top of page

జాగృతి మాలిక 02

  • Writer: Admin
    Admin
  • Aug 12
  • 1 min read

Updated: 6 days ago

పరమాత్మ స్వరూపం


ఈ సృష్టి అనంతమైన, అభేద్యమైన మహాజీవరాశి. సకల జీవరాశులను నడిపించే శుద్ధచైతన్య స్వరూపం. అది తేజోవంతం,చైతన్యవంతం,జీవభరితం, స్పూర్తిభరితం,వైవిధ్యభరితం,అజరామరం.


ఈ శుద్ధచైతన్యమే మనస్సులో జ్ఞానశక్తి గా ప్రజ్వలం అవుతూ వుంటుంది.

అదే జీవశక్తిగా ఆకలినీ కలిగించి ఆహారాన్ని తీసుకోవాడనికి ప్రేరణ అవుతుంది.

అదే దృష్టిగా కంటితో చూస్తుంది.

అదే శ్రవణశక్తిగా చెవితో వింటుంది.

అదే ఆగ్హణశక్తిగా నాసికతో వాసనలను గ్రహిస్తుంది. ఆ అనుభూతులను జ్ఞాపకాల దొంతర్లుగా మనస్సు పుటల్లో భద్రపరచుకుంటుంది..

అది మన ఆలోచనతీరుని, ప్రవర్తనని, నడవడికని, ప్రజ్ఞ, మేధస్సులని, హావభావాలని, మాటతీరుని ప్రభావితం చేస్తూ నీకు ఓ దిశ, దిశలని నిర్దేస్తుంది.

నిన్ను మహోత్తర శిఖరాలకు చేరుస్తుంది, జాగరూకతతో లేకుంటే అదే పాతాళానికి కూడా తోసేస్తోంది. అది సంకల్ప, వికల్పాల క్షేత్రం.


మనందరిలో ఓ' ట్రెజర్ బాక్స్ ' వుంది. అందులో ఓ అపురూప దివ్య ఆభరణం భగవంతుడు భద్రపరిచాడు!

దాని ' కీ ' నీ చేతుల్లో, చేతల్లోనే వుంచాడు!


మన అంతరంగమే ఆ ట్రెజర్ బాక్స్ , దాని ’ కీ' మనస్సే! అంతరాత్మనే ఆ దివ్యఆభరణం!!

అంతరాత్మని ఎరుకతో, సంయమనంతో, జాగరూకతతో గమనిస్తే అది పరమాత్మ సస్వరూపమే. మరి దానిని ఎలా దర్శించాలి...

భక్తి, శ్రద్ధ,నిష్ట,అనన్యచింతనలతో ఆత్మ వైభవానుభూతినీ పొందగలము!


సర్వే జన సుఖినోభవంతు.


మీ ఆధ్యాత్మిక సేవలో

RaNa

9900022729

 
 
 

Comments


bottom of page