భావ తరంగిణి 05
- Admin
- Aug 12
- 2 min read
Updated: 6 days ago
ఈ నిద్ర మత్తు నుంచి బయటకు రండి!
కని పించనిమేలి ముసుగులని తొలగించండి !!
విషం ఒక్క సారిగా చంపేస్తుంది. అయితే సహనం , సెక్యులరిజం, మత సహనం, సౌభ్రాతృత్వం అనే మేలి ముసుగులతో మన మనస్సులని నిద్రమత్తులో కప్పివేసి పబ్బాలు గడుపుకుంటున్న, గడుపు కోవాలనుకుంటున్న, కుహనా రాజకీయ శక్తులు మన మనస్సులని నిర్జీవంతంగా, నిర్వీర్యం చేయడంలో కాలకూట విషంలా విజయవంతం అయ్యాయి !!!
గాలిపటంలో గాలి, గల్లా పెట్టేలో గల్ల, ఫైర్ ఇంజన్ లో ఫైర్, నిప్పుకోడిలో నిప్పు, నేతిబీరలో నెయ్యి ఎలా ఉంటాయో ఈ కుహనా రాజకీయ శక్తుల బుజ్జగింపు చర్యలుకూడ అంతే!!
మనం వేసుకున్న సహనం అనే ముసుగులో, లవ్ జిహాదీ పేరుతో మన ఆడబిడ్డల మీద జరిగే నిరంతర దోపిడికి, బలవంతపు మతమార్పిడిలకి కళ్లున్నకబోధిలా నిర్లిప్తంగా వుండడం, అది మరింత బరితెగింపుకు లైసెన్స్ ఇచ్చినట్లే!
మత విద్వేషాలతో రగిలిపోతు హైందవసంప్రదాయలపై, కట్టుబాట్లుపై, విశ్వాసాలపై జరుగుతున్న అమానుష దోపిడీలకి పరమతసహనమనే మేలి ముసుగులో మూగ సాక్షులుగా ప్రశ్నించక పోవడం ముష్కర మూకలకు మరింత విచ్చలవిడితనానికి ప్రేరణ ఇచ్చినట్లే !!
దేవాలయ వ్యవస్థలని, దేవాలయ భూములను, దేవాలయ మాన్యాలని, చెరువులను అప్పనంగా దోచుకునే ప్రభుత్వాలని, రాజకీయ నాయకులని, భూ జిహాదీలని , భూభకాసురాలను, సెక్యులరిజం అనే రంగుల ముసుగులో ఉపేక్షించడం వారికి యదేక్షగా దోపిడికి లైసెన్స్ గా మారింది.
హైడ్రా, వక్ఫ్, బుల్డోజర్ల ద్వారా వారికి తగిన గుణపాఠం నేర్పించాల్సిందే!!వారి గుండెల్లో డబుల్ ఇంజన్ రైళ్ళను పరుగులెట్టించాల్సిందే!
మతమూఢస చాందసభావజాలంతో దేవాలయాలపై, దేవతా విగ్రహాలపై, మన మతవిశ్వాసాలపై విచక్షణా రహితంగా దాడులుచేస్తూ, తీరని నష్టం కలుగచేసే మతోన్మాదులపై వారికి పరోక్షంగా తమ మద్దతును అందచేసే రాజకీయ నాయకులపై శీతకన్ను వేయడం మనలోని పిరికితనానికి పరాకాష్ట!!
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోతిష్ఠ పరంతప అనే గీతాచార్య ప్రబోధగీతం ఉషాకిరణం లా
హృదయ దౌర్బల్యం అనే ఈ కనిపించని ముసుగుతెరలని ధైర్యం అనే ఖడ్గంతో చేధించేయించాల్సిందే...
పహల్గావ్ లాంటి అమానుష, వికృత చర్యలు పునరావృతం గాకుండా వుండడానికి కళ్లు మూసుకుని నటిస్తున్న మొద్దు నిద్రమత్తు నుంచి బయటికి రావాల్సిందే !!
జవాబుదారి తనంతో, ప్రశ్నించే గొంతుకలతో, బ్రహ్మోస్ , సుదర్శన్ లాంటి క్షిపణులతో ఈ ముష్కర మూకలనీ దేశ సరిహద్దుల నుంచి తరిమి, తరిమి కొట్టాల్సిందే!
జాతి మనుగడకి, గౌరవానికి, చేతిలో చెయ్యి వేసి ధృఢంగా ముందుకు అడుగు వేయాల్సిందే!
దేశరక్షణకోసం అలుపెరుగక, నిరంతరం పరిశ్రమించే అగ్నివీరులకు, వీరజవాన్లకు, వాయుసేనలకు, నావిక దళాలకు చేతులెత్తి మొక్కాల్సిందే!
వర్తమానంలో జీవిస్తూ. మన ఉనికిని సజీవంగా. సర్వమానవాళికి తెలియచేయాల్సిందే!
జై భారత్!
జై హింద్!!
సర్వే జన సుఖినోభవంతు.
మీ ఆధ్యాత్మిక సేవలో
RaNa
9900022729
Comments