top of page

భావ తరంగిణి 07

  • Writer: Admin
    Admin
  • Aug 12
  • 1 min read

శూన్యం అంటే నిజంగా శూన్యమేనా


శూన్యం అంటే ఏమీలేదు అనికాదు, అది అవ్యక్త రూపంలో,ఇంద్రియములకు గోచరంకానీ అనంతద్రవ్యరాశి!

శూన్యం అంటే చూడలేనిది అనికాదు, మన దృష్టికోణానికి అందని ఏకాంబర స్వరూపం!

శూన్యం అంటే సున్నా కాదు, ఆది అనంతమైనది!

శూన్యం అంటే విలువ లేనిది కాదు, విలువ కట్ట లేనిది.

శూన్యం అంటే నిశ్శబ్దం కాదుశబ్దం లేని స్థితి! ధ్యానం ద్వారా ఆ అనుభూతికి చేరుకోవడం.


ధ్యానం అంటే ప్రాణాయామం !

ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస !

ధ్యానం అంటే నామస్మరణం !

ధ్యానం అంటే అంతరంగవీక్షణ !

ధ్యానం అంటే మనోనిగ్రహం !

ధ్యానం అంటే మానశిక పరిపూర్ణత!

ధ్యానం అంటే పరమాత్మతో అనుబంధం!

ధ్యానం అంటే ఆత్మానుభూతి!

ధ్యానం అంటే మనలోని శబ్దాలు నిశ్శబ్దంలో లయమవుతూ మనస్సు ప్రశాంతతని చేరుకునే దివ్యానుభూతి.

ప్రశాంత పూరితమైన మనస్సుల్లోని హృదయంతరాలలో ఏకాంబరరూపంలో స్థితుడైన జీవాత్మ, పరమాత్మతో స్థితమయ్యే అనుసంధానప్రక్రియనే ధ్యానం.


పంచతత్వాల సమ్మేళనమే ఈ ప్రకృతి.

పంచతత్వమయమయిన ఈ దేహం ఆకాశతత్వంతో వికసిస్తూవుంటుంది. ఆకాశం అంటే శూన్యం అనికాదు అది ప్రణవనాదం, అదే నీ నాదం,గళం కూడా..!

శూన్యం అంటే ఖాళీ అనికాదు,అది సర్వత్రా విస్తరించియున్న అనంత ద్రవ్యరాశి!

పరమాత్మ, సర్వాంతర్యామి, పరిపూర్ణంగా మూర్తిభవించిన సర్వసంపూర్ణుడు అయిన సృష్టికర్త నుంచి ఆవిర్భవించిన ఈ విశాలవిశ్వం శూన్యం నుంచే అనేక సంపూర్ణంశంలతో ఆవిర్భవించి సకల జీవకోటికి ఆవాసంగా వర్ధిల్లుతూవుంది.

ఈ సత్యాన్ని శాంతి మంత్రం: ఓం పూర్ణ మధః పూర్ణ మిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే, పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణ మేవానశిష్యతే ప్రబోధిస్తుంది.


ఈ సృష్టి అనేక పాలపుంతలతో, గెలాక్సీలగా విస్తరించి మానవ మేధస్సుకు, ఊహలకు అంతుచిక్కని మహాద్రవ్యారాశి!


శాస్త్రీయఅధ్యాయనాలు ఇదే విషయాన్ని బిగ్ బ్యాంగ్ థియరీగా ధృవీకరిస్తున్నాయి.ఈ విశ్వం ఎప్పుడో 1300 కోట్ల సంవత్సరాల క్రితం ఓ కృష్ణబిలంలో జరిగిన ఓ మహావిచ్చిన్నంతో కూడిన పేలుడులో ఆవిర్భవించి మూడు లక్షల కాంతి సంవత్సరాల మేరకు విస్తరించిన ద్రవ్యరాశిగా భావిస్తూన్నాయి. వాస్తవానికి ఈ కృష్ణ బిలాలు కంటికి కనిపించవు కాని వాటి చుట్టూ ఉండే కాంతి ప్రవాహంతో శాస్త్రజ్ఞులు అక్కడ ఓ కృష్ణ బిలం వుంది అనే అంచనాకు వచ్చారు.


కాంతి తరంగాలు , ధ్వని తరంగాలు, దృశ్య తరంగాలు, విలోమ, రేఖాంశ తరంగాల ప్రసరణకు మాధ్యమం ఏకాంబరతత్వమే!!


సర్వేజన సుఖినోభవంతు


మీ ఆధ్యాత్మిక సేవలో

RaNa

9900022729

 
 
 

Comments


bottom of page