top of page

జాగృతి మాలిక 21

  • Writer: Admin
    Admin
  • 3 days ago
  • 2 min read

వీడని మిస్టరీ ఈ బ్రహ్మపదార్థం!!!

➿➿➿➿➿➿➿➿


📌నేనెవరిని అనే జిజ్ఞాస🔏 అనాదిగా తత్వవేత్తల మదిలో ఉదయించి సృష్టి మూలలను సృశించే ప్రేరణకు బీజం అయింది!

🌱అంకురించిన ఆ బీజము మానవమేధస్సుకు, మేధోమధనంకు నాందిగా సత్యాన్వేషణ దిశలో మార్గదర్శిగా అడుగులు వేయించింది!!

🌱బ్రహ్మపదార్థం సృష్టికి మూలం అనే ఙ్ఞానం సిద్ధయోగం ద్వారా వారి మదిలో ఉదయించి అదే వేదఙ్ఞానంగా భావితరాలకు చేరువ అయింది!!!


✨ఆ బ్రహ్మపదార్దంలో జీవం వుంది.

నాతోనే నీ జీవితం వుంది.

నాతోనే నీ మనుగడ వుంది.

నాలో చైతన్యం వుంది.అదే జీవచైతన్యంగా నిన్ను ముందుకు నడిపిస్తుంది.

నాలో నాదం వుంది.అదే నీలో సప్తస్వరాల స్వరపేటికగా వుంది.

అంతర్యామిగా నీలో వుండే ఆ పరమాత్మ బింబస్వరుపాన్ని, నేనే జీవాత్మను.

నేనే నీలో బుద్ధి రూపాన్ని.

నేనే నీ విచక్షణ జ్ఞానాన్ని.

నేను దయ, కరుణ, ప్రేమల స్వరూపాన్ని.

నేనే నీలో ప్రాణశక్తిని, ప్రాణధాతని.

నీలో అక్షరబ్రహ్మశక్తి స్వరూపాన్ని నేనే

నేనే శివం, నీ నుంచి సెలవు తీసుకుంటే నీవు ఇక శవం.


🪅నీవు మాట్లాడుతున్నా, తిరుగుతున్నా, నిద్రిస్తున్నా,శ్వాసిస్తున్నా,చూస్తున్నా,వింటున్నా, ఆలోచిస్తున్నా, మౌనంగవున్నా, పనిచేస్తున్నా,నిలుచునివున్నా, చదువుతున్నా,

నీ వినోదాలలో, ఆటపాటల్లో, ప్రేమలో, విరహంలో, శృంగారంలో, కోరికలలో, ప్రార్థనల్లో, భక్తిశ్రద్ధల్లో,మొహంలో నీతోనే నీలో ఉపద్రష్టగా వున్నాను. ఆత్మసాక్షిగా నీ ప్రవర్తన వుంటూవుంటే నేనే ఆప్తమిత్రుడను, నీ క్షేమం నా అభీష్టం!


నీవు నడిచే మార్గం విలాసవంతంగా, ఆకర్షణీయంగా, అందంగా, ఆహ్లదకరం అని నీకు అనిపించిన అది నీ జీవితగమ్యం🎯వైపే తీసుకువెళుతుందా లేదా అన్నదే ప్రదానం!!!


నీ లక్ష్యం 🏹బహుసుందరమైన పరమైపవిత్రమైన దివ్యధామం🔱 ఐతే వెళ్లాల్సిన మార్గం క్లిష్టతరమైన నేనే నీతోడునీడగా ఆప్తమిత్రుడిగా ముందుకు నడిపిస్తూ నీ ప్రయాణం సుగమం చేస్తాను!!!


జీవితంఅంటే ఎంత మందితో నీవు వున్నావు అన్నది ముఖ్యం కాదు నాతో ఎలా వున్నావు అన్నది ముఖ్యం!


నాతో నీ ప్రయాణం కష్టాలలోఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఏవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, అర్ధం అయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు, నేర్చుకోవడానికి ప్రయత్నించండి, కానీ పారిపోవడానికి ప్రయత్నించకండి. కష్టాలను సవాళ్లగా ఆహ్వానించండి మీ జీవితం అందరికీ ఆదర్శప్రాయం అవుతుంది.


ఓ చిన్నపాటి సుత్తిదెబ్బకు గాజుపలక ముక్కలవుతుంది, అదే సుతిమెత్తని సుత్తిదెబ్బలకు బంగారం ఆకర్షణీయమైన నగ అవుతుంది. జీవిత గమనంలో ఎదురయ్యే కష్టాలు, సవాళ్లు నీ లోని ప్రతిభ వ్యుత్పతులకు గీటురాయి అవుతాయి.


ఏ విషయంలోనూ ఎవరి మీద

ఆధారపడకండి.ఒక్కసారి అడిగితే సాయం.

అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం.

వీలైనంతవరకు స్వయంకృషితో 💇ఎదగండి, ఎవరి నుంచి అయాచిత సాయం ఆశించకండి. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది.


మనస్సుని ప్రశాంతంగా వదిలేస్తే ఉషోదయంలో🌄 వికసిస్తున్న పూలమొగ్గల్లా 🌷మనోఫలకంలో నా ఉనికి గోచరిస్తుంది.


తీసే చిత్రం కెమెరా యాంగిల్ కు సరిలేకపోతే ఫోటోగ్రాఫర్ తన కెమెరా పొజిషన్ మార్చి ఫోటో ఎలా షూట్ చేస్తాడో, అదేవిదంగా జీవితంపట్ల నీ దృక్పథం పరిస్థితులకు అనుగుణంగా వుంటే సంతోషం వెల్లివిరుస్తుంది.


అదృష్టం ద్వారా లభించేది, అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సాధిస్తే ఆది సంతోషాన్ని కలిగిస్తుంది. కష్టపడి తెలివితో సాధిస్తే అది సంతృప్తిని కలిగిస్తుంది!!!అందుకే తెలివితేటలతో కష్టపడుతూ నీ కలలను సార్ధకం చేసుకోనే దిశలో నీ ముందడుగు 👣 వేయాలి, అదృష్టం కలిసివస్తే సాదరంగా ఆహ్వానించు.


నదిలోని నీరు🌊 తియ్యగా ఉంటుంది. ఎందుకంటే నది అందరికీ నీటిని ఇస్తుంది. జీవితంలో దయ, కరుణ, ఆర్థ్రతలతో కలిగిన మనస్సు వుంటే అది మధురం అవుతుంది!

సముద్రంలోని నీరు ఉప్పగా ఉంటుంది. ఎందుకంటే సముద్రం కేవలం నీటిని తీసుకుంటూవుంటుంది. జీవితంలో కేవలం ఆశించే స్వభావం వుంటే తొందరగా ఒంటరి అవుతావు!

ఎటువైపు ప్రవహించకుండా ఉండే నీటికి దుర్గంధం వుంటుంది. ఎందుకంటే నీరు నిల్వ వుంటుంది అదే విధంగా లోభత్వం కూడిన మనస్సుతో జీవితం నిరుపయోగం అవుతుంది!

నదిలోని నీరులా జీవనగమనాన్ని సంతోషభరితంగా కొనసాగిస్తూ వుండాలి!!


సర్వే జన సుఖినోభవంతు


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

RaNa

9900022729

🧘🧘🧘🧘🧘🧘🧘🧘

 
 
 

Comments


bottom of page