భావ తరంగిణి 09
- Admin
- Aug 12
- 2 min read
ఇంద్రియనిగ్రహమే మనోనిగ్రహమా?
సర్వేంద్రియాం నయనం ప్రధానం. పంచేంద్రియాలలో నయనం జ్ఞానకాంతికి ద్వారం!
మనం కన్నులతో ఈ ప్రపంచాన్ని చూస్తూ అవగతం చేసుకుంటాం.
అయితే చూడగూడని వాటినే అదేపనిగా చూస్తూ యువత పెడదారిన పడుతూవుంటే తల్లిదండ్రులగా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తే అది మీలో అశాంతికి, వారి వ్యక్తిత్వం అస్తవ్యస్త మవడానికి కారణం కూడా అవుతుంది.
రెండవ పంచేద్రియం చెవులు, అవి శ్రవణద్వారాలు! వీనులకు విందైన సంగీతం సత్ సాంగత్యం, వినదగిన మాటలు మనస్సును ఆనందభరితం చేస్తుంది!
అయితే వినదగని వాటినే పదే పదే వింటూ, వినదగిన వాటిని వినక పోవడం ద్వారా మన ప్రయారిటీలు తారుమారు అవుతూ మన ఆలోచనలలో క్లారిటీ లోపిస్తూ మనస్సుని, ఆలోచనలను కలుషితం చేసేస్తాయి.
ఈ ప్రాణాలయానికి నాసిక ప్రధానద్వారం. పకృతి ప్రసాదిత స్వచ్ఛమైన, పరిశుద్ధమైన గాలి ఉచ్వాసక్రియలో మీ శ్వాసకోశాలను సృశిస్తూ హృదయకోశంని తేజోమయం చేస్తూ నాణ్యమైన జీవితాన్ని మీ సొంతం చేస్తుంది! ప్రాణాయామం ఈ శ్వాసక్రియని మెరుగుపరుస్తుంది! ప్రాణాయామం అంటేనే శ్వాస మీద ధ్యాస!
ప్రతిరోజూ ఉషోదయకాంతులలో, అహ్లదకరమైన ప్రశాంత వాతావరణ అనుభూతిని ఆస్వాదిస్తూ వాకింగ్ చేయడం మనస్సుని మధురానుభూతికి చేరువచేస్తుంది!
నోరు మంచిదైతే ఊరు మంచిదే అనేది లోకోక్తి!
అందుకే మన మాటలు హితబాషణం, నిర్భాషణం,మధురభాషణాం, మితభాషణం, సత్యభాషణంగా వుంటూ మాటల్లో సాంత్వన, ఆత్మీయతలని ప్రతిఫలిస్తూ ఉంటే అవి ప్రపంచానికే నిన్ను దగ్గర చేస్తుంది!!
అసూయ, ద్వేషం, దురుద్దేశపూర్వకంగా, అహంకారపూరితంగా, అవమానించేవిగా మీ మాటలువుంటే అది నిప్పుని చేతితో విసరడం లాంటిదే అవుతుంది,అది ఎదుటి వాడిని బాధించిన, బాధించకపోయినా నిన్ను మాత్రం తప్పక దహించి వేస్తుంది!!
జిహ్వ రుచులను ఆస్వాదిస్తూ ఆరోగ్యవంతమైన సంపూర్ణజీవితాన్ని ఆస్వాదించడానికే!
తీసుకునే ఆహారాలు మితాహారం, హితాహారం, మధురాహారం, సాత్వికాహారాలుగా మీ దేహాపుష్టికి ప్రియంగా ఉండాలి!
ఈదేహానికి అప్రియమైన తినదగని నిషిద్ధ ఆహారాలనే, పదే పదే తింటూ, ఎటువంటి ఉపయోగం లేని పానీయాలని అదేపనిగా తాగుతూ బాల్యంలోనే ఒబేసిటీ, యవ్వనంలోనే బీపీ,కొలస్ట్రాల్, షుగర్లు లాంటి అనారోగ్యలతో నేటియువత నిర్వీర్యం అవుతూ వుంటే సంపూర్ణ ఆరోగ్యం ఇక అందని ద్రాక్షపండ్లే!!
మనం చూసే దృష్టి, వినే మాటలు, మాట్లాడే మాటలు, తీసుకొనే ఆహారం,శ్వాస క్రియలు ఇవే మనస్సుకి మనం ఇచ్చే ఆహారాలు!!!
మనం చూసే దృశ్యాలపై నియంత్రణ,
అలోచించి, మృదువుగా మాట్లాడే వాక్ నియంత్రణ,
విన్న, వింటున్న మాటలలోనీ విషయాలను బేరీజు వేసుకుని స్పందించే తీరు,
మన నడక, ప్రవర్తన, తీరుతెన్నుల పై దృష్టి,
ప్రాణాయామ ద్వారామెరుగైన శ్వాస క్రియ,
జిహ్వ పై చూపించే శ్రద్ధలే ఇంద్రియనిగ్రహం అవుతాయి!
ఇంద్రియనిగ్రహం ద్వారా అంతర్శుద్ధి , తద్వారా మానసిక ప్రశాంత చేకూరుతుంది!
మనోనిగ్రహం ప్రశాంతపూరిత మనస్సుకే సొంతం!
సర్వే జన సుఖినోభవంతు
ఆధ్యాత్మిక సేవలో
మీ
RaNa
9900022729
Comments