అరటికాయ చిప్సు, ఆలు చిప్సు, మరి ఏ చిప్సు అయినా ఎంప్టి కెలోరీలతో బరవుని పెంచేస్తాయి, అందుకని వీటిని వాడకండి.

  • పూరీలకి నూనేని బాగా వాడుతారు అందులోని ఆధిక కేలోరీలు బరవుని, కొవ్వుని జమచేస్తాయి బదులుగా పుల్కాలు డైలీ తీసుకొవచ్చు.

  • దోశ, ఊతప్పం, మసాలదోశలలో వాడే నెయ్యి/బట్టరు/నూనెలు మీలో అదనపు కెలోరీలు మరియు కొవ్వుని జమ చేస్తాయి, బరువుని మరియు అనారోగ్యాన్ని తీసుకవస్తాయి, అందుకని ప్రత్యమ్నయంగా అవిరితో తయారయ్యే ఇడ్లీలను అల్లం/పుదీన చట్నీలతో తీసుకోండి.

మీరు పాటించే డైటింగ్ జీరో కేలోరీలు, తక్కువ కేలోరీలతో సూక్ష్మపోషక భరితంగా సాత్వికాహరంగానే ఉండి తీరాలి.

వారంలో ఐదు నుంచి ఆరు గంటలు మీకు ఆసక్తికరమైన క్రీడని, వాకింగునిగాని విధిగా చేసి తీరవలసిందే! వివరాలకోసం ఈ ఆర్టికలుని క్లిక్ చేయండి. http://rvnsetty.blogspot.com/2014/12/09.html


 
 
 

Comments


bottom of page