top of page

జాగృతి మాలిక 22

  • Writer: Admin
    Admin
  • 3 days ago
  • 3 min read

ఎందుకు ఈ తీరని అసంతృప్తి ? అధిగమించడం ఎలా?

➰➰➰➰➰➰➰➰➰➰➰➰


📍 ఉరుకులు పరుగులు, ఒడిదుడుకులతో కూడిన ఈ జీవనప్రయాణం తన జీవన గమనంలో మన అందరిలో ఎంతో కొంత మంచితనం, సంతోషం, రాగద్వేషాలకు మరెంతో అశాంతి, అసంతృప్తి, నిరాశ, నిస్పృహలకు ఆలంబన అయింది. వీటిని సమర్థవంతంగా నియంత్రిస్తూ సంతృప్తి పథంలో పయనానికి ఓ ప్రణాళిక ఉండాలి.


📌తన ముందు తరాలకు తరగని ఆస్తులను సంపాదించిన, అభిష్టరంగాలలో ప్రతిభా పాటవాలతో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన,లబ్ధప్రతిష్ఠలు 🎷పొందిన, ఎన్నోఅవార్డులు🏆,రివార్డులు🥇 అందుకున్న అవి ఎంతో సంతోషాన్ని కలిగించినా జీవితంలో ఏదో తెలియని అసంతృప్తి ,🌪️ వెలితి మనస్సుపొరల్లో నిగూఢంగా వుండివుంటుంది!!!


🌱మానవీయత, దేహధర్మం, పారమార్ధిక జీవనం, జీవితవిలువల పై చూపించే అశ్రద్ధ,అనాధరణే అసంతృప్తికి బీజం అవుతున్నాయి!!


🪅ఆరోగ్యమే మహాభాగ్యం అనే జీవితసత్యాన్ని కంచంలో ఆహారం🥗 తీసుకునే ప్రతిసారి జాగురుతతో యోచనచేస్తు అది నీకు, నీ మనస్సుకు హితహారం🥙 అయితే మితంగా తీసుకుంటే రసానునుభూతితో ఈ దేహం ఆస్వాదిస్తుంది. ఈ దేహధర్మాన్ని తప్పక గౌరవించాలి!!

ప్రేమ, ఆప్యాయతలతో రుచికరమైన ఆహారాన్ని అందించే ఆ చేతులను మనఃపూర్వకంగా కృతజ్ఞాపూర్వకంగా అభినందించాలి!!!


🪅 మన పిల్లలకు సంపాదించడం ఎలా అన్నది నేర్పించడమే గాకుండా, విలువలతో కూడిన జీవితంతో సంతోషంగా ఎలా గడపాలి అనేది నేర్పించడమే ప్రదానం!!

అది జీవితంలో స్నేహామధురానుభూతుల పరిమళాలను ఆస్వాదించడానికి,నాణ్యమైన దృక్పథంతో విజయపథంలో జీవనాన్ని కొనసాగించడానికి, నవసమాజ నిర్మాణానికి వేదిక అవుతుంది!!!


🪅 భార్యాభర్తలు ఇద్దరు చక్కటి ఉద్యోగాలతో మంచి సంపాదనలతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్న హృదయంతరాలలో ఏదో తెలియని వెలితి అసంతృప్తితో నగర జీవితానికి అంకితమైన కుటుంబాలు ఎన్నెన్నో, ఈ వెలితిని అధిగమించడం ఎలా?

మీ జీవిత భాగస్వామిని, కుటుంబాన్ని మనస్పూర్తిగా ఇష్టపడండి, చేదోడు వాదోడుగా వుండండి, అగౌరవపరచే విధంగా ఎప్పుడూ మాట్లాడకండి. వారితో ఏమి మాట్లాడినావు అన్నది ముఖ్యం కాదు, వారితో ఎలా మాట్లాడినావు అన్నదే ప్రధానం!!!

మీ పై నమ్మకము, విశ్వాసం సడలని విధంగా మీ నడవడిక, ప్రవర్తన, మాట తీరుతెన్నులు వుండాలి.

నిజాయితీగా జీవించడం ఆరంభిస్తే మీ గృహంలో ప్రేమ, ఆప్యాయత, సౌభతృత్వలు వికసిస్తాయి. అది స్వీట్ హోమ్ అవుతుంది!!!


🌀సుఖశాంతులు, సంతోషాలు ఆనందం అనేవి సంపదలు, భోగసామాగ్రి సమకూర్చుకోవడంతో లభిస్తాయి అనే మాయదర్పణంలో వీక్షిస్తూ అలుపెరుగని జీవితప్రయాణం కొనసాగించి అది ఎండమావిలో దప్పిక తీర్చుకొనే వృధాప్రయాసే అని జీవిత చరమాంకంలో మనోదర్పణంలో అవగతం అవుతూ అవి కేవలం నీ లోనే వున్నాయి అనే సత్యం బోధపడినా ఏమిచేయలేని నిస్సహాయస్టితి మనస్సును అవరించేస్తుంది!!!


జీవిత పాఠశాలలో ఇతరుల అనుభవాలే మనకు గుణపాఠాలు అవుతాయి.

🛝నీవు కొనసాగించిన ప్రయాణం ఎగ్జిక్యూటివ్ క్లాస్, బిజినెస్ క్లాస్, ఎకానమీ క్లాస్ అన్నది ముఖ్యం కాదు, నీ ప్రయాణం ఎలా ముగిస్తున్నావు అనేది ప్రధానం !!

🛝నీవు ప్రయాణించే కారు 5 లక్షలు కాని 50 లక్షలు అన్నది కాదు ముఖ్యం నీ గమ్యం ఏలా చేరుకుంటున్నావు అనేదే ప్రధానం!!

🛝నీ చేతి గడియారం 5 వందలు లేక 5 లక్షలు అన్నది అప్రస్తుతం, ప్రస్తుతం నీ టైమ్ 🕰️ఎలా వుంది అన్నదే ముఖ్యం!!

🛝నీవు వుండేది పెంకుటిల్లు లేక విలాసవంతమైనబంగ్లా అన్నది ప్రశ్న కాదు ఆ ఇంట్లో నీవు ఎంత సౌఖ్యవంతంగా వున్నావు అన్నదే అసలైన ప్రశ్న!!

🛝నీ బ్యాంకు బ్యాలెన్స్ పదిమిలియన్లు, వాలెట్ లో వెయ్యి రూపాయలే వున్నాయి అన్నది అప్రధానం నీవు ఎంత ఆరోగ్యంగా వున్నావు అన్నదే ప్రధానం!


📌మీ కుటుంబం సభ్యులతో కలిసి ఈ మూడు ప్రదేశాలు చూడాల్సిందే. జీవిత సత్యాలను అవగతం చేసే విశ్వవిద్యాలయాలు అవి!!!

✅మీరు పిల్లలతో కలిసి హాస్పిటల్లో పేషెంట్లు వుండే ICU 🛏️ వార్డులను చూడండి. ఆరోగ్గ్యం కంటే జీవితంలో విలువైనది ఏమీ లేదు అన్న సత్యం వారికి బోధపడుతుంది.

✅జైలులో ఖైదీలతో వుండే బరాక్సులను చూపించండి. వీలైతే ఖైదీలతో మాట్లాడండి

అప్పుడు మీకు జీవితంలో స్వేచ్ఛ ఎంత అపురూపసంపద అన్నది గ్రహిస్తారు.

✅ శ్మశానవాటికకు కూడా వెళ్ళండి, అదే మహాప్రస్థానం. నడిచిననేల, విలాసవంతమైన ఇల్లు, సంపదలు, అపురూప వస్తువులు ఇవి నీవి కావు అనే పరమాత్మతత్వం అవగతం అవుతుంది!!!


🕉️ మీరు దగ్గర్లోని దేవాలయంకి తరుచుగా కుటుంబంతో వెళ్ళండి. ఆ పరమాత్ముడి దివ్యసన్నిధిలో ప్రశాంతంతని తనివితీరా అనుభవించండి. మీ కోరికలను హృదయపూర్వకంగా పరంథాముడికి నివేదించండి.తీర్థప్రసాదాలను భక్తి పూర్వకంగా స్వీకరించండి.ఆశీస్సులను వినమ్రతపూర్వకంగా అందుకోండి. ఆధ్యాత్మిక భావనలు హృదాయంతారలను సృశిస్తూ ప్రశాంతతో నీలోని వెలితిని భర్తీచేస్తుంది!!


📌జీవితం అంటే ఏమిటి అన్నది స్వయంగా అన్వేషించి తెలుసుకోవాలి.

📍జీవితం అంటే తరతరాలకు సరిపడే సంపాదన కాదు!

📍జీవితం అంటే విలాసవంతమైన బంగ్లాలో నివసించడంకాదు!

📍జీవితం అంటే అవార్డులు, రివార్డులు కాదు!

📍జీవితం అంటే కీర్తి, ప్రతిష్ఠలు కాదు!

📍జీవితం అంటే గౌరవ మర్యాదలు కాదు!

📍జీవితం అంటే ఏమీ వున్నాయి అన్నది కాదు!

📍జీవితం అంటే పార్టీలు, స్నేహితులు కాదు!

📍జీవితం అంటే చేసే వృత్తి, వ్యాపారం,ఉద్యోగం కాదు!

📍జీవితం అంటే నాది అన్నది ఏమీకాదు!


మరి జీవితం అంటే ఏంటి⁉️

✔️జీవితం అంటే ఒదిగి వుండడం!

✔️జీవితం అంటే ఎవరికి అపకారం కలిగించకపోవడం!

✔️జీవితంలో అపరిగ్రహంను పాటించడం. ఎవరిది ఆశించక, యాచించక పోవడం!

✔️జీవితం అంటే అందరి శ్రేయస్సుపై ఆకాంక్ష కలిగి వుండడం!

✔️జీవితం అంటే కష్టాల కడలి కాదు,జీవితం అంటే సంతోషంగా జీవించడం!

✔️జీవితం అంటే అంధకారమయం కాదు, ఆది ప్రకాశభరితం, చైతన్యభరితం!

✔️జీవితం ఓ వైకుంఠపాళి అందులో అవకాశాలు అనే నిచ్చెనలు🪜సమస్యలు అనే పాములు 🪱కూడా వుంటాయి,సమస్యలను వివేకంతో పరిస్కరించుకొనే నెర్పరితనం అలవరుచుకోవాలి.

✔️జీవితం అంటే అరమరికలులేని సంసారం!

✔️జీవితం అంటే నిన్ను నిన్నుగా జీవితాంతం ఇష్టపడేవాళ్ళను వదులుకోక పోవడం!

✔️జీవితం అంటే పరమాత్మతో విడదీయలేని అనుబంధం!

✔️జీవితం అంటే దయ, కరుణ, జాలి,ప్రేమలు కలగలిపిన మధురానుభూతుల సంగమం!


నదిలో ప్రవహించే నీరు🌊 ముందుకే పయనం సాగిస్తుంది వెనుకకు ఎలా ప్రవహించదో అదే విధంగా జీవితంలో జరిగిపోయిన విషయాలతో మదనపడడం జీవితాన్ని వేదనామయం చేస్తుంది. అందుకే వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు దిశలో జీవయానం కొనసాగించాలి!!


సర్వే జన సుఖినోభవంతు


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

RaNa

9900022729

🧘🧘🧘🧘🧘🧘

 
 
 

Comments


bottom of page