top of page

జాగృతి మాలిక 01

  • Writer: Admin
    Admin
  • Aug 12
  • 1 min read

Updated: 6 days ago

దేవుడువున్నాడా!!


దైవానికి ఎలాదగ్గరకావాలి?

దేవుడువున్నాడు అనే నమ్మకంతో కొందరు,

దేవుడువున్నాడా అనే అపనమ్మకంతో ఇంకొందరు,

దేవుడు ఎక్కడ వుంటాడు అనే సందిగ్ధంలో మరికొందరు.

దేవుడువుంటే ఎందుకు కన్పించడు?

కనిపించని దేవుడిని ఏమని పిలవాలి?

ఏమని ప్రార్థించాలి?

ఆయన మనప్రార్థనలను ఆలకిస్తాడా?

ఆయన మనకోరికలను నెరవేరుస్తాడా?

అసలు దేవుడు ఏమి చేస్తూ ఉంటాడు?

ఇంతకీ ఎవరైనా దేవుడీని చూసారా?

ఇలా ఎన్నెన్నో సందేహాలు.


దేవుడు వున్నాడు అని వాదించేవాడు, దేవుడులేడు అని వాదించే ఇద్దరి వాదనలు సరియైనవికానే కాదు!!

దేవుడువున్నాడు అనే వాడు ఆ అనుభూతిని మనసారా ఆస్వాదించకనే,ఆ ప్రయత్నంకూడా చేయకనే ఆ భ్రమతోనే వుంటూవుంటాడు. పరమాత్మ అనుభూతిని పొందనివాడు ఆ అంకిత భావాన్ని ఎలా కలిగివుంటాడు!!


దేవుడిని చూడలేదు,కాబట్టి దేవుడు లేడు అనే అజ్ఞాని ఇక ఆ అనుభూతిని ఎలా పొందగలడు?


సుగంధపరిమళాలు నాసికతోనే అస్వాదిస్తాం అని అనుకుంటాం, కానీ నిజానికి అది మానశిక అనుభూతి!

సంగీతం చెవితో విన్నా అది శ్రవణానందకరం ఆత్మానుభూతితోనే సాధ్యం!

కంటితో చూసిన సుందరదృశ్యం, మనస్సుతో వీక్షిస్తే సుందర మనోహరదృశ్యంగా మనస్సుపొరల్లో నిక్షిప్తం అవుతుంది కదా!

అదేవిధంగా ఆత్మానుభూతితోనే దైవానుభూతిని మనసారా ఆస్వాదించగలం. అందుకు పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే సాధన తప్పక వుండితీరాలి.

ధ్యానం ద్వారానే అటువంటి అనుభూతికి మనం దగ్గర అవుతాం.

ధ్యానం ఆ పరమాత్మ అనుభూతిని ఆస్వాదించడానికి ఓ యానకం అవుతుంది.

ఈ రోజునుంచే ధ్యానం ద్వారా ఆ పరమాత్మ తత్వానికి దగ్గర అయ్యే ప్రయత్నం ఆరంభించాలి.


సర్వేజన సుఖీనో భవంతు

మీ ఆధ్యాత్మిక సేవలో

RaNa

9900022729

 
 
 

Commentaires


bottom of page