జాగృతి మాలిక 19
- Admin
- Aug 31
- 2 min read
Updated: Sep 1
మీ అంతర్గత శక్తిని మేల్కొలిపే సమయం వచ్చింది 🕉️
మూలాధార చక్రం శక్తిని అన్వేషించండి🛐
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
📌పుడమితల్లి ఆశీస్సులతో ఓ విత్తనం మొలకగా🌱 ఉషోదయకాంతులలో🌄 సగర్వంగా తలెగరేస్తూ తన జీవనప్రయాణాన్ని మొదలెడుతుంది. దాని మూలాలు రోజురోజుకు తన ఉనికిని తెలియచేస్తూ భూమి లోలోపలికి విస్తరిస్తూ ఆ మొలకని ఓ తల్లిలా చూసుకుంటూ మొక్కగా ఎదగడానికి కావలసిన పోషకాలు,జలాలను అందచేస్తూ ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి సంసిద్ధంచేస్తూ ఆ మూలాలను ఇంకా ఇంకా లోపటికి విస్తరిస్తునే వుంటుంది. అదే తల్లివేరు వ్యవస్థ.
📍మనలో తల్లివేరువ్యవస్థనే మూలాధార చక్రం. అది పృథ్వీ 🌐ప్రతీకగా ఉండే ప్రాథమిక శక్తికేంద్రం. ఇది శరీరస్థిరత్వాన్ని బలోపేతం చేస్తూ శరీరమూలలను శక్తిభరితంగా ఉంచే ఎనర్జీసెంటర్. మూలాధార చక్రం మలద్వారం, మూత్ర కోశంల మధ్య ఉపస్థితంగా విసర్జన వ్యవస్థ విధినిర్వహణలను పర్యవేస్తుంది.
♋ కిడ్నీలలోని నెప్రాన్ వ్యవస్థ ద్వారా రక్తంలోని మలినాలను సమగ్ర వడపోత ప్రక్రియలతో యూరిక్ యాసిడ్,యూరియా, అమ్లద్రవాల సమతుల్యతలను కాపాడుతుంది.
♋ ప్రేవువ్యవస్థద్వారా జీర్ణవాశేషవ్యర్థాలను, పిప్పిని మలవిసర్జనక్రియద్వారా, అతడి ( gut) వ్యవస్థనుఆరోగ్య భరితంగా ఉంచుతుంది.
♋ శరీరఉష్ణోగ్రతలను🌡️నియంత్రిస్తూ , టాక్సిన్లను విసర్జించే స్వేదగ్రంధుల వ్యవస్థను పర్యవేక్షిస్తుంది.ఈ స్వేదగ్రంధుల స్రవించే స్వేదంలో 99%నీరు కొద్దిపాటి ఆమ్లద్రవాలు, సోడియం, క్లోరైడ్, యూరికాసిడ్, లవణాలు ఉంటాయి.
ఉరుకులు పరుగులతో కొనసాగుతున్న ఈ జీవనగమనంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, పనిఒత్తిడులతో విపరీతమైన మానసిక ఒత్తిడి, టెన్షన్, అభద్రత భావనలు మూలాధార చక్రాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మూలాధార జనితశక్తి ప్రసరణవ్యవస్థలకు ఆటంకాలలు కలిగిస్తాయి. పర్యావసానంగా..
🪫హార్మోన్ల సమతుల్యతలను ప్రభావితం చేస్తాయి, ఫలితంగా స్త్రీలలో గర్భధారణ క్లిష్టం అవుతుంది తాత్కాలిక వ్యంధ్యత్వం ప్రాప్తిస్తుంది. అందుకే సంతానసఫాల్యకేంద్రాలు పుట్టగొడుగుల్లా విస్తరిస్తూన్నాయి.
🪫మనం తీసుకునే శ్వాసక్రియద్వారా జరిగే అపానవాయు ప్రసరణ మందగమనం అవుతుంది. ఫలితంగా గట్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ మంచి బాక్టీరియా తగ్గుతూ మలబద్దకానికి కారణం అవుతుంది. గట్ లో సహజసిద్ధంగా తయారయ్యే బి12 విటమిన్ ఉత్పత్తి నిలిచిపోతుంది. ఈ స్థితిని నిర్లక్ష్యంగా వదిలివేస్తే క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందే ప్రమాదంకూడా ఉంటుంది.
🪫కిడ్నీలలో నెప్రాన్ వ్యవస్థ సామర్థ్యం నెమ్మదిస్తుంది, కిడ్నీ వ్యాధులభారిన పడే ప్రమాదంకూడా ఉంటుంది.
🪫శరీర సామర్థ్యం నెమ్మదిగా బలహీనమవుతుంది కొద్దిపాటి శ్రమను కూడా ఓర్చుకోలేక పోతుంది. రక్త ప్రసరణలో జరిగే మార్పులు బిపికి కారణం అవుతాయి. రోగనిరోధకశక్తి క్రమంగా క్షీణిస్తూ బలహీన పడుతుంది. పర్యవసానంగా గర్భిణీస్త్రీ🤰లలో సామాన్యప్రసవాల సంఖ్య దిగజారుతూ, సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య ద్విగుణీకృతం అవుతూ ప్రసవకేంద్రాలు నవనలడుతూ విరాజిల్లుతున్నాయి.
💎మూలాధార శక్తిచక్రంను బలోపేతం చేయడం ద్వారా పై సమస్యలకు చెక్ పెట్టడానికి ఓ ప్రణాళిక ఇలావుండాలి.
♎ యోగ అభ్యాససాధనలో వృక్షాసన, మాలాసన, పవనముక్తాసన,మూలభందన, కపాలభాతి క్రియలు మూలాధార శక్తిచక్రంను దృఢంగా సాధారణ స్థితికి తీసుకురావడానికి ఉపకరిస్తాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడి, టెన్షన్, వర్క్ ప్రెషర్ ల నియంత్రణలకు ప్రాణాధారణ, మెడిటేషన్🧘♀️ చాలా ప్రభావశీలిగా ఉంటాయి.
♎ తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఏదిపడితే అది తినకుండా శరీరానికి మంచి పోషకాలను సమకూర్చిపెట్టే సాత్విక ఆహారపదార్ధాలను🥗 తినటం మంచిది. కారాలు, మసాలాలు, ఉప్పు ఎక్కువ ఉండే పదార్ధాలను తగ్గించుకోవటం ద్వారా అది మీ దేహానికి హితాహారం అవుతుంది.
♎ ఎముకలను 🦴పటిష్ట పరుచుకునేందుకు, రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు , కొలెస్ట్రాల్ లెవెల్స్ ని సాధారణస్థాయిలో వుంచుకోవడానికి ఆకుకూరలతో కూడిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు🥦🥬 విటమిన్లు, ఖనిజలవణాలు పోషకాలనిధులు.ఇవి ఆరోగ్యాన్ని చురుగ్గా ఉంచుతాయి.
♎ మన దేహంలోని అవయవాలన్ని సక్రమంగా తమ విధులను నిర్వహించడానికి ఆరోగ్యవంతమైన కొవ్వులను శరీరానికి అందించాలి. బాదం, వాల్ నట్స్, కాజు, పిస్తా, గుమ్మడిగింజలు, అవిశ గింజలు,బ్రెజిల్ నట్స్, ఖర్జూరాలాంటి నట్స్ ను రెగ్యులర్గా తీసుకోవాలి. నానబెట్టిన డ్రై ఫ్రూట్ తీసుకోవడం ద్వారా వీటి నుండి లభించే కొవ్వులు జీవక్రియల్లో పాలు పంచుకుని మనకు దేహపుష్టిని ఇస్తాయి.
♎ నిర్ణీత సమయంలో ఆరోగ్యకరమైన నిద్ర మనస్సుకు ఎంతో మేలు చేస్తుంది. అందుకని రోజులో 7 నుండి 8 గంటలు నాణ్యమైన🛌 నిద్ర మంచిది.
♎ ప్రేవువ్యవస్థ ఆరోగ్య పరిరక్షణకు పెరుగు, మజ్జిగ, ఇడ్లీ,దోసె వంటి ప్రోబయాటిక్ ఫుడ్స్, పండ్లు, ఆకు కూరలు వంటి పైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి.ఇవి జీర్ణవ్యవస్ధ నిర్వాహణక్రియలను సుగమం చేస్తూ మిమ్మల్ని ఒబేసిటీకి దూరంగా ఉంచుతుంది.
♎ చక్కెర పాళ్ళు తక్కువగా ఉండే జామ, బొప్పాయి, పియర్స్ ,🍐 ఆపిల్ 🍎, నేరేడు, కివి 🥝, అవకాడో🥑 వంటి సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
♎ ఎముకల ఆరోగ్యానికి, వ్యాధి నిరోధక శక్తి పెరగటానికి అవసరమైన D విటమిన్ సూర్యరశ్మి 🌞 ద్వారా పొందవచ్చు. అహ్లాదకరమైన వాతావరణంలో గడపటం, స్వచ్ఛమైన గాలిపీల్చటం ఆరోగ్య పరిరక్షణకు ప్రధాన కారణం అవుతాయి.
♎ యోగాసనాలు, యోగక్రియలు, ప్రాణాధారణ సాధనల కోసం మీకు దగ్గర్లో వుండే యోగ శిక్షణ కేంద్రంలో మీ పేరు నమోదు చేసుకొని యోగ సాధన 🧘 నేడే ఆరంభించండి.
సర్వే జన సుఖినోభవంతు
మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి
RaNa
9900022729
🧘 🧘 🧘 🧘 🧘 🧘
Comments