జాగృతి మాలిక 03
- Admin
- Aug 12
- 1 min read
Updated: 6 days ago
సృష్టి యాదృక్షికంగా జరిగిందా?
ఈ సృష్టి సనాతనం,చైతన్యవంతం, జీవభరితం,వైవిధ్యభరితం,తేజోవంతం, స్పూర్తిభరితం నిర్దిష్టక్రమంలో సర్వసంపూర్ణుడు, సమగ్రుడు, సర్వాంతర్యామి అయిన పరమాత్మ నుండి కల్పారంభంలో ఆవిర్భవించిన ఈ సకల సృష్టి పరిపూర్ణంగా విరాజిల్లుతోంద
అనేక మహాయుగాలు గడిచినా సృస్టి నిర్మాణక్రమంలో, రూపకల్పనలో అణుమాత్రం కూడా మార్పులు లేని అత్యంత అద్భుతమైన సంక్లిష్ట సృష్టి ప్రక్రియ, నిరంతరం కొనసాగుతూనే వుంది, వుంటుంది.
భౌతికవాదుల మేధస్సుకు ఈ జీవపదార్థం, జీవనిర్మాణం సమాధానం దొరకని ఓ సవాలుగా నిలిచింది!
ఏ శాస్త్రవేత్తకాని,వారి పరిజ్ఞానం జీవపదార్థం పుట్టుకని, దాని ఉనికిని కనిపెట్టలేక పోయింది! వారి పరిశోధనలు ఓ జీవకణాన్ని తమ పరిశోధనాలయంలో తమ మేధస్సుతో సృష్టించలేక పోయింది.
ఈ సృష్టి పృథ్వి, వాయు,నీరు, అగ్ని, ఆకాశంలతో విశ్వమంతా విస్తరించిన పంచభూతమయమే!
నశ్వర మయిన ఈ దేహాలన్నీ పంచభూతాల రూపకల్పనతో నిర్మితమైన సామూహిక జీవకణాల నిర్దిష్ట రూపాలే!
ఈ స్థూలదేహమే క్షేత్రం.ఈ ఉపాధి క్షేత్రంలో సనాతనం,అనశ్వరం, చైతన్యభరితమయిన ఓ జీవశక్తి వుంది.
అది మీ జీవక్రియ, జీవనక్రియ, జీవితక్రియలను నిర్దేశిస్తుంది.
ఆ జీవశక్తిస్వరూపమే జీవుడు!
ఆ జీవుడు పరమాత్మ సస్వరూపమే!!
మనలోని జీవుడే శివుడు!!
శ్వాస మీది ద్యాసనే ధ్యానం అదే శివతత్వం..
సర్వ భూతస్థ ఆత్మానం, సర్వ భూతాని ఆత్మానీ అనేది గీతోక్తి.
సృష్టిలోని సకలజీవరాశిలో పరమాత్మ చైతన్యవంతంగా,ఆత్మరూపంలో ప్రకాశిస్తుంటాడు. ఈ భావనతో ఈ జీవనయాత్రని కొనసాగిస్తూ ఉండాలి.
ఆత్మ భావనతో ప్రతి ఒక్కరియందు దయ, కరుణ, జాలి, ప్రేమ, కారుణ్యం కలిగి వుండాలి.
మనం సదా జాగరూకతతో, ఎరుకతో ఏ ప్రాణికి అపకారం చేయాలనే తలంపును మనస్సు నుంచి సంపూర్ణంగా త్యజించి వేయాలి. అది భగవతత్వానికి మనలని మరింత చేరువ చేస్తుంది.
సర్వే జన సుఖినోభవంతు.
మీ ఆధ్యాత్మిక సేవలో
RaNa
9900022729
Comments