జాగృతి మాలిక 20
- Admin
- Sep 3
- 3 min read
దిగజారుతున్న మానవ సంబంధాలు ... విలువల అపహాస్యం
➿➿➿➿➿➿➿➿➿➿➿➿
📌ఇటివల ప్రసారమాధ్యమాలలో ప్రసారమయ్యే కధనాలను గమనిస్తే...
రోజు రోజుకు దిగజారుతున్న బాంధవ్యాలు, అను బంధాలు, వ్యక్తిగత విలువలు...
స్పర్థ, ఆవేశం, ప్రతీకారం, నిస్పృహ,ఈర్ష్య లతో రగిలిపోతున్న జీవితాలు..
జారుడు మెట్ల అంచుకు చేరుకుంటున్న మానవ సంబంధాలు...ఎక్కడికి చేరుకోబోతున్నాయి..?
వ్యక్తిగత విలువలు ఎందుకు ఇలా దిగజారుతున్నాయి...
ఎక్కడికి వెళ్తుంది ఈ సభ్య సమాజం అనే ఆవేదన ఈ సంఘటనలను గమనిస్తే కలుగుతుంది.
🌪️ అదేపనిగా టీవీలో సీరియల్సును చూస్తున్న భార్యను మందలించిన భర్త మీద ఆపుకోలేని ఆగ్రహంతో, 3 సంవత్సరాల చిన్నారికి విషం ఇచ్చి తనూ తీసుకుని తనువు చాలించిన తల్లి!!
🌪️మొబైల్ ఫోన్ లో పబ్జి గేమ్ ఆడనీయడం లేదని పేరెంట్స్ మీద నిరసనగా తనప్రాణాలను తీసేసుకున్న 10వ తరగతి చదివే బాలుడు!!
🌪️కూకట్ పల్లిలో 14 సంవత్సరాల బాలుడు కేవలం ఓ క్రికెట్ బ్యాట్ కోసం, తనపొరుగింటి బాలిక సహస్రని హత్య చేసిన వైనం!!
🌪️ తన చెల్లికి మ్యారేజ్ ప్రపోజల్ చేసినందుకే హత్యకు గురయిన అనీల్!!
🌪️నిరాశ పరచిన పదవతరగతి పరీక్షాఫలితాలు తీవ్రమనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య!!
🌪️తనను మందలించినందుకు తనువు చాలించిన 14 సంవత్సరాల ఏడవ తరగతి విద్యార్థి గంగాధర్!!
🌪️అత్తింటి వేధింపులకు తాళలేక తన మూడు సంవత్సరాల పాప తో కలిసి సజీవదహనంతో జీవితం ముగించిన సంజు!!
🌪️రంగు తక్కువ అనే అవహేళనలు, కట్నాల వేదింపులు, అత్తింటి ఆరళ్లతో శిల్పని హత్యతో అడ్డుతొలగించిన కుటుంబం!!
🌪️తల్లి, కూతుర్లతో అక్రమసంబంధం!!
🌪️కత్తితో బెదిరిస్తూ సొంత చెల్లెలి మానం పదేపదే దోచుకున్న ఓ అన్న!!
🌪️ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి ప్లాన్ చేసి భర్తను కడతేర్చిన నాగలక్ష్మి!!
🌪️భర్త గంగారాం నోటిలో గుడ్డలు కుక్కి కాళ్ళు , చేతులు విరిగేలా తీవ్రంగా హింసించిన భార్య!!
🌪️తన అమ్మనాన్నలతో కలసి ఆరుసంవత్సరాల కొడుకు ముందరే తన భార్య నిక్కిని తలపై బాది శరీరం పై యాసిడ్ పోసి అగ్ని కి ఆహుతి చేసిన భర్త విపిన్!!
🌪️నిషాకు ఆన్ లైన్లో రాజేంద్రతో పరిచయం ప్రేమగా మారి పెండ్లితో ఏకమైన ఆ జంట,కేవలం 8 నెలల్లోనే భర్తచేతిలో గుర్గావ్ లో హత్య!!
🌪️వారిది ప్రేమవివాహం అయితే చిన్నపాటి మనస్పర్థలతో, అనుమానంతో ఐదునెలల గర్భవతి అయిన భార్య స్వాతిని కిరాతకంగా ముక్కలుగా నరికి మూసి నదిలోనికి విసిరేసిన భర్త మహేశ్వర్!!
🌪 యోగేష్ తన భార్య ప్రియను, అత్తను గిఫ్ట్స్ విషయంలో జరిగిన గొడవలో కత్తితో హత్య!!!
📌 ఇటువంటి అసాంఘిక సంఘటనలు పునరావృతం కావడానికి కారణాలు ప్రధానంగా:
వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాల కొనసాగింపు,
విచ్చలవిడితనం,తెంపరితనం,
సామాజిక మాధ్యమాల ప్రేరేపణ,
మాదకద్రవ్యాల ప్రభావంలో గతితప్పిన అలోచనాస్రవంతి, చెడుస్నేహాలాతో బాధ్యతారాహిత్య ప్రవర్తనలు.
సంకల్పలేమితో ఆత్మనున్యత, అభద్రతా భావనలతో, సత్వరంగా ప్రాణాంతక నిర్ణయాలు తీసుకొనే మూర్కత్వఆలోచనలు.
తను కోరుకున్నది తనకే అనే మూర్ఖపు ధోరణి.
క్షీణిస్తున్న మానవత విలువలు, బరితెగింపులకు ఆలంబనలు అవుతున్నాయి.
📌సమాజం లోనీ విపరీత పోకడలు, వాటి ప్రభావానికి ఆకర్షింపబడే యువత మానసికస్థితి కూడ ఈ స్థితికి ఆజ్యం అవుతున్నాయి.
🛝దాచుకోవాల్సినవాటిని చూపిస్తూ, చూపించాల్సిన అందమైన ముఖాన్ని కప్పేస్తున్నారు!!
🛝నాడు కష్టం వస్తే కుటుంబంలోని పెద్దలు ధైర్యం ఇచ్చేవారు. నేడు కొన్ని కుటుంబాలలో కలహాలకు పెద్దలే కారణమవుతున్నారు!!
🛝నాడు పిల్లలు పెద్దల పట్ల వినయ విధేయతలను చూపించే వారు, నేడు పెద్దలు వినయ విధేయతలను పిల్లల మీద చూపిస్తున్నారు!!!
🛝నాడు అందరు హార్డ్ వేర్ ఇంజనీర్లే.. మనస్సు మాత్రం సాఫ్ట్. నేడు అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే.. మనస్సు మాత్రం హార్డ్!!
🛝నాడు కొందరికే మందు,విందు అలవాటు, నేడు కొందరే వీటికి దూరం..
🛝గతంలో సంసారం చీకట్లోనే జరిగేది, జీవితాలూ వెలుగులో వుండేవి. నేడు సంసారాలు వెలుగులోకి వచ్చాయి జీవితాలూ చీకట్లోకి జారిపోతున్నాయి!
🛝నాడు ఆహారాలు ఔషదాలు అయితే నేడు ఔషదాలు ఆహారాలు అయ్యాయి!!
📍ఇటువంటి విపరీత ఆలోచనాదోరణిని, పోకడలను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి ?
🌀ఎమోషనల్ బ్యాలెన్స్ సానుకూల భావోద్వేగాలకు, జీవితంపట్ల సానుకూల దృక్పదాలకు ఆలంబన అవుతుంది. అది ఈ విపరీత మానసిక స్థితికి, ప్రతికూల భావోద్వేగాలకు సమర్థవంతంగా చెక్ పెడుతుంది. అందుకు ఓ వ్యూహాత్మక వ్యక్తిగత ప్రణాళిక కావాలి.
♎ కోపం, ఆవేశంలో ఉన్నప్పుడు రెస్పాండ్ కాకండి...ఆ రెస్పాన్సు లో విచక్షణ, వివేకం సహజంగానే లోపిస్తుంది. మీ విజ్ఞతకు అది సవాలవుతుంది, బంధాలను బలహీనపరుస్తుంది.
♎ మనస్సు తీవ్రమైన నిరాశ, ఒత్తిడి, నిస్పృహలకు లోనయివుంటే మనస్సుకు సంపూర్ణ విశ్రాంతిని ఇవ్వాలి. ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదు, సంయమనం పాటించి తీరాల్సిందే.. తొందరపాటి నిర్ణయాలకు మనస్సు ఆతృత పడుతుంది, కాని ఆ నిర్ణయాలలో తార్కిక విచక్షణాజ్ఞానం సహజంగానే ఉండదు. ఆత్మ నున్యత, డిప్రెషన్ ల ప్రభావంతో అనాలోచిత నిర్ణయాలతో జీవితాన్ని ముగించే విధంగా అడుగులు కూడా వేయించే ప్రమాదం కూడా పొంచివుంటుంది.
♎ ఇతరులలో తప్పులను వెదకడం మానండి. ప్రతిఒక్కరిలో ఎంతో కొంత మంచితనం వుంటుంది, దానిని చూడండి, గుర్తించండి, చిరునవ్వుతో పలకరించండి. అప్పుడు అందరు నిన్ను ఇష్టపడుతారు.
♎ ఇతరులను మార్చాలి అనే ఆలోచనలు మానండి, ముందుగా నిన్ను నీవు మార్చుకో... అప్పుడే అంతటా సంతోషం వెల్లివిరుస్తుంది
♎ నిజాయితీగా తప్పులను ఒప్పుకోండి, క్షమాపణలు చెప్పండి. అవతలి వ్యక్తిలో మీ పై నమ్మకం, విశ్వాసం పెరుగుతాయి, అతని మనస్సు తేలిక కూడా అవుతుంది. క్షమాపణ కోరడం బలహీనత కాదు, అది మనలోని స్థైర్యం, దృఢత్వానికి ప్రతీక. సంబంధబాంధవ్యాలు మెరుగవుతాయి.
♎ రోజూ నీ మనస్సుకు బాగానచ్చిన ఏదైనా ఓ మంచి పనిచేయండి,అది ఎదుటి వ్యక్తి ముఖంలో సంతోషంతో కూడిన చిరునవ్వునీ తీసుకురావాలి
♎సంతోషంలో ఉన్నప్పుడు ఎటువంటి వాగ్దానాలు చేయరాదు,కొన్నిసార్లు అవి శక్తికి మించినవి కూడా కావచ్చు అవి తీవ్ర ఒత్తిడికి కారణం అవుతాయి.అందుకని బాగా అలోచించి ముందడుగు వేయడం తెలివైన నిర్ణయం అవుతుంది.
♎కష్టాలను చూసి పారిపోకుండా వాటిని స్వీకరించాల్సిందే. జీవితం అంటేనే కష్టసుఖాల కావడి. కష్టాలు కన్నీళ్లనే కాదు,కొన్ని నిజాలను అవగతం చేస్తుంది. వాస్తవాలు వెలుగు చూసేలా చేస్తుంది. అందుకే కష్టాలు కూడా ఒక మంచి నేస్తమే. మీ లోని ధైర్యం, మీ సామర్ధ్యం మీకు తెలిసేలా చేస్తుంది భవిష్యత్తుకు మార్గదర్శి అవుతుంది!
💫 వ్యక్తిత్వ వికాసనిర్మాణంలో భాగంగా ఓ జర్నలు📝 తయారు చేయండి. వివిధ సందర్భాల్లో మీ స్పందన తీరుతెన్నులను రికార్డు చేయండి. అది మీ వ్యూహాత్మక ప్రణాళికలో S W O T అనాలిసిస్ గా మీ పురోగతిని, అవరోధాలను తులనాత్మక విశ్లేషణ చేస్తుంది. ఆ ప్రతిబంధకాలను సమర్థవంతంగా నిరోధించే అవకాశాలను అన్వేషించండి.
🌙మనందరిలో ఇద్దరు మనుషులు ఉంటారు. బయటకు ఆగిపించే మనిషి ఒకరైతే మనలోపల ఉండే మనిషి ఇంకొకరు అదే అంతరాత్మ, అది కేవలం సంతోషంగా ఉండాలి అనే ఆకాంక్ష కలిగి ఉంటుంది. సంతోషంగా జీవించడం నీ హక్కు, ఎవరికోసమో, దేనికోసమో దానిని వదులుకోవలసిన అవసరం లేనేలేదు!!! ఆ సంతోషం సదా నీతో ఉండాలి అంటే నీ లోపటి మనిషి కోరుకున్న విధంగా కేవలం సత్ప్రవర్తన, సత్కర్మలు,సద్భావనాలు కలిగి వుంటే చాలు!!!
💫 యోగ 🧘సాధన, ఙ్ఞాన ముద్ర, సూర్య నమాస్కారాలు, నాడిశోధనలు గజిబిజి ఆలోచనలుంచి క్లారిటీ, కలత చెందిన మనస్సుకు స్వాంతన తీసుకురావడానికి డిప్రెషన్ నియంత్రణలో ప్రధాన భూమిక వహిస్తూ ప్రశాంతతను నీలో అవగతం చేస్తుంది.
💫 విజయం కేవలం మీ చేతుల్లో, చేతల్లో నే వుంది!!!
సర్వే జన సుఖినోభవంతు
మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి
RaNa
9900022729
🧘🧘🧘🧘🧘🧘🧘
Comments