యోగముద్ర
- Narayana Setty
- Nov 6, 2017
- 2 min read
యోగముద్ర
పంచభూతాల సమ్మేళనాలు అయిన గాలి, నీరు, అగ్ని, పృధ్వీ, ఆకాశాలు సృష్టికి లయకారకాలు, అవి పకృతి ప్రసాదాలు. సకల జీవరాశి ఉనికి, మనుగడలలో వీటి పాత్ర అపారం.
ఆధునిక సమాజంలో పారీశ్రామీకీకరణ పేరిట పరిశ్రమలు వెలువరించే వ్యర్ధాలతో, రసయనాలతో మనచుట్టువుండే వాతవరణం, మనం పీల్చుకొనే గాలి, తాగేనీరు కలుషితం అవుతున్నాయి. వీటి నియంత్రీకరణ అమలులో పరిశ్రమల యజమాన్యంలో లోపించిన నిబద్దత, ప్రభుత్వాల అలసత్వంతో ఈ పర్యావరణ పరిరక్షణ రోజురొజుకి సంక్లిష్టం అవుతున్నాది, పకృతిని చిగురుటాకులా కంపింపచేస్తూన్నాయి. ఈ విషఫలాలు మన సామజికవ్యవస్థకి వదలని జాడ్యంలా నిరంతరం వేధనికి గురిచేస్తున్నాయి. అవి మన ప్రశాంత జీవనవిధానాలకి, జీవితవిధానాలకి తీవ్రప్రతికూలంగా మారయి.
‘యోగముద్ర’ అంటే ఏమిటి?
యోగముద్రలని వాడుకలో ‘ముద్ర’, ‘హస్తముద్ర’లుగా వ్యవహరించడం పరిపాటి.
ఈ ముద్రలు నాట్యశాస్త్రంలో భావవ్యక్తీకరణాలలో ప్రధాన భూమికని పోషించడం మనందరికి తెలిసిన విషయమే.
హైందవ సాంప్రదాయాల్లో వివిధ కర్మకాండలలో ఇవి కీలక పాత్రని వహిస్తాయి.
చేతివేళ్లు పంచభుతాలకి ప్రతీక. చిటికెనవేలు జలానికి, వుంగరపువేలు పృధ్వీకి, మధ్యవేలు ఆకాశానికి, చూపుడువేలు వాయుకి, బొటనవేలు అగ్నికిప్రతీకలు. యోగముద్రల ద్వార చేతివేళ్లు శక్తికేంద్రకాలుగా తనువు, మనువులను తేజోభరితం చేస్తాయి.
ఈ కలుషిత పర్యావరణం నుంచి స్వీయరక్షణగా యోగశాస్త్ర అందించిన అపురూప వారసత్వ సంపదగా యోగ ముద్రలని భావించి ఆచరించడం ద్వార మానశిక, శారీరక రుగ్మతలను సమర్థవంతంగా అధిగమించడానికి ఓ చక్కటివేదిక అవుతుంది.
యోగముద్రల ప్రయోజనాలు
ఈ ప్రాచీన యోగముద్రలు ఆధునిక జీవితసమస్యలకు పరిష్కారాలని చూపిస్తాయి. ఓ ముద్ర మానశికవికాసాన్ని పెంపొందిస్తే, ఇంకొకటి ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణితంచెస్తే, మరొకటి వ్యాదినిరోధకవ్యవస్థని పరిరక్షించెస్తే ఇలా ప్రతిముద్ర ప్రత్యేకత దానిదే! వీటిని ఆచరించడం తేలిక. ఇవి ఎటువంటి దుష్ప్రబావాలులేని ప్రత్యామ్నాయ వైద్యవిధానంగా గుర్తించండి. ఆత్మవిశ్వాసం, నమ్మకంతోకూడిన ఆచరణే సత్వరఫలితాలకి నాంది అవుతుంది.
ఇక ప్రధానమైన హస్తముద్రలని తెలుసుకుందాం.

జ్ఞానముద్ర:
బొటనవేలు చివరను చూపుడువేలు చివరతోకలిపివుంచాలి. మిగిలిన వేళ్లనూ ఒకదానితో మరిఒకటితాకుతూ నిటారుగా వుంచాలి.
మెడిటేషన్’తో ఈముద్రని ప్రాక్టీసు చేయడంద్వార నాడీమండల వ్యవస్థని సాంత్వన పరుస్తూ మనస్సులోని అతృతలు, ఆందోళనలకి చెక్ పెట్టదానికి సహయకారి అవుతుంది.
బ్రెయిన్ లోని న్యూరాన్ వ్యవస్థని వుత్తేజపరచడం ద్వార మానశిక ప్రశాంతతకి ఆలంబన అవుతుంది.
జ్ఞాపకశక్తి మరియు ఏకగ్రతలని సాధించడానికి ఉపయోగకారి.

వాయు ముద్ర:
చూపుడువేలు కొనను రెండోకనుపువద్ద మడచి, దాన్ని బొటనవేలు మొదట్లో వుంచాలి.
ఈ ముద్రసాధనతో ఏండోక్లీన్ గ్లాండ్సు సక్రమంగా తన విధులను నిర్వర్తించడానికి దోహదపడుతుంది ఫలితంగా హర్మోన్ల సమతుల్యతలని సాధించడానికి సహయకారి అవుతుంది.
శరీరంలోని ప్రధానమైన వాయుసంభందిత అసమానతలని అధిగమించడంద్వార మానశిక స్వస్తతకి ఆలంబన అవుతుంది.
చర్మ సంబందిత రుగ్మతలని దూరంచేస్తూ చర్మసౌంధర్యాన్ని ఇనుమడింపచేస్తుంది.

పృధ్వీముద్ర:
ఉంగరంవేలు, బొటనవేలు చివరలను కలిపివుంచి మిగతా మూడువేళ్లను సాచి వుంచాలి.
శారీరక బలహీనతలను దూరంగా వుంచడానికి సహయపడుతుంది.
జుట్టు రాలడం, తెల్లబడడం, చర్మం పొడిబారడం, ఎసిడిటి, కామెర్లు, అల్సర్లు లాంటి రుగ్మతలను అదుపులోవుంచడానికి సహయకారి

జలముద్ర:
చిటికెనివేలు కొనను బొటనవేలు కొనలను కలిపి వుంచాలి
చర్మాన్ని కాంతివంతంగాను, గొంతు తడారి పోకుండాను వుంచుతుంది.
హర్మోన్లఅసమానతలకి, స్త్రీలలో ఋతుసమస్యలకి, సాధారణ జలుబు, రొంపలనుంచి
సత్వరపరిష్కారానికి ఇది ఉపయుక్తం.

ఆకాశముద్ర
మధ్యవేలు చివర, బొటనవేలు చివరలను తాకించి మిగతా మూడూవేళ్లని సాచి వుంచాలి.
ప్రతికూలభావోద్వేగాల నియంత్రణకి, సానుకూల భావోద్వేగాలకి ప్రేరణ అవుతుంది.
మానశిక ఒత్తిడులను దూరంచేసుకోవాడానికి, మానశిక ప్రశాంతతని సాధించడానికి
రెగ్యులర్గా ప్రాక్టీసుచేయాలి.

హృదయముద్ర
ఉంగరపువేలు చివరను బొటనువేలు మొదట్లోకి తీసుకోవాలి. చూపుడువేలు, నడుమవేలు కొనలను బొటనవేలు కొనతో కలిపి వుంచాలి. చిటికెనవేలుని సాచి వుంచాలి.
గుండె సంబందిత వ్యాధులని దూరంగా వుంచడానికి ఆరోగ్యవంతమైన హృదయానికి రక్షణగా తోడ్పడుతుంది.

అగ్నిముద్ర
ఉంగరపువేలుని మొదటికణుపువద్ద మడచి, దానికొనను బొటనవేలు మొదట్లో ఆనించాలి.
రక్తపోటు సమస్యలున్నవారికి ఇది ఉపయొగకారి
స్తూలకాయాన్ని నియంత్రించుకోవడానికి ఇది సహయకారి.

శూన్యముద్ర
మద్యవేలును మడచివుంచి దాని చివరను బొటనవేలు మొదట్లో ఆనించాలి
చెవినొప్పి, నత్తి తదితర సమస్యలున్నవారికి మంచి ఫలితాలొస్తాయి.
ముద్రసాధనలో ఈ సూచనలని పాటించండి
మీ అవసరాన్ని దృష్టిలో వుంచుకొని ప్రత్యేకంగా సంబందిత యోగముద్రలని ప్రాక్టీసుచేయాలి.
వజ్రాసనం, పద్మాసనం, సుఖాసనంలలో మీ కిష్టమైన ఆసనస్థితిలో ఈ హస్త ముద్రలని ప్రాక్టీసుచేయాలి.
చేతివేళ్లని సున్నితంగా నొక్కాలి అనవసర వత్తిడిని తీసుకోరాదు.
మెరుగైన ఫలితాల కోసం 10 నుంచి 12 వారాలు సంబందిత ముద్రని సాధనచేయాలి.
ప్రాణయామ, మెడిటేషన్, ధ్యానంలలో మీకు ఆసక్తికరమైన స్థితిలో శ్వాసపైద్యాసతో యోగముద్రని ప్రాక్టీసుచేయాలి.
వీటిసాధనకి ప్రత్యేకించి ఓ టైం అంటులేదు ఎపుడైన సాధన చేయవచ్చు కాని ఉషోదయవేళ అభిలషణీయం.
ప్రత్యేకించి ఆహరనియమాలు లేనప్పటికి కేవలం సాత్వికాహారాలని తీసుకోవడంద్వార మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది.
నిపుణులైన యోగాచార్యుల సమక్షంలో యోగముద్రలని నేర్చుకోవాలి.
ఇక సిగరెట్, డ్రింకుల అలవాట్లకి స్వస్తి చెప్పేయాల్సిందే.
Kommentare