జాగృతి మాలిక 13
- Admin
- Aug 15
- 2 min read
Updated: Sep 1
🕊️మెదడు మీ వజ్రాయుధం !!!🕊️
శాస్త్రీయ అధ్యయనాలు ఈ అనంత విశ్వం మూడులక్షల కాంతిసంవత్సరాలకు విస్తరించిన అనంత ద్రవ్యరాశిగా గణించాయి.
ఓ కాంతిసంవత్సరం అంటే సుమారు 5.88 ట్రిలియన్ మైళ్లు.
ఆధునిక విమానం గంటకు 600 మైళ్ల వేగంతో ప్రయాణంకొనసాగిస్తే ఓ కాంతిసంవత్సర దూరాన్ని ఓ మిలియన్ సంవత్సరాలలో అది పూర్తిచేస్తుంది.ఈ విశ్వ ప్రదక్షిణ చేయడానికి అది సుమారు 300 మిలియన్ సంవత్సరాలు తీసుకుంటుంది అని నాసా శాస్త్రవేత్తలు గణించారు.
పాలపుంతలతో, గెలాక్సీలతో, కృష్ణ బిలాలతో విస్తరించిన ఈ బ్రహ్మాండం మన ఊహలకు అంతుచిక్కని మహాద్రవ్యారాశి.
శక్తివంతమైన టెలిస్కోప్ వ్యవస్థలతో, శాస్త్రీయ విజ్ఞానంను మేళవించి శాస్త్రవేత్తలు విశ్వాధ్యాయనం చేశారు, చేస్తున్నారు, చేయబోతున్నారు. నూతన ఆవిష్కరణలు చేస్తునేవున్నారు. ఈ విశాల బ్రహ్మాండంని వీక్షించే దృష్టి మానవనేత్రంకి అసాధ్యం!!
మరి ఈ నవీన శాస్త్రజ్ఞానం అందుబాటులో లేని కాలంలో మన ఋషులు, పూర్వీకులు ఈ బ్రహ్మాండంనీ ఎలా దర్శించగలిగారు!
సౌరకుటుంబం,నవగ్రహలు,నక్షత్రాలు వాటి గమనాన్ని ఎలా గణించారు!!
ఈ ఖగోళశాస్త్రజ్ఞానం ఎలా అవగతం అయింది!!!
మన మెదడు 90 బిలియన్ల న్యూరాన్లుతో సృష్టించబడిన ఓ బ్రహ్మాండమైన జీవపదార్యం. అదే మనస్సుకు ఆవాస క్షేత్రం.
మనస్సు వివేకజ్ఞాన క్షేత్రం.
మనస్సు తార్కికవిచక్షణలకు కేంద్రం.
మనస్సు యుక్త విచక్షణలకు నిలయం.
మనస్సు తాత్వికచింతనల క్షేత్రం.
మనస్సు ఆలోచనాతరంగిణి.
మనస్సు భావోద్వేగాల కడలి.
మనస్సు జ్ఞాపకాల దొంతరలకు జర్నలు.
మనస్సు అంటే ప్రజ్ఞ.
మనస్సు అంటే మేధస్సు.
మనస్సు అంటే విజ్ఞత.
మనస్సు అంటే మనోఫలకం.
మనోఫలకం చర్యలు,ప్రతిచర్యల సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. (CPU)
మనస్సు ఓ అద్భుతమైన మంత్రాలయం.
మన పూర్వీకులు, జ్ఞానులు, తత్వదర్శులు,
మహర్షులు, రాజర్షులు, సిద్దులు యోగసాధన, ప్రాణాయామం, ధ్యానప్రక్రియలతో అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశ్వత, వశిత్వ అనే అష్టసిద్దులను అతీంద్రియశక్తులగా సాధించేవారు.
ఈ అతీంద్రియశక్తులతో సర్వాంతర్యామిని మనోనేత్రంతో వీక్షించేవారు. అదే విజ్ఞాననేత్రం.
ఈ విజ్ఞాననేత్రంతో బ్రహ్మాండమైన ఈ విశాలవిశ్వాన్ని మనస్సుతో వీక్షించేవారు.
వారి మనోఫలకంలో భూమండలం, గ్రహాలు, సూర్యుడు, నక్షత్ర మండలాల గమనాన్ని స్థితిగతులను నిక్షిప్తంచేస్తూ యోగవిజ్ఞాన శాస్త్రభండారముగా భావి తరాలకు అపురూప కానుకగా అందించారు.
విజ్ఞాననేత్రమే బ్రహ్మాస్త్రంగా పాటలిపుత్రవాసి ఆర్యభట్టు గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు ప్రపంచమేధావి.
వారి పరిశోధనలు ఆర్యభట్టియంగా ప్రసిద్ధిచెందాయి. అందులో
గోళ అధ్యాయంలో భూమి గోళ ఆకారంలో తన చుట్టూ తాను తిరుగుందని,
సూర్య సిద్దాంతంగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ గ్రహణాలు ఏర్పడడానికి కారణాలను సహేతుకంగా వివరించారు.
గణితపాదగా బీజగణితం, త్రికోణమితి ,π ఇతర గణిత భావనలను విశదీకరించారు.
ఉజ్జయినిపుర దైవజ్ఞ వరాహమిహిర, చంద్రగుప్త విక్రమాదిత్య ఆస్థానకవి,ఖగోళ,గణిత, జ్యోతిష్య పరిశోధనల ఙ్ఞానసారాంశం బృహత్సంహిత, బృహఙ్ఞాతకం పలు భాషలలో లభ్యమవుతుంది.
భవిష్యత్తును యోగులు జ్ఞాననేత్రంతో దర్శించారు. కాలజ్ఞానం అనే భవిష్యవాణిలను మనకు అందించారు.
ఆ విధంగా ఆవిర్భవించిందే వీరబ్రహ్మేంద్ర గారి కాలజ్ఞానం. ఈ తాళపత్రగ్రంథ ప్రతి ఇప్పటికి భద్రపరచి వుంది.
వేదవ్యాస మహర్షి సంస్కృత విరచిత భవిష్యపురాణము ఏకాదశ పురాణంగా వివిధ భాషలలో లభ్యమవుతుంది.
సిద్ధ యోగ సాధువులు గౌతమ బుద్ధుడు,రమణ మహర్షి,గురు రాఘవేంద్ర, సత్య సాయిబాబా, గురుమయి చిద్విలాసనంద, శ్రీ రామ యోగి, స్వామి వివేకానంద,శివ ప్రభాకర సిద్ధ యోగి, యోగ గురు శివానంద, రామకృష్ణ పరమహంస, యోగి వేమన, రమణనందా లాంటి ఎందరో మహానుభావుల అపురూప యోగ విజ్ఞానసంపద ప్రకృతిమాత దివ్య కంఠాభారంగా శోభిల్లుతువుంటుంది.
సర్వే జన సుఖినోభవంతు,
మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి
RaNa
9900022729
🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️✨
Comments