జాగృతి మాలిక 15
- Admin
- 6 days ago
- 2 min read
నేను నేను కాదా? మరి నేనెవరిని!?
నేనెవరిని అనే జిజ్ఞాస మన అందరిలో తరతరాలుగా ఉదయిస్తూనే వుంది. ఎందరో సిద్ధ సాధువులు తమ ఙ్ఞానసిద్ధితో నన్ను దేహీగా
దేహంలో వుండే పరమాత్మ స్వరూపంగా దర్శించి భావితరాలకు మార్గదర్శనం చేయించారు
దేహీ అయిన నేను పరమాత్మలో ఓ అంశాన్ని. నాలోని ఆ పరమాత్మ అంశయే ఆత్మ. అది పరమాత్మ ప్రతిబింబం.
జలంతో నిండిన పాత్రలో సూర్యబింబం ఎలా🌞 ప్రకాశిస్తుందో ఆత్మ కూడ స్వయంప్రకాశం!జలంలో సూర్యబింబం సూర్యనారాయణుడి ప్రతిరూపమే, 🌞అలాగే సర్వసంపూర్ణుడు, మహాదేవుడు,సృష్టికర్త అంశ అయిన నేను ఆ పరిపూర్ణ ప్రతిబింబమే!
పరమాత్మలో అందరు వున్నారు, కానీ వారిలో పరమాత్మ లేరు!
పరమాత్మ అవ్యక్తం, నేను అవ్యక్తమే!
🌼🪷🌸పుష్పమాలికల పరిమళాలు అవ్యక్తం,కానీ ఆ పరిమళాల అనుభూతిని అస్వాదిస్తాం!
దృశ్య,శ్రవణ తరంగాలు అవ్యక్తం అయితే ఓ బలమైన తరంగ గ్రాహక వ్యవస్థతో 📡టీవీ📺 లో చిత్రాలను వీక్షిస్తున్నాం, మొబైల్ ఫోన్ 📲లో సంభాషణలు సాగిస్తున్నాం.
ప్రవహించే నది జలాలలో🌊 విద్యుత్ అవ్యక్తం అయితే జలవిద్యుత్ కేంద్రంలో ఎలెక్ట్రాన్ల ప్రవాహంగా విద్యుత్సక్తిగా మారి మన ఇండ్లల్లో దీపాలు💡 వెలగడానికి, టీవీలో📺 చిత్రాలను వీక్షించడానికి,ఫ్యాన్ ద్వారా చల్లటిగాలిని, ఫ్రిడ్జ్ లో ఆహారాలు తాజాగా ఉంచే ఆ అవ్యక్త విద్యుత్ ఫలాలను మనం రోజూ అనుభవిస్తున్నాం
పరమాత్మ నిర్వికార స్పూర్తిదాత. వరుణ దేవ రూపంలో 🌧️పర్వతాలు, నదులు, లోయలు, హిమానినదాలు, పంటభూములు, అరణ్యాలు, గ్రామాలు,నగరాలు, నివాసాలు అనే భేదబావం లేకుండా నిర్వికారంగా వర్శిస్తాడు, నేను కూడ ఆ నిర్వికార స్పూర్తివంతాన్నే!
పరమాత్మ నిత్యుడు, నేను నిత్యుడనే!
అనిత్యమైన దేహంలో ఉండే దేహీ అయిన నాకు కూడా మరణం లేదు!
ఈ మహాప్రస్థానంలో పుట్టుకకు ముందు మరణం తర్వాత కూడా వుంటాను. ఈ మధ్యకాలంలో దేహరూపంలో వ్యక్తం అవుతూవుంటాను.
పరమాత్మ త్రీగుణాతీతుడు,నేను త్రీగుణాతీతుడనే!కామం,క్రోధం, లోభం అనే త్రిగుణాల మాయ నన్ను ప్రభావితం చేయవు.
ఈ త్రిగుణాల మీది సంయమనమే అత్మ సంయమనం, దానిని మనోనిగ్రహం ద్వారా సాధించుకోవాలి. అప్పుడు హృదయక్షేత్రంలో 🫀జ్ఞానబీజం🌱 అంకురమౌతుంది!
పరమాత్మ శాశ్వతుడు, పురాతనడు, సనాతనుడు నేను కూడా పురాతనడును, సనాతనుడును,శాశ్వతుడను. కల్పారంభంలో సృష్టికర్త నుంచి ప్రభవించిన నేను కల్పాంతంలో వారిలో లయమవుతాను.
పరమాత్మ త్రికాలతీతుడు, నేను కాలాతీతుడనే⏳ ప్రకృతి లోని ప్రతి వస్తువు కాలగర్భంలో కలసిపోవలసిందే! పంచభూతాత్మకం కానీ నేను కాలప్రభావానికి అతీతుడనే!!
ఆత్మ స్వరూపం ఎలా వుంటుంది??
పరమాత్మ పరమదయాసాగరుడు,నేను కూడా సర్వుల యందు దయాభావనతో వుంటాను!
పరమాత్మ హృదయం దాతృత్వమయం, నాలో కూడ దాతృత్వభావనే వుంది!
పరమాత్మ కరుణామయుడు నాలో కూడా ధీనులయందు అపారకరుణ వుంది!
పరమాత్మ శరణుకోరిన వారిని క్షమిస్తాడు, నాలో ఆ క్షమాగుణమే వుంది!
పరమాత్మ అసూయరహితుడు, నేను కూడ అనసూయనే!
పరమాత్మకు ఎవ్వరిపై మొహం వుండదు,నేను కూడ మోహం ఎవ్వరిపై పెంచుకోను!
పరమాత్మ అనురాగాన్ని ఎవ్వరిపై కురిపించడు, నేను కూడ రాగాన్ని కలిగి వుండను!
పరమాత్మ ధర్మరక్షకుడు, నాకు ధర్మాచరణ ప్రీతి!
పరమాత్మ లోని త్యాగనిరతి, సేవానిరతి నే నా మూలాలు!
పరమాత్మ ఎవ్వరినీ ద్వేషించడు, నాలోనూ ఎవరిపై ద్వేష భావన వుండదు!
పరమాత్మ చైతన్యరూపం, నీలో చైతన్యశక్తి నేనే!
పరమాత్మ శక్తి స్వరూపం, నీలో శక్తి కేంద్రకం నేనే!
దున్నినా తవ్వినా భూక్షేత్రం ఫలసాయమే ఇస్తుంది! సదా నీ హితమే నా అభిలాష!!
గీతాచార్యుడు శ్రీ కృష్ణ పరమాత్మ గీత లో ఇలా ప్రబోధించాడు.
ఉద్దరేదాత్మనాత్మనం ఆత్మామవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపూరాత్మనః
మనలో రెండు పార్శ్వాలు ఉంటాయి.
మొదటి పార్శ్వం ధర్మబద్ధం, నీతివంతం, న్యాయవంతం అయిన జీవనవిధానంకు ఆలంబనంగా వుండే శుద్ధమైన మనస్సు. అటువంటి వశీకృత మనస్సు చిత్తశుద్ధితో పరిశుద్ధ ఆత్మగా ప్రకాశిస్తూ ఆత్మబంధువు అవుతుంది!!
రెండవ పార్శ్వం అధర్మం, అవినీతి, అన్యాయం, అక్రమార్జనలు, చెడునడవడికలతో కూడిన మురికి కూపం లాంటి ఆలోచనలతో, భావనలతో ఇదే జీవితంగా గడిపేస్తూ వుంటుంది. అటువంటి జీవితాలకు ఆత్మ విరోధి, వారిని జరామరణ పీడిత జీవనమరణ చక్రంలోనికి ఆ కర్మ ఫలాలు అనుభవించడానికి జీవుడిని పడేస్తుంది.
ప్రతి ఒక్కరు ప్రయత్నపూర్వకంగా తమను తాము ఉద్ధరించుకోవాలి, వారికి ప్రారబ్దమనునది అడ్డుకాదు.
సర్వే జన సుఖినోభవంతు
మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి
RaNa
9900022729
🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️
Comments