లక్ష్యసాధనలో అవరోధాలను ఇలా అధిగమించండి....
- Admin
- Nov 6, 2017
- 3 min read

బిజినెస్’లో లాసెస్, ఆరోగ్య సమస్యలు, ఆఫీసు లో వర్కుఫ్రెషర్, వృత్తిలో ఎదుగుదల లేకపోవడం, ఎక్జాంస్ కాంపిటీషన్, లవ్’ఫెయిల్, వైవాహికజీవితంలో అపశృతులు, వివాహేతర సంభందాలు, కుటుంభ కలహాలు, భార్యాభర్తల్లో కొరవడిన అన్యోనతలు, తరచు కీచులాటలు, ఆర్ధిక సమస్యలు, ఇలా ఎన్నెన్నో కారణాలు మన ఆలోచనల సరళిని దీర్ఘకాలంలో ప్రభావితం చేస్తాయి!! అది మీలోని సృజనాత్మకత, భావుకతలపై నెమ్మది నెమ్మదిగా తమ ప్రతికూల ప్రభావాలని చూపెడతాయి. అది మీ ప్రవృత్తిపై తీరని ప్రభావాన్ని తీసుకువస్తూంది… తరచుగా అసహనం, విసుగు, కోపం, ఆవేశాలకి లోనవుతుంటారు… పర్యవసనంగా ఆలోచనలలో, తీసుకొనే నిర్ణయాలలో తరచుగా వివక్షణ, విచక్షణ, విజ్ఞతలు లోపిస్తాయి...
మితిమీరిన కోపావేశాలు, అలజడులప్రకంపణలు మానసిక వ్యధలకి, ఒక్కోసారి తీవ్రమైన తలనొప్పులకి, ప్రతిసారి బ్లడ్ ప్రెషర్ లెవెల్సు పెరగడానికి కారణం అవుతాయి. అది వ్యాధినిరొధక వ్యవస్థని, బలహీనం చేస్తుంది. తరచుగా జలుబు, రొంప, మలబద్దకంలకి గురిచేస్తుంది. ఇది 90% వ్యాధులకు మూలం అవుతుంది, మొండి వ్యాదులకి చేయూత అవుతుంది.
అలాగని ఈ కోపావేశాలను, మదిలోని అలజడులను నీలో నీవే అదుపు చేసుకుంటే అది మనస్సుపై ప్రతికూల ప్రభావాన్ని తీసుకువస్తుంది.
ఇది జీర్ణవ్యవస్థని, అంతర్గత వ్యవస్థలని బలహీన పరుస్తుంది. అల్సర్, కండరాల వాపులకి గురిచేస్తుంది.
ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ జీవనపయనంలో సగభాగం నిద్రకి, మిగిలిన సగభాగంలో ఓ అర్ధ భాగం కోపంతోనే నేస్తం సాగిస్తున్నారు అని గణాంకాలు చెబుతున్నాయి.
పంచుకుంటే తగ్గేది భాధ! అందుకని కోపావేశాల మూలాలను గుర్తించాలి. మదిలోని ఆలోచనలను, అలజడులను కలిగించే అంశాలను కేవలం మనస్సుకి దగ్గరైన సన్నిహితులతోనే పంచుకోవాలి ‘షేర్ అండ్ కేర్’ మీకు తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తూ, మనస్సుని తేలిక చేస్తుంది.
ఈ కోపావేశాల ప్రదర్శనలో వివక్షణ, విజ్ఞతని పెంపొదించుకోవాలి!! కోపాన్ని, ఆవేశాలను ‘పాజిటివ్ ఎనెర్జీస్’ గా మలచుకోగలిగే సామర్ధ్యాన్ని మీరు పెంపొదించుకుంటే ఇక సాధించబోయే ఫలితాలు మిమ్మలని ఈ పోటి ప్రపంచంలో ప్రత్యేకంగా నిలపెడ్తాయి.
మీ ఆక్షేపణలు, అభిప్రాయాలను అవసరమైన సందర్బాలలో మృదుభాషణలోతప్పక తెలియజేయాలి, అప్పుడే అనుకున్నది సాధించడానికి వీలు అవుతుంది, అలా చేయకపొతే ముభావిగా మిగిలి పోయె ప్రమాదం ఉంది.
ఒకేసారి మల్టీ టాస్కులు తీసుకోవడం స్ట్రేస్సుని పెంచడానికి కారణం అవ్యుతుంది. అందుకే టాస్కులని ప్రయారిటీ పరంగా విభజించుకోవాలి. ఇక ఒక్కోకటిగా టాస్కులని హ్యండిల్ చేయాలి.
ఈ సామర్ధ్యాన్ని సొంతం చేసుకోవడానికి మీ లోని అంతర్గత శక్తులని ప్రేరేపించాలి, వాటిని లక్ష్యదిశగా కేంద్రీకరంచి ముండడుగు వేయాలి. ఆండుకోసం సానుకూల భావనలతో చూడడం మొదలెట్టాలి. ఈ సానుకుల ధోరణి మీ ఇంటి నుంచే ఆరంభించాలి.
పంచుకుంటే పెరిగేది ప్రేమ! అందుకనే జీవిత భాగస్వామి మీ పై చూపించే ఆధరణ, ఆప్యాయాత, అనురాగం, ఇష్టాలని గుర్తించండి, ప్రశంసించండి, మోటివేట్ చేయండి, ఆమెకి సదా స్నెహ హస్తం ఇవ్వండి, అయితే అదే పనిగా పొగడకండి. ఫ్రశంశ మనస్సులోంచి వస్తే, పొగడ్త పెదాలనుంచి మాత్రమే వస్తుంది. మీరు మీ పిల్లలని రోజు హగ్ చేసుకొండి, నవ్వుతూ పలకరించండి. సరదాగా వారితో గడపండి. చిరునవ్వులతో ఆఫీస్ నుంచి వచ్చిన మీవారిని మదిలోనికి, ఇంటిలోనికి ఆహ్వానించాలి, మృదువుగా ప్రేమతో పలకరించాలి. కాఫీ/ టీ సర్వు చేయండి, సేద తీరనీయండి. ఆ పై మీకిష్టమైన టాపిక్ షేర్ చేసుకోండి. వారాంతాలలో ఫ్యామిలితో మూవీ/పార్కు/షాపింగ్/డిన్నర్’లకి వెళ్లండి. ఈ సానుకూల మార్పులు భార్యభర్తల మధ్య వుండే అపోహలని దూరంచేస్తూ, కీచులాటలకి పుల్ స్టాప్ అవుతుంది. ఇక మీ దాంపత్యజీవితం నందనవనంగా మారడాన్ని గమనిస్తారు!!
మీరూ బాగ ఇష్టపడె బుక్ అది ఓ నవల కాని, సుడోకొ పజిల్సు కాని, సైంటిఫిక్ ఫిక్సన్ కాని, అడ్వెంచర్ థ్రిల్లర్ కాని మీ బ్యాగ్ లో వుంచుకోవాలి, తీరిక సమయాలలో, జర్నీలలో అది కాలక్షేపంగా మిమ్మల్ని రొటిన్ నుంచి బిజీ చేస్తుంది. మష్తిష్కంకి పదును పెడుతుంది.
మనం తరచుగా టైం దొరకడం లేదు అనే మాట వింటుంటాము, అయితే మీరు మీకు తెలీకుండానే గంటలతరబడి టివీచూడడం లేదా ఇంటెర్ నెట్ బ్రౌజ్ చేయడం అలవాటు చేసుకొనివుంటే ఆ వ్యసనాన్ని తగ్గించుకొని అందులో కొద్దిపాటి టైం డైలీ ఫ్యామిలి మెంబర్సుతో సరదాగా గడపండి. చిన్నారుల ప్రోగ్రస్ చదువుల్లో, ఆటపాటల్లో గమనించండి, వారికి ప్రేమ, ఆప్యాయతలని పంచండి. వారి చిరునవ్వులు మీ చికాకులను తొలిగిస్తాయి.
పంచుకుంటే పెరిగేది, తరగనిది జ్ఞాపకాలా తీపి గుర్తులు! అందుకని చాలాకాలం నుంచి టచ్’లో లేని మీ చిరకాల బాల్యమిత్రులకి సర్ప్రైజ్ చేస్తూ వారితో ఫోన్ లో మీ చిన్ననాటి మధూరానుభూతులను షేరు చేసుకోండి. వారికి స్నేహమాధుర్యాన్ని పంచండి. అది మీకు మంచి రిలీఫ్’ని ఇస్తూ ప్రొయాక్టివ్’గా వుంచుతుంది.
నిద్రకి ముందు టీవి ప్రోగ్రాంలు చూడకపోవడం మీ సుఖనిద్రని సుగమం చేస్తుంది! సాదారణంగాఈ టైంలో ప్రసారితమయ్యే క్రైం స్టోరీస్, హారర్ ఎపిసోడ్సు, ఈవిల్ స్టోరీస్, టెర్రర్ స్టోరీస్, సస్పెన్సు థ్రిల్లర్సు, మిడ్ నైట్ మసాలాల వంటి ప్రోగ్రాంలు అవి మదిలో కలిగించే ఆలోచనా ప్రకంపణలను దూరం చేసేస్తుంది. కొన్ని రోజుల్లోనే చక్కటి నిద్రానుభూతులను మీ సొంతం చేసుకుంటారు.
మనస్సు, తనువు, మష్తిష్కంలను సంధానిస్తూ పాజిటివ్ ఎనెర్జిస్ లకి ఆలంబన అవుతూ మీలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తూ, ఆత్మ న్యూనతలను దూరంచేసే హైందవ సంప్రదాయక ప్రదాయణి ‘యోగ’ని ఆభ్యాసం చేయండి. ఇందుకు మీరు రాత్రి పది గంటలకి ముందుగానే ‘యోగనిద్ర’ ద్వార సుఖ నిద్రని ఆహ్వానించాలి మరియు ఉదయం ఓ అరగంట ముందుగా నిద్రనుంచి లేవాలి. ఇక ఆ సమయాన్ని యొగసాధన ప్రత్యేకించి ‘మెడిటేషన్’ కి కేటాయించాలి. అందుకే యొగ క్లాసులకి తప్పక సైన్ చేయండి.
Comments