top of page
జాగృతి మాలిక 36
అష్టైశ్వర్యాలు కలిమి అంటే సిరి సంపదలు. నగలు, ఆభరణాలు, వజ్రాలు, బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, బాండ్లు, సెక్యూరిటీలు, నగదు , హోదా, మంచి జీతం,విలాసవంతమైన బంగ్లా, ఖరీదైనకార్లే సంపదలని, అవే శాశ్వతం అనుకుంటూ వాటిని సంపాదించడం కోసం అలుపెరుగని జీవిత సమరం కొనసాగిస్తుంటాం. కానీ సత్యం ఏమిటంటే రాత్రి వెంట పగలు లాగా కలిమి లేములు కూడా కలిసి ఉంటాయి. లేమి అంటే సంపదలు ఆవిరి కావడం. మనం తరుచుగా ఓ శ్రీమంతుడు బికారి కావడం, అదృష్టం కలిసి వచ్చి ఓ సామాన్యుడు శ్రీమంతుడు కావడం చూస్తున్నాం. సంపదలు ఎవరి
జాగృతి మాలిక 35
ఆనందో బ్రహ్మ ఆనందం మాటల్లో, చేతల్లో వ్యక్తపరచలేని ఆహ్లాదకర మానసికానంద మధురానుభూతి!! అది ఉత్సాహం,ఉల్లాసం, సంతసం, మోదం, ఆహ్లాదం, హర్షం, సంతృప్తి ,సంతోషాల సంగమ కూడలితో కలిగే అనిర్వచనీయానుభూతి. * ఎన్నికల్లో విజయం సాధిస్తే కలిగేది విజయానందం * లాటరీలో అదృష్టలక్ష్మీవరిస్తే కలిగేది సంభ్రమాశ్చర్యం. * ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కలిగేది ఉల్లాసభరితం * ఉద్యోగంలో చేరే రోజు ఉద్వేగభరితం. * ప్రేమలో గెలుపుతో మనస్సు పరవశంతో మైమరవడం. * ఆ ఇష్టసఖితో కలిసి మొదటిసారి తీసుకునే డిన్నర్ మధురసభరితం *
జాగృతి మాలిక 34
శిలలపై శిల్పాలనే చెక్కినారు శిలలలో అందమైన రూపాలను చూడగలిగే విశేష దృష్టి, ఆ శిలలనే అందమైన శిల్పాలుగా తీర్చిన కళావైభవ సంపన్నులు. ఇసుకలో సౌధాలని చూడగలిగే మేధస్సు , ఆ మేధస్సుతో సుందర ఆకాశ హర్మ్యాలను నిర్మించే అపార వాస్తుశిల్పులు. మొక్కల్లో ఔషధాలను చూసే అపర ధన్వంతరులు, ప్రకృతిని చెరబట్టే అసురతత్వం కూడా వీరిదే. మృత్తికలో వస్తు సముదాయాన్ని చూడగలిగే విశేష ప్రజ్ఞాశాలి. ఆ ప్రజ్ఞతో మట్టితో కుండలను, వంట పాత్రలను తయారుచేసే కమ్మరి. కలపలో మూర్తీభవించిన మూర్తిని దర్శించే అంతర్దృష్టి, ఆ దృష్ట
జాగృతి మాలిక 33
ఒత్తిడి…ఆందోళన రెండూ ఒకటి కాదా ? ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న జీవనశైలి, పనిలో ఒత్తిళ్లు మరియు ఇతర సవాళ్లకు శరీరం మరియు మనస్సు ఇచ్చే సహజ ప్రతిస్పందనే స్ట్రెస్, అదే ఒత్తిడికి మూలం. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎదుర్కుంటున్న సమస్య టెన్షన్, ప్రెషర్,ఒత్తిడి. * ఓ చిన్నారి హోంవర్క్ పూర్తి చేయలేకపోతే పడేది టెన్షన్ * సకాలంలో పని పూర్తిచేయకపోవడంతో వచ్చేది వర్కుప్రెషర్ * వ్యాపారంలో తగినంత ఆదాయం లేకపోవడంతో కలిగేది ఒత్తిడి * ట్రాఫిక్ లో చిక్కుకొని సకాలంలో ఆఫీసుకు చేరుకోలేకపో
జాగృతి మాలిక 32
కృతజ్ఞతనే నిజమైన నివాళి మెరుగైన సంబంధబాంధవ్యాలను పరిరక్షించడంలో, వ్యక్తిశీల నిర్మాణంలో కృతజ్ఞతభావ ప్రదర్శన క్రియాశీలక పాత్రను కలిగి ఉంది. మనందరం ఏదో ఒక సందర్భంలో ఇతరుల సహాయాన్ని తప్పకుండా తీసుకుంటువుంటాం. మనం తీసుకున్న సహాయం చిన్నది అయినా లేక పెద్దది అయినా ఆ సహాయా సహకారాలకు మనః పూర్వక ధన్యవాదాలు తెలియచేయడమే కృతజ్ఞత. అది సంతోషానికి కారణం అవుతూ బలహీనమైన బంధాలను, బాంధవ్యాలనుకూడా బలోపేతం చేస్తుంది! కృతజ్ఞతాపూర్వక ప్రశంసలు,అభినందలను మనస్సులో దాచుకోకండి వాటిని వారికి సకాలంలో అందచేయ
జాగృతి మాలిక 31
అహింసా పరమో ధర్మః ధర్మపరిరక్షణ కోసం చేసే హింస, ప్రయత్నం, కార్యం అహింసనే అవుతుంది.రక్షింపబడిన ధర్మం మనల్ని రక్షిస్తుంది. రక్షింపబడని ధర్మం అది తప్పక శిక్షిస్తుంది. ధర్మానికి హాని కలిగిస్తూ ధర్మగ్లానికి కారణమైన ప్రతి ప్రయత్నంను హింసగనే పరిగణించాలి. ఉగ్రవాదంకి విఘాతం కలిగించిన ఆపరేషన్ సింధూర్ ధర్మగ్లానికి గుణపాఠం, ధర్మ పరిరక్షణే! మహా భారతంలో “అహింసా పరమో ధర్మః ధర్మ హింసా తదైవచ.” గా ప్రబోధించబడిన విద్వత్ శ్లోకం. మన ధర్మాలకు, విశ్వాసాలకు, నమ్మకాలకు విఘాతం కలిగించే శక్తుల పట్ల
జాగృతి మాలిక 30
అనన్యభక్తి , అనన్యచింతనలే పరమాత్మకు నీరాజనం !!! మనందరం అవ్యయయుడు,అప్రమేయుడు,విశ్వంభరుడు,సర్వేశ్వరుడు అయిన ఆ పరమాత్మ యందు భక్తి,శ్రద్ధలతో వినయ,విధేయతలను కలిగి ఉంటాం. ఆయన సేవలో తరించడానికి శ్రద్ధాసక్తులను ప్రదర్శిస్తాం. పూజలు, వ్రతాలు, నోములు, క్రతువులు, హోమాలు, యజ్ఞాలు, ప్రార్థనలు, కానుకలు,ధూప దీప నైవేద్యాలు, అన్నసంతర్పణలు సమర్పిస్తాం. ఇవి భక్తిని ప్రదర్శించడానికి మనం ఎన్నుకున్న వివిధ రూపాలు. భక్తిని ప్రదర్శించడంలో మనందరం ఆర్తులమే!! మనం కష్టాల్లో, ఆపదల్లో, అనారోగ్యాల్లో వున్నప
జాగృతి మాలిక 29
జ్ఞాన, విజ్ఞానస్వరూపమే పరమాత్మ!! మనం తరచుగా వింటువుండేది, మాట్లాడుకునేది, తెలుసుకోవాలి అనే కుతూహలంని జిజ్ఞాసని యోగులలలో , వేదాంతులలో, మేధావులలో, పండితులలో, కళాకారులలో మరియు సామన్యులలో కూడా ఆసక్తిని, ఉత్కంఠతను కలిగించేది “జ్ఞానం” * జ్ఞానం అంటే ఏమిటి? * జ్ఞానం ఎలా వుంటుంది? * జ్ఞానం ఎక్కడ ఉంది? * జ్ఞానం ఎలా సంపాదించాలి? * జ్ఞానం మనలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందా? * జ్ఞానం సంపాదించుకుంటే ఇక వేటి అవసరం వుండదా? * జ్ఞానం నిజంగా ప్రభావశీలినా? * జ్ఞానం విజ్ఞానం రెండు ఒకటేనా? ఆకర
జాగృతి మాలిక 28
యద్భావం తద్భవతినే సంకల్ప అనితరశక్తి మన మదిలో ఆలోచనలు కోకొల్లలుగా నిరంతరం ఓ స్రవంతిలా జనిస్తూనే ఉంటాయి. ఆ ఆలోచన స్రవంతిలోనే ఎన్నో ఆలోచనలు కరిగి పోతువుంటాయి, కొన్ని ఆలోచనలు మాత్రమే ఆశలవుతాయి, మిగతావి పేరాశలవుతాయి. అందులో కొన్ని ఆశలు కోరికలవుతాయి. ఈ కోరికల మధ్య స్పర్ధ ఉంటుంది, ఆ పరస్పర స్పర్ధ ద్వారా వాటిలో ప్రాధాన్యతలు ఏర్పడుతాయి. ఆ ప్రాధాన్యతలో ఎన్నెన్నో కోరికలు వెనుకబడి పోతాయి, కొన్ని మాత్రమే ఆకాంక్షలు అవుతాయి. అందులో కొన్ని ఆకాంక్షలు సాకారదిశగా,మిగిలినవి పగటికలలు అవుతాయి . స
జాగృతి మాలిక 27
జగమంతా ప్రేమమయం! ఆహ్లాదకరమైన ఉషోదయ వేళల్లో , లేలేత వెచ్చని సూర్యకిరణాలు స్పర్శతో మది పులకిస్తువుంటే ఇష్టసఖితో ఉద్యానవన విహారం ఓ మధురానుభూతి! ఆ అందమైన ప్రశాంత వాతావరణం, మదిని ఆకర్షించే పూలమొక్కల పరిమళాలు వాటి సువాసనలు మనస్సుని పరవశింప చేస్తాయి! ఓ అందమైన గులాబి🌹 తన సొగసులతో నీ చూపును 👁️ఆకర్షించడంతో పాదాలు ఆటు అడుగు వేస్తాయి, చేతివేళ్ళు 🤌ఆ గులాబీని సున్నితంగా మృదువుగా స్పర్శిస్తాయి ఆ అనుభవాన్ని మనస్సు తనలో ఓ మధుర జ్ఞాపకంగా పదిలపరుచుకుంటుంది - అది ప్రేమ. కొన్ని తుంటరి చేతులు
Blog
Yoga isn't just a practice, it's a way of life
bottom of page
