జాగృతి మాలిక 23
- Admin
- 3 days ago
- 2 min read
🕉️విశ్వ చైతన్యశక్తి విశ్వంభర
➰➰➰➰➰➰➰➰
నింగిలోకి వెళ్తున్న విమానం✈️ను కంటితో చూస్తాం కానీ అది గాలిలోకి ఎలా ఎగిరి, ఎలా ప్రయాణిస్తుంది, ఓ గులకరాయిని గాలిలోకి విసిరి వేస్తే నేల మీద పడుతుంది,కాని ఓ పక్షి 🦅ఆకాశంలో ఎలా ఎగురుతుంది అనేది చూసే కంటికి 👁️ తెలియదు, కానీ ఫలితాన్ని గమనించదగిన తెలివి దానికి వుంది.
స్మృతివంతమైన మనస్సు తన అనుభవపూర్వక జ్ఞానంతో అది భూమికి గురుత్వాకర్షణశక్తి వుంది, దాని ప్రభావంతో ఇలా జరుగుతుంది అని గ్రహిస్తుంది. ఆ అనుభవాన్ని, ఆకర్షణాశక్తిని కన్ను చూడలేదు, గ్రహించలేదు.
అదేవిదంగా మనం కంటితో👁️ చూసే ఈ ప్రపంచంలో కొంతమాత్రమే నిజం. మిగిలిన ప్రపంచం అంతా మనసు చేసే మాయ!
ప్రపంచం అంటే కంటికి కనిపించేదే కాదు మనస్సు చేసే రూపకల్పన కూడా!!
అందుకు కారణం, అనుభవం, ఫలితాలను విశ్లేషించే అనుభవపూర్వక జ్ఞానం మనస్సుకు మాత్రమే వుంది.
వెలుగులో వున్న వస్తువులను మాత్రమే చూడగలం, కానీ చీకటిలో వున్న ఏ వస్తువును చూడలేం. వెలుగులో వున్న నాణెంని కూడా ఒక వైపు మాత్రమే చూడగలం,అదే నాణెం గాలిలో తిరుగుతూ వుంటే దాని రూపాన్ని గ్రహించలేవు!!
మనకు సమీపంలో వుండే నక్షత్రం☀️ సూర్యుడు నుంచి వచ్చే కాంతి⚡ ఓ సెకనుకు మూడు లక్షల కిలోమీటర్లు వేగంతో భూమికి🌐 చేరడానికి రమారమి ఎనిమిది కాంతి నిమిషాలు ప్రయాణం చేసి భూ వాతావరణంలో ఆవరించిన సూక్ష్మకణాలపై పరావర్తనం చెందుతుంది, అందువలన ఈ అంతరిక్షం 🌓 పగటిపూట ప్రకాశవంతంగా కనిపిస్తుంది,కాని నిజానికి అంతరిక్షం🌑 చీకటి మయం!!!
మనకు సూర్యనక్షత్రం తరువాయి సమీప⭐ నక్షత్రం నుంచి కాంతి⚡ మనకు చేరడానికి నాలుగు కాంతి సంవత్సరాలు ప్రయాణం చేస్తుంది. ఈ వినీల ఆకాశంలో అటువంటి నక్షత్రరాశులు🌌 కోకొల్లలు. నిశీరాత్రిలో సుదూరాల నుంచి ప్రయాణించిన వాటి కాంతి భూవాతవరణం లోని సూక్ష్మకణాలపై ప్రతిఫలిస్తూ 🌠మిణుకు మిణుకుగా అగుపిస్తుంది. అటువంటి ఎన్నో నక్షత్రరాశుల సమూహమే ఓ పాలపుంత అనే గెలాక్సీ!
భూతకాలంలో నక్షత్రంలో జనించిన కాంతిని వర్తమానంలో మనం చూస్తున్నాం మనకంటే దూరంగా వుండే గ్రహం భవిష్యత్తులో దర్శిస్తుంది. అందుకే కాలానికి వర్తమానం మాత్రమే ఉంటుంది భూత భవిష్యత్తు కాలాలు అనేది మనస్సు చేసే గారడీ. అందుకే వర్తమానంలో జీవించాలి, అదే వాస్తవిక జీవితం.
✍️ఆరుబయట రాత్రి సమయాల్లో ఆకాశవీధిని వీక్షించే ఆసక్తిని మీ పిల్లలలో కలుగచేయండి. నక్షత్రాలు,గ్రహాలు,ఉపగ్రహాలు,తోకచుక్కలు, చంద్రగమనం దశ దిశలను వారికి తెలియ చేయండి.ఈ ఖగోళంలోని వింతలు,విశేషాల జ్ఞానసంపదను మీ మదిలో పదిలంచేసుకోండి!!
ఖగోళ శాస్త్రీయ అధ్యయనాలు మన పాలపుంత రమారమి నూరు మిలియన్ల కాంతి సంవత్సరాల దూరం విస్తరించిన ఓ అనంత ద్రవ్యరాశిగా ఈ బ్రహ్మాండంలో అది ఓ భాగం అని వెల్లడించాయి. ఇటువంటి పాలపుంతలు ఎన్నెన్నో ఈ విశాల వినువీధిలో విస్తరించి వున్నాయి. వాటిని మానవనేత్రంతో 👁️వీక్షించడం అసాధ్యం, కేవలం శక్తివంతమైన టెలిస్కోపుల🔭 ద్వారానే ఈ ఖగోళంని కొంత మేరకు వీక్షించవచ్చు.
✍️ మీరు ఓ నక్షత్రశాలను తప్పక దర్శించండి, సౌరకుటుంబంలోని గ్రహాలు, ఈ ఖగోళంలో విస్తరించిన నక్షత్రరాశులను, గెలాక్సీలను వీక్షించే ఖగోళ ఙ్ఞానానుభూతిని మీ సొంతం చేసుకోండి!
ఈ బ్రహ్మాండం బ్రహ్మపదార్థంతో సర్వత్రా విస్తరించిన చైతన్యశక్తి రూపం!!!
అది పరమాత్మ నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపం!!!
ఈ బ్రహ్మపదర్ధం సృష్టికి మూలం. అది మనలో శక్తి,చైతన్య రూపంలో ప్రకాశించే జీవపదార్థం అదే జీవాత్మ!!!
అది ఆచింత్యం, మనస్సుతో గ్రహించలేని శక్తి రూపం.
అది అవ్యక్తం, జ్ఞానేంద్రియాలకు గోచరించని చైతన్య రూపం.
అది అవ్యయం, ఇది అనశ్వరం, శాశ్వతమైనది.
అది అచ్చేద్యం, ఇది చేదింపలేనిది.
అది ఆశోష్యం, ఇది శీతోష్ణప్రభావరహితం.
అది అక్లేద్యం, ఇది నీటితో తడుపలేనిది.
అది అదాహ్యమం,ఇది అగ్నితో దహింపబడలేనిది.
అది సర్వగతం,ఇది సర్వత్రా వ్యాపించినది.
పరమాత్మ🔱 ఈ సృష్టికి ఆధారభూతుడు!!!
అణువు కంటే సూక్ష్మమైనవాడు, సూక్ష్మతమైనవాడు!!!
మహద్వస్తువుల కంటే మహాత్తరమైనవాడు!!!
🔱ఈ విశాల విశ్వాన్ని ధరించిన విశ్వంభరుడు!!!
🔱పాలసముద్రం అనే పాలపుంతల సమూహాలను తల్పంగా శయనించే శయనధారి!!!
🔱చక్రరూపంలో పరిభ్రమించే ♻️ఈ అనంత విశ్వాన్ని ధరించిన చక్రధారి!!!
🔱అతనే అధ్యంతరహితమైన ఈ విశాలవిశ్వమంతా వ్యాపించిన విష్ణువు!!!
పరమాత్మ🔱 సంకల్పబీజం ద్వారా ఈ సృష్టి ఆరంభం కంటికి కనిపించని అతి సూక్ష్మకణాల కలయికతో పరమాణు రూపంలో ఆవిర్భవించింది. అటువంటి కొన్ని పరమాణువుల కలయికనే కణం లేక అణువు. కొన్ని కణాల కలయికనే జీవపదార్థం. పరిణామక్రమంలో ఈ జీవపదార్థాల కలయికనే జీవరూప అవతరణకు నాంది అయింది.
పకృతి లోని ప్రతి ప్రాణి ఆ పరమాత్మ సృష్టి రూపం. ఈ సృష్టి లోని ప్రతి జీవియందు సమత్వయోగ భావనతో ఈ పర్యావరణ సమతుల్యతను కాపాడడం మనందరి బాధ్యత!!!
సర్వే జన సుఖినోభవంతు
మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి
RaNa
9900022729
🧘🧘🧘🧘🧘🧘🧘
Comments