top of page

వైవిధ్యభరిత జీవన సంధ్య

  • Narayana Setty
  • Dec 2, 2017
  • 3 min read

మనలో ప్రతిఒక్కరు ఏదోఒకరోజు తాము చేసే వృత్తుల నుంచి, పనుల నుంచి వృత్తివిరమణ తీసుకోవల్సిందే...! అయితే ఉద్యోగస్తులకు ఆ రోజు అనేది ముందుగానే తెలిసిందే.. కాని ఇతర వృత్తులు, వ్యాపాకాలు సాగించేవారు తమ ఆరోగ్యం సహకరించినంతవరకు ఆయా వృత్తులలో, వ్యాపాకాలని కొనసాగిస్తూంటారు.. కాని వీరిలో చాలామంది ఈ వృత్తివిరమణదశ తరువాత ఏమి చేయాలి, ఏలా వుండాలి అనే విషయంలో దశ, దిశలలో స్పష్టత లోపించి అయోమయానికి గురవుతూ జీవనవిధానాన్ని కొనసాగిస్తూ వుండడాన్ని మనం తరచుగా గమనిస్తూవుంటాం..

వయస్సుతో నిమ్మిత్తం లేకుండా ఈ జీవితాన్ని వైవిధ్యభరితగా కొనసాగిస్తే, జీవనమాధుర్యాలను తనివితీరా అనుభవిస్తూ జీవన సంధ్యని ఆస్వాదించడానికి మీ నవజీవనశైలికి ఇలా శ్రీకారం చుట్టండి.

మనం ఇన్నాళ్లు ఇతరులకోసం సాగించిన జీవనం నుంచి మనకోసమే మనజీవనం అనే ధృక్పధంతో నూతన అధ్యాయనాన్ని ఆరంభించాలి..

  • ఒడిదుడుకుల జీవనగమనాన్ని సరళతరం చేసేవిధంగా మీ ఆర్ధికవనరులను గణించండి. మీ బాంకుఖాతాలని మీరే చూసూకోవాలి. మీ బాంకుడిపాజిట్లని, బాంకుఖాతలని మీ పేరే వుంచుకోవాలి, కాని నామినేషన్ మీ వారసులపేర తప్పక నమోదుచేయించాలి. మీ ఆర్ధికలావాదేవిలని మీరే స్వయంగా నిర్వర్తించుకోవాలి. ఆర్ధికవ్యవహరాలు నిక్కచ్చిగా, నిబద్ధతతో, పారదర్సకంగా వుండేట్లూగా చూసుకోవాలి. మీవిలువైన సంపదని ఆత్యాశకివెళ్లి తీవ్రఒడిదుడుకులకు ఆలంబనగా వుండే షేర్ మార్కెట్లో మదుపుచేయకండి. మీ బాంకులాకర్లు, ఇన్సురెన్సు, అన్యూటిపాలసీల వివరాలు మీ వారసులకు తప్పక తెలియచేయాలి. మీ సంపదలని మీ వారసులకు చెందేవిదంగా వీలునామ తయారుచేయించాలి.

  • ఆరోగ్యకర ఆయుఃప్రామాణాం అనేది మీ జీవనశైలితో అనుసంధానమై వుంటుంది. ఆరోగ్యకర ఆయుఃప్రామాణం అనేది ప్రస్తుత పరిస్తితి నుంచి అనారోగ్యం బారినపడేందుకు మద్యవుండే కాలంగా ఆ తరువాతకాలాన్ని అనారోగ్య ఆయుఃప్రామాణాంగా గణన చేసుకోవాలి.

  • రోజు వ్యాయామం చేసేవారు, వారి నడకనిపెంచేకొద్ది వారి ఆరోగ్యకర ఆయుఃప్రామాణం పెరుగుతాయని పలు అద్యయనాలు తెలియజేస్తున్నాయి. గంటకి 5 కిలో మీటర్ల వేగంతో నడిచేవారి ఆయుఃప్రమాణం మరో పది సంవత్సరాలు పెరుగుతాయి. వేగంగా నడవడంద్వారా శరీరంలోని అన్ని అవయవాలు చురుకైన పనితీరుని కలిగి వుండే కారణంగా జీవితకాలం పెరుగుతుంది. 65 సంవత్సరాలు పైబడినవారు తరచు తమ నడకవేగాన్ని పరిక్షించుకుంటూవుండాలి.

  • కలుషితమైన గాలిని పీల్చడంద్వార మానసిక సమస్యలు వస్తాయి అని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి గాలి కాలుష్యంద్వార లంగ్సు, గుండె, చర్మానికి వ్యాధులు వస్తాయి, దానివల్ల మానసిక ఆరోగ్యంకూడా దెబ్బతింటుంది. అందుకని గాలికాలుష్యంబారిన పడకుండా మీ నడకని పచ్చనిచెట్లు వుండే ఉద్యానవనంలో/పార్కులలో ప్రతిరోజు కనిసం ఓ గంట కొనసాగించాలి.

  • మానసికానందానికి యోగని నిత్యసాధన చేయాలి. యోగసాధన మనువు, తనువునుని అనుసంధానం చేయడంద్వార సానుకూల భావోద్వేగాలకి దరిచేస్తూ మానసికానందానికి దగ్గరచేస్తూంది.

  • మానసికప్రశాంతతకి ప్రాణమాయని సాధన చేయాలి. మెదడులోని ప్రతికూల భావోద్వేగాల కేంద్రకాలపై అదుపును తీసుకరావడంద్వార ప్రాణయామ మనస్సుకి ప్రశాంతతని తెస్తుంది.

  • నీకు ఇతరులు చేసిన తప్పులను మన్నించే క్షమాగుణాన్ని, నీవు ఇతరులకు చేసిన తప్పులని ఒప్పుకొనే మనోధైర్యాన్ని ప్రసాదించమని మీ ఇష్టదైవాన్ని నిత్యం ప్రార్ధించండి. నిత్యప్రార్ధన మిమ్మల్ని మానసికంగా ధృడవంతంగా వుంచుతూ క్షమాగుణ మాధుర్యఫలాలని సొంతం చేస్తూంది.

  • హితులు, సన్నిహితులు, మిత్రులతో విడిపోయిన స్నేహభందాలను రీకనెక్టు చేసుకోండి. వారితో మీ సాన్నిహిత్యాన్ని పునరుద్దరించుకోండి. దగ్గరగా వున్నవారిని కలవండి, దూరంగా వున్నవారిని తరచు పోనులో పలకరించండి. చిన్ననాటి మధురస్మృతూల్ను మననం చేసుకుంటు ఆనందగా వుండేలా మీ స్నేహ హస్తాన్ని అందించండి. సృష్టిలో అముల్యమైన స్నేహమాధుర్యాలని ఆస్వాదిస్తూ పులకితులవండి. ఇది మీలోని నైరాశ్యాన్ని దూరంచేస్తూ ఒంటరితనాన్ని దరిచేయనియకుండా వుంచుతుంది.

  • దూరమైన భంధాలు, అనుభంధాలు, భాంధవ్యాలని రీచార్జు చేసుకోండి. వారిలోని తప్పులని వెదకడాన్ని మాని, వారిలోని సుగుణాలని, మంచితనాలని గుర్తించండి, అభినందించండి. చిరునగవుతో పలకరించండి. భాంధవ్య పునరుద్దరణలు ఎనలేని మానసిక సంతోషాలకి మూలాలు అవుతాయి.

  • మీ అభిరుచులకి అనుగుణమైన ప్రదేశాలకి విహారయాత్రలకి హితులు, సన్నిహితులతో సరదాగా వేళ్తూ ఎంజాయ్ చేయండి. అలాచేస్తే మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా వూంటారు.

  • ఒంటరిగా ఆలోచించే దాని కన్నా సంగీతం, సాహిత్యం, నాట్యంలాంటి ఇష్టమైన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం లేదా తిలకించడం చేయడం వల్ల మానసిక ఒత్తిడికి దూరమవుతారు.

  • తరుచుగా గుడులకి, గోపురాలకి, ప్రార్ధనామందిరాలకి కుటుంభసభ్యులతో కలసి వెళ్తుండండి. ఆలయ ఆధ్యాత్మిక ప్రశాంతతని మనసార ఆస్వాదించండి. అక్కడి సేవాకార్యక్రమాలలో భాగస్వాములుగా మారండి.

  • తీరికసమయాలని మీ ఆసక్తి మేరకు స్వచ్చభారత్ లాంటి సమాజసేవా కార్యక్రమాలకి కేటాయించండి. అవి మీ ఆలోచనలకి పదునుపెడ్తూ మెదడును చురుకుగా వుంచడానికి దోహదమవుతాయి.

  • ఇంటిపెరట్లో ఔషధమొక్కలు పెంచుతూ గార్డెనింగుని హాబిగా చేసుకోండి. మొక్కలను, కుండీలను చక్కగా సర్డండి..వాటికి నీరు పోయండి. అలా మీరు ఓ గంట సమయాన్ని ఆ మొక్కలతో గడపండి. అది మిమ్మల్ని ఎనెర్జిటిక్ గా వుంచుతుండి.

  • చెస్, సుడొకు పజిల్సు, కంప్యూటర్ గేంలు, గల్లనుడికట్టులాంటివి మెదడుకు పదునుపెడ్తూ మిమ్మల్ని ఎక్టివ్ గా వుంచుతాయి.

  • ఇంట్లో మనవలు, మనవరాండ్లు చిన్నపిల్లల్లు వున్నారా? వారి ఎమొషన్సు, వారి అభిరుచులతో, వారితో కలసిపోండి. ఆడుకోండి. ఆనందించండి..వారు చిన్నపిల్లలైతే ఎత్తుకోండి, ముద్దాడండి.. టీనేజర్సు అయితే వారికి స్నేహితులుగా మారిపోండి. ఇక ఒత్తిడికి మీరూ దూరం అవుతారు.

  • ఏదో ఒక సమస్యపై మీలో మీరు అంతర్మధనంపడుతూ బాధపడేదానికన్నా మీ లైఫ్ పార్టునరుతో లేదా మీ సన్నిహితులకో సమస్యని వివరించండి. మీకు సొంతంగా పరిష్కారం దొరకని విషయాలకు ఇతరుల అనుభవాలనుంచి చక్కటి పరిష్కారామార్గాలు లభిస్తాయి. అందుకే మనలో మనం మానసికంగా కుంగిపోవడంకన్నా మిత్రులతో పంచుకుంటే రిలాక్సుడుగా ఫీలవుతాం.

  • ఇతరులతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి అనే అంశంపై మనకు ఏర్పడే ఒత్తిడి అధారపడి ఉంటుంది. నిత్యం మనం ఒకరొపై ఒకరు ఆధారపడి ఉంటాం. ఇలాంటి సంధార్భంలో ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరుచుకుంటే మనం ఇతరులు సంతోషంగా ఉంటారు.

  • స్వీయానుభవాలని, ఆలోచనలని, మేధస్సుని, జీవనవిధానలని యువతరానికి స్పుర్తీదాయకాలుగా నిలిచేలా పంచుకోండి.

నాణ్యమైన జీవనప్రమాణాలు ఆరోగ్యకర ఆయుఃప్రామణానికి దోహదమవుతాయి. అందుకని తీసుకునే ఆహరం పోషకవిలువలు కలిగిన పౌష్టికాహరంగా వుండితీరాలి, అది శరీరావసరాల మేరకు తగినంత పరిమాణాలలో తీసుకోవాలి, అవి మేలైన నాణ్యతని కలిగిన సాత్విక ఆహరాలుగా వుండి తీరాలి.

  • సాత్వికాహరం ఔషధంలా వ్యాధినిరోధకవ్యవస్థని బలోపేతం చేస్తుంది, మనల్ని సదా ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది.

  • మీరు రోజు ‘జీరో’ కెలోరీలు, ‘లో’ కెలోరీల ఆహారాన్ని ఆసక్తి మేరకు తీసుకోవచ్చు!!

  • ఇవి మిమ్మల్ని ఒబెసిటిబారిన పడకుండా, స్లింగా, ఆరోగ్యభరితంగా వుంచుతాయి.

  • హర్మోన్ల అసమతుల్యతల ద్వారా వచ్చే మూడ్’స్వింగ్సు నుంచి పరిరక్షీంచేదిశలో కీలకపాత్ర పోషిస్తాయి.

  • ఇవి మనువు, తనువులను కల్మషాలభారి నుంచి రీచార్జి చేస్తాయి.

మీ డైలీడైటులో సాత్వికాహరంగా పండ్లు ఓప్రధాన భాగం కావాలి. ప్రూట్ తేలికగా జీర్ణమౌతుంది. అంతేగాకుండా ఫైబర్, పొటాషీయం, విటమిన్లు, మైక్రో నూట్రీషీయంట్లు, ఎంజైంలు, యాంటియాంక్సిడెంట్సు, ఇందులో పుష్కలంగా వుంటాయి. అవి ఆరోగ్యభరితమైన శారీరకపోష ణాలను అందచేస్తాయి.

  • ప్రూట్ లో హానికలిగించే కొలోస్ట్రాలు వుండదు. ఇది మీ హార్టుని హేల్తీగా, రక్తపోటుని దూరంగా వుంచుతుంది.

  • రక్తంలో చక్కరల స్థాయిని పెరగడానికి అవకాశం ఇవ్వదు. డయాబిటీసుని దూరంగా వుంచుతుంది.

  • శరీరంలో క్యాన్సర్ కణాలని పెరగడానికి అవకాశం ఇవ్వదు. సూక్ష్మపోషకాలు రక్త హీనతని దూరం చేస్తుంది

  • ప్రూట్ లో ఫైబర్ సంవృద్దిగా లభ్యం. పెద్దప్రేవువ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం మీకు ఇక దూరం.


 
 
 

Comentarios


bottom of page