భావ తరంగిణి 04
- Admin
- Aug 12
- 1 min read
Updated: 6 days ago
జీవధార,జీవనధార,ప్రాణధార మంచి నీళ్ళే!!
జీవభరితం, వైవిధ్యభరితం అయిన ఈ భగవంతుని సృష్టి బహు విలక్షణభరితంగా, మన ఆలోచనలకి, అంచనాలకు అందని విశిష్టస్థాయిలో ఉంటూ మానవాళి మేధస్సుకి, విజ్ఞతకి, ప్రతిభకి , ప్రజ్ఞలకి పదును పెడుతూ ఎన్నో నూతనావిష్కరాలకి కేంధ్ర బిందువుగా మార్గదర్శకంగా పయనింపచేస్తునే వుంది.
మన దేహానిర్మాణం కూడా అంతే విలక్షణభరితం!
ఈ భూమి 70% నీరు, 30% ద్రవ్యరాశితో విస్తరించిన ప్రకృతి. సరిగ్గా అదేవిధంగా మన దేహాల్లో కూడా 70% ద్రవరాశి రూపంలో వుండే నీరే !! నీరే మనకి జీవధార, జీవనధార, జీవితధార,ప్రాణధార కూడా!!
సమాజప్రగతి,పురోగతి,ఆర్ధికస్వవలంబనకి, ప్రభుత్వవ్యవస్థలను ప్రభావితం చేసింది,చేస్తున్నది,చేయబోయేది కూడా ప్రకృతి ప్రసాదిత జలాలే!
ప్రపంచంలో అతిపురాతన,విశిష్ట మానవ నాగరిక సమాజాలు హరప్ప, సింధు నాగరికతలు గంగ, సింధు నదుల పరివాహక ప్రాంతాల్లోనే వికసించి నలుదిశల విస్తరించి శోభిల్లింది!!
నాడు నేడు కూడ వివిధ దేశాల మధ్య ఈ జలయుద్దాలు అనేకమార్లు జరిగాయి, జరుగుతున్నాయి !
నేడు ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న పాక్ పై మనం అప్రకటిత జలయుద్ధానికి శంఖారావం పూరించాం !!
ఇక వ్యక్తిగత పరంగా
రోజూ త్రాగేనీళ్లు మన శరీరవ్యవస్థలో:
ఆహారం సమర్థవంతంగా జీర్ణం అవడానికి,
జీవరసాయనకచర్యలతో మేళవించిన రసరూపఆహారం జీవశక్తిగా అంగంగాలకి రక్తకణాలద్వారా చేరవేయడానికి,
వ్యర్థపదార్థాలను మలరూపంలో సుఖ విరోచనం అవడానికి,
స్వేదక్రియద్వారా శరీర ఉష్ణోగ్రతల సమతుల్యతలను పరీరక్షించడానికి , కిడ్నీల్లోని నెప్రాన్ వ్యవస్థ జీర్ణక్రియలోని రసాయనచర్యల ఫలితంగా విడుదలైన మలినాలను వడపోతప్రక్రియ ద్వారా రక్తశుద్ధికి, తద్వారా మలినాలను సాఫీగా మూత్రంద్వారా విసర్జనకి కారణం అవుతుంది.
ఆరోగ్యవంతమైన ఈ దేహం సమర్థవంతంగా తన కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రతిరోజు మూడు లీటర్లనీళ్లు త్రాగి తీరాల్సిందే!
పరగడుపున 2 నుంచి 3 గ్లాసుల మంచి నీళ్లు త్రాగడంవలన మలబద్ధకం తొలిగి ప్రేవువ్యవస్థ సమర్థవంతం మవుతుంది.
కొబ్బరినీళ్లు, తాజామజ్జిగ,తాజా పండ్లరసాలు,చెరకురసాలు,వెజిటేబుల్ జ్యూస్ లను కూడా తీసుకోవచ్చు.
భగవత్ప్రసాదితమైన ఈ విలక్షణదేహం శతవసంతాలు సమర్థవంతంగా ప్రతిఫలాపేక్ష లేకుండా మీ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ప్రతిరోజూ కనీసం మూడులీటర్ల శుద్ధమైననీళ్లు త్రాగాలి.
ద్రవరాశి సమతుల్యతలను కాపాడడం మీ కనీసబాధ్యత!!
వృద్ధులలో దప్పిక తక్కువగా ఉంటుంది. అందువల్ల కేవలం ఒకటీ రెండు గ్లాసుల నీరు తీసుకుంటుంటారు. అది డిహైడ్రేషన్ కి కారణం అవుతుంది. మీరు జాగరూకతతో గమనిస్తూ తగినంత నీరు త్రాగే విధంగా వారిని ప్రోత్సహించాలి.
శరీర ధర్మాన్ని గౌరవిద్దాం!!
ఈ దేహాన్ని కృతజ్ఞతపూర్వకంగా ప్రేమిద్దాం!! ఆరోగ్యవంతంగా జీవితాన్ని కొనసాగిద్దాం!!
సర్వే జన సుఖినోభవంతు
మీ ఆధ్యాత్మిక సేవలో
RaNa
9900022729
Comments