జాగృతి మాలిక 16
- Admin
- 6 days ago
- 3 min read
💫అద్భుతాలు చేసే ఆలోచనలు💫
ఓ ఆలోచన సామాన్యుడిని అందలం ఎక్కిస్తుంది
ఓ అలోచన సామాన్యుడిని మేధావిని చేస్తుంది
ఓ అలోచన బికారిని మిలియనీరుని చేసేస్తుంది,
మరో ఆలోచన ఓ మిలియనీరును బికారిని కూడా చేస్తుంది!
ఓ ఆలోచన ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది,
ఇంకో ఆలోచన ఉన్నత శిఖరం నుంచి పాతాళం లోకి కూడా తోసేస్తుంది!
ఓ ఆలోచన విశేషజ్ఞానానికి తెర తీస్తుంది,
మరో ఆలోచన మీ అజ్ఞానాన్ని దహించివేస్తుంది!
ఓ ప్రగతిశీల ఆలోచన ప్రభంజనంలా ఈ ప్రపంచాన్ని 🌎 చుట్టివేస్తుంది.అలోచనే పదునైన ఆయుధం.
అటువంటి ప్రగతిశీల అలోచనలు, కృషి, పట్టుదలలతో కీర్తి శిఖరాలు అధిరోహించిన 🚵♀️ ఆదర్శప్రాయులు ఎందరో!!!
ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెన్నుపూసలు,డిస్క్ సమస్యలతో సాయిప్రసాదు విశ్వనాథ్ అంటార్కిటికాలో స్కై డైవ్ 🪂లో అసాధారణ ప్రతిభ ప్రదర్శించిన వ్యక్తిగా మన్ననలను పొందాడు.
కేవలం 8 సంవత్సరాల వయసులో పోలియో వ్యాధికారణంగా చక్రాలకుర్చీకి🦼 పరిమితమైన సురేష్ హెచ్ అద్వానీ బోన్ మ్యారో శస్త్రచికిత్సని మొట్టమొదటిసారిగా విజయవంతంగా నిర్వహించిన ప్రముఖ క్యాన్సర్ డాక్టర్.
బాల్యంలోనే రైలుఆక్సిడెంట్ లో కాలు కోల్పోయిన గిరీష్ శర్మ ఓ ప్రముఖ అంతర్జాతీయ బాడ్మింటన్ క్రీడాకారుడిగా🏸 మన్ననలను పొందిన స్పూర్తిదాత.
అంగవైకల్యం కర్మ ఫలం అయితే ఆ శాపాన్ని తమ ప్రగతిశీల ఆలోచనలతో ఓ వరంగా భవిష్యత్తును తిరిగి రాసుకున్న అపరబ్రహ్మ లు వీరు !!
అలోచన ఆంటే ఓ భావన
అలోచన ఆంటే ఓ అభిప్రాయం
ఆలోచన అంటే ఓ ప్రణాళిక
ఆలోచన అంటే ఓ నిర్ణయం
ఆలోచన అంటే మీ ప్రవర్తన
అలోచన ఆంటే మీ చింతన
అలోచన ఆంటే మీ తలంపు
అలోచన ఆంటే మీ భవిష్యత్తు
ఆలోచనలే మీరు!!!
ఆలోచనలు ఓ స్రవంతిలా నీ ప్రమేయం లేకుండా మస్తిష్కంలో 🧠 జనించే ప్రతికూల, సానుకూల భావనల సమూహం.
సగటున మస్తిష్కంలో రోజుకి 6000కు పైగా ఆలోచనలు జనిస్తాయని,అందులో 80% ప్రతికూల భావోద్వేగాలుగా వుంటాయని, అందులో 90% ఆలోచనలు పునరావృతం 🛞 అవుతూవుంటాయి అని పరిశోధనా ఫలితాలు తెలియచేస్తున్నాయి.
మనకు వచ్చే ప్రతి నాలుగు ఆలోచనలలో మూడు వ్యర్ధపు ఆలోచనలే!!
ఆలోచనాస్రవంతిలో జ్ఞాపకాలు, ఆటపాటలు, చదువులు,నమ్మకాలు, అపోహలు, భయాలు, ఆరాటాలు,కోరికలు, ఆశలు, ప్రేమ💕, వ్యామోహం, ప్రవృత్తి, సంపాదన, ఆరోగ్యం, ఆహారం,పరీక్షా ఫలితాలు, ప్రమోషనుల చుట్టూ పరిభ్రమిస్తూ వుంటాయి.
మెదడులో జనించే ఈ ఆలోచనలు కేవలం జరిగిపోయిన కాలానికి చెందినవి అయితే అవి మిమ్మల్ని డిప్రెషనులోనికి అవే భవిష్యత్తుకు సంబంధించినవి అయితే భయబ్రాంతులకు గురిచేసే ప్రమాదం వుంది.
ధ్యానం 🧘♀️అలోచనలపై నియంత్రణ సాధిస్తూ వర్తమానంలో జీవించేలా చేస్తుంది.
మనందరిలో 90 నుంచి 100 బిలియన్ల జీవకణసముదాయం న్యూరాన్లుతో విస్తరించిన బ్రహ్మాండమైన ఓ అద్భుతవ్యవస్థే మస్తిష్కం 🧠!
అది అనుభవాలను ఙ్ఞాపకాలుగా తనలో నిక్షిప్తం చేసుకుంటుంది.బుద్ధి వివేక జ్ఞాన కేంద్రీయ వ్యవస్థగా విధులను నిర్వహిస్తూ, తార్కిక విచక్షణలతో ఆలోచనలను పిల్టర్ చేస్తూ ఆలోచనలని మనస్సుకు చేరవేయడానికి దోహదం చేస్తుంది.
కొన్నిసార్లు నాకే ఈ కష్టాలన్ని అనే భావనతో మనస్సు బాధకు లోనవుతుంది. ఈ ఆలోచన ధోరణిని మార్చుకోకపోతే మరింత ప్రమాదకరం. మనకంటే ఎక్కువ కష్టాలతో ఉన్నవారితో బేరీజు వేసుకుని తను వారి కంటే నయం అనే సంతోష భావనలోనికి మనస్సును తీసుకునిరావాలి.
నా రూపంబాగాలేదు, నేను అందంగాలేను అనే తీరని మనోవేదన, నున్యతాభావనతో వున్న నేను ఓ గ్రహణమొర్రి ముఖంని చూడగానే, ఆ మనోవేదన మాయమయి తనకు ఈ రూపం ఇచ్చిన ఆ భగవంతుడిపట్ల మనస్సు కృతజ్ఞతతో నిండిపోయింది.
తీవ్రమైన మానసిక ఒత్తిడి ఆరోగ్యానికి హానికరం.
మీ కిష్టమైన మ్యూజిక్ 🎶 తో, ఆటపాటలతో, మిత్రులతో , పిక్నిక్ లతో మనస్సును ఆహ్లాదపరచుకోవాలి.
లక్ష్యం 🎯 మంచిదయితే, అది పరిశుద్ధ భావనలకు వేదిక అవుతుంది. అందుకే మన లక్ష్యం ఎప్పుడూ ఉన్నతంగానే వుండాలి.
మీలక్ష్యం ఏదైనా అది మొదటిగా ఓ ఊహగా జనిస్తుంది. అది ఊహాత్మకశక్తి, నిశితపరిశీలన, ఏకాగ్రత, శ్రద్ధ, ఇష్టాలతో నిర్దిష్టలక్ష్యంగా అంకురం 🌱అవుతుంది.
ధ్యానం మీలో ఏకాగ్రతను, పరిశీలన, ఊహాత్మక కోణాలను ఉత్తేజభరితం చేస్తూ ఆ లక్ష్యసాధన దిశలో నడిపిస్తుంది.
మనం మంచి బుద్ధితో 🧠 ఆలోచించి చక్కటి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే మనస్సు ఓ దిక్సూచిగా 🧭 దశ,దిశని సూచిస్తూ నీ లక్ష్యసాధనలకు🎯 ఓ కేంద్రబిందువు అవుతుంది. కేవలం కలలు కనడమే గాకుండా, ఆ కలలసాకారం చేసుకునే దిశలో మన నడవడికలు వుండాలి.
ఇందుకోసం మనస్సుకు మంచిఆహారం ఇవ్వాలి.మనస్సుకు ఆహారం అంటే నోటితో తీసుకునేది, కంటితో చూసేది, చెవుల ద్వారా వినేది, స్పర్శతో అనుభూతి పొందేది, ముక్కుద్వారా పీల్చే వాసనలు అవుతాయి. నిషిద్ధమైన ఆహారాలు స్వీకరిస్తూ వుంటే మంచి ఆలోచనలు ఎలా వస్తాయి. మనస్సుకు నిశ్చలత్వం ఎలా వస్తుంది. మనో నిగ్రహం ఎలా లభిస్తుంది. ఆధ్యాత్మిక భావనలు ఎలా వికసిస్తాయి.అందుకే మనస్సుకి మంచి ఆహార్యమే ఇవ్వాలి.
ఓ దీపం 🪔 చీకటిని ఎలా పారదోలుతూందో అదే విధంగా ఓ క్రియాత్మక ఆలోచన జీవితానికి ఓ మంచిదారి 🛤️ చూపిస్తూ ఆ జీవితగమనాన్నే మార్చి వేస్తుంది!
శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో
యుక్తాహారవిహరస్య యుక్తచేష్టస్య కర్మసు
యుక్తస్వప్నానాభోదస్య ...అని ప్రబోధించారు.
మితమైన సాత్విక,హితాహరాలు, ఋజుప్రవర్తనలు, బాధితులకు స్వాంతన, ఓదార్పు కలిగించే హిత భాషణాలు, మనస్సుకు హితం కలిగించే నడవడికలు, మనస్సుకు విశ్రాంతి నిచ్చే ఆహ్లాదభరిత నిద్రలుగా 😴 వుండాలి. అవి ఇంద్రియనిగ్రహానికి ఆలంబనలు అవుతాయి. అవి సానుకూల అలోచనసరళిని ప్రభావితం చేస్తాయి. అది నీ ఆధ్యాత్మికలక్ష్యంకి 🏹చేరువ చేస్తుంది. అప్పుడు మనస్సు ప్రశాంతతో పరవశమయమవుతుంది.
సర్వాంతర్యామి 🔱పరమాత్మ మాటలు మనకు వినిపించవు కానీ ఫలితాలు మన కండ్లలో ప్రతిఫలిస్తాయి.
సర్వే జన సుఖినోభవంతు.
మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి
RaNa
9900022729
🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️
Comentarios