జాగృతి మాలిక 18
- Admin
- Aug 26
- 2 min read
Updated: Sep 1
క్షమాపణ భీరత్వమా?ధీరత్వమా ?💫
క్షమాగుణం సంబంధాలను బలోపేతం చేస్తుంది. పగ, ప్రతీకారం, పంతాలు, పట్టింపులను దూరం చేస్తుంది. అరిషడ్వర్గాలను నియంత్రణలోనికి తీసుకవస్తుంది.
మనస్సుకు ప్రశాంతతను తీసుకవస్తుంది.
కష్టాలను సవాలుగా స్వీకరించే ధీరత్వం మీ సొంతం చేస్తుంది.
క్షమ మీ శీలసంపద, సంతోషం, ఉదాత్తమైన జీవితగమనానికి ఓ చక్కటివేదిక అవుతుంది.
నిజాయితీగా క్షమాపణ కోరడం ద్వార ఎదుటి వ్యక్తి లోని కోపం,క్షోభ,😡ఆవేదనలు తగ్గిపోతాయి, వారి మనస్సు తేలిక పడుతుంది, అపనమ్మకం తొలిగి మీ మీద నమ్మకం పెరుగుతుంది.☺️అందుకే క్షమాపణ అడగాలంటే ధైర్యం వుండాలి. క్షమించడానికి మంచి మనస్సుకూడా ఉండాలి.
పంతాలు పట్టిపుంపులతో బలహీనమైన అన్నాచెల్లెళ్ల బంధాలు, స్నేహబంధాలు, 👫భార్యాభర్తల అనుబంధాలు, తల్లి కూతుళ్ల అనుబంధాలు ఈ సమాజంలో తరచుగా తారసపడుతు వుంటాయి.
ఇటువంటి బలహీన బంధాలు🍃 తీవ్ర నిరాశ, నిస్పృహ, మనోవేదనలకు కారణమవుతాయి.
ఈ బలహీనబంధాలను 🔗 తిరిగి సాధారణ స్థితికోసం మీ మొబైల్ 📱 తీసుకొని వారిని చిరునవ్వుతో👄 పలకరిస్తూ,నేను తెలిసి తెలీక చేసిన పనులు మిమ్మల్ని బాధించి వుంటే మన్నించండి అని వారితో మనస్సు విప్పి మాట్లాడండి.వారిని ఆప్యాయంగా ఆహ్వానించండి. అపోహలు తొలిగి మనస్సులు తేలిక అవుతాయి, అనుబంధాలు 🌱చిగురిస్తాయి!
ఇతరులను క్షమించడం భీరత్యం కాదు అది మీలోని దృఢమైన మానశిక స్థైర్యంల తో మేళవించిన ధీరత్వం!!
ఇతరులలో తప్పులను వెదకకండి, ఎవ్వరినీ మార్చాలి అనే ప్రయత్నాలు మానండి. మీ ఇంట్లో టివిలో ఛానల్ కూడా నీవు మార్చుకోలేవు, మీ బుడ్డోడి చేతిలో రిమోట్ వుంటే! అందుకే అందరిలో మంచిని ఇష్టపడండి అప్పుడు అందరూ నిన్ను ఆహ్వానిస్తారు,ఇష్టపడుతారు, గౌరవిస్తారు.
చిన్న చిన్న తప్పులు, అవసరానికో ఓ అబద్ధం అనే భావన సమాజ రుగ్మతగా మారింది.
ట్రాఫిక్ జామ్ వల్ల ఆలస్యం అయింది అని బుకాయించే బదులు ఓ 5 నిమిషాలు ముందుగా ఆఫీసుకి బయలుదేరవచ్చుకదా!
బాగాలేను అందుకే హోమ్ వర్క్ చేయలేదు,టైమ్ 🕰️ లేదు అందుకే చేయలేదు అని కప్పిపుచ్చుకునే ప్రయత్నానికి బదులు డైలీ హోమ్ వర్క్ చెయ్యడం బెటర్ కదా!
లేని అమ్మమ్మకి ఆరోగ్యం బాగా లేదు అని సెలవు కోరడం, ఆపీస్ లో పనివుంది అందుకే ఆలస్యం అని ఇంట్లో బుకాయించడం. చూద్దాంలే ఇప్పుడు కాదు.
ఇలాంటి కుంటిసాకులు తప్పుకాదు అనే ఈ తప్పులతడకల ప్రవర్తన, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే మీ పిల్లలు ఆ అడుగు జాడల్లోనే నడుస్తారుకదా! మీ పిల్లలకు నేర్పించే విలువలు ఇలాగేనా?
తండ్రి: జాగ్రత్త నా అడుగుల్లో 👣నే నడు.
కొడుకు:జాగ్రత్త నేనూ నీ అడుగుల్లో👣నే నడుస్తా!!
రాజదండన 🪄
రాజ్య పరిపాలకులు నేరస్థులను, దేశ ద్రోహులను, హంతకులను, టెర్రరిస్టులను, ఆర్ధిక నేరస్థులను, అక్రమ చొరబాటుదారులను, దేశవిద్రోహచర్యలకు, ప్రభుత్వ ఆస్తులలూటీ, గృహదహనాలకు పాల్పడే అతతాయులను, అంతర దేశభద్రతకు ముప్పు కలిగించే నేరస్థులను రాజ్యాంగ,చట్టపరిదుల్లో కఠినంగా శిక్షించి తీరాల్సిందే! అవసరమైతే శిక్షాస్మృతినీ కూడ సవరించాల్సిందే! రాజ్యాంగ ధర్మంను నిష్పాక్షికంగా పాలకులు అమలు చేయవలసిందే! రాజదండన అమలులో ఆశ్రితపక్షపాతం, అలసత్వం,అలక్ష్యం క్షమింపరాని నేరాలు!
అతతాయులపట్ల చూపించే జాలి,దయ,క్షమ భీరత్వమే! అది నిప్పుని చేతితో పట్టుకోవడం లాంటిది. అది తప్పక నీ చెయ్యిని కాలుస్తుంది. అపత్రాదానం పాముకి 🪱పాలు పోసినట్లే!
శిక్షా కాలంలో నేరప్రవృత్తి నుంచి పరివర్తనతో సత్ప్రవర్తనపొందిన వారికి ప్రాయశ్చిత్తంగా క్షమాభిక్ష ప్రత్యేక పరిస్థితులలో అనుగ్రహించడం ధర్మపరీక్షణలో అంతర్భాగమే అయితే దురుద్దేశ పూర్వకంగా అమలుచేస్తే అధర్మం అవుతుంది.
చట్టం ఎవరికి చుట్టం కాదు. ఏవరు ఏ స్థాయిలో వున్నా చట్టపరిధికి అతీతులు కారు, కాలేరు, కారాదు!
సర్వే జన సుఖినోభవంతు.
మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి
RaNa
9900022729
🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️
Comments