top of page

జాగృతి మాలిక 17

  • Writer: Admin
    Admin
  • 6 days ago
  • 2 min read


🍃కర్మ ఓ సువర్ణావకాశం🍃


మనం ఎందుకు జన్మిస్తున్నాం?

మనం ఎందుకు మరణించాలి?

మనం తిరిగీ ఎందుకు జన్మించాలి?

సమాధానం దొరకని ఈ ప్రశ్నలు మనస్సులో గింగిరాలుగా అనాదిగా తిరుగుతూనే ఉన్నాయి.


మనం వీధిబడి 🎒 నుంచి చదువు 📖 ఆరంభించి యూనివర్సిటీ చదువులతో ముగిస్తాం. కొందరు మద్యలోనే ఆ చదువులు ఆపేస్తారు.

అదే విధంగా జీవితం అనే పాఠశాలలో మనం ఎన్నో అనుభవాలను వాటినుంచి గుణపాఠాలను, అనుభూతులను వాటిద్వారా సుఖదుఃఖాలను , వైవిధ్యభరిత జీవితంగా నూతన ఆవిష్కరణలను, నూతన పరిచయాలను ఆ స్నేహా మధుర్యాలను కూడా అనుభవిస్తాం.

నీ విద్యాభ్యాసం ఎలా ఓ రోజు ముగుస్తుందో అదే విధంగా నీ జీవిత అధ్యాయం కూడా ఓ రోజు ముగిసితీరవల్సిందే!ఇది నిర్దుష్టమైన వైజ్ఞానిక సత్యం!


కొత్తకారును 🚗 తీసుకున్నాక పాతకారును ఎలా వదిలివేస్తావో,నూతన గృహప్రవేశం🏡 చేసాక పాతఇంటిని ఎలా ఖాళీ చేసి వెళ్తావో, అదేవిధంగా జీర్ణమై శిధిలమైన ఈ దేహాన్ని ఆత్మ వదిలి కొత్త దేహాన్ని ధరించడానికి సిద్ధమైపోతూ వుంటుంది.

ఈ కాలచక్రంలో ⭕ ఆత్మ తన జీవితచక్రాన్ని అనాదిగా ఇలాగే కొనసాగిస్తూ వుంది.

అందుకే ఈ దేహాన్ని ఆరోగ్యవంతంగా చైతన్య వంతంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే!

ఈ జీవితగమనంలో అనేక విషయాలు తెలుసుకుంటూ ఈ దేహంతో ఎన్నో కర్మలను ఆచరిస్తూ వుంటుంది,అందులో కొన్ని అసంపూర్ణ కర్మలుగా మిగిలి పోతాయి.ఆ అసంపూర్ణ కర్మఫలాలను అనుభవించడానికి మరిన్ని కర్మలు ఆచరించడానికి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇంకో అవకాశమే ఆత్మకు మరుజన్మ. ఈ మహాప్రస్థానంలో దేహంతరప్రాప్తి అనేది విరామం.


కర్మ అంటే ఏమిటి?

కర్మ అంటే మన ఆలోచన, చేసేపని. ప్రతి పనికి ఓ ఫలితం ఉంటుంది. చేసే పనులు మంచివి అయితే మంచి ఫలితాలు చేసే పనులు చెడ్డవి అయితే చెడ్డ ఫలితాలు ఇస్తాయి.

ఇటీవలి కాలిఫోర్నియా యూనివర్సిటీలో శాస్త్రీయ పరిశోధనా అధ్యయనాఫలితాలు ఇలా తెలియ చేస్తున్నాయి.

మంచి కర్మలు ఆచరించే వారిలో 80%మంది జీవితాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. కేవలం 20% మంది జీవితాలు సాధారణంగా కొనసాగినా వారు ఎంతో సంతోషంగా జీవిత మధుర్యాలను అనుభవిస్తున్నారు. అయితే సంతోషంతో ఎవరైతే సహజీవనం కొనసాగిస్తారో భవిష్యత్తులో వారు విజయ శిఖరాలు 🚵‍♀️చేరుకుంటారు.

మంచికర్మలనే ఆచరించే వారి చుట్టూ ప్రశాంత వాతావరణం, పాజిటివ్ వైబ్రేషన్ తో కూడిన ఆరా ఏర్పడుతుంది.


కర్మ సిద్దాంతం

కర్మ సిద్దాంతం ప్రకారం చేసే ప్రతి పనికి ఓ కారణం ఉంటుంది. ప్రతికారణం ఓ ఆలోచన నుంచి జనిస్తుంది. ప్రతిఅలోచన ఓ సంకల్పం నుంచి జనించిందే!


కర్మని ఎలా ఆచరించాలి.

ఓ పోటీ పరీక్షకు ముందుగానే పోటీ ఎలావుంటుంది, అందులో విజయం సాధించగలమా అనే ఆలోచనలు, విత్తనాలు మడిలో విత్తకనే పంటరాబడిని గురించి ఆలోచించడం లాంటిది, ఐతే పోటీని గురించిన ఆలోచనగాకుండా 100% నీప్రయత్నలోపం లేకుండా నీ వంతు ప్రిపరేషన్ వుండాలి అప్పుడు నీ నుంచి విజయాన్ని ఎవరు ఆపలేరు!


పరమాత్మ భగవద్గీతలో ఈ సత్యాన్ని నిష్కామకర్మగా ప్రబోధించారు.

కర్మణ్యేవాధికారస్తే మా పలేషు కదాచన

మా కర్మఫలహేతుర్భుః మా తే సంగోత్స్వ కర్మణి

కర్తవ్యం నీ వంతు,కాపాడుట నా వంతు.


మనం ఆచరించే కర్మలు కొన్ని చేయదగినవి మరికొన్ని చేయదగనిగా వుంటాయి.

చేయదగిన విహితకర్మలు నిష్కామ కర్మలుగా తప్పక ఆచరించాలి.


కర్మలు అకర్మ, వికర్మలు గా వుంటాయి, వికర్మ ఫలాలు అనుభవించి తీరాల్సిందే, అకర్మ ఫలాలు నిన్ను కర్మ బంధాలలో బంధించవు.

మానసిక స్థితి,భావనలే అకర్మ లేక వికర్మలుగా ఫలితాలను ఇస్తాయి.


కబడ్డీ, రగ్బీ 🏉,కుస్తీ, సాకర్ ⚽ లాంటి ఆటలలో ఆటగాడు తీవ్రంగా గాయపడినా అది అకర్మ. అదే ఉద్దేశపూర్వకంగా గాయపరిస్తే వికర్మ .

అగ్నిప్రమాద రక్షణలో భుజాల నుంచి జారి అతను మరణిస్తే అది అకర్మ. కానీ ఉద్దేశపూర్వకంగానే నిప్పుల్లోకి పడేస్తే అది వికర్మ.

యుద్ధరంగంలో శత్రువును తుపాకీతో కాల్చిపడేస్తే అది అకర్మ , అదే ఓ టెర్రరిస్ట్ తూటా పేలిస్తే అది వికర్మ.

జింకను వేటాడటం సింహానికి అకర్మ, మాంసాహారం తీసుకోవడం అది నీకు వికర్మ.

జ్ఞాని కర్మలను అకర్మలుగా ఆచరిస్తాడు.


చేయదగని కర్మలు, వికర్మలను అదేవిదంగా ఆచరిస్తూ వుంటే ఆ కర్మబంధనాలలో బంధిగా కర్మఫలాలు తప్పక అనుభవించి తీరాల్సిందే!


ఇచ్చినవారు అడుగలేదని మనం ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే ఆది ఇచ్చే వరకు మళ్ళీ మళ్లీ తిరిగి జన్మించాల్సిందే. ఆ ఋణానుబంధం తీరేవరకు కర్మబంధ విముక్తుడివి కాలేవు. అందుకే ఇతరులనుంచి ఏమీ అయాచితంగా స్వీకరించరాదు. అందుకే గౌరవవేతనాలు, పురస్కారాలు, బహుమతులు కూడా ఆశించరాదు. ఈ అపరిగ్రహం ఎంతో కొంత ఆచరిస్తూ వుంటే భగవంతునికి మరింత దగ్గర అవుతూ కర్మబంధన విముక్తికి చేరువవుతావు.


చేసే పనులలో కొన్నింటికి కర్మఫలాలు వెంటనే వస్తాయి, మరి కొన్ని కర్మఫలాలు నెమ్మదిగా వస్తాయి. కొన్ని అసంపూర్ణ కర్మఫలాలను అనుభవించడానికి ఆత్మ ఇంకో జన్మ తీసుకోవాల్సిందే!


కర్మ అంటే శిక్ష కాదు. కర్మ అంటే శిక్షణ🪔.ఋణాను బంధన విముక్తికి పరమాత్మతో స్థితమయ్యే అపురూప సువర్ణావకాశం!!!


సర్వే జన సుఖినోభవంతు


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

RaNa


9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

 
 
 

Comments


bottom of page