top of page

జాగృతి మాలిక 12

  • Writer: Admin
    Admin
  • Aug 15
  • 1 min read

🐾ఆత్మ ఈ మానవజన్మకోసం ఎన్ని జన్మలు తీసుకుందో మీకుతెలుసా?🐾


అమ్మనాన్నల కలల పంటగా, వారి తీపిగుర్తులుగా, పుట్టుకతోనే అన్న,అక్క,తాత, అమ్మమ్మ, అత్త,మామ, పిన్ని, బాబాయి అనే స్వపరివారం పరమాత్మ ప్రసాదించిన అపూర్వకానుకగా ఎన్నో జన్మజన్మల నిరీక్షణఫలితంగా ఆత్మ దేవాలయమే క్షేత్రంగా ఈ శరీరాన్ని పొందగలిగింది.


ఆత్మకి ఈ జన్మకే ఈ బంధాలు, అనుబంధాలు!

ఆత్మకి ఈ జన్మ మొదటిదికాదు, చివరిదికాదు!

ఆత్మ ఈ జన్మకు ముందుగా ఎన్నెన్నో జన్మలు తీసుకుంది.

ఆత్మ మరెన్నో జన్మలను కూడా తీసుకోబోతుంది.

ఆత్మకి గతజన్మలని గురించి ఏమీ తెలియదు.

ఆత్మకి తను తీసుకోబోయే జన్మలని గురించి కూడా ఏమీ తెలియదు.


అత్మ అంటే ఏమిటి??

ఆత్మ కల్పారంభంలో పరమాత్మ నుంచి సృష్టిలో ఆవిర్భవించిన పరిపూర్ణ జీవపదార్థం.

ఆత్మ అంటే శుద్ధచైతన్య స్వరూపం.

ఆత్మ సనాతనమయినది

ఆత్మ అవ్యక్తమయినది

ఆత్మ అచింత్యం

అత్మ వికారరహితం

అత్మ ఇంద్రియాలకుగోచరించని బ్రహ్మపదార్థం.

ఆత్మకి పుట్టుక లేదు

ఆత్మకి చావు కూడా లేదు

అత్మ నిత్యమైనది

ఆత్మ పంచభూతాత్మకం కాదు, కావున అవి ఆత్మని ప్రభావితం చేయలేవు.


శాస్త్రీయ అధ్యయనాలు సర్వసంపూర్ణుడు, నారాయణ స్వరూపం అయిన పరంబ్రహ్మ ద్వారా ఈ అనంతవిశ్వం సుమారుగా 450కోట్ల సంవత్సరాలక్రితం ఓ కృష్ణబిలంలో జరిగిన మహావిష్పోటకంతో పంచతత్వ సమ్మేళనంగా ఆవిర్భవించింది అని బిగ్ బ్యాంగ్ థియరీ లో తెలియచేసింది.

సృష్టి ఆవిర్భవించిన ఎన్నో కోట్ల సంవత్సరాలకు జీవపదార్థం ఏకకణజీవిగా రూపాంతరం తీసుకుంది.

ఈ జీవపదార్థం సుదీర్ఘకాలం కొనసాగిన అనేక హిమయాగాలకు సాక్షిగా నిలిచింది.

ఈ భూమండలం మీద గత 100 కోట్ల సంవత్సరాలలో ఐదు హిమయుగాలు ఏర్పడినాయి.

సుమారు 45 కోట్ల సంవత్సరాలక్రితం ఏర్పడిన మంచుయుగాంతంలో అనుకూల వాతావణంలో వృక్ష సంపద ఆవిర్భవించి వాతావరణంలో ఆక్సిజన్ స్థాయినీ గణనీయంగా పెరగడానికి దోహదం చేసింది.

చివరి సుదీర్ఘ మంచుయుగం 26 లక్షల సంవత్సరాల క్రితం ముగిసినట్లుగా శాస్త్రీయ అధ్యయనాలు భావిస్తున్నాయి.

ఈ జీవపదార్థం పరిణామక్రమంలో ఏకకణజీవి నుంచి బహుళకణజీవులగా, జలచరాలుగా, ఉభయచరాలుగా, భూచరాలుగా, పశుపక్ష్యాదులగా, స్తన్యజీవులుగా రూపాంతరం చెందింది.


ఉత్కృష్టం,సర్వోత్తమమం, అపురూపం. సర్వ శ్రేష్ఠం అయిన ఈ మానవజన్మ పొందడానికి ఆత్మ 84 లక్షల జన్మలని తీసుకుంది.


ఇంతటి అముల్యమైన మానవజన్మని ప్రసాదించిన పరబ్రహ్మ స్వరూపం అయిన శ్రీకృష్ణపరమాత్మని అనన్యచింతనతో, అనన్యభక్తి,శ్రద్ధలతో సేవించాలి.

దయ, కరుణ,ప్రేమ, అద్రోహం,త్యాగనిరతి, అపైశునం,ఆక్రోధం,ఏకీభావస్థితి,స్వధర్మాచరణ పూరిత హృదయంతో ఆ పరమాత్మ చరణాలకు పరిపూర్ణార్పణం వలన ఆత్మ శాశ్వతమైన దివ్యధామం చేరుకుని జననమరణచక్ర పరిధి నుంచి మృత్యుంజయుడువు అవుతావు.

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.


సర్వే జన సుఖినోభవంతు


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

RaNa

9900022729

🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️

 
 
 

Comments


bottom of page