జాగృతి మాలిక 14
- Admin
- 6 days ago
- 2 min read
✨కర్మ ప్రతీకారాన్నే కోరుకుంటుందా!?✨
మనజీవితంలో ఎందరో తారసపడుతువుంటారు
అందులో కొందరు దగ్గరవుతారు.
వారిలో కొందరు హితులవుతారు.
వారిలో కొందరు సన్నిహితులవుతారు.
వారిలో కొందరి సన్నిహిత్వం మనస్సుతో పెనవేసుకపోతుంది.
వారిలో ఒకరు ఎమీ ఆశించకుండా ఆప్తుడిగా, నీ ఉన్నతిని, శ్రేయస్సును కోరుకుంటూ స్నేహహస్తం అందిస్తూ వుంటారు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అందుకే ఆ విలువైన బంధాన్ని వదులుకోరాదు. ఈ ఆత్మీయ స్నేహబంధం గత జన్మల అనుబంధమే!!
ఈ జన్మలో తారసపడే వ్యక్తులతో గతజన్మల్లో ఎంతో కొంత సంబంధం తప్పక వుండి వుంటుంది.
గతజన్మలో నీ కూతురు ఈజన్మ లో నీ తల్లిగా లేక నీ కుమారుడు నీ తండ్రి గావచ్చు.
గతజన్మలో నీ కారణంగా బికారి అయినవాడు ఈ జన్మలో నీ కుమారుడు కావచ్చు.
నీ మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, దగాలకు బలైనవారు ఈ జన్మలో బలమైన శత్రువులుగా తారసపడతారు.
పుట్టుకతోనే మేధోవైకల్యం, అంగవైకల్యాలతో
ప్రారబ్ధకర్మలఫలంగా 2 నుంచి 3 శాతం జన్మిస్తువుంటే మరికొందరు విధిరాతతో, అనారోగ్యంతో అంగవైకల్యాల పాలవుతున్నారు!
వారిలో కొందరు దృఢమైన మనస్సు, స్వయంకృషి, ధీరత్వంలతో,అంగవైకల్యాలను సానుకూల భావనలతో సవాళ్లుగా స్వీకరించి వారి కర్మఫలాలను తిరిగి వారే రాసుకుంటూ మానవీయులుగా,ఆదర్శప్రాయులుగా నిలిచారు. అటువంటి వారినుంచి స్పూర్తి పొందే ప్రయత్నం చేద్దాం.
ప్రమాదంలో ఓ కాలు పోగొట్టుకున్న అరుణిమ ఎవరెస్టు శిఖరం అధిరోహించి మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఓ ఆదర్శ మహిళ!!
కేవలం ఓ సంవత్సరం వయస్సులో పోలియో వ్యాధికారణంగా నడుము నుంచి పాదాలవరకు కదలికలులేని శారీరకస్థితిలో ఏకంగా 397 గోల్డ్ మెడల్సును 🏅 వివిధ క్రీడల్లో సాధించిన అర్జున అవార్డుగ్రహీత బెంగళూరుకు చెందిన మాలతి కృష్ణమూర్తి తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ మన్నలను సాధించిన ధీర వనిత!!
ఆంగ్ల సాహిత్యంలో ప్రసిద్ధ కావ్యరచయిత,జాన్ మిల్టన్ కంటిచూపు కోల్పోయిన తర్వాత రచించిన ’ప్యారడైజ్ లాస్ట్' అసాధారణ మన్ననలను పొందింది!!
కేవలం 19 నెలలవయస్సులో తీవ్ర అనారోగ్యంతో అందత్వం మరియు చెవిటితనం పొందిన ప్రపంచ ప్రఖ్యాత రచయిత్రి హెలెన్ కిల్లర్ గారి బయోగ్రఫీ ’స్టొరీ ఆఫ్ మై లైఫ్’ ఎందరికో స్ఫూర్తివంతం!!
అంధత్వంతో జన్మించి అనేక జీవిత సవాళ్లను సమర్థవంతంగా స్వీకరించి పాటల రచయితగా, సంగీత దర్శకుడుగా వెలిగిన ఓ ధ్రువతార రవీంద్ర జైన్!!
సానపడితే వజ్రము ప్రకాశిస్తుంది!!
బంగారం సుత్తి దెబ్బలు తిని ఆకర్షణీయమైన నగ అవుతుంది!!
మానసిక వైకల్యం అనేది శాపం కాదు దానిని స్వీకరించలేక పోవడమే నిజమైన శాపం!!
యజ్ఞక్రియలు, క్రతువులు, హోమాలు, పాపభీతి, లోకకల్యాణకార్యాలు, పుణ్యకార్యాలు, ప్రజాహితకార్యాలు, పశుపక్ష్యాదుల ఆదరణ, వ్యవసాయం, న్యాయబద్దమైన వృత్తి వ్యాపారాలు, ఆలయాలలో అందించే సేవలు, వృద్ధులకు, అనాథలకు, దీనులకు, వికలాంగులకు అందించే స్నేహహస్తం, దానగుణం, దయాగుణం,దాతృత్వం మదిలో పవిత్ర భావనలకి అంకురం అవుతాయి. అవి వ్యక్తిత్వ నిర్మాణంలో మిమ్మల్ని ఉత్తములుగా తీర్చిదిద్దుతాయి. ఆ సత్కర్మలు మనస్సుని ప్రశాంతభరితం చేస్తాయి. అందుకే మంచి ఆలోచనలు పవిత్రభావనలతో మనస్సును నింపాలి, అవి శరీరాన్ని ఆరోగ్యవంతం చేస్తాయి.
అసంబద్ధ వ్యాపారాలు, లంచాల తో నిర్వీర్యం అవుతున్న ప్రజాసేవలు,డబ్బుకుఅమ్ముడుపోయే న్యాయవాదులు,ధనార్జనకోసమే చేస్తున్న వైద్యం,
అక్రమ సంపాదనల కోసం కల్తీమయం చేస్తున్న ఆహార పదార్థాలు,వంటనూనెలు, విత్తనాలు.
పరస్త్రీ వ్యామోహం, జీవహింసల వంటి కర్మలు ఎవరినైనా అధముడిగా చేస్తాయి, సమాజానికి వారు ఎంతో కీడును కలుగచేస్తారు.
ఈ దుష్కర్మల నుంచి బయటకు రావాల్సిందే! భూమిని పెకలించి మొలకెత్తిన విత్తనంలా నీలో దృఢసంకల్పం ఉండాలి! సానుకూల భావోద్వేగాలు, పాజిటివ్ థింకింగ్,సత్ సాంగత్యం, భగవత్చింతన, ధ్యానం అందుకు ఎంతో సహాయకారిగా వుంటాయి.
మనం చేసే ఏ కర్మ అయినా వాటి కర్మఫలాలను అనుభవించి తీరాల్సిందే!
ఆ కర్మల ఫలితాలు కొన్ని వెంటనే, మరికొన్ని కొద్దికాలం తర్వాత, మరి కొన్ని దీర్ఘకాలం తర్వాత అయినా అనుభవించాల్సిందే! అసంపూర్ణ కర్మఫలాలు ప్రారబ్ధకర్మలుగా అనుభవించడానికి ఆత్మ ఇంకో జన్మని తప్పక తీసుకోవాల్సిందే!
నారాయణ స్వరూపం అయిన శ్రీకృష్ణ పరమాత్మ గీతలో అనాసక్తియోగని యిలా బోధించాడు.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషూ కదాచన
మా కర్మఫలహేతుర్భుః మాతే సఙ్ఞాస్త్వకర్మణి.
కర్తవ్యం నీ వంతు,కాపాడడమే నా వంతు.
అనగా ఇతరులకు హితం కలిగించేలా కర్మలను ఫలాపేక్ష రహితంగా ఈశ్వరార్పణ భావనతో సదా ఆచరిస్తువుండాలి.
ఈ నిష్కామకర్మాచరణతో భగవత్తత్వం నీలో అవగతం అవుతుంది. పరమాత్మని అంతరంగంలో వీక్షించే అర్హతని కూడా సంపాదించుకుంటావు.
సర్వే జన సుఖినోభవంతు
మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి
RaNa
9900022729
🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️✨
Comments