భావ తరంగిణి 08
- Admin
- Aug 12
- 2 min read
Updated: 6 days ago
కాలం మారడం నిజమేనా?
కాలం అనేది వ్యవహారికభాషలో టైమ్, ఆది సమయాన్ని సూచిస్తుంది. అయితే టైమ్ జోన్లలో ఆ సమయాన్ని చూపించే టైమ్ ని తరుచుగా సవరిస్తూ ఉంటారు. సవరణలకు, మార్పులకు లోనయ్యేది కాలం కాదు!
నిజానికి కాలం మారదు, కాలంలో మనం మారుతూవుంటాం!! ఇది ప్రకృతిధర్మం!!
కాలం అంటే సమయం.
కాలం అంటే వ్యవధి.
కాలావ్యవధిని ఓ ప్రాథమిక ప్రామాణికంతో కొలుస్తారు. అవి:
తృటి, క్షణం, సెకను, నిముషం,ఘడియ, ఝాము, రోజు, వారం, నెల, సంవత్సరం, దశాబ్దం, రజితవవర్షం, స్వర్ణవర్షం, వజ్రవర్షం, అమృతవర్షం,శతమానం లేక శతాబ్ది,సహస్రాబ్ది.
కాలచక్రం ఈ కాలగతిని తనలో కలుపుకుంటూ నిరంతరం సాగిపోతూ వుంటుంది.
భూమి ఆత్మ ప్రదక్షిణ కాలవ్యవధిని ఓ రోజుగా, రోజును ఒక రాత్రి, పగలుగా, సూర్యుని చుట్టూ తన కక్ష్యలో చేసే పరిభ్రమణ కాలవ్యవధిని ఓ సంవత్సరంగా, దానిని మూడు కాలాలుగా, ఆరు ఋతువులుగా పరిగణిస్తున్నాం.
సౌరకుటుంబం లోనీ ఇతరగ్రహలుకూడా తమ కక్ష్యల్లో సూర్యుని చుట్టూ చేసే నిరంతర ప్రదక్షిణలు, చంద్రుడు భూప్రదక్షిణలో తన కక్ష్యలో అనేక నక్షత్రాలకు చేరువయ్యే సమయాల ఆధారంగా ఏర్పడే వివిధ రాశులు, తిథి, నక్షత్రం, యోగం, కరణం, వారం వాటి ఖగోళ ఫలితాలను కాలచక్ర ఆధారంగా గణిస్తారు.
కల్పారంభంలో పరమాత్మ నుంచి ఈ సృష్టి పరిపూర్ణంగా ఆవిర్భవించింది! దానితోపాటు కాలచక్రం కూడా! అది నిరంతరం ఓ జీవనదిలా తన పయనం కొనసాగిస్తూనే వుంది. నదిలో నీరులా కాలంకూడా ఆగదు, సాగిపోతూనే వుంటుంది.
సాగిపోయేకాలంలో పుడుతున్నాం , ఆ కాలంతోనే సాగిపోతువున్నాం, ఆ కాలంలోనే కలిసిపోతూ తిరిగి మరోజన్మకి సిద్ధం అవుతాం. ఈ జనన మరణచక్రం, కాలచక్రంలో ఓ అంతర్వాహినిగా సదా కొనసాగుతూనే వుంటుంది.
కాలానికి అతీతంగా ఈ ప్రపంచంలో ఏదైనా వుందా?
వర్తమానంలో జీవించివున్న మనలో ఎవరు ఓ శతాబ్దం తర్వాత వుండరు కాలగర్భంలో కలిసి వుంటారు. అదే విధంగా ఓ నూరు సంవత్సరాల క్రితం వున్న ఎవరు ఈ రోజులేరు, కాలంలో కలిసిపోయారు. కాని కాలగమనం నిర్వికారంగా ముందుకి సాగిపోతూనే వుంటుంది. కాలనికి ఆతీతంగా ఈ విశ్వంలో ఎది వుండదు.
నిజానికి కాలం అనేది సంఘటనలు, జ్ఞాపకాల దొంతరలు మాత్రమే!!
కాలం భూత,వర్తమాన, భవిష్యత్తు కాలలకు అతీతం.
ఎపుడో చిన్నప్పుడు జరిగిన సంఘటనలు స్వప్నంలో తారసపడుతాయి.స్వప్నం కాలాతీత ఘటన.
గతం అనేది లేదు ఎందుకంటే దానీ లోనికి వెళ్ల లేవు దానీ తాలూకు స్మృతులు మాత్రమే నీతో వుంటాయి, అలాగే భవిష్యత్తు కూడా లేదు, ఎందుకంటే దానిని నీవు సృశించలేవు. భవిష్యత్తు సదా వర్తమానంలో కలిసిపోతూ గతంతో లయమవుతూ వుంటుంది. ఇది సృష్టి ధర్మం.
కాలుడు ఎవరు?
కాలం మారేది కాదు! కాలమే నేను! కాలుడను నేనే! మహంకాళిని నేనే! సృష్టికర్తను అయిన నాలోనే ఈ చరాచర జగత్తు కల్పాంతంలో లయమవుతుంది! నేనే లయకారకుడను!
సర్వే జన సుఖినోభవంతు
మీ ఆధ్యాత్మిక సేవలో
RaNa
9900022729
Comments