మీ వయస్సుని మించి అగుపిస్తున్నారా?
- Admin
- Nov 6, 2017
- 3 min read

యంగ్’గా కనిపించాలి అన్నది మనందరికి ఇష్టమే! ఆ భావనే మిమ్మల్ని ఏనర్జటిక్’గా, గ్రేట్’గా, ఫవర్ ఫుల్’గా, డైనమిక్’గా వుండేలా చేస్తుంది, అయితే యవ్వనంగా వుండవలిసిన వయస్సులో వయస్సునిమించి ఆగుపిస్తున్నారా?
ఇందుకు ప్రదానంగా పౌష్టికాహరలోపం, హర్మోన్లలొ అసమానతలు, చేసేపనులు గ్రేట్ గా లేవని క్రమేణ వాటిపై పెంచుకున్న అనాసక్తతలు, ఎదుగు బొదుగులేని సంపాధనలు, ఆలోచనాధోరణిలో పరివర్తనలు ఈ పరిస్తితులకి దారి తీస్తాయి. మీ సంబందభాందవ్యాలని డోలాయమానం చేస్తాయి. రూపురేఖలను, హవభావాలను ప్రభావితం చేస్తాయి. నెమ్మదిగా జుట్టుపై ప్రబావాన్ని తీసుకువస్తుంది. జుట్టు గ్రేకలర్’ సంతరించుకోవడం లేదా పలుచబడడాన్ని గమనిస్తారు. కొందరిలో కనులచుట్టూ డార్కుగా వలయాలు రావడం, ముఖంలో గీతలు ప్రస్పుటం కావడం కూదా గమనించవచ్చు. ఫలితంగా థర్టీస్’లోనే వయస్సునిమించిన పెద్దవారిగా కనపడడం మొదలవుతుంది. ఆరోగ్యంగా కనిపించడం కోసం ఇక మిమ్మల్ని ట్రీట్’మెంటుకోసం డాక్టర్ల చుట్టు తిరిగేలా చేస్తూంది.
ఈ భావనలను అధిగమించడానికి, ఆలోచనలలో నవ్యత్వం, ఆచరణలో భిన్నత్వం, స్వీయగౌరవాన్ని పెంపొందించుకొనే దిశలో ఆత్మవిశ్వాసంతో, మానసికదృడత్వాన్ని పెంపొందించే విదంగా ముందడుగు వేయాలి. ఇక మీ నవీనజీవనశైలిలో తీసుకవచ్చే మార్పులను స్వాగతించాలి. ఆ మార్పులు, కూర్పులు, చేర్పులను జీవితశైలిలో ఓ నూతన వరవడిగా గుర్తించాలి.
మొదటిగా మీలోని సంశయాత్మకధోరణిని వదులుకోవడానికి, సానుకూలధోరణితో సంసిద్దులు కావాలి. చాలాసందర్భాలలో అవలి వ్యక్తి భాదపడుతాడు అనే సంశయంతో వాళ్లు మీపై వేసే అభాండాలు/అనుచితమైన కామెంట్సుకి రిప్లై ఇవ్వక మౌనంగా తప్పులేక పోయిన గిల్టీగా ఫీల్ అవుతూ, మానసివేదనని భరిస్తూ వుంటారు. ఇది మీలో ఆత్మన్యూనతని పెంచేస్తుంది, జీవనాన్ని దుర్భరం చేస్తుంది. ఇక మీదట అటువంటి సందర్భాలలో వారు సహోద్యోగినిఅయినా, మిత్రుడుఅయినా, బాస్’అయినా, జీవనభాగస్వామిఅయినా మరేవరైనాసరే మీ తిరస్కారాన్ని “మీరు అలా మాట్లాడడం నాకు నచ్చడంలేదు”, అని సూటిగా వారి మొహంకేసిచూస్తూ, తడబాటు లేకుండా, మృదువుగా చెప్పాలి.
సంశయాత్మక ధోరణిని తిరస్కరించడంతో అది మానసికశృంఖలాలను తెంచుకోవాడానికి మొదటి స్టెప్ అవబోతుంది. క్రమేణా ఎందుకు నచ్చడం లేదో తెలియజేయడం మీరు అలవాటు చేసుకోవాలి. ఇక మీదట ధూషణ / తిరస్కారాలు మీ దరికి చేరడానికి సంకోచిస్తాయి.
నేను ఏమీ చెయ్యలేక పోయాను అని చింతించడం వలన ప్రయోజనం లేదు, ఇప్పుడు ఏమి చెయ్యగలను, నేను రేపు ఏమి చెయ్యాలి అని నిర్ణయాత్మకధోరణిలోఆలోచించడం, ఆచరణలో పెట్టడం మనలని అభివృద్దివైపు నడిపిస్తాయి.
ఈ సానుకూలధోరణి మీలోని అత్మన్యూనతని దూరంచేయడమే గాకుండ మీ ఆత్మవిశ్వాసానికి మెరుగు పెడుతూ మిమ్మలని డైనమిక్’గా, యంగ్’గా వుంచడానికి తొడ్పడుతుంది.
వీరు విధేయత అనే ముసుగులో కాలం గడిపేస్తూ వుంటారు. నిజాయితిగా తమ పని చేసుకపోతారు. అందులో నైపుణ్యం, ప్రావీణ్యతలనికూడా సంపాదిస్తారు.
వీరు తమ ప్రావీణ్యతలకి తగిన గుర్తింపు సకాలంలో అందడంలేదు అని సహోద్యోగులతో వాపోతుంటారు. అయితే ఎంప్లాయర్’ని అడగడానికి సంశయిస్తూవుంటారు. తమముందే చేరిన జూనీయర్సు తమ ప్రఙ్న, పాఠవాలతో అవకాశాలను అంది పుచ్చుకుంటూ ఉద్యోగ పరమపదసోపానపఠంలో నిచ్చేనని వడివడిగా ఏక్కెయడం వీరిని ప్రేక్షకులుగా, తదుపరి నిరాశావాదులుగా మార్చివేస్తుంది. ఇక ఫ్యూచర్ మీద విశ్వాసాన్ని సడలించేస్తారు.
నిజాయితిగా తమ భావనలను అవసరమైన సమయాలలోకూడా వ్యక్తీకరించలేక పోవడం, ప్రశ్నించే నైపుణ్యం కొరవడడమే తమ ప్రావీణ్యతకి గుర్తింపు కలగకపోవడం, అసంతృప్తికి కారణం అని చాలా లేట్’గా గుర్తిస్తారు.
ఆలోచనలను, ఆభిప్రాయాలను అవసరమైన సమయాలలో వ్యక్తీకరించకపోవడం ద్వారా అవకాశాలను అంది పుచ్చుకోలేరు! ఈ బలహీనతను సమర్థవంతంగా అధిగమించవలసిందే!
అయితే కొన్ని సందర్భాలలో వీరి సిన్సియారిటిని, సీనియారిటీని లేటుగా గుర్తింపబడవచ్చు, ప్రమోషన్లు కూడా పొందవచ్చు. నిజాయితిపరుడుగా కూడా మెప్పుపొందవచ్చు.
మాట్లాడడం ఓ కళ. మృధుభాషణ మీ వ్యక్తిత్వానికి మరింత సొగసుని తెస్తుంది.
నలుగురిని అందులో కొందరు అపరిచితులు అయినా సరే చిరునవ్వుతోనే పలకరించండి!
మీ సంభాషణలలో సందర్భానుసారంగా చతురోక్తులని మేళవించండి! అది వ్యక్తులమద్య వుండే దూరాన్ని తగ్గిస్తుంది. సాన్నిహిత్యాన్ని పెంచుతుంది, సంభందాలను బలోపేతం చేస్తుంది.
ఇక మిమ్మల్ని ఏనర్జటిక్ గా వుంచుతుంది. మీ చతురతను అభిలషిస్తారు.
ఆఫీస్ వర్కుల్లో బెరుకుతనానికి స్వస్తి చెప్పేయాలి. మీ ఆలోచనలని/అభిప్రాయాలను సూటిగా, తడబాటులేకుండా కమ్యునికేట్ చేయాలి.
ఎఫెక్టివ్’కమ్యునికెషన్ అలవాటు చేసుకోవాలి. అది అలావాటు అయ్యేంతవరకు మనస్సులో ప్రాక్టీస్’చేయాలి. మీలోని స్పీకింగ్’ ఫోభియాని వదలివేయడం వ్యక్తిత్వనిర్మాణప్రక్రియలో ముందడుగు అవుతుంది.
మీపార్టిసిపెషన్లో సానుకూలధృక్పధం మాత్రమే ప్రతిబించాలి. ఇతరుల అభిప్రాయాలను శ్రద్దగా ఆలకించాలి, అవి మీఆలోచనల కంటే మెరుగైనవి అయితే వాటిని గౌరవించాలి.
మీ ఆలోచనాసరళి నాణ్యమైనది అయితే సహేతుకంగా మీ అభిప్రాయాలకి వివరణ ఇవ్వగలగాలి. అపుడే సాధారణంగా వాటికి విలువ పెరుగుతుంది, ఆమోదం పొందడానికి ఆస్కారం ఎర్పదుతుంది.
ఇతరుల అభిప్రాయాలతో ఏకాభిప్రాయం కుదరకపొతే ఆర్గ్యుమెంట్ చేయకండి, అయితే డిష్కసన్ మాత్రమే చేయాలి. డిష్కసన్ మాత్రమే స్నెహపూర్వక వాతవరణాంలో అవలివారిని ఇంప్రెస్ చేయడానికి అవకాశాన్ని కలుగచేస్తుంది.
మీకు నచ్చని ఇతరుల అభిప్రాయలను సున్నితంగా తిరస్కరించాలి అది అవలి వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఏ మాత్రం కించపరిచేవిదంగా ఉండరాదు.
మీ అభిప్రాయాలు ఆమోదం పొందినా/పొందకపోయినా ఈ సానుకూలధృక్పదం స్వీయగౌరవానికి వన్నె తెస్తుంది. 'విన్ విన్ ' వాతవరణాం ఇద్దరిలోని అహన్ని తృప్తి పరుస్తుంది అటువంటి వాతావరణం మీలోని అంతర్లీన శక్తుల ఉద్దీపణకి ప్రేరణ అవుతుంది.
జీవనయానం క్రియాశీల ధోరణిలో కొనసాగించాలి. వృత్తిరీత్యా, వ్యాపారపరంగా నీకు కావలసింది నీవే సంపాదిం చుకోవాలి!
స్వశక్తితో సంపాదించే ప్రతిభ, సంపాధనలకే ఈ సొసైటీలో గుర్తింపు! వారసత్వంగా వచ్చే ఆస్తిపాస్తులు నీ విలువను పెంచవు!!
అవకాశాలను వెతుక్కూంటూ నీవు వెళ్లాల్సిందే, అవి మీముంగిటకి రావు, వచ్చిన అవకాశాలను సడలని విశ్వాసంతో, స్వయంకృషి, మేధస్సులని మేళవించి సమర్థవంతంగా వినియోగించుకోవాలి. అవసరమైతే ఇతరుల సహయం తప్పకతీసుకోవాల్సిందే! రండి కలిసి సాగుదాం, సాధిస్తాం అన్న ధోరణిలో నడుద్దాం!!
లక్ష్యం అనేది క్లియర్’గా వుండితీరాలి. ఆ లక్ష్యం మీశక్తిని, వయస్సుని, ప్రతిభని ధృష్టిలో వుంచుకొని మీపరిమితులను గుర్తేరిగి నిర్దేశించుకోవాలి! ఆలక్ష్యసాధనని నిర్ణయాత్మక ధోరణిలొ కొనసా గించాలి.
చేజారిన అవకాశం, చేజార్చుకున్న కాలం తిరిగిరావు! అందుకనే కావలసిన నైపుణ్యం, మేధస్సులని పెంపొందించుకుంటూ అవకాశాలను అందుకోవాలి. ఇందుకు దృడచిత్తం, ఆత్మవిశ్వాసంలనే పెట్టుబడులుగా ముందదుగు వేయాలి. అవి వ్యక్తిత్వనిర్మాణంలో కీలకపాత్రని పోషిస్తూ కలలసాఫల్యానికి అంతర్గత ప్రేరేపణగా నడిపిస్తాయి, ఇక నీ లక్ష్యాన్ని సాధించడానికి మార్గం సుగమం అవుతుంది.
మీరు ఏ రంగంలోవున్నా, వృత్తిలోవున్నా రాణించాలి అంటే మీ ప్రతిభ, నైపుణ్యాలని నిరంతరం మెరుగుపరుచుకుంటూ వుండవలసిందే!! అలసత్వం దరిచేయకుండా చూసుకోవల్సిందే!! లేదంటే ఈ పోటీ వాతవరణంలో ఇక ఏక్కడవేసిన గొంగలి చందంలా వెనుకబడిపోయే ప్రమాదం పొంచివుంటుంది!!
భవిష్యత్తుని గురించి కలలు గనవలసిందే... వాటిని సార్థకత చేసుకోవాడానికి అవసరమైన నైపుణ్యం, తెగువ, ధైర్యం, సాహసాలని ప్రదర్సించి తీరవలసిందే!!
ఈ భవిష్య ప్రణాళికలు మిమ్మల్ని సదా ప్రేరేపిస్తూ ఉండేట్లు దశ, దిశలని మలచుకోవాలి. అలాగే నీ ప్రతిభ, వ్యుత్పత్తుల సామర్ధ్యాన్ని అతిగా భావించరాదు. అది ప్రత్యర్దులసామర్ధ్యాన్ని అంచనావేయడంలో తక్కువచేసి చూపిస్తుంది. నీ ఎదుగుదలకి బారికేడర్ అవుతుంది.
మనం తీసుకునే ఆహరం పోషకవిలువలు కలిగిన పౌష్టికాహరం అయితీరాలి, అది శరీరాఅవసరాల మేరకు తగినంత పరిమాణాలలో తీసుకోవాలి, అవి మేలైన నాణ్యతని కలిగిన సాత్విక ఆహరాలుగా వుండి తీరాలి.
సాత్వికాహరారం ఔషధంలా వ్యాధినిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తుంది, మనల్ని సదా ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది.
మీరు రోజు ‘జీరో’ కెలోరీలు, ‘లో’ కెలోరీల ఆహారాన్ని ఆసక్తి మేరకు తీసుకోవచ్చు!!
ఇవి మిమ్మల్ని ఒబెసిటిబారిన పడకుండా, స్లింగా, ఆరోగ్యభరితంగా వుంచుతాయి.
హర్మోన్ల అసమతుల్యతల ద్వారా వచ్చే మూడ్’స్వింగ్సు నుంచి పరిరక్షీంచేదిశలో కీలకపాత్ర పోషిస్తాయి.
ఇవి మనువు, తనువులను కల్మషాలభారి నుంచి రీచార్జి చేస్తాయి.
ఎంప్టీ కెలొరీల ద్వార ఆరోగ్య ప్రధానమైన సూక్ష్మపోషకాలు శూన్యం అటువంటి ఫుడ్స్’ని అవాయిడ్ చేయడం శ్రేయస్కరం.
ఫుడ్ సెలెక్షన్’లో మీ విఙ్నత చూపించాలి. సమగ్ర వివరాలకు ఈ లింకుని క్లిక్ చేయండి http://rvnsetty.blogspot.com /2014/11/blog-post_11.html
Comments